గోదావరిసీమ జానపద కళలు క్రీడలు వేడుకలు/ప్రముఖుల అభిప్రాయాలు

వికీసోర్స్ నుండి

ప్రముఖుల అభిప్రాయాలు

బహుకళా సురభిళ భావుక పట్టభధ్రుడు

పడాల రామకృష్ణారెడ్డి

శ్రీ రామకృష్ణారెడ్డి బహుకళాసురభిళహృదయుడైన భావుక పట్టభద్రుడు. వృత్తిలో పరమ నాగరీకుడేగాని ప్రవృత్తిలో వట్టి జానుతెనుగు జాతి జానపదుడు. వివిధవిషయాల్లో చొరవగా ప్రవేశిస్తాడు. ప్రావీణ్యం సంపాదిస్తాడు. అవగాహన చేసుకుంటాదు. అనుభవం మూటగట్టుకుంటాడు. ఆలోచించి పలుకుతాడు. పలికిన పలుకున ఆలోచిమపచేశ్తాడు. రెడ్డిగారిగ్రంధంలో ఉయించుమించు మన సర్వ జానపద కళారూపాలగురించీసంగ్రహ పరామర్శవుంది. అతని పూనికలో ఒక ఏకాగ్రతవుంది. అవగాహనలో సమగ్రతవుంది. సకలజానపదసరస్వతి సర్వాంగీణ పరిష్వం గంగా ఒక పరిశోధననిబంధాన్ని వెలయింప సమకట్టేవారికి మార్గదర్శకంకాగల లక్షణాల గ్రంధమని ఘంటాపధంగా చెప్పగలను. పలికిన పలుకల్లా రంగస్థలప్రవేశ్వంచేసిన పాత్రధారి పలుకులావుందిగాని వట్టినేపధ్య ప్రవచనంలాగునా, ఆకాశభాషితంమల్లేనూ లేదు. అప్పుడప్పుడు రెడ్డిగారు చెణుకులు విసురుతాడు. అబ్బ! అని ఒక్కొక్కప్పుడు వట్టి చెణుకులుకావు. గట్టిచురకల్లాఉంటాయి. చూడ్డానికి సుందరముఖారవిందుడేగాని అతని విమర్శనాదృక్పధంమాత్రం మొగమాటంలేనిది. రచనకూడా సుగమార్ధవచనంగానూ, చమత్కారచరణంగానూ ఉంటుంది. మనసాత అతినికి నా ఆశీస్సహకృతాభినందచందనతాంబూలాలు అందిస్తున్నాను.

--జాతీయూచార్య, డా.యస్. వి జోగారావు.

ఎం.ఏ., పిహెచ్ డి., డి. లిట్ (Hon) ఆంధ్రా, అమెరికా ఆంధ్రాయూనివర్శిటీ.

జానపద కళలకు "ఎన్ సైక్లోపీడియా"

పడాల రామకృష్ణారెడ్దిగారి సిద్ధాంతగ్రంధం తెలుగు జానపదకళలపై ఒక "ఎన్సైక్లోపిడియా" అని చెప్పాలి. (విజ్ఞాన సర్వస్వము.) జానపదుల కళలు. వారి జీవితాలు- సంఘం -ఆచారాలు - పండగలుమందులు - వృత్తులు - విశ్వాస్వాలు - దేవత్రలు - ఆటలు ఇలా ఎన్నో విషయాలపై మంచి పరిశోధన గావించబడిన గ్రంధం. దీనిలో శిల్పం చిత్రలేఖనం, సంగీతం, నాట్యం, కవిత్వం మొదలగు లలితకళ్లుకూడా శాస్త్రీయదృక్పధంతో పరీశీలనచేసి చెప్పారు.

తెలుగు సంస్కృతికి, ప్రత్యేకించి తెలుగు జానపదకళలకు ఈ విధంగా వీరు చేసిన మహత్తరమైన సేవ బహుధా ప్రశంసనీయం. గ్రంధం ప్ర్రారంభంనుంచి అంతంవరకూ ఆసక్తికరంగా నడిపించిన రచనా కౌశలము నిస్సందేహంగా అభినందించతగింది. అట్లాంటి ఉత్తమపరిశోధనచేసిన శ్రీ రెడ్డిగారిని అవశ్యం మెచ్చితీరాలి.

--డా. పి. వేణుగోపాలరావు, M. A. Phd.

రీజనల్ డైరక్టర్, అమెరికన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ స్టడీస్, మద్రాసు.

రెడ్డిగారిగ్రంధం జానపద కళలకు బహుమానం

ఈగ్రంధంలోని 3వ భాగంలో జానపదకళలు, ఆచారాలు, అలవాట్లు విద్య, వైద్యం వగైరా ఎన్నోవిషయాలు చక్కగాచెప్పేరు. వ్యాధుల నివారణకు ప్రకృతిసిద్ధమైన వస్తువులతో నేటివ్ వైద్యం ఎలాచేస్తారో చక్కగా సేకరించి చెప్పేరు. నిజంగా ఇది అభినందించదగినంత గొప్పగా వుంది. ఆరవచాప్టర్ లో జానపదకళలతోపాటు లలితకళలను పోల్చిచూపించి రచయిత ఇరుపక్షాలపై తనకున్న ఆదిక్యతను, అదికారాన్ని, శక్తిని నిరూపించుకున్నారు. 12వ ఛాప్టర్ లో జానపదుల అలవాట్లు, అచారాలు వగైరాలు సవిర్శతో పరామర్శించి "ఇవన్నీ వారిని సుఖవంతులుగానూ, శాంతివంతులుగానూ చేయడానికి ఏర్పాటుచేసినవే అనే రచయితమాట అక్షరసత్యం. ఈ గ్రంధం చాలా సరళసుందరంగా వ్రాయబడింది. ఇంత సమాచారం సేకరించిన రచయితకృషి అద్భుతతి ఇంతపెద్దవిషయాన్ని చేబట్టి ఛేధించడం రచయిత పట్టుదలకు ఆసక్తికి నిదర్శనం. ఇద్ జానపద కళారంగానికి ఒక గొప్ప బహుమానమనే చెప్పాలి. ఒక్కజానపద కళారంగానికేకాదు తెలుగు సాహితీసాంస్కృతిఈ మతల్లిమెడలోచేరిన మరోమంచి మణిహారం.

--ప్రొఫెసర్. డా. షేక్ మస్తాన్ M. A. Phd.

ఆలిఘర్ యూనివర్సిటీ.

అభినందార్హమైన గ్రంధం రామకృష్ణారెడ్డి థీసిస్

శ్రీ పడాల రామకృష్ణారెడ్దిగారు ఆచార్య యస్.వి.జోగారావుగారి వంటి బహుముఖ ప్రజ్ఞాధురీణుల పర్యవేక్షణలో సాగించిన ఈ పరిశోధన చరిత్రలో నిల్చిపోతుంది. ఈ సిద్ధాంతగ్రంధంలోని ఈ క్రింది అంశాలు ప్రస్తుతించదగినవిగా పేర్కొనాలి.

ఎన్నుకొన్న విషయం పండితులకు, సాధరణ పాఠకులకు ఉత్సుకతను, అభిరుచిని కలిగిస్తోంది. అంశాలన్నీ అందరికీ అందికలోఉండి మనసును రంజింపచేస్తున్నాయి. ఎన్నుకున్న విషయాన్ని విభజించిన తీరు ఎంతోబాగుంది. విషయవిశ్లేషణ ప్రశంసనీయం. "జానపదుల నిసర్గ విజ్ఞాననిధి" అనే అధ్యాయంలో చర్చించిన వివిధఅంశాలు విజ్ఞానదాయకంగా విషయవివణాత్మకంగా ఉన్నాయి. అదేవిధంగా 8,9,10 అధ్యాయాలు అభిరుచిని ప్రేరేపిస్తున్నాయి. విషయసేకరణలో శ్రమ, దీక్ష కన్పిస్తునాయి. విషయానికి తగిన సులభ సుందరమైన భాషలో వ్రాయటం జరిగింది. మొదలుపెట్టిందిలగాయతు చివరివరకు విడిచిపెట్టకుండా ఎంతోఉత్సుకతతోచదివిస్తున్న ఉత్తమమైన పరిశోధన గ్రంధం. రచయితకు నా అభినందనలు.

—ప్రొఫెసర్, డా.మద్దూరిసుబ్బారెడ్డి M. A. Phd.

శ్రీ వెంకటేశ్వరా యూనివర్సిటీ - తిరుపతి.


ఆలోచనకు ప్రేరణ కలిగించే వ్యక్తి

రా మ కృ ష్ణా రె డ్డి

నాటకకర్తగా, అనేక జానపద కళారూపాల రచయితగా శ్రీ పడాల రామకృష్ణారెడ్డి సుప్రసిద్ధుడు. రచనతోపాటు నటనలోకూడా సముచిత ప్రావీణ్యం ఉండడంవల్ల ఆయననాటకాలు మరింతరక్తికట్టాయి. ఆలోచనకు ప్రేరణకలిగించేవ్యక్తి. తెలుగు జానపద కళారంగంలోని అన్ని అంగాలగురించి (రంగాలగురించి), అంశాలనుగురించి రసవత్తరమైన శైలిలో వ్రాశారు. తెలుగువారికే తెలియని కొన్ని జానపదకళలగురించి ఆటపాటలగురించి వీరు వ్రాసినగ్రంధం యీ రంగంలోఎత్తిన మరో మణిదీపం. పాటైనా మాటైనా ప్రతిభవంతుంగాపలికే రామకృష్ణారెడ్దికి నా అభినందనల్.

--జ్ఞానపీఠావార్డు గ్రహీత, పద్మభూషణ, పద్మశ్రీ, ఆచార్య

               డా. సి. నారాయణరెడ్డి
          వైస్ చాన్సలర్, తెలుగు యూనివర్సిటీ.

అభినంధ్యులు రామకృష్ణారెడ్డి

తెలుగువారి జానపదకళలు, వేడుకలు, సంబరాలు, ఆటలు, పాటలు, మాటలు మొదలైన వాటిగురించి మీరు చాలాసమాచారం సేకరించారు. ఇన్నిటిగురించి ఇంతవరకూ ఎవ్వరూ ఒక్కచోట సంగ్రహించలేదు. మీకృషి ప్రశంశాపాత్రము. దీపముండగానే యిల్లు చక్కదిద్దుకోవాలి. కొన ఉపిరితోనున్న యా కళలగురించి భావితరాలవారికి తెలియటానికై నా మీ పుస్తకం బాగా ఉపకరిస్తుంది. ఇది గొప్ప సిద్ధాంతగ్రంధం.

ఒకవైపు ఉద్యోగధర్మం నిర్వహిస్తూ, మౌలికమైన రచనలుచేస్తూ తీరికచూసుకొని జానపద కళారూపాలగురించి పరిశోధనాత్మక గ్రంధం అందించినందుకు ముమ్ము అభీనందిస్తున్నాను.

                  ---ప్రొఫెసర్, డా. బిరుదు రామరాజు ఎం.ఎ,పి.హెచ్ డి, ఉస్మానియా యూనివర్సిటీ.

పండిత పామర జనకం:

                               రామకృష్ణారెడ్డిరచన

బాధ్యతగలఉద్యోగం నిర్వహిస్తూ ఇటువంటి పరిశోధనాత్మక గ్రంధం వ్యాయటమనేది సామాన్యమైన పనికాదు. మీరు చెప్పిన చాలా విషయాలు ఆయా కళారంగాలలో నిరంతరం పరిశ్రమచేస్తున్న వారికి కూడా సంపూర్ణంగా తెలియవేమో!

మీది ప్రగాఢమైన లోతైన సాంస్కృతిక దృష్టిగల రచన, అందునా జానపదకళలను శాస్త్రీయస్థాయికెత్తివాటికి పండితలోకంలో ప్రామాణీకత సాధించడానికి మీగ్రంధం ఎంతైనాఉపకరిస్తుంది.

విషయంచెప్పేతీరు పండిత పామరులందరికీ హృదయంగమంగా ఉండుట మీరచనలోని మొరొకవిశేషం. మీది ప్రతిభా పాండిత్య పరిశీలనలు ముప్పిరిగొన్న సాహిత్య వ్యాసాంగం , మీకు నా హార్ధిక శుభాకాంక్షలు.

డా.వి.యల్.నరసింహారావు ఎం.ఏ.పి.హెచ్.డి.

డైరక్టరు, ఆం.ప్ర. ప్రభుత్వప్రాచ్యలిఖిత గ్రంధాలయం. హైదరాబాదు

రామకృష్ణారెడ్దిగారి పరిశీలనగ్రంధం అనర్ఘరత్నం

శ్రీ రెడ్డిగారు జానపద కళలగూర్చి, వాని స్వరూప స్వభావాలగూర్చి, వానిహీనస్థితిగూర్చి పరిశోధనాత్మకంగా తేటతెల్లంగా యీ గ్రంధంలో ప్రకటించారు. తెలుగునాటక వికాసం గురించి, పౌరాణిక నాటకాల దుర్గతి, దుస్థితి గురించి నిరూపించి తమ బాధను వ్యక్తంచేశారు. అంతేగాక వివిధ శీర్షికలలో వాదు వివరించిన అంశాలు అద్భుతాలు, సహజదర్పణాలు.

శ్రీ రేడ్డిగారి పరిశోధనాసమగ్రతకు, విషయవివేచనకు యీ గ్రంధం అనర్ఘతరత్నం అనడంలో సందేహంలేదు. ఇట్టి రచనలు మరింతగా రచయితలేఖినిద్వారావెలువడాలని ఆశించడంలో అత్యాసలేదు.

ప్రొఫెసర్, డా.యం.ఆర్, అప్పారావు నూజివీడు అధ్యక్షులు ఆంధ్రనాటక కళాపరిషత్ మీ కలంనుండి వెలువడిన ప్రతి అక్షరం, మీనోటినుంచి వచ్చిన ప్రతి ఉపన్యాసం ఒక క్రమప్రకారం రూపుదాల్చి శ్రోతలనాకట్టుకుంటాయి. ఇది అందరికీ లభ్యమయ్యేదికాదు. మీరు సరస్వతీ కటాక్షం పొందిన మహనీయులు. మీ హృదయం కళాహృదయం. అసలు మీ రూపమే కళాస్వరూపం. మీఓర్పు, మాటలకూర్పుమరొకరికుండవేమో అనిపిస్సుంది. అన్నికళలూ మీలో యమిడిపోయాయి. మీ తంబురకధ విని ముగ్దుడనయ్యాను. సర్వసమర్ధులు మీరని ఆకధ ఋజువు చేసింది. అంత శక్తిని, ఆసక్తిని గలిగించిన కధాగానం నా నలబై సంవత్సరాల అనుభవంలో తమది మాత్రమే. ప్రదర్శనలో, ప్రావీణ్య్హలోముంది. రచనలో రంజకత్వంవుంది. ఈరెండూ సమపాళ్ళలో రంగరించి పోసి సరస్వతీమాత మీలో తన రూపాన్ని చూసుకుంటుందని భావిస్తున్నాను.

-- నాటకళారాధక బుగ్గా పాపయ్యశాస్త్రి

ఏక్టర్ రేడ్డికి - డాక్టరేట్

ఏక్టరు పడాల రామకృష్ణారెడ్డి మహాశయులకు డాక్టరేటు రావడం అస్మదాదులకు ఆనణ్దదాయకమైన విష;యం. పదవిలోఉంటూ, పలు సాంస్కృతికకార్యక్రమాల్లో పాల్గోంటూ సాహితీక్షేత్రంలో కృషీవలునివలె లేఖినిపట్టి సహితీసౌరభాన్ని సృస్టించడమేగాక ప్రజల ఆదరాభిమానాల పాతృడైన ఉత్తమనటుడు రామకృష్ణారెడ్డి ధన్య్హజీవి. అధికారంలో ఉండి డాక్టరేటు పొందినవారు మనజిల్లాలో వీరే ప్రధములని నా భావన.

--ఆంధ్ర నయాగరా, ప్రొఫెసర్ భి. వి.యుస్. పాత్రుడు కృతజ్ఞతలు

1912లో ఎం.ఏ. పాసైనా వాలో విద్యాతృష్ణ తీరలేదు. కాని ఉద్యోగం వదలుకోలేదు. పి.హెచ్.డ్. ప్రయివేటుగా చేద్దామవేది నా తపన, మునిపల్ కమీషనరు ఉద్యోగంలో యిదిసాధ్యపడేదికాదన్నారు అందరూ. రాజమండ్రిలో ఒకమీటింగులో ఒకసారి ప్రొఫెసరు యస్వీ. జోగారావుగారితో యీ ప్రస్తావనతేగా తప్పక యూనివర్సిటీకి అప్లయిచేయండి. ఈ సబ్జక్టుకు మీరు ఫిట్ కేండిడేటు అన్నారు. అలాగే ఆంధ్రాయూనివర్సిటీ ఎగ్జంప్షన్ యిచ్చింది. కాని నేనున్నది నూజివీడు. అంతదూరంనుండి దీన్ని సాధించడం అసాధ్యం. నాకోరిక తెలపగానే ప్రభుత్వం దయతోనన్ను భీమ్లీ కమీషనరుగా ట్రాంస్పర్ చేసింది. భీమ్లి మంచి వాతావరణం. ఇక్కడికి వచ్చేసానండి అని చెప్పగానే ప్రొఫెసర్ జోగారావుగారు ఎంతో ఆనందించి తనదగ్గర అవకాశంకల్పించి ఆరుమాసాలలో ప్రీ పి. హెచ్ డి. పూర్తిచేయింఇ, సంవత్సరేం తిరక్కుండానే పి.హెచ్.డి. కి యీధీసెస్ సమర్పించేటట్టు చేశారు. వారిచ్చిన ఉత్సాహం. ప్రోత్స్దాహం యీ పరిశోధనలో నేనుపడ్డ కష్టాన్ని మరపించేది. ఆయన ఉత్తమ గురువు. నన్ను శిష్యుడుగాగాక స్నేహితుడిగా అభీమానించారు. వారికి నా నమస్కృతులు.

ఈ ధీసెస్ని మెచ్చి నాకు డాక్టరేట్ పట్టా యివ్వడానికి సిఫార్సు చేసిన ఆంధ్రాయూనివర్సిటీ త్రెలుగుడిపార్టుమెంటు అధ్యాపకులకూ యీగ్రంధంపై నాకు డాక్టరేట్ యివ్వమని అమూల్యాభిప్రాయం అందించిన యితర ఊనివర్సిటీల ఎడ్జుడికేటర్సుకూ నా వందనాలు.

ఈ పరిసోధన ప్రజలకు సంబందించినదికావడంవల్ల యీ పేరుమీద ఎందరో వృద్ధ కళాకారులకు, అజ్ఞాతమేధావులను కలిసేభాగ్యం కలిగింది. ఇది నాకు ఎనలేని శక్తిని, ఆసక్తిని, అన్నికళలపట్ల అవగాహనని పెంపొందించి ప్రజలు ప్రీతితో "సకల కళాసాగర", "లలితకళాభిజ్ఞశేఖర", "జానపదకళాప్రపూర్ణ" వంటి బిరుదులిచ్చి గౌరవించేటట్టు చేసింది. ఆ మేధావులకి, ఆ కళాకారులకి, ఆ అభిమానులకి నేనెంతో ఋణపడివున్నాను. వారికి నా అభివాదములు-

పుస్తకప్రచురణకు ఆర్ధికసహాయమందించిన తెలుగు యూనివర్సిటీ వారికి కృతజ్ఞతలు.

 భవదీయుడు

డా.పడాల రామకృష్ణారెడ్డి ఎం.ఏ.పి.హెచ్.డి.