గోదావరిసీమ జానపద కళలు క్రీడలు వేడుకలు/జానపదుల నిసర్గ విజ్ఞాన నిధి

వికీసోర్స్ నుండి

జానపదుల నిసర్గ విజ్ఞాన నిది

పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/33

జానపదుల నిసర్గ విజ్ఞాన నిధి

జానపదులయొక్క సహజ విజ్ఞాన నిధి పరంపరానుగతమైనది. శతాబ్ధాల తరబడి వారసత్వముగా ఒకరినుండి మరియొకరికి సంక్రమిస్తూ ప్రవహిస్తున్న నజీవ స్రవంది. ఇది వారి విద్య, వైద్యం, ఆహారం, విహారం, వ్యవహారం మొదలైన రంగాలలో విశేషంగా కనిపిస్తుంది.

విద్య:

వీరిని చాలవరకు నానాకాలం చదువులు, పల్లెజనులు సేద్యం వృత్తిగా గల రైతులు, రైతుకూలీలు. వీరికి సంవత్సరంలో వానాకాలం తీరిక. ఊడ్పులు పూర్తయి మరల పంట కోతకొచ్చే వరకూ పనిపాటులుండవు. ఇఒదే వర్షఋతువు ఈ సమయంలో వీధుల్లో అరుగులమీద పాఠశాలలు నిర్వహించే పంతుళ్ళవద్ద ఓనమాలు ప్రారంభించి [ఓ, న,మ:, శి,వస,య:] శతకాలూ, పద్యాలూ కంఠస్థం చేస్తూ, పొలాల్లో స్వేచ్చగా గొంతెత్తి పాడుతూ శృతిలయలు తమంతతాముగా తమ్మువరించేటట్టు చేసుకుంటారు. సంగీత సాహిత్యాలు ఇలా వారి రక్తనాళాలలో ప్రవేశిఒస్తాయి. పెద్ద బాలశిక్ష వీరి పారాయణ గ్రంధం. భారత, భాగవతాది పురానేతి హాసాలు వింటూ, వానిలోని నీతులను జీర్ణీంచుకుంటూ వానిని తమ నిత్యజీవితాల మీదికి అనువర్తింప చేసుమొనేవారు. రాముడులాటి కొడుకుఇ, సీతలాంటి కూతురు వారు మనసారా కోదుకొనేది. "యద్బావ్యం తద్భవతి" అన్నట్లుగా తల్లి కనుసన్నలలో మెలిగే కూతుళ్ళూ, తండ్రి అదుపాజ్ఞలలో మెలగే కొడుకులూ వారిసంతానం. వృతులలో తండ్రి వృత్తే కొడుకు స్వీకరించేవాడు. సర్వులకూ వృత్తి విదలు శిరోధార్యం. కర్షకునిబిడ్డలు కర్షకులేఅయి చెమటోడ్చి పనిచేసి ధాన్యరాసులు పండించి అన్నదతలై అందరినీ ఆదుకొనేవారు. కమ్మరి, కుమ్మరి, కరణం, కంసాలి, సాలె, పురోహిత వృత్తులవరు తమ పిల్లలను తమ వృత్తులలోనే ప్రవీణులుగా, ప్రజ్ఞావంతులుగా తీర్చి దిద్దేవారు. "కులవిద్యకు సాటిరదు గువ్వల చెన్నా" అనేది వారి నరనరాలలో నాటుకుపోయిన మాట. అందువల్ల వారికి నిరుద్యోగసమస్య అనేది లేదు. ఇద్ విద్య విషయకంగా వారి విజ్ఞానసిరి.

వైద్యం:

  • Folk medicine is the substance of all the traditional view points on sickness and the healing methods applied against disease which exist among the people".

జానపదులవైద్యం వారికి అనుభవం నేర్పిన విద్య. తమ పూర్వుల నుండి అందుకోబడిన నిధి.

ఇంగ్లీషు వైద్యం రాకముందు పల్లెసీమల్లో ఆయుర్వేద వైద్యం ప్రసిద్ధిగాసాగింది. దీనికి ఆద్యుడు ' ధన్వంతరి '.'చరకసంహిత ' ప్రమాణగ్రంధం. దీనిలో పేరెన్నికగన్న వైద్యులకు మెడల్స్ యిచ్చి బిరుదు లిచ్చి పల్లకీలమీదకూడా ఊరేగించేవారు. ఆ రోజుల్లొ రాజవైద్యులుకూడా వీరే. ఇప్పటికి కూడా అల్లోపతి వైద్యానికి లొంగని దీర్ఘ రోగాలకూ, మొండి వ్యాధులకూ ఇదే శరణ్యం. తరువాత జర్మనీనుండి దిగుమతి కాబడిన హోమియో వైద్యంకూడా బాగా ప్రచారం పొందింది.

వీటికన్నిటికీముందు సమాజానికి గొప్పసేవచేసింది జానపదుల అనుభవవైధ్యం. ఇది నాటువైద్యమనీ, గచ్చాకు పుచ్చాకు వైద్యమనీ కొట్టిపారెయ్యడానికి వీల్లేదు. నాడిచూసి రోగం నిర్ణయించే ప్రక్రియ జానపదుల సొత్తు. వీరు చేయిపట్టుకొని నాడిచూసి వాతం, పిత్తం, శ్లేష్మం వగిఅరాల హెచ్చు తగ్గులు గమనించి మందులిస్తారు. ఈ మందు కూడా అతితేలికగా లభ్యమయ్యేదే. చాలావరకు చిట్కావైద్యమే. ఉదాహరణకి తేలుకుట్టింది అనుకోండి. వెంటనే చింతపిక్క అరగదీసి కుట్టితినచోట అంటిస్తే టక్కున అతుక్కుపోతుంది. పది నిమిషాలలో ఆ విషాన్నంతా పీల్చుకొని ఆ పిక్క ఊడిపోతుంది. దానితో బాధకూడ పోతుంది. దెబ్బతగిలి రక్తం కారుతుంటే దానిపై ముగ్గువేసి కిరసనాయిలు పోస్తారు. వెంటనే రక్తం కట్టడిపోతుంది. గుడ్డ కాల్చి ఆమసి అంటిస్తారు - దెబ్బ మాడిపోతుంది.


  • Oswald A.Erich and Richard Beifle, as quoted in Folklore Folk life 1972 P.193, 194 ("ఆంద్రుల జానపద విజ్ఞానము" నుండి గ్రహించబడినది) గజ్జికురుపులకు ఆముదం, సున్నం కలిప్ రాస్తారు. -చీము వోడిపోతుంది, కురుపు మాడిపోతుంది. చిగుముకు మురుపిందాకు, పసుపు, ఉప్పు కలిపి నూరి రాస్తారు - తగ్గిపోతుంది. చిడుము, గజ్జి తగ్గడానికి సముద్రస్నానం చేయిస్తారు - అదికూడా ఒక మందు క్రింద లెక్కే. ఒంటిమీద పొక్కులకు మాచపత్రిఆకు పసరు రాస్తారు. తామరకు, చిక్కుడాకు రుద్దినా, కొబ్బరిపెంకు కాలుస్తుంటే వచ్చే చమురు రాసినా తగ్గిపోతుంది. ఇలా వైద్యం తేలిగ్గా చేస్తారు. సెగ్గడ్డలకు తెలగపిండి పెరుగులో నానబెట్టి కట్టుకట్టి పక్వానికివచ్చాక చ్ంద్రకాంతంచెట్టు ఆకును ఆముదంతో వేడిచేసి అంటిస్తారు. అది కోసేసి చీమునంతటినీ వోడ్చేసి మానిపోతుంది. ముఖంమీద మొటిమలకు అల్లంరసం ఆరారా రాస్తారు. తగ్గిపోతాయి. చిరుపుడి కాయలకు సున్నం, చాకలిసోడా కలిపిఅంటిస్తారు. రాలిపోతాయి. సప్పికి, మాదని పిప్పళ్ళు, మిరియాలు, దాల్చినచెక్క, చెంబపిక్కలు కలిపి అరగదీసి ఆ గంధం పూస్తారు. మాదకు కాకినాడ దగ్గరగల పెద్దాడలో చీట్లుయిస్తారు. ఈ చీట్లు తీసుకున్న మనిషి రోగి దగ్గరకు వెళ్ళేవరకూ అల్పాచమానంకూడ చెయ్యకూడదు. అంతకఠోరమైన నియమం. ఆ చీట్లు రోగిదగ్గర చింపుతారు. ఆమాద తగ్గిపోతుంది. అయితే చుట్ట పొగ వాసనవంటివి అయిదారు రోజులవరకూ రోగిదగ్గరకు రానీయకూడదనే నియమం ఉంది. ఈ చీట్లతోపాటు మందుకూడాయిస్తారు. అదికూడా వాడాలి.

కవుకుదెబ్బలకు ములగాకూ, వామ్మూ ఉడికించి కట్టుకడతారు. నడుమునొప్పికి కోడుగుడ్డులోని తెల్లనిసొన గుడ్డకి రాసి సెగను కాసి పట్టువేస్తారు. ఇరుకు నొప్పికి, బెణుకు నొప్పికీ చింతపండు ఉడికించి పట్టు వేస్తారు. వాతం నొప్పులకు తెల్లజిల్లేడుపాలు పొడుస్తారు. నులుగుపాము నడుంముక్క వండిపెడతారు. కీళ్ళ నొప్పులకి (రొమెటిజం) ఉడ్కబెట్టిన కేబేజి ముక్కలు ముక్కలుగా తరిగి రోగి కాళ్ళకూ చేతులకూ మర్ధనాచేస్తారు. కాళూ చేతులూ తిమ్మిర్లకు నీరుల్లిపాయ మెత్తగా నూరి మర్ధనా చేస్తారు-తగ్గిపోతాయి. కాళ్ళ పగుళ్ళకి ఆముదంలో పసుపు కలిపి పగుళ్ళలో రాస్తారు- కొంతమంది నిమ్మకాయ తొక్క రుద్దుతారు.

తలలో పేను కొరుకుడుకు ఎర్రమందారపువ్వు రుద్దుతారు. చుండ్రుకు మెంతులు నానబెట్టి రుబ్బి ఆముద్ద తలకు మర్ధనాచేసి తలంటుతారుఅంతే అది పోతుంది. తలనొప్పికి ఆముదం ఆకుగానీ, నిమ్మ ఆకుగుండకొట్తిగానీ తలపై కడతారు. నొసలుకు మంచిగంధంగానీ, మిరియాలు ఉడికించిగానీ పట్టువేస్తారు-కొదీనాపప్పు, హారితికర్పూరం కలిపి నుదుటికి రాస్తారు. ఇది వేడిని తగ్గించేస్తుంది. తలనొప్పికి నల్లినిచంపి వాసనచూస్తే కూడా పోతుండంటారు. శొంఠి కణతలకు రాసినా తలనొప్పిపోతుంది. పార్శ్వపునొప్పికి కుంకుడుకాయ నురుగు కొద్దిగా వెచ్చచేసి రెండుముక్కుల్లోనూ వేస్తారు. కొందరు ముషినిచెక్కగంధం 3 సార్లు త్రాగిస్తారు.

చెవిలో పోటుకు రుద్రజడాకు పసరు పిండుతారు. కొంద్రు నిమ్మరసం గవ్వహిదుం పొంగించి చెవిలోపోస్తారు. గాలిబిళ్ళలు వేస్తే అవిసాకు రుబ్బి ఆ పసరు కొబ్బరినూనెలోగాని, సున్నంలోగాని కలిపి వాటికి పూస్తారు. వేడిచేసి కళ్ళు మండుతుంటే చనుబాలు పిండమంటారు లేదా నందివర్థనంపూలు కట్టమంటారు. కండ్లకలకకు నువ్వుల నూనెగాని, నీరుల్లిపాయరసం గాని కండ్లలో వేస్తారు. కామెర్లకు నేలఉసిరి ఆకుల్నికాయలతో సహా పసరుతీసి మజ్జిగతో కలిపి పరగడుపున త్రాగిస్తారు. ఎక్కువమందిచెప్పే వైద్యంకుంకుడుకాయ మూడుసార్లు పాలతో సానపై అరగదీసి గ్లాసెడుపాలలో కలిపి రోజూ రెండుపూటలా పుచ్చుకుంటే మూడు రోజుల్లో తగ్గిపోతుందని. దీనికి మరోగ్యారంటీ పసరు వైద్యం కూడా వుంది. తూర్పుగోదావరిజిల్లాలోని వెల్లగ్రామంలో యిది ప్రతి ఆదివారం యిస్తారు అతిచౌకగా. దీనికి దేశప్రసిద్ధివుంది. జానపదుల్లో కొందరు కామెర్లరోగిని సూర్యోదయం ఎండలోనిలిపి సూర్యునివైపుచూస్తూ గడ్డిపరకలతో మంత్రించి మాండోరం (నేటివ్ మందు) ముందుగా యిస్తారు తేనెలోవేసినాకమని, దీనికి తగ్గిపోవడంఉంది. తూ|| గో|| కొంకుదురులో తాడి రామన్నగారు, అనంతరం వారి మనుమదు తాడి వెంకటకృష్ణారెడ్డిగారు యీ మంత్రం వేసి తగ్గించేవారు. ఈ మంత్రంలో ముందు రోగిని కామెర్లొచ్చిందా అని అడుగుతారు. కామెర్లొచ్చిందంటాడురోగి. ఇలా మూడుసార్లు ప్రశ్నించి పదవులు కదుపుతూ నోటిలో ఆ జబ్బు తగ్గించమని సూర్యదేవుని ప్రార్థిస్తాడు. ఇంతకీ యీ తగ్గడం మాండోరం ప్రభావమే అంటారు.

నోటికి పూతపూస్తే పటిక రయిస్తారు లేదా పుల్లటి మజ్జిగ పుక్కిట పట్టమంటారు. ఇగుళ్ళూ రక్తంకారుతుంటే (పయోరియా) నేపాళంపుల్లతో పండ్లు తోమమంటారు. పళ్ల సలుపులకు నీళ్లలో జామిఆకులు వేసి బాగా మరిగించి ఆనునువెచ్చని నీటితో ప్రతిరోజొ మూడుసార్లు పుక్కిలించమంటారు. పుప్పిపళ్ళకు ఇంగువ పెడతారు.

కడుపునొప్పి వచ్చినా, అన్నం అరగకున్నా వామ్మూ ఉప్పూ కలిపి నమిలి మ్రింగిస్తారు. చెంబులో నిప్పులుపోసి కదుపుమీద కాపడం పెట్టిస్తారు. అల్లం, ఉప్పు నో'ట్లోవేసుకొని బాగానములుతూ రసం మ్రింగుతుంటే అజీర్తి పోయి ఆకలి పుడుతుంది.

జిగటవిరోచనాలకి పచ్చిసపోటా రసంగాని, పచ్చి అరటికాయగాని తినిపిస్తారు. దీనికి వేడిజిలేబి తినడంకూడా మందే. రక్తవిరోచనాలకి సగ్గుబియ్యం జావ త్రాగిస్తారు. నీళ్ళవిరోచనాలకి గసగసాల పొడుం తినమంటారు. ఏ విరోచనాలకైనా వీరి అస్లు సిస్లు మందు నల్లమందు. విరోచనాలుకావాలంటే ప్రొద్దుటే పరగడుపున వేడినీళ్ళలో చిట్టాముదం 2, 3 చెంచాలు వేసి త్రాగిస్తారు. కొందరు 'సునామణి ఆకు ' చారు కాచుకు త్రాగురారు. మలబద్ధకం పోవడానికి ఉసిరికాయ చూర్ణంతో చేసిన కషాయం వేడిపాలలో గిలక్కొట్టి త్రాగమంటారు.

జలుబుచేస్తే ఉపశమనానికి నల్లజీలకర్ర గుడ్డను కట్టి పీల్చమంటారు. సలసలమరిగే నీటిలో పసుపువేసి, ఇటుకవేసి, ముఖానికి ఆవిరి పడతారు. ముక్కుదిబ్బడేస్తే ముక్కుల్లో నువ్వులనూనెగాని, కొబ్బరినూనెగాని చుక్కలు వేస్తారు-సర్దుకుంటుంది. దగ్గు వస్తుంటే కరక్కాయ బుగ్గను పెట్టుకొని ఊట మ్రింగుమంటారు. కోరింతదగ్గుకు దానిమ్మకాయపెచ్చులు బాగా వేయించి ఆ చూర్ణం చిటికెడు తేనెలో కలిపి నాకిస్తారు. చంటిపిల్లలకు జలుబు చేస్తే తమలపాకు రసం రెండుచుక్కలు పాలల్లో పిండి పట్టిస్తారు.

వీరిడృష్టిలో జ్వరంవస్తే లంఖనం పరమౌషదం. జీలకర్ర, వామ్ము కషాయం పొంగబెట్టి త్రాగిస్తారు. నరాల అలహీనతకు మొలలొచ్చిన పెసలు గాని, శనగలుగాని తినమంటారు. శుక్ర నష్ట వ్యాధికి నేతితో చేసిన సున్నుండలు తినబెడతారు. నులిపురుగుకు (ఎమిబియాసిస్) అల్లోనేరేడుపండు మందు. చక్కెరవ్యాధికి (డయాబెటిస్) నేరేడుచెక్క కషాయం త్రాగమంటారు. అంతకంటే సులువు ప్రొద్దుటే పరగడుపున వేప చిగుళ్ళుతినడం. దీనికి కాకరకాఅకూడా శ్రేష్టం. ఉబ్బసం ఉపశమనానికి వేడినీళ్లల్లో తేనెవేసి త్రాగిస్తార్.

బాలింతలకు చనుబాలు వృద్ధికావడానికి, దేహంలో నీటినిహరించడానికి, వాతంనొప్పులు తగ్గించడానికి 'కాయం ' అనేమందు తయారుచేసి పెడతారు. సొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, పిప్పిలికద్దె, కట్జుకరోహిణి, జీలకర్ర, వామ్ము, చాయపసుపుకొమ్ము, కళింగ దుంపరాష్ట్రం దోరగా వేయించి, వేడినీళ్ళలో మెత్తగానూరి లేహ్యం లాగా తయారెఉచేసి సున్నిఉండలలా చుట్టి నానబెట్టి ఓపదిహేనురోజులపాటు తినమంటారు. ఇవన్నీ ప్రతి వూళ్లల్లోనూ ప్రతికిరాణాకొట్టులోనూ దొరికేవే.

పాలు పడకుంటే పిప్పిలికట్టే, మిరియాలు పాలతో నూరి త్రాగిస్తారు. రక్తపోటు రగ్గించడానికి వెల్లుల్లి ఎక్కువగా నాడిస్తారు. అలాగేనీరుల్లికూడా. ఉల్లిచేసే మేలు తల్లి కూడా చేయదని వీరి వాడుకమాట. రక్తపోటుకు కొంతమంది సర్పగంధి తత్సంబంధమైన వేళ్ళను ఔషధంగా ఇస్తారు. గుండెనొప్పికి లేత కొబ్బరికాయ నీళ్లు నిత్యం త్రాగమంటారు. పక్షవాతానికి గ్లాసుడునీళ్లల్లో రెండుచెంచాల తేనె రోజూ 3, 4 సార్లు త్రాగిస్తారు. పావురంరక్తం పక్షవాతంవచ్చిన భాగంమీద మర్ధనాచేస్తారు. తినేవాళ్ళ్ని పావురం మాంసంకూడా తినమంటారు. లావు తగ్గడానికి ఉదయంలేవగానే పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చనినీటిలో సగం నిమ్మకాయరసం పిండి ఉప్పు, మిరియపుపొడి కలిపి తాగుతుంటే కొన్నాళ్ళకు తగ్గుతుంది.

పాముకరిస్తే వెంటనే 12 ఏండ్లబాలుని మూత్రం 150 గ్రాములు త్రాగిస్తే విషం విరిగిపోతుందట. సాధారణంగా దీనికి వైద్యం కళ్ళకు మిరియాలగంధం కలికంపెట్టి నిద్రరాకుండా చేసి నాగముషిణి గంధం త్రాగిస్తారు. కొంతమంది వైద్యులు పాముకాటుకు వెంటనే కరిచినచోటికి పైన త్రాడుతోబిగించి కట్టి రక్తప్రసారంకాకుండా నిలిపివేసి కాటువేసిన చోట ఏదైనా ఆయుధంతోకోసి రక్తంపిండి బయటకు కారేటట్టు చేస్తారు. తేలుకుడితే కొంతమంది గడ్డిపరకతో కుట్టినచోటరాస్తూమంత్రం వేస్తారు. ఈ మంత్రానికికూడా తగ్గిందనేవారున్నారు.మడేలుమంత్రం (మళయాళ మంత్రం, అని మరోచిత్రమైన మంత్రముంది- మంత్రించి అదికుట్టింది నిన్నుకాదు ఆ గోడను అంటాడు. వెంటనే ఆ గోడబెల్లు విరిగిపడుతుందట. ఇక్కడ నొప్పి తగ్గిపోతుండట. చెయ్యిగానీ, కాలుగానీ తెగితే వెంటనే గుంటకలవరాకు కట్తుకడతారు. మానిపోతుంది. కొండనాలుక పెరిగితే ఉప్పు, పసుపుపెట్టి నొక్కుతారు. తగ్గిపోతుంది. వ్రణాలకు పలస్త్రి పట్టు వేస్తారు. పిల్లల అనాసలకు కోనసీమలోని పుల్లేటికుర్రుగ్రామంలో నేటివ్ మందిస్తారు. అనాస తగ్గిపోతుంది.

ఇలాగ ఇంకా ఎన్నోజబ్బులను పెరట్లోమొక్కల పసర్లతోనూ, ఇంట్లో వస్తువులతోనూ ఖరీదులేని వైద్యం చేసే పెద్దవాళ్ళు ఆడా, మగా గ్ర్రామ గ్రామాన ఎందరో వుండేవారు. ఫీజులేని ప్రిస్క్రిప్ష్నన్. వీరే గ్రామానికి శ్రీరామరక్ష. నిజానికి వీళ్ళలో చాలమంది అక్షరజ్ఞానమున్న వాళ్ళుకూడా కాదు. వినికిడిద్వారానూ, అనుభవంద్వారాఊ అలవడిందే అంతా. వీళ్లు కొన్నింటికి ఈ మందులతోపాటు మంత్రంకూడా వేస్తారు. ఈ మంత్రం పూర్త్రిగా సైకలాజికల్ ట్రీట్ మెంట్. వాళ్ళు ఉచ్చరించే మంత్రమల్లా 'దేవుడా, పరమేశ్వరా, ఇతనికి ఈజబ్బు వెంటనే తగ్గించు తండ్రీ- ఈ మంత్రంతో ఈ జబ్బు తగ్గుగాక ' అని పలుసార్లు నో"టితో అంటుంటారు. ఆలోచిస్తే ఇది నేటి హిప్నాటిజం పద్ధతిని మూలరూపమే. డాక్టర్లు, నర్సులు అక్కర్లేకుండా ఎరుకలసానులే పురుళ్ళుపోస్తారు. ఒక్కోసారి వాళ్ళలో పెద్దవాళ్లుకూడా పురుళ్లుపోస్తారు. ఎరుకలసాని బోడ్డు కోస్తుంది అంతే. ఇంతాచేస్తే పురిటిఖర్చు కట్టుకునే పాతచీర ఒకటి ఆమెకు బహుమతి ఇవ్వటమే.

కాలక్రమంలో ఈ అనుభవవైధ్యం ఆయుర్వేదిక్, హోమియోపతిక్, అల్లోపతిక్ల మధ్య మరుగుకుపోయింది. అయినా ఈ నాటికీ ముసలమ్మలు ఈ వైద్యాలు చెప్పుతుంటారు అక్కడక్కడ. పేదలపాలిటి పెన్నిధివంటి ఈ వైద్యం కాలగర్భంలో కలిసిపోకముందే సేకరించి పరిరక్షించడం తక్షణ కర్తవ్యం. ప్రతి చిన్నజబ్బుకీ డాక్టర్లు వ్రాస్తున్న మందులజాబితా తట్టుకోలేక ఆక్రోసిస్తున్న సామాన్యుడికి ఇది ఎంతో ఉపశమనం.

జానపదులలో మరోవైద్యం ఉంది. అదీభూతవైద్యం. సాధారణంగా పురటాలు బలవంతంగా చచ్చిపోతే దెయ్యమౌతుంది అనినమ్మకం. అలాగే నూతిలోపడి, చెరువులోపడి, కాలువలోపడి బలవంతంచావు వాళ్ళు (పురుషులైనాసరే) భూత, ప్రేత, పిశాచలవుతారని విశ్వాసం. ఆ చనిపోయినవాళ్లు- ఆయింట్లోవారినిగాని ఆవీధిలోవారినిగాని బంధుమిత్రులను గాని ఆవేశించి తమకోర్కెలు చెప్పి అవి చెల్లింప చేసుకుంటారు. దెయ్యాలు ఆవేశించినవారి చిటికెనవ్రేలుగోరు నొక్కితే ఆ దెయ్యం వొదిలేస్తుందట.కొంతమందికి నవాసారద్రావణం వాసనచూపిస్తే ఆ ఘాటుకు వొదిలేస్తుంది కొంతమంది సాంబ్రాణి పొగ వేసి ఆ దెయ్యం కోరికలు చెప్పించి అవి తీరుస్తారు. కొంతమంది అనారోగ్యానికి గురైనప్పుడు ఎక్కడో ఏదో చూసి జడుసుకున్నారని అక్కడ శక్తి పట్టుకుందని ఆ ఆరోగ్య క్షీణానికి అది కారణమని భూతవైధ్యుని దగ్గరకు తీసుకువెళ్తారు. అతడు పరిపిండితో పిశాచిబొమ్మవేసి పద్మంవేసి అందులోఆరోగిని కూర్చుండబెట్టి ఓం, హ్రీం, క్రీం అని గట్టిగా అరుస్తూ పట్టుకున్న శక్తిని వద్లిపొమ్మనిచెప్తూ కోడిపెట్టకాలిగోరుకోసి ఆ రక్తంతో రోగికి తిలకంపెట్టి, నిమ్మకాఅలు సగానికికోసి రోగి తలచిట్టూ దొగదుడుచి పారేస్తాడు. మంత్రించి వేరుముక్క కట్టి విభూతి కుంకం ఇస్తాడు నిత్యం బొట్టుపెట్టమని. ఈవైద్యానికి భూతం వదిలేసి తగ్గిపోయిందనే వారూ ఉన్నారు. ఈ భూతవైద్యులకు తూర్పుగోదావరి జిల్లాలోని పడిసిలేరు, లక్ష్మీనరసాపురం, లొల్ల గ్రామాలు ప్రసిద్ధి. ఈ వైద్యులు పేకబెత్తం ఝుళి ఆవేశించిన భూతాన్ని మాట్లాడిస్తారు రోగిద్వారా. ఇందులో నిజమెంత ఉన్నా జానపదవైద్యంలోలో దీనికున్న ప్రసిద్ధిని కొట్టిపారేయ్యడానికి వీల్లేదు. ఈ భూతవైధ్యుల్లో కొందరు మాత్రరూపంలో మందులిచ్చి విడిపోయిన జంటలను కలపడం ఉంది. మనిషిని వశంచేసుకోవడానికి మందుపెట్టడం అనేది ఉంది. ఈ మందులు మైదెరకల స్త్రీలు ఇస్తుంటారు. ఎవరైనా ఒక పురుషుడు మరో స్త్రీ పట్ల మరీ మక్కువ చూపిస్తుంటే ఆమె మందో, మాకో పెట్టిందనడం జానపదులరివాజుమాట. భూతవైద్యానికి కొంతమందిముస్లింలు ఖురాను మంత్రాలు వ్రాసిన రక్షరేకులు, తాయెత్తులు కడతారు. దీనికోసం వీరుతీసుకొనే డబ్బులుకూడ తక్కువ. పసిపిల్లల జబ్బులకు వైద్యులదగ్గరికి వెళ్లడానికి బద్లు ముందుగా వీరిదగ్గరకే పరిగెడతారు. వారు ఉరుదూ లిపిలోఉన్న పుస్తకంలో ఆడబ్బులుపెట్టించి ఆ డబ్బులుపెట్టిన పేజీలో ఉన్న విషయముతో ఆ జబ్బునుచెప్పి దాని నివారణకు మంత్రించిన తాయెత్తును ఇచ్చి మొలకో, మెడకో, చేతికో కట్టమని చెప్పి, ఆ సాయంకాలం ఎర్ర్ర నీళ్ళు పచ్చనీళ్ళు దిగదుడిచి ఊరావల నలుగురూనడీచే రోడ్డుపై పొరబోయమంటారు.

కొందరు నాలుగుబాటలు కలిసినచోట దిగదుడిచిన బల్యన్నం పొయిస్తారు. ఈ భూతవైద్యంతోబాటు ఇంటిదగ్గర మామూలుగా గచ్చాకు పుచ్చాకు వైద్యంకూడా చేయిస్తుంటారు. దేనికి తగ్గుతుందో తెలియదు కాని మొత్తంమీద భూతవైద్యానికుకూడా గిరాకీ ఎక్కువే. దీర్గరోగాలకు నల్లకోడిపెట్టను దిగడిచి కోస్తారు. ఇంకా రోగం అలీయమైనదైతే పందితోనూ, డప్పులతోనూ మిట్టమధ్యాహ్నంవేళ దిగదుడుపు పెడుతుంటారు. వీధిలో అది తీసుకెళ్లేటప్పుడు ఎవరైనా చూస్తే ఆ భూతం ఆరోగిని వదిలి చూసినవారిని పట్టుకుంటుందని దిదుడుపు తమ వీధిదాటేవరకూ అందరూ తలుపులు మూసేసుకుంటారు. అయినా జాగ్రత్తకోసం ముందుగా ఒక మనిషి దిగదుడుపు వస్తుందని వీధిలో చెప్పుకుంటూ ముందుకెళతారు. కాకినాడదగ్గర పెదపూడిలోనూ, గొల్లలమామిడాడలోనున్న మర్కెట్టుషెడ్లో నూ ప్రతి ఆదివారం, లక్ష్మీవారం ఒక ముశ్లిం యీ భూతవైద్యం చేస్తాడు. చాలమందికి అతనిమాట నమ్మకం.

పశువులకు జబ్బుచేస్తే కూడా జానపదులు తమ జ్ఞానవైద్యంతోనే బాగుచేసుకుంటారు. కీళ్లనొప్పులు, వాతం నొప్పులకు గుర్రులేయిస్తారు. అంటే అక్కడా వాతలేస్తారు. ఆకలిపెంచడానికి ఉప్పు, నల్లేరు కలిపి కారం నీళ్ళతో గొంతులో గొట్టంతోపోస్తారు. దొమ్మరోగానికి కొఱ్ఱగంజిపోస్తారు. ఆవులు, గేదలి ఈనినపుడు బాలించరాలికి పాతబియ్యం అన్నంలాగే పాతవడ్లు, ఉలవలు ఉడకేసి పెడతారు. పశువులకు సాధారణంగా వచ్చే పారుడురోగం, కాళ్ళకుగాళ్ళు తగలడం, గొంతువాపు, గురకరోగం, మాద, కురము, వాతం ఇలాంటి జబ్బులుకూడా వీరు తమ నాటువైద్యంతోనే తగ్గింపచేస్తారు.

ఆహారం:

చేలో పండించుకున్న వడ్లు దంచుకుని చక్కగా బియ్యం చేసుకుని వండుకుంటారు. ఇది తవుడుతో కలిసివుంటుంది. 'బి ' విటమిన్ సంపూర్ణంగా మినుములూ, పెసలూ చేంగినూ, కందిచేను గట్లమీదాపెంచి మినప్పప్పుతో మినపరొట్టే, పెసలతో పెసరపప్పు, కందులతో కందిపప్పు వండుకుతింటారు. అంటే వారికి కావలసిన ఆహారం వారిచేతిలో ఉన్నట్టే. కొందరు ఉదయం చోడిఅంబలిలో మజ్జిగ, ఉప్పు కలుపుకు త్రాగురారు. ఇదివారి ఉదయం టిఫిన్ అన్నమాట. చాలామంది చద్ధన్నం తింటారు. సాయంత్రం ఉప్పుకలిపిన ఉడుకుగంజి త్రాగుతారు. ఇది వారి సాయంత్రం కాఫీ. ఇవి చవకగా లభ్యంకావడమే కాకుండా దేహానికి తుతుష్టినీ పుష్టినీ కలిగించే బలిష్ఠమైన ఆహారం. వీనిలో విటమునుల విలువ ఎక్కువ. అందుకే వరిలో నగరజీవులలాగ్ఫ నరాల బలహీనతలు, రక్తహీనతలు తక్కువ. వారు పండింఛే పంటకు ఎరువు వారి యింటి పెంటే. *"కుక్కపిల్ల, సబ్బుబిళ్ళ, అగ్గిపుల్ల, కాదేదీ కవితానర్హం" అన్నట్లు వీరికి పనికిరాని వస్తువులేదు.పైగా ఈ పెంటతో పెంచబడ్డ పంట ఆరోగ్యానికి మంచిదంట. వీరు పంటకు కాల్చిన మట్టి కుండలువాడతారు. ఇది ఖరీదు తక్కువేకాకుండా యితర పాత్రలలోలాగ వేడి తగిలినప్పుడు వంటపదార్ధంలో మరో రసాయనిక సంయోగం జరుగదు. అందువల్ల ఆరోగ్యానికేహానీ ఉండదు. వంటకే కాకుండా నీళ్ళు తెచ్చుకోవడానికీ చల్లకూ మట్టికడవలనే వాడుతారు. ఖరీదైన పాత్రలుకాదు గనుక దొంగతనాల బెడద ఉండ్దు. వేదంలోకూడా "మృణ్మయం దేవపాత్రం" అనివుంది. 'నాధుడు పల్లియకేగి భుజింపకున్కి భరితంబయి అట్టుకనట్టునట్టి యొప్పనో దనంబొసగె తదాజ్ఞానం శ్రావమూకుటన్" (పాండురంగమహత్యం) అటకలోని అన్నంను మట్టిమూకిట (చిప్పలో) తెచ్చి వడ్డించెనని అర్ధం. ఈ మట్టికుండల వినియోగం అంతపురాతనమైనది. జానపదులలో పాడి సమృద్ధి - ఇంటికొచ్చిన అతిధికి మజ్జిగ దాహం యిచ్చి మర్యాదచేస్తారు. వ్యవసాయానికి ఎద్దులూ పోతులూ పాడికి ఆవులూ గేదెలూ వారి జీవిత భాగస్వాములు. కాఫీ, టీల కంటే మజ్జిగ సేవనం మనిషికి ఆరోగ్యం.

ఇక కావలసిన కూరా నారా యింటి పెరట్లోనే పండించుకుంటారు. ఈ జానపదుల పెరటితోట నిజానికి ఆరోగ్య ఐశ్వర్యాల మూట.


                       *మహా ప్రస్థానం - శ్రీ శ్రీ ప్రతియింటికీ పెరటిలో తోట పల్లెటూళ్ళలో కనుపించే ఒక సుందర దృశ్యం. ఇవి ఆహార విహారాలకే కాకుండా ఆదాయాన్నికూడా సమకూరుస్తాయి.  అందులో నాటిన ప్రతిమొక్కా ఆరోగ్యరీత్యానో ఔషధపరంగానో ఏదో ఒక పరమార్థం కలిగివున్నదే.  ముఖ్యంగా తులసి, ములగ, పసుపు, ఉసిరిక, కరివేపాకు, బొప్పాయి, నిమ్మ, అరటి, కొబ్బరి చెప్పుకోదగ్గ చెట్లు - అలాగే దొండ, కాకర, బీర, ఆనప, పొట్ల,గుమ్మడి, వంకాయ, బెండకాయలాంటి కూరగాయలు, బచ్చలి, తోటకూర, గోంగూర, పొన్నగంటికూర వంటి ఆకుకూరలు విస్తారంగా పెంచుతారు.
                            తు ల సి

దీనిని పూజిస్తే పుణ్యం పురుషార్ధం వస్తుందనేది ఒక అలౌకిక దృష్టి. సైన్సుదృష్ట్యా యిది దోమల నివారిణి. దీని ఆకు జీర్ణకారి. పైత్యవికారం తగ్గిస్తుంది. డజను తులసాకులూ రెండు మిరియపుగింజలూ కలిపి తింటే పడిశం తగ్గుతుంది. తులసిఆకు పసరు చర్మంమీది తెల్లమచ్చలకు, కురుపులకు దివ్యౌషధం.

పౌరాణీకంగా యీ దళానికి ఒక విలువుంది. కృష్ణ తుల్లాభారంలో దీనిపాత్ర అపూర్వం. శ్రీకృష్ణుని బరువు తూయడానికి సత్యభామ నగలన్నీ చాలలేదు. ఒక్క తులసిదళంతో సరితూగాడట. రామదాసు శ్రీరాముణ్ణి 'చారు తులసీదళధామ ' అంటాడు. చిలకర్తివారి 'గణపతి ' దీనికి అర్ధం 'చారులో తులసిదళంవేసుకొని త్రాగడం ' అని చెప్పినప్పుడు నవ్వువస్తుంది. కానీ పైత్యవికారం ఎక్కువగా ఉన్నప్పుడు తులసాకు ఏరూపంలో తిన్నా పైత్యాన్ని తగ్గిస్తుంది.

                        ము ల గ

ములగకాడలో విటమిన్ 'ఎ ' ఎక్కువ. ఖనిజలవణాలు, మాంసకృత్తులు సకృతుగా గల బలవర్ధకాహారం. అమ్మవారికి నైవేద్యం పెట్టేటప్పుడు ములగాకు, తెలగపిండి కూరవండి పెడతారు ఆపేరుమీదనైనా ప్రసాదంగా అది తిని బలవంతులవుతారని. రాలిపోయిన ములగపువ్వు ఏరి, పప్పులో వేసుకుని వండుకుంటారు. ములగచెట్తు బెరడు గుండకొట్టి గుడ్డలో కట్టి జలుబుచెసినప్పుడు ముక్కుదగ్గర పెట్టుకు పీలిస్తే ఉపశమనం కలుగుతుంది. నడుమునొప్పికి, ఇరుకు నొప్పులకె ములగాకు, వామ్ము కట్టు గొప్పగా పనిచేస్తుంది.

                            ప సు పు

ఇది క్రిమిసంహారిణి. ఆరోగ్యానికి అత్యంతావశ్యకం. సెప్టిక్ ను నిరోధిస్తుంది. పూర్వకాలంలో మగవాళ్ళ పాముకోళ్లు, పాదరక్షలు ధరించినట్లుంది గాని స్త్రీలు ధరించినట్లు లేదు. అందువల్ల కాలికి ఏదైనా దెబ్బ తగిలినా సెప్టిక్ కాకుండా ముందుజాగ్రత్తగా పాదాలకు పసుపు పారాణిరాసేవారు. లివర్ జబ్బులకు మంచిమందు. స్త్రీలకు రోమనివారిణి. జానపదస్త్రీలు ముఖానికి నిండుగా పసుపు రాసుకుంటారు. నగరీకులు పౌదర్లమోజుల్లో దీన్ని విస్మరించడంతొ చాలామంది స్త్రీలకు మీసాలు చూస్తున్నాం. ఇది మంచి జీర్ణకారికూడా - అందుకే ప్రతికూరలోనూ వేస్తారు. దీనికి మలేరియా నిరోధక శక్తివుంది. ఇళ్లలో పసుపునీళ్లు చల్లడంలో శుభం మాట ఎలవున్నా క్రిములనుచంపే శక్తిగా వినియోగించడం దీని వనుకవున్న రహస్యం.

                          ఉ సి రి క

దీన్ని అమృతఫలం అంటారు. దీనినిండా 'సి " విటమినే. పాత ఉసిరికాయ పచ్చడి పత్య్హానికి మంచిది. మనకు ప్రౌఢభాషలో 'కరతలామలకం' అనె మాటవుంది. దీనర్ధం 'అరచేతిలో ఉసిరికాయ ' అని. ప్రతి యింటిలోనూ యివిపెంచుతారు. కనుక సులువుగా లభ్యమయ్యేది.

'సి ' విటమిను సరిపడా లేకుంటే దేహంలో వ్యాధినిరోధక శక్తి తగ్గిపోయి ఏవ్యాధి అయినా యిట్టేసోకే ప్రమాదముంది. నేటి 'ఎయిడ్సు ' వ్యాధికి దీనినుండి ఏదైనా మందు కనిపెట్టవచ్చేమో ఆయుర్వేదపరిశోధకులు ఆలోచించడం మంచిది. పచ్చిఉసిరికాయ దాహాన్ని తగ్గిస్తుంది. అందుకే మందుటెండలో ప్రయాణించేవారు రాచఉసిరికాయ వెంట తీకుకొని పోతుంటారు. క రి వే పా కు

దీనిలో విటమిన్ 'ఎ ' పుష్కలంగా వుంది. పైత్యహారి - జీర్ణకారి. కాని ఇప్పుడు దీనిని విస్మరించి మనవాళ్ళు కూరల్లో చారుల్లో ఏదో సువాసనకోసం వేసినట్లు భావించి తినేటప్పుడు ఏరిపారవేస్తారు. అందుకే ఎవరినైనా అనవసరమున్నప్పుడు వాడుకుని సమాయానికి దూరంగా గెంటివేస్తుంటే వాడిది పాపం కరివేపాకుబ్రతుకురా అంటుండడం వాడులో కొచ్చింది.

అసక్య్ వెంకటేశ్వరస్వామి జనపదకధలో దీనికి చలా ప్రాముఖ్యముంది. అలివేలుమంగమ్మ సారెలో కరివేపాకు తేలేదనేగదా వెంకన్న బాబు ఆమెను ఏలుకోను పొమ్నన్నాడు.

                            బొ ప్పా యి

ఈ పండులో మాంసకృత్తులు మెండు. జీర్ణశక్తినిండు. మాంస తొందరగా మెత్తగా ఉడికించాలంటే రెండు పచ్చిబొప్పాయి ముక్కలు వేసి ఉడికిస్తే చాలు, ఇట్టే మొత్తనైపోతుంది. ఈ పండు చక్కెర వ్యాదిని తగ్గిస్చుంది.

                                ని  మ్మ

ఈ పండు విటమిన్ 'సి 'కి నిలయం. వేడిచేసే కూరలన్నిటిలోనూ ఇది వాడతారు చలవకోసం. నిమ్మరసం ఒంటికిరుద్ది కొంతసేపయ్యాక స్నానంచేస్తే వొంటికి మంచి చాయనిస్తుంది నిమ్మకాయ చిప్పలు ఎండబెట్టి నలుగుపిండిలోకలిపి రాస్తే శరీరానికి కాంతినిస్తుంది. వేడిచేసినప్పుడు నిమ్మరసంలో పంచదార వేసుకొని నీళ్ళలో కలిపిత్రాగితే చల్లబరుస్తుంది. ఉదయం పరగడుపున ఒక కాయ నిమ్మరసం చెంచాడు తేనెలో కలిపి త్రాగితే ఒళ్ళు తగ్గుతుంది. ధారుపుస్టి కలిగిస్తుంది.

మొక్కలన్నింటిలోకి యీమొక్క వీరక్కువ త్రాగుతుంది. ఎన్నినీళ్ళుపోసినా పోసినట్టు కనిపించదు. అందుకే ఎవరైనా గుంభనంగా ఉలుకుపలుకు లేకుండా ఉంటే నిమ్మకునీరత్తినట్టు అలాగున్నావేమిటిరా అంటుంటారు. అ ర టి

అదితులు, బందువులు, ఏవేళ్ళొచ్చినా కంగారుపడకుండా అర్జంటుగా ఆదుకోనటానికి ఇంటిలోని అరటిచెట్టు పెద్ద అండ. చెట్టునున్న గెలనుంచి కాయలుకోసి కూరవండి తృప్తిగా పెట్టవచ్చు. అరటిపువ్వు కడుపులోని అల్సర్ కి మందు. అరటిదువ్వ తింటే చలువచేస్తుంది. అరటిపండు సుఖవిరేచనకారి. అరటిపండులోనిగింజలపౌడరు తింటే మసూచి దరికి రానివ్వదు. అరటి ఆకులు అన్నం, టిఫినూ తినడానికి చాలాఉపయోగిస్తాయి. అరటిపువ్వు వలిచాక చివరనమిగిలిన లింగం నమిలితే కడుపులో నులిపురుగు చచ్చిపోతుంది.(ఎమీబియసిస్) నోటిపూతకూడా పోతుంది.

                        కొ బ్బ రి

ఈ కాయను నారికేళఫలం అంటారు. కొబ్బరినీరు నీరుడు దోషాన్ని తొలగిస్తుంది. చలువచేస్తుంది. ఎండాకాలంలో దీని ప్రతిభ అద్బుతం లోని గుంజు మంచి బలవర్ధకాహారం. గాంధీగారు (మహాత్మాగాంధీ) దీన్నే ఎక్కువ భుజించేవారు. దురదలు కొబ్బరిపాలు రుద్దితే పోతాయి. కొబ్బరిపాలతో తల రుద్దుకుంటే అకాలపుతల నెరదంటారు. వెంట్రుకలు ఊడిపోవడాన్ని ఆపుచేస్తుంది. కొబ్బరిడొక్క పొయ్యిలోకి ఉపయోగిస్తుంది. కొబ్బరిపీచు త్రాడుగా ఉపయోగపడుతుంది. కొబ్బరి ఆకు చాపలకు పనికొస్తుంది. కాయ అమ్మకానికి విలువైనది. అందుకే కొబ్బరిచెట్టును కొంగుబంగారామన్నారు.

ఈ చెట్లవల్ల యిన్ని లాభాలుండబట్టే "సస్యశ్రీ" గారు "చెట్టు నాజట్టు" అన్నారు కవితారూపంలో.

                            కూ ర గా య లు

దొండకాయ చక్కెరవ్యాధి మీద చక్కగా పనిచేస్తుంది. కదుపులోని కల్మషం పోవడానికి చిన్నప్పుడు దొండాకుపసరు ఉగ్గు పెడతారు. అందుకే ఏదైనా తగువొచ్చినప్పుడు, శత్రువుని కసిగా తిట్టేటప్పుడు "దొండకాయపసరు కక్కిస్తా" అంటుండడం వింటుంటాం. అంటే దాని మనుగడ అంత దీర్ఘకాలిమమైనది. దొండాకు చలవచేస్తుంది. కాకరకాయ సర్ం క"డుపులో నులిపురుగుల్ని చంపుతుంది. చక్కెరవ్యాధికి కూడాయిదిమందే. ఆనపకాయ, బీరకాయ, పొట్లఖాఆయాలలో విటమిన్లు పుష్టిగా ఉండడమె గాక సులువుగా జీర్ణమౌతాయి. అందుకే పత్యానికి యీకూరలు వాడతారు. వంకాయ ఆరోగ్యరీత్యా మంచిచెడ్డలెలా ఉన్నా ఇది రుచి రాజము. "వంకాయ్ వంటి కూరయు, లంకాపతిపైరివంటిరాజులుకలరే ' అంటారు ఓ కవి. బెండకాయ ముదరకుండా ఉంటే మంచి ఆహారం. ముదిరితే మాత్రం ఒక ముతకసామెతుంది. "బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా ప్రమాదం ' అని. అందుకే కోసేటప్పుడు యీకాయలు ముచ్చికలు విరిచి చూచుకుంటారు.

బూడిద గుమ్మడికాఅయ వడియాలు పెట్టుకొని వేపుకుతెంటే బలే రుచిగా ఉంటాయి. దీని గింజలు కడుపులో పాములున్న వాళ్ళకి పాములమందే.

                           ఆ కు కూ ర లు

గోంగూర పచ్చడి తెలుగువారి ప్రత్యేకతకు తెలిపే వంటకం. దీనినిండా ఖనిజ లవణాలుంటాయి. బచ్చలకూర, తోటకూర, పొన్నగంటికూర, మెంతుకూర, సుఖవిరేచన కారులు. మలబద్ధకాన్ని తొలగిస్తాయి. పొన్నగంటికూరను సంసృతంలో 'జనార్నవ ' అంటారు. దీనిలో బంగారు ఖనిజం ఉందట. తమిళంలో 'పొన్న 'అంటే బంగారం అని అర్థం. దీన్నిండా 'ఎ ' విటమినే. అందువల్ల కంటిజబ్బులకు ఇది ఉపయోగకారి.

మామూలుగా యివికడుపు నింపుకోవడానికి తింటున్నామనుకున్నా మనిషి జీవితానికి కావలసిన పోషక పదార్థాలు నిండిఉండడంతో అవి అందుబాటులో ఉండేలాగ ఆలోచించి జానపదులు పెరళ్ళలో పెంచేవారు. ఈ పౌష్టికాహారంతో ఆరోగ్యంగా నూరేళ్ళు బ్రతికేవారు. ఇప్పుడు చెట్లను పెంచడం మాని కొట్టేయడం ప్రారంభించారు ప్రతి గజం స్థలంలోనూ యిల్లు కట్టేసి అద్దెలకెచ్చేసి ఆదాయం సంపాదించేయాలని. ఇది పల్లెలకు కూడా ప్రాకిపోయింది. అందుకే "సుజలాం, సుఫలాం, మలయజశీతలాం, సస్యశ్యామలాం" ప్రార్ధనకే పరిమితమైపోయింది. చెట్లులేక పోవడాంవల్ల మంచిగాలి కరువు - వర్షాభావం ఏర్పడి మంచినీళ్ళకరువు. వర్షాలులేకపోవడం వల్ల పంటలకరువు. అందుకే మరల పెరట్లో చెట్టులు పెంచడం, కనీసం మనిషికొకచెట్టు నాటడం యీనాడు అందరూ చేపట్టవలసినది.

విహారం:

               "ఆడకే చుక్కాని ఈడనే గడవేసి
                 పడవెక్కి భ్ణద్రాద్రి పోదామా
                 చలి గంగస్నానము చేదామా"
                  

జానపదులైన క్రొత్తజంటలవిహారయాత్రలు ఇవి. వీరివిహారయాత్రలలో ముఖ్యమైన తీర్ధయాత్రలు, అంతర్వేది, పొన్నాడ, చొల్లంగి, కోరుకొండ, కోటిపల్లి, వాడపల్లి మొదలగు తీర్ధాలకు యెడ్లబళ్ళు కట్టుకొని మూటకూళ్ళు పట్టుమొని కుటుంబాలకు కుటుంబాలు తరలి వెళతారు. దగ్గర తీర్ధాలకు కాలినడకనే వెడతారు - ఇరుగు పొరుగు వారితో జట్లుజట్లుగా కూడి. దూరప్రాంతాలైన తిరుపతి, సింహాచలం, అన్నవరం వగైరా పుణ్యక్షేత్రాలకు మొక్కుంబడుల పేర్లతో రైలులో వెళతారు. ఈ ప్రయాణాలలో అటుకులు మూటకట్టుకొనిపోయి ప్రయాణం మధ్యలో అన్నానికి బదులు అవి నీళ్ళలో నానబెట్టుకు తింటారు. జాతర్లలో, తీర్ధాలలో వీరు స్వేచ్చగావిహరిస్తూ మంచం పకోడీలు, జీళ్ళు, కరకజ్జం, కడ్డీలు కొనుక్కు తినడం, లక్కపిడతలు, కొయ్యబొమ్మలుకొని తెచ్చుకోవడం, స్త్రీలు రకరకాల గాజులు తొడిగించుకోవడం చేస్తూ ఎంతో ముచ్చటగా తిరుగుతారు. రంగులరాట్నం సరదా విపరీతం. పురుషులు రంగుల రాట్నంలో గుర్రాలు, ఏనుగులు సింహాలమీద ఎక్కగా, స్త్రీలు ఉయ్యాళ్ళలో కూర్చుంటారు. రంగులరాట్నం గిర్రున తిరుగుతుంటే వాళ్ళ కళ్లు గిర్రున తిరిగిపోయి, గాలిలో తేలిపోయి ఏదో లోకంలోకి ఎగిరిపోతున్నట్టు మధురానుభూతిని పొందుతారు. ఈ రంగులరట్నం సాహిత్యంలో అనాదికాలం నుంచీ కనిపిస్తోంది. చంద్రశేఖర శతకంలో దీని ప్రస్తావన యిలా ఉంది.

",,,,,,,,,,,,,,,,,,సం
బరమరి దెల్పుమింకొక పబావము
రంకులరాటామెక్కి నే
తిరిగిన సాటిరాదని సుతించును,"

పాల్కురికి సోమనాధుని బసవ పురాణంలో ఇలా వుంది-
" చటిల సంస్కృతి జీవ ఘట చక్ర రర్మ
పటు పరివర్తన భ్రమణంబు గూర్చి
కీలు వూందించి యాక్రియ రాటనముల
వాలి యాడించు నా వడ్రంగియతడు"

ఈ విహారాలు పెళ్ళీకాని పిల్లల పెశ్శిచూపులకు ఒక సాధనం అవుతాయి. ఇలా ఇతర పాంతాలకు వెళ్ళడంలో దేశంలొని మంచిచెడులు, ప్రజల సాధక బాధకాలు అవగర్ మవుతాయి. ఇలా కొన్ని కుటుంబాలు కలిసివెళ్ళి ఒకరి కష్టసుఖాలు ఒకరు పంచుకొనడం వల్ల వారిలో ఒకరిపై ఒకరికి ప్రేమానురాగాలు పెరుగుతాయి. పల్లెలలో సధారణంగా స్త్రీ పురుషులు పొలాల్లో పనిపాట్లు సాగించుకొంటూ పైరగాలి ఆశ్వాదిస్తుంటారు నిత్యమూను. ఇదే నిజంగా ఆరోగ్యకరమైన విహారం.

వ్యవహారం:

1. మ ర్యా ద లు:

అతిధులువస్తే ముందుగా కాళ్ళుకడుక్కోడానికి నీళ్ళు ఇస్తారు. వీథిలోనే వాళ్లు కాళ్ళు కడుక్కొని లోనికి ప్రవేశించాలి. దీనివల్ల సూక్ష్మక్రిములు వారి కాలిధూళితో ఇంటిలోనికి రారాకుండా నిరోధించబడుతుంది. ఆ కడుక్కోనెటప్పుడు చిన్న పొడికూడా ఉండకుండా కడుక్కోవాలి. ఈ పొడిగానీ ఉంటే అందులో శని ప్రవేశిస్తుందట. దనికి జానపదులు నలదమయంతుల కధ ఉదహరిస్తుంటారు. నలుడు అన్నిట పరిశుద్దుడే గాని ఒక రోజు కాళ్ళు కడుక్కొనేటప్పుడు మడమపై చిన్న పొడిభాగం ఉండిపోయిందట. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శని దీనితో అవకాశం చిక్కి ఆవహించి అష్ఠకష్టాలూ పెట్టాడట. తరువాత ఉప్పుకలీపిన చల్లని మజ్జిగ దాహం ఇస్తారు. ఆపైన వాకిట్లో మంచం వేస్తారు. చాలామంది ఎంతదూరం అయినా నడిచేవెళతారు. అందువల్ల అలసి ఉంటారు. వారు ఆ మంచంమీద కూర్చొనిగాని పడుకొనిగాని సేద తీర్చుకుంటారు. ఇందులో రాజుల మర్యాదసేసి వెలమలు, రాజులు చాపవేసి తమరు దయచేయండంటే తమరు దయచెయ్యండంటూ అందరూ చాపచుట్టూ నేలమీదే కూర్చోవడం విచిత్రం.

2. పెళ్ళీభద్రత:

పిల్లల పెళ్ళీ పెద్దలే నిర్ణయిస్తారు. అందువల్ల వారి నిత్యజీవితంలో వచ్చే పొరపొచ్చాలకు పెద్దలు బాధ్యత తీసుకొని సరిచేస్తారు. అంటే పెళ్ళీకి ఇలా సాంఘిక భద్రత కల్పించబడిందన్నమాట.

3. సెక్సు విజ్ఞానం:

ఇది అతి సులువుగా అందరికీ బోధపడేటట్లు దేవాలయాలపై బూతుబొమ్మలు వేయించడం ఒక పద్ధతి. పెద్దవాళ్ళు పెళ్లయి వయసొచ్చిన బిడ్డల దగ్గర అప్పుడప్పుడు మర్మ గర్భితంగా సెక్సు విషయాలు మాట్లాడటం మరొకపద్ధతి. శోభనం దినాన పెద్ధముత్తైదవులు రతి విషయాన్ని రహస్యంగా వివరించి చెబుతారు స్త్రీకి. పురుషుడికి మగవారితో ఒకరీ బోధపరుస్తారు. ఆ దంపతుల్ని ఆత్యంత సన్నిహితులను చేయడానికి ఒకరు ఎంగిలి చేసిన పాలు మరొకరితో త్రాగించడం వగైరా చేయిస్తారు.

4. ప రి శు భ్ర త :

ఉదయం లేవగానే ప్రతివారూ వారి వీధి తుడిచి పేడతో కళ్ళాపు చల్లి దానిపై ముగ్గులు పెట్టడం మొదటి చర్య. దీనివల్ల పరిసర కాలుష్యం నివారింపబడుతుంది. ముగ్గువల్ల వీధికి అందం రావడమేకాక సూక్ష్మక్రిమిసంహారం జరుగుతుంది. పండుగ పేరుచెప్పి తరుచు ఇల్లు అలుకుట కూడ ఇందుకోసమే.

5. మైల పట్టడం

ఇంట్లో ఎవరికైనా బిడ్డ పుట్టినపుడు పదిరోజులు మైల పాటించి పదవ రోజున పురిటి స్నానం చేయిస్తారు. అప్పటి వరకూ ఆ పురిటి ఇంట్లోకి ఎప్పుడూ వెళ్లరు. వెళ్లినవారు వెంటనే ఆ బట్టలు విడిచి తల స్నానం చేస్తారు. ఆ పురిటిగదిలోని సూక్ష్మక్రిములు బౌయట ప్రపంచం లోనికి రాకుండా ఎర్పరచిన కట్టుబాటు ఇది. ఈపురిటినీళ్ళనాడు ఇరుగు పొరుగువారు బందుమిత్రులు ఒక్కొక్క ఇంటినుంచి ఒక్కొక్క బిందె నీళ్ళు, నలుగుపిండి, పసుపుముద్ద పంపుతారు. అంటే ఈ పదిరోజుల మురికి పరిశుభ్రతకు నీళ్ళు, నలుగుపిండి విశేషంగా అవసరం అవుతాయి. కావున ఒకే ఇంట్లో అన్నినీళ్లు లభ్యంకాకపోవచ్చు - అందువల్లనే ఈ సహకారాన్ని సంప్రదాయంపేరుతో యిలా అందిస్తారు.

అలాగే అవరైనా చనిపోతే ఆ వంశంవారు పదిరోజులు మైల పడతారు. పదవరోజున దిన కార్యక్రమానికి వంశంలో ఇంటికి ఒకరు హాజరై ఊరిచివర చెరువులోగాని, కాలువలోగాని అందరూ కలిసి స్నానంచేసి, శుద్ధి కార్యక్రమంలో పాల్గోంటారు. ఆ రోజు దినకార్యానికి వారందరికీ భోజనం పెట్టాలి. కారణం - అందులో ఇతర గ్రామాలనుంచివచ్చినవాళ్లుంటారు. దీనిని తట్టుకొనుటకు సహాయంగా ఆ వంశం వారు ప్రతి ఇంటినుంచి బియ్యం, ఉప్పు, పప్పు, చింతపండు, పెరుగు తమ మనిషికి సరిపడా ఒక కావిడిలో వేసి ప్రతి ఊరునుంచి, ప్రతీయింటినుంచీ పంపిస్తారు. ఇది ఒక సానుభూతి ప్రక్రియగానే కాకుండా ఆర్ధికంగా ఆ యింటివారిని ఇబ్బంది పడకుండా చేస్తుంది.

8. రచ్చబండ తీర్పులు:

కుటుంబ తగువులు, ఇంటి తగువులు, పొలం తగువులు, వ్యక్తుల మధ్యతగువులు వారిలో వారే పెద్దలను నిర్ణయించుకొని వారిద్వారా రచ్చబండమీద పరిష్కరించుకుంటారు. దీనినే రచ్చబండ తీర్పులు అంటారు. అన్ని కులాలవారూ ఒకరినొకరు అన్నా, బావా, మామా, అక్కా, వదినా, అత్తా అని వరసలుపెట్టి పిలుచుకుంటూ కలిసి మెలసి బ్రతుకుతారు. పెద్దలు వీరి తగువులలోని లోతులు తెలుసుకొని నిష్కపటంగా తీర్పులు చెపుతారు. అందుకే అవి అందరికీ శిరోధార్యం - ఖరీదులేనివి. *"నిరక్షరాస్యులు అజ్ఞానులుకారు. జ్ఞానాన్ని సంపాదిచుకోడానికి అక్షరాస్యత ఒక అవకాశం మాత్రమే. కనుకనే జానపదు;లు అజ్ఞానులు కారు-అనుభవజ్ఞలు. అనుభవం మనిషికి జ్ఞానాన్ని యిస్తుంది.


  • 'ఆంధ్రుల జానపద విజ్ఞానం ' లోని 'తొలి పలుకు ' డా|| ఇరువెంటి కృష్ణమూర్తి తమ అనుభవాలవల్ల తమకు అందిన సంస్కారంతో ఎన్నో శారీరక, సాంఘిక, మానసిక సమస్యలకు పరిష్కారాలు కనుగొని తరతరాలుగా తమకు ఎదురౌతున్న ఇక్కట్లను ఎదుర్కొంటుంటారు"

7. కులాలు

జానపదులలో కులాలు ఉన్నాయి గాని కులవైషమ్యం మాత్రం తక్కువ. కుల కట్టుబాట్లు, అచారాలు ఎవరికి వారివి వేరుగా ఉంటాయి. పెద్దకులాలలో పతివ్రత్యం విధిగా పాటించాలి. పరపురుషసాంగత్యం భార్యను భర్త విడిపెట్టేదాకా పోతుంది. భర్త చనిపోతే ఆమె విధవరాలుగా జీవితాంతం బ్రతకవలసిందే. వ్యభిచార నేరానికి సంఘంలో వెలివేయడం కూడాకద్దు. ఇక మగాడిసంగతికి వస్తే ఏకపత్నీవ్రతం ప్రశంసనీయం - పిల్లలు పుట్టనప్పుడు బహుపత్నీ వ్రతం నిషెధ్జం కాదు. ఒక కాలంలో ఉంపుడుకత్తెలను ఉంచుకోవడం ఆ వ్యక్తి గొప్పతనానికి నిదర్శనంగా ఉండేది. కొన్ని కులాలలో భార్యాభర్తలకు సరిపడకుంటే పెద్దలు విచారణచేసి కులతప్పులు వేసి విడాకులు ఇప్పిస్తారు. వారు పునర్వివాహం చేసుకోవడాన్కి అనుమతిస్తారు. కొన్ని కులాలలో స్త్రీలు అలా ఏడు మనువులు వరకూ వెళ్ళవచ్చు.

ఔదార్యం:

పెద్దరైతులు తమ పొలాలలో పండే పంటను వారిదగ్గర పనిచేసే పాలికాపులకు, కమతం మనుషులకు ఉదారంగా పంచిపెడతారు అందువలన వారు తమరైతులకు లాభాలు ఎక్కువ రావాలని ఎంతో శ్రద్ధగా పొలాల ఆలనాపాలనా చూసి పంట ఎక్కువ పండేటట్లు చూసుకుంటారు. అందుకే విచ్చలవిడిగా వదిలేసినా పొలాలలో దొంగతనాలు ఉండవు. ఒకసారి ఒకరైతుచేలో ప్రక్కరైతుతాలూకు పాలేరు పచ్చగడ్డి దొంగతనంగా కోసేస్తే ఈరైతుపాలేరు అతనితో పోట్లాడి ఆ గడ్దిమోపు విడిపించుకొని రక్తసిక్తమైన డేహంతో ఆ గడ్దిమోపు తనరైతు దగ్గరకు తీసుకొచ్చాడు. అదీ వారి స్వామిభక్తి. దొంగతనం చేసినవారిని పోలీస్ స్టేషకి పంపడం కాకుండా ఊరిపెద్దలు రచ్చబండమీద విచారించి శిక్షిస్తారు. ఇలాంటి ఆరోగ్యప్రదమైన విహానాలతో జానపదులు తమకు తామే సరిదిద్దుకుంటారు. వ్యవసాయం చేయడంలో కొన్ని కమతాలు కలిసి సమిష్టిగా తమపొలాలు దున్నుకోవడం. కుప్పనూర్పులు చేసుకోవడం చేస్తారు. పొలాలలో పంట బాగా పండినప్పుడు దానికి దిష్టి తగలకుండా గడ్డితో మనిషిబొమ్మచేసి దానికి దుస్తులుతొడిగి చేనుమధ్య కర్ర ఫాటీ కొందరు మట్టిముంతను సున్నముతో బొట్లుపెట్టి మనిషిముఖంలాచేసి నిలబెడరారు. ఇందులో దిష్టితగలకుండా చేయుట ఒక ఆలోచన అయితే, రాత్రులు గొంగలకు ఎవరో మనిషికాపలా ఉన్నాడనే భ్రాంతి కలిగించడం ఒక ఆలోచన. అక్రమంగా పశువులు ఇతరుల పొలాలలో మేస్తూ ఉంటే దానిని అరికట్టే కట్టుబాటు బందెలదొడ్డిలో పెట్టడం.

                    "గట్టిగా పెంపదక్షతలేక నూరూర
                      బందెల పడిపోయె పశుగణంబు" (మనుచరిత్ర)

9. వృ త్తు లు :

మేదగులు బుట్టలుఇ, తట్టలు అల్లుతారు. తాపీపనివారు ఇళ్ళు కడతారు. కరణాలు లెక్కలు వ్రాస్తారు. పురోహితులు గ్రామంలో ఇంటింటికీవెడళ్ళి శుభాశుభాలు చెపుతుంటారు. కమ్మరులు రైతుకు కావలసిన నాగళ్ళు, కొడవళ్ళు, గునపాలు, పారలు వగైరాతయారు చేస్తారు. కంసాలి వెండి, బంగారు ఆభరణాలు తాఅరుచేస్తారు. చాకళ్ళు బట్టలు ఉతుకుతారు. మంగళ్ళు క్షుర కర్మ చేస్తారు. మాదిగలు చెప్పులు కుడతారు. దేవాంగులు బట్టలునేస్తారు. కోమట్లు అంగళ్ళు నడుపుతారు. ఇలా ప్రతి గ్రామంలో రైతులతో పాటు ఈ వృత్తులవారు ఉండుటవలన ఏగ్రామానికాగ్రామం స్యయం పోషకం అయ్యేది.

10. నిత్య జీవనం :

ఎండకూ, వానకూ తలపై గొడుగులు వేసుకొని తిరుగుతారు. ఇవి తాటాకు గొడుగులు. వానకు జమ్ముతో తయారుచేసిన గూడచాపలుకూడా వాడతారు. గాలికోస్ం తాటియాకు విసనకర్రలు, కూర్చొనుటకు తుంగచాపలు జానపదుల వ్యవహార సామాగ్రి. 11. సంఘ జీవనం :

కలిగిన వాళ్ళలో స్త్రీలు కాళ్ళకు కడియాలు, నడుముకు వడ్డాణం, దండకు కడియం, చేతులకు మురుగులు, మెడలో కాసులపేరు, నానుపట్టిడ వగైరా వెండి, బంగారు ఆభరణాలు దరిస్తారు. విహాహిత స్త్రీలు మెడలో బంగారంతో చేసిన మంగళసూత్రాలు కట్టుకుంటారు. నిర్ధనులు పసుపుకొమ్ము కట్టుకుంటారు. భర్తయే స్త్రీకి సర్వస్వం. దీనివల్ల గృహజీవితం నిరపాయం; వీరిది సమిష్టి కుటుంబం పద్దతి. కలిసి శ్రమించడం కలిసి జీవించడం వీరి జీవన సరళి.

12. ఇళ్ళూ వాకిళ్ళు :

వీరి ఇళ్లు మండువా లోగిళ్లు. వీరిది సమిష్టి కుటుంబపద్ధతి. ఒకే గర్భాన పుట్టిన సోదరులు పెరిగి పెద్దవాళ్లై వివాహము చేసికొని పిల్లల్ని కంటున్నా ఆస్థిని పంచుకొని వేరేకాపురాలు పెట్టక, కలిసిమెలిసి ఆ ఇంటిలోనే కాపురం ఉంటూ జ్యెష్ఠసొదరుని పెత్తనం మీదనే నడుచుకుంటారు. మనుమలు మునిమనుమలు పుట్టినా చాలా కుటుంబాలలో ఏకకుండ్ కూడే. ఇంటిముందు అరుగులు, ప్రక్కనవాకిలి, వనకవైపు పెరడు సాధారణంగా వీనిలో తీర్చిదిద్దబడతయి. సామాన్లు దాచుకోవడానికి అటకలు, మిద్దెలు వేసుకుంటారు. బట్టలు ఆరబెట్టుకోవడానికి దండెం కడతారు. ప్రతి ఇంటికి కోళ్ళగూడు, దాలిగుంట, పశుశాల ఉంటాయి. ఆకోదిగ్రుడ్డ్లు, మాంసము వీరికి ఇంటసిద్ధంగానుండే కూరపదార్ధాలు. దాలిగుంటలో పాలు కాచుకుంటారు. అంటే ఎండుపిడకలు గుండ్రంగా పేర్చి, దానికి అగ్నిముట్టించి దానిపై పాలు కాయడం, పప్పు వండడం పరిపాటి. పొయ్యిమీద వంటయితే పిడకలు, పుల్లలు వాడతారు. ఇలా అన్నీ అందుబాటులో ఉంచుకొని తృప్తిగా జీవనం సాగిస్తారు జానపదులు.

13. ఆ చా రా లు :

నిత్యజీవితంలో అలవా'టుగా చేసే పనులు తరతరాలుగా ఆచరించబడటంవల్ల ఆచారాలుగా పిలవబడుతున్నాయి. జానపదులది కర్మసిద్ధంతం, చెట్టుల్నీ, పుట్టల్నీ, రాళ్ళనీ, రప్పల్నీ, సూర్యుణ్ణీ, విగ్రహాల్నీ అత్యంత భక్తితో పూజిస్తారు. ఈ చెట్లు ఔషధపరంగా చాలా విశిష్ఠమైనవికదా! ఆ విశిష్ఠతను గుర్తింపచెయ్యడానికే యిలాంటి క్రతువు లేర్పరచడం. వేపచేట్టు ఔషధప్రక్రియకు ఎన్నోరీతులఉపయోగించె వృక్షం - దాని ఆకులు , ఈనలు, లోపలిచెక్క, వ్రేళ్లు అన్నీ క్రిమిసంహారాలే. ఇక రావిఆకు - దానిమీద ఏదికలిపినా రసాయనిక సంయోగం పొందనిది. అందువల్ల ఔషధ సేవనంలో తేనె మొదలగు అనుపానాలతో భస్మాలను ఈ ఆకులలోనే కలిపి నాకుతారు. పురుషులు తలపైపాగా, మూతికిమీసం, కాళ్లకు కిర్రుచెప్పులు ధరిస్తారు. పాగా తలకు ఎండ తగలకుండా కాస్తుంది. పైగా తలకు ఏదెబ్బాతగలకుండా చేస్తుంది. మీసం ఉచ్చ్వాసనిస్వాసలలో గాలిని చల్లబరుస్తుంది. పొలాలో పాములు, పురుగులు ఈ కిర్రుచెప్పుల శబ్ధానికి తప్పుకుని దూరంగా పోతాయి. అందుకని పొలాల్లో తిరిగేవారు ఈ కిర్రుచెప్పులుతొడుక్కొని తిరుగుతారు. స్త్రీలు ముఖానికి పసుపు, కళ్ళకు కాటుక కాళ్ళకు పారాణి రాసుకుంటారు. పసుపు ముఖానికి మెరుగుఇచ్చి రోమాల్ని హరిస్తుంది. కాటుక కంటికి అందాన్ని కూర్చుటేకాకుండా కంటిరోగాలను కూడా చేరకుండా చూస్తుంది. పారాణి సూక్ష్మక్రిములను దూరంచేస్తూ ఇనుపముక్క వగైరా గుచ్చుకున్నప్పుడు సెప్టిక్ కాకుండా కాస్తుంది. ఈ ఆచారాలలో అంతర్గతంగా కొన్ని ఆరోగ్యసూత్రాలు ఇమిడి ఉన్నాయి.

ముత్తైదువలెవరైనా తమ ఇంటికి వస్తే వెళ్లేటప్పుడు పుణ్యస్త్రీ అయిన ఆ ఇంటామె కుంకుమతో తాను ముందు బొట్టుపెట్టుకొని తరువాత ఆమెకు బొట్టుపెడుతుంది "దీర్ఘ సుమంగళీ భవ" అని. ఇక్కడ అతిధికి బొట్టు పెడితే చాలదా, తనుముందు బొట్టు పెట్టుకోవడం దేనికీ అనే ప్రశ్న రావచ్చు. విధరాండ్రు బొట్టుపెట్టుకోరాదు. వారు ఇతరులకు బొట్టు పెట్టడం కూడా అమంగళం. అందువల్ల తాను ముందు బొట్టు పెట్టుకోవడం ఎదుటివారికి తానుకూడా పుణ్యస్త్రీనే అని తెలియచెప్పడమన్నమాట.

14. చావు బ్రతుకులు :

మనిషి మంచం మీద చనిపోవడం అరిష్టమని జానపుదులు మనిషి చచ్చిపోతాడనుకొన్నప్పుడు మంచం మీదనుంచి క్రిందికి దించి ఎండుగడ్డిలో పడుకోబెడతారు. ఈ గడ్డిలో పడుకోబెట్టడం వల్ల చల్లబడ్డ దేహం వేడెక్కి మరల ప్రాణం పుంజుకొనే అవకాశం ఉంటుందేమో అనే ఆశ. అంతేకాకుండా ప్రాణంపోయే ముందు తులసాకు పసరు పిండి నోట్లో పోస్తారు. ఇది ఆఖరి మందుగా ప్రయోగించడమన్నమాట. తులసాకు శక్తివంతమైన ఓషధికదా ! మనిషి చచ్చిపోయినప్పుడు మరీ వృద్ధుడైతే శ్మశానానికి ఊరేగింపుగా తీసుకళతారు. ఈ ఊరేగింపులో బాజాబజంత్రీలు కూడా వెడతారు. పెళ్ళి ఊరేగింపులాగ. కానీ, పెళ్ళి బాజా వేరు, చావు బాజా వేరు. చావుబాజాకు వీరమరణంమీద "టమకటట్టమకటమకటట్టమక" అని ఒకేలా వాయిస్తారు. ఇంకే వరసలూ వాయించరు. దీన్నిబట్టే చావుబాజా అని తెలుసుకోవచ్చు చూడ్నక్కర లేకుండానే. వివాహం కాని వారిని తాటియాకు చాపలో చుట్టబెట్టి ఏకర్రకు కట్టి శ్మనానానికి మోసుకెళ్తారు. వివాహితుడైతే కటుకుకట్టి, దానిపై పరుండబెట్టి పైన ఏడుకట్టులు బిగించి మోసుకెళతారు. కటుకు అంటే రెండువెదురుగడలు రెండు అడుగుల దూరంలో ఎదురెదురుగా పెట్టి ఏడుచోట్ల రెండేసి వెదురుముక్కలు కత్తెరలా పెట్టి ఆ రెందు ఘడలనూ కలుపుతూ కట్టబడే శయ్య. దీనినే 'పాడె ' అనికూడా పిలుస్తారు. ఇలా తీసుకెళ్ళేటప్పుడు దారిలో అక్కడక్కడ మూడుచోట్ల దింపి, కాసేపు ఉంచి, మరల భుజానికి ఎత్తుకొని మోసుకెళ్తారు. ఈ ప్రదేశాలనే దింపుడు కళ్లాలంటారు. ఇలా అక్కడక్కడ దించడంలో ఒక ఉద్దేశం ఇమిడిఉంది. ఆమోసుకురావంలోని ఊపులో మరల గుండె కదిలి కొట్టుకోవడం ప్రారంభిస్తుందేమోననే ఆశ. దీనినే దింపుడు కళ్ళం ఆశ అంటారు. శవాన్ని తీసికెళ్ళేటప్పుడు సానుభూతిగా బంధువులు, మిత్రులు, ఇరుగువారు, పొరుగువారు అందరూ కూడావెళతారు. శవంమీద పూలూ, బుక్కా, డబ్బులు చల్లుతుంటారు. ఈ ఏడుకట్ల కొయ్యల సవారికి కొన్ని కులాలలో వేరేపద్ధతి ఏర్పాటుచేసి మోసుకెళ్తారు..విశ్వబ్రాహ్మణులు, దేవాంగులు రెండు కర్రలమీద గుడిలా కట్టి, గుడ్డతో మూడు వైపులా మూసేసి, ఎదుటవైపు కనిపించేలా అందులో శవాన్ని కూర్చోబెడతారు. గుడిపై ఇత్తడిచెంబు పెడతారు. దానినే "అనంతశయనం" అని పిలుస్తారు. నలుగురూ నాలుగువైపులా భుజాలమీద ఈ కర్రలు పెట్టుకొని మోసుకొనివెళ్ళీ పాతిపెడతారు. ఈ శవాన్నికూడా ఊరేగింపుగా తీసికెళతారు. కుదుపుకి అనంతశయనంలోని శవం తలకాయ అటు యిటూ ఊగుతుంటే వీరణం వాయిద్యం "తట్టాం గొయ్యి తియ్యి, నాడబ్బు నాకియ్యి" అన్నట్టు వినబడుతోందని ఆ వాయిద్యాన్ని అలావాగ్రూపంలో పిల్లలు అనుకరిస్తుంటారు. క్షత్రియుల విషయానికొచ్చేసరికి వారిచావులో ఒక విశేషం చెబుతారు. "రాచపీనుగ తోడు లేకుండా చావడట". ఈ మాట ఎలాపుట్టిందో పరిశోధించ వలసివుంది. ముస్లింలు, క్రైస్తవులు శవాలను పెట్టెలలో పెట్టి మోసుకేళ్లి పాతిపెడతారు. తురకల శ్మశానంలో హిందువులను పాతిపెట్టనీయరు. దీని మీద తూర్పు గోదావరి జిల్లాలో ఒక విచిత్రమైన జానపద గాధ కూడా చెపుతుంటారు దోమాడ కరణం చచ్చీ సాధించాడు బ్రతికీ సాధించాడు అని. ఆ కరణం బ్రతికిఉన్నప్పుడు పన్నుల వసూలు పేరుతోనూ, లంచాల పేరుతోనూ ఆగ్రామస్తులను కాల్చుకు తినేవాడట. అయితే చచ్చిపోయేముందు ఊరి వారందరిని పిలిచి తాను చేసిన పనికి పశ్చ్చత్తాప పడుతున్నానని కళ్ళనీళ్ళు పెట్టి తన చివరికోరిక ఒకటి తీర్చమని దీనంగా కోరాడట - ఏమంటే - తురకల శ్మశానం దగ్గర తనను ఖననం చేయమని. ఓస్ ఇంతేగదా అనివారు తీసుకెళ్లి ఆ శవాన్ని అక్కడ పాతిపెట్టారట. దానితో తురకలంతా తిరగబడి వీళ్ళమీదికి కత్తులు దూస్తే అదోపెద్ద యుద్దరంగంగా మారిందట. పైగా చట్టప్రకారం న్యాయస్థానం ఆ కప్పెట్టింవారికి శిక్షలు వేసిందట.

మిగిలిన జాతులు శవాన్ని కట్టెలతో కాల్చి బూడిద చేస్తారు - పెండ్లికానివారిని మాత్రం యిలా దహనం చేయక ఖననం చేస్తారు. మూడవరోజున 'చిన్న దినమని ' ఆరోజు అన్నం, పాయసం వగైరా మృతునికి ఇష్టమైన పిండివంటలుచేసి ఆకులో ఉంచి నుదురు మీద పెడతారు.

"గృధ్ర వాయ్సాది రూపేణ ఊపభుంక్ష్వా" అంటే చనిపోయిన వారు కాకిరూపంలోనో గ్రద్దరూపంలోనో వచ్చి తింటారని అర్ధం. అవికాకులు ముట్టుకోకపోతే మృతునికి కావలసినది ఇంకా ఏదో మిగిలి పోయిందని భావిస్తారు.

15. దాన ధర్మాలు :

ఇంటికి భిక్షానికి వచ్చిన ముష్ఠ్జివారిని పొమ్మనకుండా దోసెడు బియ్యం వేస్తారు. రాత్రులు "మదాకబలం బాబయ్యా" అంటూ వచ్చే గంగిరెడ్లవారు వగైరాలకు గిన్నెతో తెచ్చి అన్నం ముద్దలువేస్తారు. చారు, కూరలు, మజ్జిగకూడా పోస్తారు. లేదుపో అనడం ఎక్కడో గాని ఉండరు. అలాగే పంట కాలంలో భిక్షుకులకు పొలాల్లో వరిమోపులు, వరిపనలు దానం చేస్తారు. దీనిలోకూడా ఒక్ పరమార్ధం ఇమిడివుంది. ప్రత్యక్షంగా అది దానంలా కనిపించినా పరోక్షంగా వరి దృష్టి తమ పొత్తుమీద పడకుండా చూసుకోవడం. ఇలా కలిగినవారు దానధర్మాలు చేయకుంటే, వారి ఆకలిబాధకు తాళలేక వీరి ఇండ్లపై పడి ఏ అఘాయిత్యం అయినా చెయ్యవచ్చు. పొలాలలో పంటయింటికి చేరకపోవచ్చు కూడా. తమ మీద వ్యతిరేక భావాలు వాళ్ళ లో కలగకుండా యిలా సముదాయించడం అనే విజ్ఞానం ఈ దానాలలో దాగి ఉందనిపిస్తుంది.

16. నో ము లు :

  • "మాంగల్య సంరక్షణ, మూసిన ముత్తెంవలె త్తవారింట సంచరించగలుగుట అనే లక్ష్య సాధనపై ఎన్నియో నోములు ఆచరణలోనికి వచ్చినవి. బాలికలను ముద్దియలును, పెరిగి పెద్దవారగు లేత వయస్సునందు వారికి సౌశీల్యము, మితభాషిత్వము, పులుగడిగిన ముత్తెం వలె నుండుట మొదలగు ప్రశంసనీయమైన లక్షణములు నేర్పుటకివి ఎంతయో తోడ్పడుననుట నిర్వివాదాంశము".
    • "ఆడపిల్లలు అప్పటికైనను తాము జన్మించిన చోట ఉండక మరియొక చోటకి పోవలసినవారే కదా! క్రొత్తవారి నడుజ్మ కొత్తకొత్తగృహ మర్యాదలతో మెలగవల్సిన కొత్తడి ఎంతమెలుకువతో అణకువతో మెలగవలసి యుండునో? అట్లు కొత్త ఇంట మెలగవలసిన బాధ్యత ఎవ్వరిది? తల్లిదే. అయితే ఆ పద్దతులు అన్నియు కాగితముపై వ్రాసి వల్లెవేయించిన బాలిక అట్టి మర్యాదలు నేర్చుకొనగలదా? అని శిక్షణ మార్గమగునా? కాదు. అందు ఆకర్షణ లేదు. ఉత్సాహంలేదు. ఆనందం లేదు. ఒకపాటగనో, పద్యముగనో, కధగానో, వ్రత్ముగానో ఉన్న అది చిత్తాకర్షకముగా ఉండగలదు. ఇతరుల ఇంట అణకువ్తో మెలగవలసిన బాల్లకౌ సాదాచార సంపత్తియందు సుశిక్ష్ణ్ మొసగుటకే మన ప్రాచీనులు ఆడబిడ్డలకు చిన్నతనముననే నోములు పట్టించు ఆచారము ఏర్పరచిరి."

  • ఆంధ్రుల చరిత్ర. సంస్కృతి పుట 83 (ఆచార్య ఖందవల్లి లక్ష్మీనిరంజనం)
    • విజ్ఞాన సర్వస్వము, తెలుగు సంస్కృతి 1. ఉదయ కుంకుమ నోము :

బాలికకు వివాహమైన సంవత్సరమున మాఘ మాసంలో రధసప్తమినాడు తులసికోట వద్ద ఏడు పిడకలతో పాటు పొంగించి సూర్యునకు ప్రీతి కరంగా పొంగలి తయారుచేసి, ఆపైన గౌరీ పూజచేయించి నివేదన పెట్టి మొదటిదిగా ఈ నోము పట్టిస్తారు. ఈ నోము పట్టిన బాలిక ప్రతిరోజూ ఉదయమే లేచి ముఖం కడుక్కుని బొట్టు పెట్టుకుని, మరొక ముత్తైదువకు బొట్టుపెట్టాలి. ఇలా సంవత్సరం వరకూచేసి ఆఖరున ఒక ముత్తైదువకు తలంటి నీళ్ళూ పోసి సకల భోజ్యములతో భోజనం పెట్టి చీర, రవికల గుడ్డ, కుంకుమతో నిండిన బరిణె, దక్షిణ తాంబూలాదులతో వాయనం ఇచ్చి ఉద్యాపన చేసుకోవాలి. ఈ నోముతో పాటు చిట్టిబొట్టు నోము, కాటుక గౌరినోము, నిత్యశృంగార నోము, పువ్వులు పండు- తాంబూలం నోము మొదలగు నోములు పట్టిస్తారు.

ఈ నోములన్నీ బాలిక జీవితారంభానికి తొలిపాఠాలు అని చెప్పవచ్చు.

2.చిట్టిబొట్టు నోము:

ఈ నోము పట్టిన బాల ఉదయమే లేచి కాలకృత్యాలు తెర్చుకుని తలదువ్వి జడవేసుకుని, స్నానంచేసి, ఉతికి ఆరవేసిన మడిబట్టలు కట్టుకుని, బొట్టూ కాటుకా పెట్టుకుని పసుపూ, గంధంపూసుకుని, అక్షతలు పట్టుకుని -

                           "చిట్టిబొట్టు పట్టవలె సిరిగల ఇంట పుట్టవలె
                            పట్టుపుట్టము కట్టవలె పసిడినగలు పెట్టవలె
                            ఏడుగురన్నలతో పుట్టవలె ఏకచక్రం ఏలవలె
                           పదుగురన్నలతో పుట్టవలె పట్టభద్రుని చేపట్టవలె"
                            

అనికధ చెప్పుకొని అక్షతలు పైన వేసుకోవాలి, తరువాత అయిదుగురు మిత్తైదువలకు పసుపురాసి, కుంకం బొట్టుపెట్టి, గంధంరాసి, బొట్టుకు క్రిందుగా గంధంచుక్కపెట్టి, దానిపై రెండు అక్షింతలు అంటించి, అక్షతలు వారి చేతిలో పెట్టి, పాదాలకు మ్రొక్కి అక్షతలు తలపై వేయించుకొని వారి దీవన పొందుతారు. దీనివలన బాలికలకు సౌభాగ్య చిహ్నాలైన హరిద్ర,కుంకుమల యెడ శ్రద్ధా భక్తులు,పెద్దలయెడ వినయవిధేయతలు ఏర్పడతాయి.

3.కన్నె తులసమ్మ నోము:

ఇది పెండ్లికాని బాలికలు ఆచరిస్తారు.ప్రొద్దుటేలేచి స్నానంచేసి, తులసమ్మ దగ్గర మగ్గులు పెట్టి, ఐదు ఒత్తులువెలిగించి,శివరాత్రినాడు ప్రారంభించి ఏడాదిపాటు ప్రతితోజూ ఇలాచేస్తారు. ఆఖరున ఓక్ కన్యకు ఉద్యాపన చేస్తారు.

ఉద్యాపన అంటే వ్రతసమాప్తి. ఆరోజునపూజించి ఆమెకు భోజనం పెట్టి దాన ధర్మాలు చేస్తారు. దానితో ఆ చిన్న వయసులోనే వారిలో ఒక క్రమశిక్షణ, దానబుద్ది అలవడతాయి. వివాహం ఆలస్యమైన కన్నెలకు వివాహంలో సౌభాగ్యంకలిగించునని కొందరి విశ్వాసం.

4. నిత్య శృంగార నోము :

ప్రతిరోజూ సాయంకాలం ఒక ముత్తైదువకాళ్ళకు పసుపురాసి పారాణి పూసి, సమస్కరించి, తాంబూలం ఇచ్చి, దువ్వెనతో తలసవరించి, అద్దం చూపడం దీని విధానం. ముగ్ధలకు అందంగా అలంకరించుట అంతర్లీనంగా ఇది నేర్పుతుంది.

5. మూ గ నో ము :

దీవావళి మొదలు కారీక శుద్ద పూర్ణిమ వరకూ బాలికలు దీనిని నోస్తారు. వాజ్నేయము వారికి అలఫ్గరుచుట దీని ఉద్దేశం. జానపదులని సమిష్టి కుటుంబాలు కదా ! సమిష్టి కుటుంబాలలో మెలగవలసిన పడతికి ఇది శిల పోషకం. ఇలాంటివే శ్రావణ మంగళవారం నోము, బొమ్మల నోము వగైరా ఎన్నో నోములు బాలికలను, యువతులను తీర్చిదిద్దు విజ్ఞానంతో కల్పించబడి అనాదిగా జానపదులలో అజరామరంగా మానసిక్ క్రమశిక్షణ ఈ నోముల్లో కనిపిస్తుంది. వీనిలో కొన్ని ఆరోగ్యానికి సంబందించినవి కూడా ఉన్నాయి. సూర్యునకు సంబంధించినవి, పసుపు, కుంకుమలకు సంబంధించినవి తులసి చెట్లు, రావి చేట్లు, వేపచెట్టులకు సంబందించినవి యీ బాపతే; కొన్ని శాస్త్రీయమైనవి - శ్రావణ
35

మంగళవారంనాడు, పసుపు కొమ్మును పూజించి దానిని కర్పూరంతో అరగదీసి గౌరీ ప్రసాదంగా స్వీకరించి, దీనితో స్నానం చేయడం ఒక వ్రతనియమం. దీనివాళ్ళ తరుణవయసు పిల్లకు శరీర దుర్గంధం, రోమములు, ఋతుబాధలు పరిహరించబడతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

"వీనిని కన్యకలు అయిదవతనము నిమిత్తమును, ఐశ్వర్యం నిమిత్తమును, సవతి పోరు లేకుండు నిమిత్తమును, ముఖ్యముగా నోచు కొనుచూ వచ్చిననూ, వీని ఆచరణవలన సదాభ్యాసములు, దైవభక్తి, ఆస్థిక భావములు, పాపభీతి, ధర్మానురక్తి కలిగి బాలికలకు చక్కని శిక్షణ ఏర్పడెడిది. వీనిలో కొన్ని స్త్రీలనేకులు కలిసి నోచుకొనునవి, ఆచరిన్చునవి ఆగుటచేత ముందుముందు సమిష్టికుటుంబంలో భాగాస్వామినియగు బాలికకు పరస్పర సహకారము, ప్రేమ, మైత్రి మొదలగు గుణములు బీజములుగా నాటి ఆమెలో ఉత్సాహమును పెంపొంచించుచు వచ్చినవి."

ఈ నోములనేవి పదకొండవ శతాబ్ధి నాటికే అనేది నన్నయగారి మహాభారతంలో శకున్తలోపాఖ్యనంలోని ఈ క్రింది పద్యం వల్ల తెలుస్తోంది.

నుడువులు వేయు నింకేల యిప్పటి
నోముల దొల్లి కడగి నోచితిని గాకేమి "

వ్రతాలు

ఆర్త జనులకు అభయ హస్తాలు జానపదులు వ్రతాలు.

మానవ జీవితం సహజంగా కశ్తాలపుట్ట. కొందరికి ఆకలి బాధ-కొందరికి ఆరోగ్య బాధ-కొందరికి సంసార బాధ-కొందరికి సంతాన బాధ. ఇలా ప్రతిమనిషికి ఏవోబాధలే. శ్లేష్మంలో పడ్డ ఈగలాగా యీప్రపంచంలో కొట్టుమిట్టాడే మనిషికి దుఃఖోపశమనం కోసం ఎదో ఒక ఓదార్పు కావాలి. ఆ ఓదార్పులే యీవ్రతాలు. ఈ వ్రతాలకు ఆరాధ్యుడు దేవుడు. ఆ దేవుని అనుగ్రహానికి పెద్దవాళ్ళు చెప్పిన యమనియమానస ప్రాణాయామ ప్రత్యాహార ధ్యానధారణ సమాధివంటి పద్ధతులను ఆచరించడం


*విజ్ఞాన సర్వస్వము, తెలుగు సంస్కృతి
సామాన్యుడికి సాధ్యంగాదు. అందువల్ల సూక్ష్మంలో మోక్షంగా యీ వ్రతాలు అవతరించాయి. వీనికి విశ్వాసం ప్రధానం. జానపదులు ఎంతో భక్తి విశ్వాసాలతో వీనిని ఆచరించి మనస్సును తేలిక పరుచుకుంటారు తమ భారం దేవుడిమీద పడేసి. నిజానికి యీదేవుడనే అదృశ్యశక్తే సృష్టింపబడకుంటే యీ కస్థాల కడలిలో మనిషి మనుగడ ఎంతబాధాకరం ! అందుకే దేవుడి కంటే దేవుణ్ణి సృష్టించిన వాణ్ణిమెచ్చుకోవాలి.

సహజంగా జానపదులు కులమత వర్గ వివక్షతలేకుండా అరాధించే దేవుడు తిరుపతి వేంకటేశ్వరుడు. ఆపద మొక్కులవాడు. కొండకొస్తానని, తలనీలాలిస్తానని మ్రొక్కుకుంటే చాలు ఆవనిజరిగి పోతుందనేది ప్రతీతి. 'తట్టుడి - తెరువబడును, పిలువుడి - పలుకబడును" అన్నంతతేలిక. అందుకే నిత్యం వేలాదిమంది అదేవుణ్ణి దర్శిస్తూ మొక్కులు చెల్లిస్తుంటారు. అట్లాంటి దేవుడే సత్యూనారాయణ స్వామి కూడా.

                              స్సత్యనారాయణ వ్రతం

తూర్పు గోదావరి జిల్లాలో ప్రత్తిపాడు దగ్గర అన్నవరంలో పంపానదీ తీరాన రత్నగిరిపై వెలిశాశు శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి. దరిద్రబాధలు తీరడానికి యీస్వామి వ్రతం దివ్యౌషధంగా భావిస్తారు. ఈ వ్రత సందర్భంలో బంధుమిత్రుల కట్నాలు, చదివింపులు చూస్తుంటే లౌకిక పరంగా కూడా యిది నిజమే అనిపిస్తుంది. (ఈ మధ్య అధికారులు, డక్టర్లు, లాయర్లు, అధిక సంపాదనకు ఇది సాధనంగా కూడావాడుకుంటునారనుకోండి). ఈ స్వామి సన్నిధిలో మొక్కుకున్న పెళ్ళిళ్ళెక్కువ. ఖర్చు తక్కువ. ఈ దేవున్మి వ్రతం సామాన్యుని పాలిట కల్పవృక్షం. సాగినవాళ్ళు కొండకెళ్ళీ చేసుకుంటారు. సాగలేనొఇవాళ్లు యింటి దగ్గరే చేసుకుంటారు. ఇందులో ప్రతిభాగానికీ ప్రత్యేక విశేషముంది. ప్రతఫలంలో ప్రేక్షకుడికి కూడా భాగస్యామ్యంవుంది. కధా ప్రారంభంనుంచి ప్రసాదం తీసుకొని భుజించేవరకూ. కధా ప్రారంభం అయ్యాక కధ్యలో లేచిపోతే కీడు జరుగుతుందట. ఆఖరున ప్రేసాదం భుజించకుండా పోయినా అపరాధం చేసినట్టే. కాబట్టి అడిగైనా యీప్రసాదం తినమన్నారు. సాహిత్య సభలకి సత్యనారాయణ స్వామి వ్రతానికి ఆహ్వనం అక్కరలేదంటాదు.

ఇది మాఘమాసంలోగాని, వైశాఖ మాసంలోగాని, కారీకమాస్ంలోగాఇ పుణ్యదినాలో చేస్తారు. ముఖ్యంగా ఏకాదశి, పౌర్ణమి దినాలలో ఎక్కువ. ఈ వ్రత్ం స్కాందపురాణంలో చెప్పబడింది. ఈ పురాణ కధలు చాలవరకు నైమిశారణ్యంలో శౌనకాది ఋషులకు సూతమహాముని చెప్పినట్లు ప్రారంభమౌతాయి. నారదుడు భూలోకంలో మానవుల కష్టాలు చూసి జాలిపడి విష్ణువు దగ్గరకెళ్ళి దీనికి తరుణోపాయం చెప్పమని వేడుకున్నాడట. దానికి విష్ణుమూర్తి సత్యనారాయణ వ్రతం చెప్పాడట. దీన్ని పరీక్షిజ్ంచడానికి నారదుడు భూలోకానికి వచ్చి భిక్ష మెత్తుకునే ఒక పేద బ్రాహ్మడునికి యీవ్రతం తెలిపాడట. వెంటనే అతను వ్రతం చెయ్యడానికి సంకల్పించు కున్నాడు. ఆనాడు ఎక్కువ బియ్యం దొరికాయట. దానితో వ్రతం చేస్తుంటే ఒక కట్టెలమ్ముకునే వాడొచ్చి అంతా చూసి ఆ ప్రసాదం తిన్నాడట. ఆ రోజు అతనికి రోజూ కంటే మూడించలు ఎక్కువ అమ్ముడుపోయాయి.

ఉల్కాముఖుడనే రాజు, భద్రశీల అనే భార్యతో ఏటివొడ్డున యీవ్రతం చేస్తుండగా సాధువు పేరుగల వైశ్యుడు చూసి యీవ్రతం ఎందుకు చేస్తున్నారని అడిగితే సంతానంకోసం అన్నాడాట/ ఆవోశ్యునికి కూడా సంతానం లేదు. ప్రసాదం తీసుకొని తిని తనకు సంతానం కలిగితే వ్రతం చేస్తానని సంకల్పించాడట. అంటే - భార్య లీలావతి గర్భం దరించింది. అందాల భరిణ అమ్మాయిపుట్టింది. కళావతి అని పేరు పెట్టాడ్రు. అయితే తీరికలేని పనుల్తో వ్రతాన్ని వాయిదా వేసుకున్నాడు ఆమెపెళ్ళయ్యాక చేద్దామని, ఆమెకు రత్నాకరుడనే వైశ్య శ్రేష్ఠునితో వివాహం జరిగింది. మామా అల్లుళ్ళిద్దరూ వ్యాపారం నిమిత్తం సింధునదీ తీరంలోని ర్త్నసానుపురం వెళ్ళేరు. అక్కడ వ్యాపారం జోరయ్యింది. ఆ ఆనందంలో సాధువు సంకల్పించినవ్రతంసంగతే మరిచిపోయేడు. స్వామికి కోపం వచ్చింది. ఒక రోజు రాత్రి దొంగలు అదేశపు రాజైన చంద్రకేతు మహారాజు గారింట్లో దొంగతన్ం చేసి భటులు తరుముకొస్తుంటే భయంతో ప్రక్కనున్న యీవైశ్యులున్న్ అరుగుమీద పడేసి పారిపోయేరు. రాజభటులు యీషావుకార్లను గొంగలని తీసుకుపోయి జైల్లో పడేశారు. అక్కడ యింటిదగ్గర దొంగలు పడి సర్వం దోచేశారు. తల్లీ కూతుళ్ళు అన్న వస్త్రాలకు కూడా కరువై అడుక్కోవడం మొలెట్టేరు. ఒకనాడు కళావతి భిక్షాటన చేస్తూ ఒక బ్రాహ్మణ యింట యీ వ్రతం చేయడం చూసి తల్లికి చెప్పింది ' ఆమెకు వెంటనే గతం జ్ఞాపకం వచ్చి పశ్చాత్తపం పొంది ఆ వ్రతం చేస్తానని సంకల్పించి భర్తను, అల్లుణ్ణి క్షమించమని ప్రార్దించింది. అక్కడ చంద్రకేతు మహ్జారాజు కలలో సత్యనారాయణస్వామి కనబడి వీరుచోరులుకారనీ, తెల్లవారేసరికి విడిచిపెట్టమనె చెప్పేడు. ఆ రాజు విడిచిపట్టడమే గాక నిధిలిచ్చి మరీ సాగనంపేడు. వారు ఓడలో ఆధనరాసులు వేసుకు వస్తుంటే స్వామి వారిని పరీక్షింపదలచి ముసలి బ్రాహ్మణడుగా వచ్చి సత్యనారాయణవ్రతం చెయ్యబోతున్నానని ధనసాయం చెయ్యమని అడిగాడు. వైశ్యుడు తమ దగ్గర ధనంలేదు పొమ్మన్నాడు. బ్రాహ్మణుడు ఓడలోఉందిగదా అన్నాడు. వైశ్యుడు ఓడలోనివి తీగలు, ఆకులు అన్నాడు. అట్లేఅగుగాక అని బ్రాహ్మణుడు వెళ్ళిపోయాక చూసుకుంటే తీగలూ ఆకులే ఉన్నాయి. వెంటనే పరుగు పరుగునవెళ్ళి అతని పాదాలు పట్టుకుంటే అత్రని సత్యదేవుని వ్రతం గుర్తుచేశాడు. సాధువు చెంపలేసుకుని ఇంటికి వెళ్ళగానే వ్రతం చేస్తానని సంకల్పించాడు. తీగలూ, ఆకులూ రత్నరాసులుగా మారాయి. ఓడ రత్నపురానికి వచ్చింది. ఆసమయంలో వైశ్యుని యింట కళావతి సత్యనారాయణ వ్రతం చేస్తోంది. భర్తా, అల్లుడూ వచ్చారని తెలియగానే లీలావతి కుమ్మార్తెను వ్రతం పూర్తిచేసుకురమ్మని తాను ఏటిఒడ్డుకు ఎదురెళ్ళింది. కుమార్తె కళావతి భర్త ఆగమనానికి ఆనందపడిపోతూ ప్రసాదం తినకుండా పరుగెత్తింది. అంతే - అక్కడ ఓడ నీటిలో మునిగిపోయింది. కళావతి భర్తకూడా అందులో మునిగిపోయేడు. కళావతి దు:ఖంతో భర్తను అనుసరించబోగా ఆకాశవ్బాణి వ్రతప్రసాదం భుజించకుండా వచ్చిన ఆమె తప్పిదానికి యీ ప్రమాదం జరిగిందని చెప్పగా ఆమె వెనుకకు వెళ్ళి ప్రసాదం తిని తీసుకొచ్చింది. ఓడ, భర్త తేలి పైకొచ్చేరు.

ఒకసారి అంగధ్వజుడనేరాజు అడవిలో మృగముల వేటాడుతూ ఒక చోటికి వెళ్లేసరికి, అక్కడ కొందరు గొల్లలు సత్యనారాయణస్వామివారి వ్రతం చేస్తున్నారట. వారి ప్రసాదం యివ్వబోగా రాజు తూష్ఠీభాగంతో తిరస్కరించాడు. వెంటనే తన వందలమంది కొడుకులూ మరణించిన వార్త వచ్చింది. ఇది సత్యదేవుని మహత్తే అని తెలిసికొని వ్రతం చేసుకుంటాను అని సంకల్పించాడు. వాళ్లు బ్రతికారు.

ఈ వ్రతానికి ఎర్ర గోధుమరవ్వ, బెల్లం కలిపి చేసే ప్రసాదం ప్రత్యేకత. ఖర్చు యిలా యీ ప్రసాదఖరీదూ., వ్రతంచేయించిన పురోహితునకిచ్చే సంభావనగా మాత్రమే. అందరికీ అందుంబాటులో ఉండే వ్రతం - జానపదులలో బాధామయ జీవితాలకు సేద తీర్చే వ్రతం.

త్రి నా ధ వ్ర తం

ఇదికూడా దరిద్ర నివారణకు చేసే వ్రతమే. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల పూజ. వారికి ప్రతీకలుగా మూడు కలశాలు పెట్టి పూజిస్తారు. ఈ వ్రతాన్ని 'మేళ ' అని కూడా అంటారు. ఇది సాయంత్రం పూజ, త్రిమూర్తులకు గంజాయి ధూపం యీవ్రత ప్రత్యేకత.

పూర్వం ఉజ్జయినీ నగరంలో ఒక బ్రాహ్మణుడు కటికదరిద్రంతో బాధపడుతూ జీవిస్తున్నాడు భార్యతో. ఒక కుర్రవాడు పుట్టేడు. తల్లికి పాలులేవు. ఎలాగో తంటాలుపడి భిక్షమెత్తి ఒక ఆవును కొన్నాడు పాలకోసం. ఒక రోజు అది తప్పిపోయింది. దానిని వెతకడానికి బయలుదేరిన ఆ పేద్ బ్రాహ్మణుడు దూరతీరాలు కూడా గాలించాడు. దొరకలేదు. ఇంటిస్థితిని తలుచుకుంటే పాలులేక పిల్లవాడి ఏడుపు సముదాయించలేక తల్లి ఏడుపు-ఇదంతా ఆలోచిస్తూ భగవంతుడా! ఏమిటి నాకీ నరకం అని దు:ఖిస్తుంటే జాలితలచి దివ్యతేజసంపన్నులైన ముగ్గురు మూర్తులు వచ్చి త్రినాధ వ్రతం చేస్తే దరిద్రం తొలగిపోతుందని చెప్పి వెళ్ళిపొయారు. వారే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. అలాగే చేస్తానని సంకల్పించి ఇంటికి బయలుదేరేసరికి దారిలో ఆవుదొరికింది. భార్య్హతోకలిసి వ్రతం చేశాడు. అష్ఠయిశ్వర్యాలూ వచ్చాయి. ఇది తెలుసుకొని ఆ రాజ్యంలో యితరులు కూడా చేసి శ్రీమంతులవుతున్నారు.

ఆ పట్టణం రాజుకు అందరూ అలా శ్రీ మంతులు కావడం ఇష్ఠం లేదు. అందుకని తన రాజ్యంలో యీవ్రతం ఛేస్తే శిక్షిస్తానని శాసనం చేశారు. రాత్రులు మారువేషంలో తిరిగి అవరైనా చేస్తున్నట్టు తెలిస్తే వారిని మరునాడు దండించేవాడు. ఒక రోజు అకస్మాత్తుగా రాజుగారి కోట అగ్నికాహుతైపోతోంది. భార్యాబిడ్డలు కూడా అందులో గతించారని వార్తవచ్చింది. అప్పుడు త్రిమూర్తుల ఆగ్రహంవల్ల యిలా జరిగిందని గ్రహించి యీవ్రతం తాను చేస్తానని మన:పూర్వకంగా నమస్కరించాడు. వెంటనే కోట మామూలుగా కనిపించసాగింది. భార్యాబిడ్డలు ఎదురొచ్చారు.

ఇది పురాణాల్లోనూ ఉన్నట్టులేదు. ఇది పూర్తిగా జానపదులు కల్పించుకున్న కధ. ధూపానికి గంజాయి ఖర్చూ, చూడవచ్చిన వారికి ప్రసాదంగా పంచడానికి కొబ్బరికోరు, పంచదార ఖర్చూ తప్ప మరే ఖర్చూ లేనిది. జానపదులు దీనిని కూడా చాలా భక్తి శ్రద్ధలతో చేస్తారు. ఈ వ్రతం మనకు ఉత్కళ దేశంనుండి దిగుమతయింది.

హ ను మ ద్ వ్ర తం

ఇది పురాణాంతరతమైనది. భవిష్యత్ పురాణంలో చెప్పబడింది. ఇష్టార్ధము లిచ్చే వ్రతం అని, గ్రహబాధలు, రోగములు, పలాయన మౌతాయని దుష్టగ్రహములు తొలిగిపోతాయని, సర్వకార్యసిద్ధియని యీవ్రతం చేస్తారు. ఇది మార్గశిర శుక్ల త్రయోదశినాడు జరిపిస్తారు. వీలుంటే పంపానదీ తీరాన్మ చేస్తారు. ఇతర చోట్లచేస్తే 'హేమకూటగిరి ప్రాంతజతాం ' వంటి పురాణ మంత్రాలచేత పంపానది పూజచేసి తరువాత హనుమద్ వ్రతానికుపక్రమిస్తారు.

చేతికి పదమూడు ముడులతోరం కట్టుకుని 'ఓం నమోభగవతే వాయునందనాయ ' అనే మంత్రం జపిస్తూ అక్షతలతో షోడశోపచార పూజచేసి 13 అప్పాలు (నేయి, గోధుమ పిండితొ చేసినవి) దక్షిణ తాంబూలాదులతో పురోహితునకు వాయినం యిస్తారు. ఇలా చేసినవారికి ఆంజనేయుడు సహకారిల్గా ఉంటాడట. మూల మంత్రంతో సాంగోపాంగంగా వ్రతం పూర్తిచేసి మూడు సార్లు గంధం అభిమంత్రించి చేతులకు పూసుకున్నా, లలాటాన ధరించినా జనవశీకరణ వస్తుందట.

ఈ వ్రతం కూడా నైమిశారణ్యంలో శౌనకాదిమునులకు సూతుడు చెప్పిందే. పాండవులు ద్వైతవనంలో ఉండగా వ్యాసుడు పరామర్శించ డానికి వెళ్ళాడు. ధర్మరాజు వ్యాసుని తామిలా రాజ్యభ్రష్టులగుటకు కారణ్మెమని అడిగాడట. పూర్వం శ్రీకృష్ణుడు చెప్పగా జయముకోరి ద్రౌపది యీవ్రతం చేస్తుండగా అర్జునుడు చూసి నాజేడామీది మృగమును పూజించుట నాకవమానమని కోపంతో ఆమెచేతి తోరమునుత్రెంచి వేయమని ఆజ్ఞాపించాడట. పతివ్రత యగు ద్రౌప్ది భర్త ఆదేశాను సారం వ్రతతోరం త్రెంచివేసి దీక్షను విరమించింది. పదమూడుముళ్ళుల్గల తోరం తెంఫివేసినందున పదమూడు సంవత్సరాల అరణ్యవాసం వచ్చింది అనిచెప్పేడు. తరువాత యీవ్రతంచేసి ధర్మరాజు రాజ్యం పొందాడని కధాభాగం. విద్యార్ధులు విద్యలో విజయంఅ పొందాలని ఇది చేస్తారు.

108 అప్పాలు హనుమంతుని మెడలో దందగుచ్చి వేస్తారు. లేత తమలపాకులతో పూజ చేస్తారు. ఆ ఆకులు భక్తులకిస్తారు. ప్రసాదంగా అవి కాడకూడా పారెయ్యకుండా నమిలి మ్రింగాలి. అదే దెని శిష్ఠత. అంత నిష్ఠతో చేస్తారు జానపదులు.

వరలక్ష్మివ్రతం

ఇది ముఖ్యంగా ఐశ్వర్యాభివృద్దికోసం చేసేవ్రతం. స్తీలే చేస్తారు. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం దీనికి నిర్ధిష్టమైన రోజు. 'అస్మాకం సహకుటుంంబానాం క్షేమ స్థయిర్య విజయాయురోగ్య ఐశ్వర్యాభివృధ్యర్ధం, ధర్మార్ధకామమోక్ష చరుతుర్విధఫల పురుషార్ధ సిద్ధ్యర్ధం, సత్సంతాన సౌభాగ్య ఫల ప్రాస్త్యరం ' అని సంకల్పం చెప్పుకుని చెంబుకు గంధం అద్ది, కుంకుమ బొట్టుపెట్టి, నీటితో నింపి, గంధపుష్పాక్షతలు వేసి మర్రిచిగుళ్ళు, మామిడి చిగుళ్ళు మొదలగు పంచపల్లవములు, తామరపువ్వు, కొబ్బరికాయ ఆపాత్రపై నిలిపి, దానిపై వరలక్షిదేవి రూపు ఉంచి, (చిన్న బంగారు బొమ్మ) కుడిచేత్తో ఆకలశం పట్టుకొని వరలక్ష్మీ దేవిని 'సర్వమంగళ మాగళ్యే విష్ఠువక్షస్థలాలయే, ఆవాహయామి దేవీత్వం సుప్రీతాభవసర్వదా, శ్రీ వరలక్ష్మీమావాహయామి ' అని అవాహన చేసి 'పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే, నారాయణ ప్రియేదేవి సుప్రీతాభవ సర్వదా ' అనే శ్లోకంతో ఆర్ఘ్యపాద్యాదుల అష్ఠొత్తర శతనామాలతో షోడశోపచారపూజచేసి, ప్రదక్షిణ నమస్కారలతో పూజిస్తూ, తొమ్మిది ముడులుగల రెండు తోరాలు అమ్మవారివద్దవుంచి 'బద్నామి దక్షిణ హస్తే నవసూత్రం, శుభప్రదం పుత్రపౌత్రాణ్భివృద్ధ్యంతబేహిరమే ' అని తోరపూజచేసి ఒక తోరంతీసి కుడిచేతికి కట్టుకుంటారు. తరువాత నానావిధభక్ష్య భొజనముల నివేదన చేసి ముమ్మారు ప్రదిక్షిణ చేస్తారు.

దీనికి కూడా ఒక కధవుంది. ఈ కధ చెప్పే ముందు అందరికీ అక్షతలు యిస్తారు. కధానంతరం అందరూ అవి దేవి మీద చల్లి తమ తలలమీద చల్లుకుంటారు. పూజానంతరం పురోహితుని గంధపుష్పాక్షతలతో పూజించి 12 కుడుములు వాయనమిచ్చి, దక్షిణ తాంబూలదులతో సత్కరించి నమస్కరించి ఆశీర్వాదం పొందుతారు. ఆ తరువాత ప్రసాదం అందరికీ పంచిపెడతారు. ఈ వ్రతంకూడా సూతుడు శౌకాది మునులకు చెప్పిందే. ఒకనాడు పార్వతీదేవి ఏంచేస్తే స్త్రీల పుత్రపౌత్రాది సంపత్తితో సర్వసౌఖ్యూలూ కలిగి సుఖంగా ఉంటారో చెప్పమంటే పరమేశ్వరుడు యీవ్రతం చెప్పేడట. మగధదేశంలో కుండిన మహానగరంలో చారుమతి అనే బ్రాహ్మణస్త్రీ వుంది. ఆమె మహా పతివ్రత; ఆమెయందు లక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి కలలో కనిపించి శ్రావణశుక్ల పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం తనను పూజిస్తే కోరిన వరాలిస్తానని చెప్పిందట. ఆరోజురానేవచ్చింది. ఆమె బంధుమిత్రులతో వరలక్ష్మీదేవిని పూజించి, తొలి ప్రదక్థిణ చేసేసరికి వారికాళ్ళల్లో మువ్వల రవళి వినిపించిందట. చూసుకుంటే కాళ్ళకు బంగారు గజ్జెలు; రెండవప్రదక్షిణ చేసేసరికి చేతులకు నవరత్న ఖచితమైన ఆబరణాలువచ్చాయట, మూడవ ప్రదక్షిణ అయ్యేసరికి అందరూ సర్వభూషణాలకృతులయ్యారట. ఈ వ్రతాలు చేసే వాళ్ళకేగాక విన్నవారికీ, చదివిన వారికీ కూడా యిష్టకామ్యములు సిద్దిస్తాయని ఆఖరున ఫలశృతి చెప్పబడుతుంది ఇలాంటిదే యిష్టకామ్యార్ధసిద్ది కోసంచేసే మరోక వ్రతం 'వినాయక వ్రత్రం '.

వీనిలో ముణ్యంపురుషార్ధాల మాట ఎలావున్నా అత్యూల్పమైన ఖర్చుతో బంధుమిత్రుల సమాగమం, తన్మూలంగా సమాజంలో సమత, మమత, అనురాగం, అభిమానం అభివృద్ది జరిగే అవకాశముంది. పైగా వీని నిర్చహణలో మినిషికి నియమనిష్టలు, క్రమశిక్షణ్, ఏకాగ్రత అలవడతాయి. సంతానంకోసం, సంపదకోసం, ధానాధ్యులు చేసే పుత్రకామేష్ఠి, రాజసూయం, అశ్వమేధం వంటి క్రతువులకు, అజ్ఞ యాగాదులకు యివి ప్రతిరూపాలు. సామాన్యులకుకూడా ఆఫలంమీద కోరికుంటుంది గదా! అందుకని అవి అతని స్థాయికి సరిపడా సరళం చేయండి, యిలా వ్రతాల రూపంలో అందించబడ్డాయి. ఈ అణుయుగంలో కూడా యిప్పటికీ జానపదులు పల్లెలలో యీ వ్రతాలను ఎంతో వేదుకగా చేసుకుంటూ ఆయాదేవతల ఆశీర్వాదం పొందుతున్నట్టు అనుణ్భూతిని పొందుతుండడం గమనార్హం.

  • "ఈ వ్రతములందు నిగూఢమైన మొదటి ధర్మము వితరణ. వ్రతంపేర కలిగినంతలో పండో, పత్రమో, వస్తువో, వస్త్రమో, ధనమో, ధాన్యమో, భొజనమో ఇతరులకు అందజేయుట అనునది ముఖ్యలక్షణముగా కనిపించుట. దానములేని వ్రతము లేనేలేదు. రెండవ ప్రయోజనము భగవచ్చక్తి ప్రార్ధనాశీలత". అందుకే వ్రతకధలలో ఎత్తిమరీ చెబుతారు - "శక్తి లోపమైనను రక్తిలోపముకారాదు. కధలోపమైనా వ్రతలోపము కారాదు" అని.
    • "నోములు, వ్రతాలవలన కలిగే లాభాలు ఏమిటి అని ఆలోచిస్తే మొదట నలుగురూ చేరి సంతోషముగా కాలం గదుపుట అని చెప్పవచ్చు. బీజమునందు వృక్ష గుణధర్మములన్నియు గర్బితములై ఉన్నట్లు ఈ వ్రతములందు దయ, సత్యం శౌచం, నీతి, ఆరోగ్యం, మోక్షం మొదలగు సంప్రదాయములన్నియు గర్భితమై యున్నవి".

వి శ్వా సా లు :

చంద్రుడి దగ్గరగుడికడితే దూరపు వానలనీ, దూరంగా గుడికడితే దగ్గరవానలుపడతాయనె జానపదుల విశ్వాసం. గుడి అంటే చంద్రబింబానికి కొంత దూరంలో అప్పుడప్పుడు చుట్టూ చక్రంలా కనబడే కాంతివలయం.


  • విజ్ఞాన సర్వస్వము, సంసృతి పుట. 908,9010
    • ఆంధ్రుల జానపద విజ్ఞానము పుట 315, డాక్టర్ ఆర్.వి.ఎస్.సుందరం. పిల్లిమాయ దొరికితే అది ఇంటిలో పాతిపెడితే ఆ ఇంటిలో బంగారం తులతూగుతుందట.

ఇంటిమీద తీరువు పిట్ట అరిస్తే ఆ ఇంటికి అరిష్టమట. ఆ ఇంట్లో చావు బ్రతుకుల్లో ఉన్న రోగి అవరైనాఉంటే ఖాయంగా చచ్చిపోతారని దాని అర్ధమట. అలాగే వీధుల్లో కుక్కలు చేరి మొయ్యోమని మోరపైకెత్తుకొని అరుస్తుంటే కూడా ఆ వీధిని అవరింట్లోనైనా చావు బ్రతుకులలో మనిషి ఉంటే ఇక చచ్చిపోతాడని నిర్ధారణ చేసుకొంటారు. అతని ప్రాణాలు తీసుకెళ్ళడానికి వచ్చిన యమకింకరులు ఆ కుక్కలకు కనిపించి అలా అరుస్తుంటాయని వారి భావన.

ఆకాశంలో తోకచుక్క పొడిస్తే దేశంలో గొప్పవాళ్ళు ఎవరో చచ్చి పోవడముగానీ, ఏదైనా ఉపద్రవం రావడంగానీ జరుగుతుందట.

ప్రయాణం వెళ్ళేటప్పుడు ఒక తుమ్ము తుమ్మితే కార్య నాశనం. రెండుతుమ్ములు తుమ్మితే విజయం అని విశ్వాసం. అలాగే వెనక తుమ్ముముందుకు మంచిది అంటారు. (ఈ వెనక అనేది బయలుదేరిన తరువాతనా లేకవెళ్ళేవారి వనకనా అనేది ప్రిస్థితిని బట్టి సరిపెట్టుకుంటారు).

గ్రహణ కాలంలో ఏమైనా తింటే కడుపులో శూలపోట్లు వస్తాయని గ్రహణ సమయానికి ముందుగానే భొజనాలు పూర్తిచేస్తారు. గ్రహణ సమయంలో గర్భవతులు కదిలితే పిల్లలు గ్రహణంమొర్రితో పుడతారట. దేవుడుగుడికి వెళ్లి దైవదర్శనం చేసిన తర్వాత సరాసరి వచ్చేయక కాసేపు ఆలయంలో కూర్ఛోవాలట.

మనిషి నెత్తి మీద పిట్టరెట్ట వేస్తే మేలు జరుగుతుందంటారు. ప్రయాణ వాహనము మీద కుక్క మూత్ర విసర్జన చేస్తే ఆ ప్రయాణం విజయం అంటారు.

చావు పరామర్శకు వెళ్లినప్పుడు పరామర్శించి నేరుగా తిరిగి ఇంటికి వచ్చేయాలిగాని మధ్యలో ఎవరి ఇంటికీ వెళ్లరాదంటారు. కాళ్ళు బారచాపుకు కూర్చున్నవాళ్ల కాళ్ళు దాటితే మళ్లీ ఇటువైపుకు దాటమంటారు. ఇలా చేయకుంటే ఎవరికాళ్ళు అయితేదాటారో వారు స్త్రీ అయితే భర్త, పురుషుడైతే భార్య చనిపోతారనేది ఒక వాడుక. పొలకమారితే ఎవరో కావలసినవాళ్లు తలచుకుంటున్నారంటారు. ఏపనికైనా ముగ్గురు బయలుదేరితే అది ముక్కలై పోతుందట. (కార్య నాశనం). కాకి అరిస్తే బంధువులు వస్తారంటారు. గడపమీద గుమ్మితే వారి తలమీద, గడపమీద పసుపునీళ్ళు చల్లుతూ 'చిరంజీవ ' అంటారు.

ఇంట్లో మొండిచేయి మొలిస్తే (పుట్టుగొడుగు మొండి ఛెయిలా మిలిస్తే) ఆ యింటికి అరిష్ఠమంటారు.

వీనిలో నిజమెంతున్నా, అబద్ధమెందుతున్నా వారి జీవిత గమనానికి జానపదులు ఏర్పాటుచేసుకున్న లక్ష్మణరేఖలు ఇవి.

వర్షాలు కురవకుంటే ఒక బాదురుకప్పను పట్టుకొని పసుపురాసి బొట్టెట్టి పసుపు గుడ్డలో కట్టి రోకలికికట్టి ఆ రోకల్ని యిద్దరుపిల్లలు మోస్తూ యింటింటికీ ఊరేగింపుగాతీసుకేళితే గడపగడపకూ పళ్లాలతో పసుపు కుంకుమ, పువ్వులు పెట్టి పంపిస్తారు. దీనికూడా పిల్లలు పుల్లలతో కోలమీద వాయిస్తూ.

                      "కప్పల తల్లీ నీళ్లాడే
                        జ్కడవల నిండా వానాకురిసే"
                     

అని పాడుతూ ప్రతి గుమ్మానికి తీసుకెళతారు. ఇలా కప్పను పూజిస్టే వాన వస్తుందనేది జానపదుల విశ్వాసాలలొ ఒకటి.

ఈ వర్షాలకోసం ఊరంతా శివాలయంలో హోమాలు చేయించి ఆఖరున శివుని తలమెద వేలాది బిందలనీళ్లు గుమ్మరించి గుడినింపేస్తారు. వెంటనే వర్షం పడుతుందని వారి విశ్వాసం. దీనికోసం దేవుని ముందర వందలాది కొబ్బరికాయలు కూడా కొట్టి ఆ నీళ్లతో అభిషేకిస్తారు. ఈ కొబ్బరికాయ కొట్టడంలో ఒక జానపద విజ్ఞాని చెప్పిన మాటయిది. క్షుద్రదెవతలకు నోరున్న జంతువుని బలియిస్తారట. సాత్విక దేవలకు నోరులేని జంతువుని బలి యివ్వడమట యిది. కొబ్బరికాయ మొక్క వస్తుందిగనక అదిప్రాణే. ఆ కాయలోని నీరు శరీరంలో రక్తంలాంటిదని, గుంజు మాంసంలాంటిదని, పై పేంకు చర్మంలాంటిదని, అందువల్ల ఒక కొబ్బరికాయ పగలగొట్టడమంటే ఒకజంతువును బలివ్వడమే అని భావమట చంద్రవంకలో ఉత్తరం కొమ్ము ఎక్కువుంటే ఉప్పుధర పెరుగుతుందని, దక్షినకొమ్ము పెచ్చుంటే ధాన్యంధర పెరుగుతుందని భావిస్తారు. కొత్తయింటికి దృష్టి దోషం తగలకుండా బూడిదిగుమ్మడికాయ ఇంటిముందు వేలాడదీస్తారు. దెయ్యాలు మీదపడకుండా పిల్లల మొలత్రాడుకు తోలుముక్కకడతారు. ఎక్కడికైన వెళ్లేటప్పుడు ఎక్కడికని అవరైనా అడిగితే వెళ్లేపని జరగదంటారు. తలమీద చేతులు పెట్టుక్కూర్చుంటే దరిద్రమట.

పసిపిల్లలకు అద్దం చూపిస్తే మీద పళ్ళొస్తాయట. మీదపళ్ళొస్తే మేనమామలకి కీడని నూనె మండిగలో ఆబిడ్డముఖం నీడచూపించి చాకుతో ఆబిడ్డ బొట్టునీడపై పొడిపించి రోలుమీద కొబ్బరికాయల్, వెలక్కాయలు కొట్టిస్తారు. తెల్లవారుజామున వచ్చిన కలలు జరుగుతాయంటారు. దీపాలు పెట్టాక ఇల్లు తుడిస్తే లక్ష్మి పోతుందట. ఏకాదశి, మహాశివరాత్రి, సంక్రాంతి భోగి, మకర సంక్రమణం రోజుల్లో చనిపొతే పుణ్యలోకాలు వస్తాయంటారు. ఒంటిమీద సాలెపురుగు ప్రాకితే కొత్తబట్టలుతొడుగుతారంటారు. పిడుగు పడేటప్పుడు అర్జున, ఫల్గుణ, పార్ధ, కిరీటి, శ్వేతవాహన, సవ్యసాచి, భీభత్స, కృష్ణ, విజయ, ధనుంజయ అని అర్జునుని పదిపేర్లూ చదివితే పిడుగు దగ్గరక్ రాదట. ఇంటిలో బూరుగుచెట్టు, కుంకుడుచెట్టు, ఉసిరిచెట్టు ఉండరాదంటారు. గ్రహణ సమయంలో ఆహారపదార్ధాలమీదా, ఊరగాయలమీదా దర్భ ముక్కలు వేసుకోవాలంటారు--లేకుంటే వానిలో పామువిషం క్రక్కుతుందట. పిల్లలకు దృష్టిదోషం తగిలిందనుకున్నపుడు 3 ఎండు మిరపకాయలు, ఉప్పు కలిపిదిష్ఠితీసి మండుతున్న పొయ్యిలో వేస్తారు. ఆ మిరప కాయలుకాలి ఘాటు రాకుంటే దిష్ఠితగిలినట్టు లెక్కట.

గ్రద్ధగాని, తీతువుగాని యింటిమీద వాలితే అశుభం. ఆంజనేయ దండకం చదివితే దెయ్యాలు దగ్గరకు రావట. చెప్పులూ, చీపుర్లూ తలదగ్గర పెట్టుకు పడుకుంటే దెయ్యాలు మీదపడవట. అరటిగెల కోసేసిన్ వెంటనే ఆచెట్టు కొట్టేయాలట. అలా కొట్టెయ్యకుండా ఉంచితే చూసిన పుణ్యస్త్రీలకు వైధవ్యం వస్తుందట. సాయంకాలం పసిపిల్లల్ని వాకిళ్లలో పడుకోబెట్టిన పిట్టరూపు వస్తుందని, అలా వచ్చినవాళ్ళకి ఆరూపు మార్చడంకోసం ఆంబిడ్డని తూములో ప్రవేశపెట్టి వెలికి తీస్తారు. దయ్యాలు - భూతాలు

జానపదులు చేలకు నీరు కట్టడానికి, పంటలు దొంగలపరం కాకుండా చూసుకోవడానికి రాత్రులు పొలాల్లో తిరుగుతుంటారు. రాత్రి తమకు కొరివిదయ్యం క్నిపించింది అంటుంటారు. ఈ కొరివిదయ్యాలు మండుతున్న కొరివిలాగ, లాంతర్లు పట్టుకు నడుస్తున్న మనుషుల్లాగ దూరంగా కనిపిస్తూ గాలిలో తేలియాడుతుంటాయి.

తూర్పు గోదావరి జిల్లా కొంకుదురులో వీనిని గురించి ఆసక్తిదాయకమైన ఒక కధ చెబుతారు అది నిజంగా జరిగిందంటూ. రెండుతరాల క్తితం కనళయ్య గారనే ఒకపెద్ద మనిషి వీధిలో మంచంవేసుకు పడుకొని నిద్రపోతుంటే కొరివిదయ్యాలు ఆయన్ని మంచంతోపాటే "వోం వోం కనళాబొజ్జా" అంటూ మోసుకుపోయి ఊరవతల ఆ మంచంతోబాటే నక్కల పాటి రావిచెట్టుదగ్గర రావిచెట్టుపైన పెట్టాయట. అలాతీసుకువెళ్ళేటప్పుడు ఆ అర్ధరాత్రిఆమాటలు వినబడుతున్నా అని దయ్యాలని భయపడి ఎవ్వరూ ఇళ్ళలోనుంచి బయటకి రాలేదట. మంచంమీద మనిషికి మెలుక వచ్చి కూడా మాట్లాడితే ఏంచేస్తాయో అని నోరు మూసుకుని పడు;కున్నాడట. తెల్లవారాకా చెట్టు దిగొచ్చాడట.

ఈ దయ్యాలూ భూతాల మీద అక్కడే మరొక కధ కూడా చెప్పుతారు నిజంగా జరిగిందని. ఓ ఏభైఏళ్ళక్రితం ఆవూరి దేవాలయం దగ్గర ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేదట. ఆ బ్రాహ్మణ కుటుంబంలో అన్నగారు మంత్రతంత్రాలు ఎరిగినవాడు. తమ్ముడు నూనూగు మీసాల నూతన యవ్వనంలో మిసమిసలాడుతున్న గొప్ప అందగాడు- పైగా బ్రహ్మచారి. వారికి వ్యవసాయముంది. అందువల్ల తమ్ముడు ప్రతీరాత్రీ పొలంలో పంట కాపలాకు అరవ వేసుకొని దానిపై పడుకునేవాడట. ఒక అర్ధరాత్రి ఒక అపురూప సౌందర్యరాశి అయిన సుందరి వచ్చి అతనిని నిద్రలేపి సంభోగానికి ప్రోత్సహించిందట. ఆమె సౌందర్యానికి ముగ్దుడైన అతను ఆమెను రమించాడట. తల్లవారక ముందే ఆమె వెళ్ళిపోయింది. ఇలాగే ప్రతీరోజూ జరుగుతుండేదట. పదిరోజులు పోయేసరికి అతను చాలా నీరసపడిపోయి పది లంఖణాలు చేసిన మనిషిలాగ అయిపోయేడట. ఇలాగ పీడ ముఖం పడిపోయిన తమ్ముణ్ణీ గమనించిన అన్నగారు తమ్ముణ్ణి ప్రశ్నిస్తే జరుగుతున్న వ్యవహారం చెప్పాడు. రాత్రి తమ్ముని వెళ్ళకుండాఆపుచేస్తే అర్ధరాత్రి ఆమెవచ్చి తలుపుకొట్టిందని అన్నగారు లేచివచ్చి తన మంత్రశక్తితో ఆమెను నిజరూపంలోకి మారిస్తే ఆమె కామపిశాచి అని తేలింది. వెంటనే ఆ భూతాన్ని తరిమికొట్టాడట. అలాగ తమ్ముని రక్షించుకోగలిగాడనీ, లేకుంటే మరో పదిరోగులకి అదె రాక్షస రతిమూలంగా అతను చచ్చిపోయి ఉండేవాడని చెప్పుకుంటారు (కాశీమజిలీ కధల మాదిరి సుబ్బన్నదీక్షితకవి-గొల్లభామ కధల్లంటివి ఇలాంటి వానిని వినే వ్రాస్తుంటారు). దయ్యం పట్టుకున్న వాళ్ళనుంచి దయ్యాల్ని వదిలించడానికి భూతవైద్యులు పేకబెత్తంతో దయ్యం పట్టిన మనిషిని కొట్టడం, అతని తలవెంట్రుక నొకదాన్నితీసి సీసాలో పెట్టి సీసామూత బిరడాతో బిగించి లోపలిగాలి బయటకు రాకుండాచేసి ఊరికిదూరంగా భూమిలో పాతిపెట్టడం చేస్తారు. అంటే ఆభూతం భూస్థాపితంఅయిపోయి బయటకి రాలేదన్నమాట. ఈ భూతాన్నే గాలిపట్టడం అంటారు - గాలిలా దీనికి కూడా రూపం లేనందువల్లనేమో! దయ్యాల మూతులు ఎర్రగా ఉంటాయని, పాదాలు వెనక్కి తిరిగి ఉంటాయని ప్రతీతి. జానపదులు ఈ భూతాల తృప్తికోసం బలులు ఇస్తుంటారు. రైతులు పంటకొసేముందు కోడిని కోసి ఆ రక్తం అన్నంలో కలిపి మూడుముద్దలు చేలో వేసి భూత శాంతి ఛేస్తారు. కొన్ని ఊళ్ళల్లో గ్రామస్థులంతా షకారంగా ఊరుమ్మడి డబ్బుతో మేకను కోసి అమ్మవారి గుడిముందు తలనరికి ఆ రక్తం అన్నంలో కలిపి ఆ ముద్దలు ఆకుల్లో వేసి తీఉకెళ్ళి తమ తమ పొలాల్లోచల్లి కోత ప్రారంభిస్తారు. దీనినే పంటదేవత జాతర అంటారు.

ఇంతకీ శాస్త్రవేత్తలు కొరివిదయ్యాల గురించి చెఫ్ఫే సిద్ధాంతం వేరు. చనిపోయినవారి ఎముకలలోని భస్వరం గాలిలో కలిసినప్పుడు మండుతూ గాలివాటాన్ని బట్టి అటూ ఇటూ కదులాడుతుంటుందట. అందుకే అని ఎక్కువ శ్మశానాలోను ఆ పరిసర ప్రాంతాలలోనే కనిపిస్తాయి. ఇక భూతావేశాన్ని గురించి వారు చెప్పేది ఇది మానసికమైన ఓక రుగ్మత అనీ, భూతాలతొ సంచరించామనే మాటలు కట్తుకధలనీను.

చే త బ డి

జానపదులలో దీనిమీద విశ్వాసమెక్కువ . ఇది తంత్ర విద్యకు సంబంధించింది. తంత్ర విద్యంటే భూతాలు, దయ్యాలు, పిశాచాలకు సంబంధించిన విద్య. శత్రువును సాధించాలనుకున్నప్పుడు అతని నాశనాన్ని కోరుకుంటారు ఆ నాశనానికి అజ్ఞాతంగా చేసే ప్రక్రియే చేతబడి లేక ప్రయెగం . ఈతంత్ర శగ్తిగలవారు చాలా అరుదుగా ఉంటారు . ఇవి కొండదొరలు కూడా చేస్తారు.

ఎవరికైతే కీడు తలపెడతారో అతని తలవెంట్రుకగాని, గోరుగాని, మూత్రంగాని దొరికితే చాలు. దానితో ఈ ప్రయెగం చేస్తారు. ఆ మనిషి రూపుతో ఒక బొమ్మను చేసి ' అబ్రకదబ్రా ' వంటి మంత్రాలతో దాని తలమీదా, కాళ్ళమీదా ముళ్ళుగుచ్చి అతని నుండి సంపాదించగలిగిన తలవెంట్రుకగాని, మూత్రంగాని, గోరుగాని, మూత్రంకలిసిన మట్టిగాని దానికి కట్టి ఇంతకాలంలో ఆ వ్యక్తి చనిపోవాలని నిర్దేశించి దూరంగా శ్మశానంలో పాతిపెడతారు. వెంటనే అకారణంగా, అకస్మాత్తుగా ఆ వ్యక్తికి తలనొప్పి, కీళ్ళనొప్పి లాంటివి ప్రవేశించి క్రమంగా అనారోగ్యానికి లోనై పీడముఖం పడి ఆ నిర్దేశించిన సమయానికి చనిపోతాడు. అలా పీడముఖం పడుతుండడం గ్రహించిన కొందరు పెద్దలాళ్ళు అది చేతబడి అని భావించి ఒక తంత్రగాడిని ఆశ్రయిస్తారు. అతను రోగి స్థితి గ్రహించి అది చేతబడే అని నిర్ణయించి ఆ రోగిని గాని, రోగికి నమ్మకమైన వ్యక్తినిగాని అమావాస్యనాడు అర్ధరాత్రి చీకట్లో ఒక్కణ్ణీ రమ్మని, బొమ్మ పాతిబెట్టబడ్డ చోటికి తీసుకెళ్ళి వివస్త్రంగా త్రవ్వమంటారు. అలా త్రవ్వగా ముళ్ళుగ్రుచ్చ్జబడి మంత్రింపబడినబొమ్మ కనిపిస్తుంది. దానిని పైకి తీసి, ఆముళ్ళు వగైరాలు తోలగించి, మంత్రం జపించి, కొబ్బరికాయకొట్టి, ఆబొమ్మను నాశనం జేసేసి, రోగి స్తొమతను బట్టి సొమ్ము వసూలు చేసుకుంటాడు. క్రమంగా ఆ వ్యక్తికి ఆ జబ్బు తగ్గిపోతుంది. చేతబడి తీయడమనేది ఎక్కువగా ముస్లింలే జేస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో దుళ్ళగ్రామంలో ఒక ముస్లిం ఈ విద్యలో ఆరితేరిన వానిగా ప్రసిద్ధి పొందాడు. దీర్ఘకాయిలా రోగులు చేతబడి అనుమానమొస్తే ఒక కొబ్బరికాయ తీసుకొని అతని యింటికి వెళ్ళితే అతను ఆకొబ్బరికాయ మన ఎదురుగానే ఒక ఖాళి చేంబు పై పెడతాడు. రెండు నిమిషాలకు ఆ చేంబునుండి ఝమ్ అని శబ్దం వస్థుంది. దానితో అతను మనకు తేలియని పిశాచి బాషలో మాట్లాడతాడు. తరువాత మాట్లాడిన విషయం మనకు చెబుతాడు. కొంతమందికి అది ఛేతబడికాదని సమాధానమొచ్చిందని, ఎక్కడో జడుసుకున్నాడని, అక్కడ ఒక పిశాచి వెంబడించిందని చెప్పి దానిని వదిలించడానికి పదిరూపాయలు తీసుకొని వేరుముక్క కట్టి పంపించేస్తాడు. కొందరికి చేతబడి ప్రయోగం జరిగిందని దానిని తీయడానికి డబ్బు మాటాడుకొని అమావాస్య అర్ధరాత్రి అతనిని రమ్మని, శ్మశానంలో త్రవ్వించి, ఆ ప్రయోగం చేసిన బొమ్మని పైకితీయిస్తాడు. ఆ ప్రయోగం చేసినవాళ్ళనిమాత్రం చెప్పడు. అది ఆ రోగి, ఆరోగి బందువులు ఊహించుకోవలసిందే. శతృవులెవ్వరో. ఇలా తీసేసిన తరువాత అతనికి ఆజబ్బు నయమయిపోతుంది. ఆశ్చర్యం: చేతంబడులనేవి అసలు లేనేలేవని అనేవారు దీనికి చెప్పేదేమిటంటే రోగి తనను కలిసాక ఆతంత్ర్రగాడే ఒక బొమ్మనుచేసి, దానికి వెంట్రుకలు చుట్టి, ముళ్ళుగుచ్చి ఒక స్మశానంలో ఒకచోట పాతిపెట్టి వచ్చి, ఆతరువాత అమావాస్యనాదు అర్ధరాత్రి అతనిని అక్కడకు తీసుకెళ్ళి త్రవించి దానిని తీయిస్తాడని. మరి రోగమెలా తగ్గుతుందయ్యా అంటే ఇది సైకలాజికల్ ట్రీట్ మెంటని అంటారు. పచ్చని చెట్లకు కూడా ఈ ప్రయోగం చేస్తే ఆ చెట్లు ఆకులు రాల్చి మాడిపోయి చచ్చిపోతాయని జానపదులు చెబుతుంటారు. ఈ జిల్లాలోనే లొల్లలోనూ, నడిశలేరులోనూ, కోనసీమలోను ఈ చేతబడులు తీసేవారు ఉన్నారు. ఇలాంటి చెడుపు, చిల్లంగి అనేవికూడ.

                            గృ హ వా స్తు

జానపదులు యిండ్లు నిర్మాణంలో యీ క్రింది నియమాలు పాటిస్తారు. ఆగ్నేయం పెరకం (పెరిగి) ఉండ కూడదట - అలా ఉంటే ఆ యింటిలో వారికి దరిద్రమట.

దక్షిణం, పడంర మెరకగా ఉండాలి- తూర్పు, ఉత్తరం పల్లంగా ఉండాలి- అలా ఉంటే ఆ యింటిలోని వారు వృద్ధి పొందుతారు. ఆగ్నేయంలో పొయ్యి, ఈశాన్యంలో నుయ్యి, ఉండాలంటారు - అలా ఉంటే శుభం. సింహద్వారానికి ఎదురుగా నుయ్యిగాని, గొయ్యిగాని ఉండకూడదు - ఉంటే అరిష్టమట. అలాగే వీధి శూల కూడదంటారు. వీధి శూలంటే వీధిలో రోడ్ల ఆద్యంతాలకు అభిముఖంగా గుమ్మం ఉండరాదు - ఇది వినాశ హేతువట. వాడకంనీరు తూర్పు భాగాన తూములోంచి పోవాలి. అలా చేస్తే ధనాభివృద్ది అవుతుంది. మరుగుదొడ్డి దక్షిణ నైరుతీ భాగాల మధ్యగానె, అగ్నేయ దక్షిణ భాగాల మధ్యగాని ఉండాలి. అలా ఉంటే సర్వత్రా శ్రేయస్సు. ఈశాల్యం త్రెరిపి వుండాలి. అంటే ఈశాన్యమూల కప్పు లేకుండా ఉండాలన్నమాట. మూత వేస్తే ఆ కుటుంబం మసి అయిపోతుందట. ఇంటి నానుకొని ఖాళీస్థలం వదలడంళొ దక్షిణం కంటే ఉత్తర్ం ఎక్కువుండాలి. పడమర కంటే తూర్పు ఎక్కువుండాలి. సింహద్వారంతో మూడు వరుస గుమ్మాలుంటే శివదృష్టి- సర్వనాశనం అంటారు. గర్భంలో గుమ్మాలు ఎనిమిదిగాని, పన్నెండుగాని ఉండేటట్లు చేస్తారు. మొత్తంమెద స్వరూపాలు సరిసంఖ్యలో ఉండాలంటారు.

'గ్రహస్థితి కంటే గృహస్థితి గొప్పది ' - గ్రహస్థితి సరిలేకుంటేనష్టపోయేది ఆ ఒక్క వ్యక్తే. గృహస్థితి సరిలేకుంటే ఆ యింట్లో ఉన్న వారందరికీ నష్టంకలుగుతుందని వారి భావం. గృహనిర్మాణంలో 'విష్ణు వృష్టం, శివదృష్టి ' పనికి రావంటారు. - అంటే విష్ణాలయానికి వెనుక, శివాలయానికి ముందు ఉండే యిండ్లు శోభించవని, గృహచ్చిద్రాలు, దరిద్రంవంటివానితో సర్వనాశనం అవుతాయని అంటారు. అలాగే ధ్వజ స్తంభం నీడపడ్డ యిళ్ళుకూడా వృద్ధినొందవని చెబుతారు.వీరు నాగరికుల్లాగ ఫేషన్ కోసం కాకుండా గృహాలను ఉపయోగం కోసమే కడతారు. ఖర్చు తక్కువగా ఉండేటట్టు మట్టి, సున్నం, ఇటుక (పచ్చి యిటుకకూడా) వాడి ఎక్కువగా పెంకిటిళ్ళే కడతారు. మరీ పేదలు పూరి గుడిశలు తాటాకుతో నిర్మించుకుంటారు.

  • "Folk Architecture may be said to be traditional Architecture. It is concerned with all traditional aspects of building, the shapes, sizes and Lay outs of building all "kinds"

  • Warren E. Roberts, "Folk Lolorer Folk life" (Ed... Ridhard M. Dorsa) 28 p.

(ఆంధ్రుల జానపద విజ్ఞాణనం పు 424 నుండి గ్రహించబడింది) శ కు నా లు

జానపదులు ఎక్కడికైనా ప్రయాణం బయలుదేతి వెళ్ళేటప్పుడు ఒంటిబ్రాహ్మణుడు, పిచ్చివాడు, గుడ్డివాడు, కురూపి, పొదితో మంగలి మురికిబట్టలమూటతో చాకలి, తెలుకల మనిషి, గర్భిణీస్త్రీ, విదవరాలు, తల విరబోసుకున్న స్త్రీ, తోళ్ళు, బొగ్గులు, ఉప్పు, నూనె, నువ్వులు, మినుములు, దూది, కట్టెలు, కొత్తకుండ, ఊక, మలం, మజ్జిగ, ఇనుము, పిడకలు, పిల్లి, పంది ఎదురొస్తే దుశ్శకునములుగా భావిస్తారు. దీనికి ప్రాయశ్చితంగా ప్రయాణం ముందుకు మాని వనక్కి వచ్చి కాళ్ళూచేతులూ, ముఖమూ కడుక్కొని కాసేపు కూర్చుని అప్పుడు ప్రయాణం బయలుదేరతారు.

ఈ శకునాలు ఏడడుగులలోపులో వస్తేనే వర్తిస్తాయనేది ఒక సవరణ కూడా వుంది.

ఇక ఇద్దరు బ్రాహ్మణులు, పుణ్యస్త్రీ, వేశ్య, ఉతికిన బట్టలమూటతో చాకలి, నీరు, పాలు, పెరుగు, నెయ్యి, పువ్వులు, పండ్లు,మాంసం, శంఖం, మంగళారవం, శవం, ఆవుపేడ, ఆవు, గుర్రం, ఏనుగు పుస్తకాలతో విదార్ధి ఎదురొస్తే సుశకునములుగా భావిస్తారు.

                     బ ల్లి ప త నం

బల్లి చాలా కంగారు కీటకం. ఇళ్ళల్లో అస్తమానూ గోడలమీద్ పురుగుల వేటలో తిరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు అటూ యిటూ తిరగడంలో అప్రయత్నంగా మనిషిమీద పడుతుంది. బల్లి కొన్ని అవయవాలమీద పడితే కీడు, కొన్ని అవయవాలమీద పడితే మేలు కలుగుతుందని జానపదులు అనాదిగా విశ్వస్తున్నారు. ఫలితాలు యిలాగుంటాఅట.

   కీ డు లు:- నడినెత్తిమెద - రోగం
                          ముంగురులమీద - హాని
                          జడమీద, తల ముసుగుమీద - వైధవ్యం
                          చెవిమీద - దుర్వార్తవినుట

                              

ముక్కుమీద - కార్యహాని
గడ్డంమీద - అపమృత్యువు
మెడ మీద - మరణ భయం
నడుం మీద - బుద్ధి నాశం
గుండె మీద - బుద్ధి నాశం
బొడ్డు మీద - భయం
బొడ్దుకు దిగువన - రోగం
కుడి చేతి మీద - సహాయ నాశనం
మణికట్తున - గర్వభంగం
వెన్నున - శత్రుభయం
తొడ వెనుక - విష భయం
స్త్రీకి తొడ మీద - వ్యభిచారం
మోకాలిసందులో - వాహన భ్రష్టత్వం
మోకాలిక్రింద - వైద్యం మూలంగా ధనవ్యయం
కాలివేళ్ళ మీద - రోగం

మేళ్లు:- పాలభాగాన, కనుబొమ్మలమీద - ధనలాభం
          చెంపల మీద - శుభం
          ముక్కుప్రక్క - మిత్రలాభం
          మీసం మీద - అధికార లాభం
          ఱొమ్ముల మీద - జయం
          కడుపు మీద - పుత్ర లాభం
          కడుపు ప్రక్కన - ఆరోగ్యం
          భుజాల మీద - సహాయం
          అరచేతి మీద - ద్రవ్యలాభం
          నడుము వెనక - వస్త్రలాభం
          పిరుదుల మీద - శయ్యా సౌఖ్యం
          ముందుతొడ మెద - సౌఖ్యం
          మోకాలిమీద - వాహనలాభం
          పిక్కలమీద - కార్యలాభం
          మోకాలిక్రింది ఎముకమీద - వ్యాపారలాభం
          పాదం మీద - కళ్యాణం
          

అవయవాలు అదరడం

అప్పుడప్పుడు అవయవాలు అదరడం అనేది పశుపక్ష్యాదులలోనూ, మనుష్యులలోను కనిపిస్తుంది. మనుష్యులలో కనిపించే యీ అదరడానికి అదిరే ప్రదేశాన్ని బట్టి యిలాగ శుభాశుభాలు చెప్పుకుంటారు.

కుడిప్రక్మ అదిరిన మేలు, ఎడమ ప్రక్క మధ్యను ఫలం నడినెత్తిన మృష్ణాన్నం, నొసట మేలు, కుడిచెంప రాజభయం, ఎడమచేయి ఉద్యోగం, రెండు కన్నులూ అదిరిన మేలు, ముక్కు రోగం, పైపెదవి కలహం, క్రింది పెదవి భోజన సౌఖ్యం, గడ్డం లాభం, కుడిచెక్కిలి ధనలాభం, ఎడమ చెక్కిలి దొంగల భయం, కుడి భుజం సంభోగం, ఎడమ భుజం కీడు, రొమ్ము ధనలాభం, చేతులు వాహన లాభం, అరచేయి సంతానం, కుడితొడ రాజభయం,మోకాళ్ళు జాడ్యం, మీగాళ్లు ధాన్య్హ లాభం, అరికాళ్లు సౌఖ్యం.

ఆడవాళ్ళకు కుడికన్నదిరినా, మగవారికి ఎడమకన్నదిరినా అశుభ మంటారు. మగవారికి కుడికన్ను, ఆడవారికి ఎడమకన్ను అదరడం శుభం.

ఈ అవయవాలు అదరడాన్ని విఅద్యశాస్త్రజ్ఞలు పైత్యం ఎక్కువవ్చడంవల్ల, నరాల బలహీనతవల్ల జరిగే పని మాత్రమే అని చెబుతారు.

గ్రామదేవతలు :

ఆంధ్రదేశంలో విష్ఠ్యాలయంగాని శివాలయంగాని లేని ఊరుండరు. ఊరిలోని గ్రామదేవతే వారి ఊరును రోగాలబారినుండి, క్షామాలనుండీ కాపాడుతుందనీ, ఇష్ఠకామ్యాలు నెరవేరుస్తుందనీ జానపదుల విశ్వాసము. అందుకే ఆమను ముక్కుకుంటూ ఏటేటా ఫెళ్ళుమని ఉత్సవాలు జరిపిస్తుంటారు. ఈ ఉత్సవాలనే జాతర్లంటారు. ఈ అమ్మవార్ల ఆరాధనా పద్ధతేవేరు. త్రిమూర్తులలో శానవశాన బ్రహ్మకు ఎలాగుపూజలేదు. ఇక శివకేశవుల ఆరాధన సాత్వికారాధన. వీరికి విఅవేద్యం పళ్ళూ, ఫలహారాలు చాలు. కాని యీ గ్రామదేవతల ఆరాధన క్షుద్రదేవతారాధన. నరుని దగ్గరనుంచి కోడివరకూ బలికోరతాయి. ఆదిమ మానవుడు ప్రకృతి శక్తులతోపాటు చెట్టునీ, పుట్టనీ, రాయినీ రప్పనీ కూడా ఆరాధింఛేవాడు. భూగర్భంలోనూ, జలగర్భంలోనూ దొరికినకొన్ని రాళ్ళు గ్రామదేవతలుగా వెలశాయి. ఈ యోగం కూడా అన్ని రాళ్ళకూ పట్టదు - కొన్ని రాళ్ళకే. అందుకే స్థలభోగం శిలాభోగం అంటూంటారు పెద్ద్దలు. ఆంధ్రదేశంలో ఎక్కడచూసినా పోతురాజులూ, పోలేరమ్మలూ, కోకొల్లలు (ఇవి మన మంత్రులు పాతిన శంకుస్థాపన రాళ్ళంటారనుకోండి కొందరు రాజకీయ్ చతురులు).

ఇంతకీ యీగ్రామదేవతలు ఎవరూ అనేది ఆలోచిస్తే ప్రతి చిన్నదేవత వెనుకా కూడా ఒక్ పెద్ద కధ ఉంటుంది. సాధరణంగా ఆ వూరికోసం ఏదైనా త్యాగం చేసిన పేరంటాలో, బ్రతికుండగా ఏదైనా అతీత శక్తులు ప్రదర్శించిన స్త్రీయో, అత్తమామల ఆరళ్ళతోనో, భర్త పోరుతోనో, బలవంతాన చనిపోయిన పడుచో అయివుంటుంది.

ఇలాంటిదే రాయలసీమలో అనంతపురం జిల్లాలో బుక్కరాయసముద్రం దగర ముసలమ్మ. బుక్కరాయ చెరువు కట్టతెగింది. ఊరు మునిగిపోయే ప్రమాదమొచ్చింది. ఆవూరిలోని ముసలమ్మ అనే వనితను బలియిస్తే తన్నివారణ జరుగుతుందని ఊరి పోలేరమ్మ పూని పలికిందట. గ్రామ శ్రేయస్సుకోసం నవయవ్వనవతి, సుందరాంగియైన ముసలమ్మ ప్రాణప్రదులైన భర్తను. అత్త,ఆ,అ;అమి విడిచి అందులో దుమికి ఆత్మార్పణ ఛేసింది. కట్టమంచి రామలింగారెడ్డిగారి 'ముసలమ్మ మరణం ' కావ్యం యిదే. ఈ ముసలమ్మ అందాల్నివర్ణిస్తూ పసుపు పూసుకు స్నానమాడేటప్పుడు 'తలమీదచెట్లు కురిసిన లలితసుమపరాగమున వెలయు లతిక ' వలె ఉన్నదంటారు. ఆత్మబలిదానం యివ్వాఅనికి జల ప్రవేశం చేసేటప్పుడు-

                 "జ్వలదగ్ని శిఖలపై చెలనవ్వుతోబోవు
                   ధాత్రీ మహాదేవి తనయయనగా"
                   

అని వర్ణించి తెలుగు సాహితీ చరిత్రలో ఆమెస్థానాన్నిఅజరామరం చేశాడు. ఇలా గ్రామాన్ని కాపాడిన తల్లిగా, అక్కడ గ్రామదేవతగా వెలసి పూజలందుకొంటుంది. చిత్తూరు జిల్లాలో గంగమ్మ గ్రామదేవత చ్రిత్ర మరోరకం. తాళ్లపాకలో గంగ్ఫమ్మ అనే బాలిక ఒక యింట ఆడపడుచుగా పుట్టింది. ఆమె ఎదిగేకొద్దీ రాత్రులు గ్రామంలో ఒకశక్తి తిరుగుతూ అందర్నీ భయబ్రాంతుల్నిచేస్తోంది. ప్రజలు రాత్రులు వీధుల్లో తిరగడమే మానివేశారు. ఒక రోజు తిరుపతినుండి ఒక బాటసారి ఆవూరి మీదనుండి వెళుతూ చీకటి పడడంతో ఆవూళ్ళొ ఆగిపౌయాడు. అతడు బ్రాహ్మణుడు కావడం వల్ల ఊర్లోవాళ్ళు స్వయంపాకం చేసుకొవడానికి ఉప్పులూ, పప్పులూ, బియ్యం యిచ్చారు. భోజనమయ్యాక అతను వీధిలో రచ్చబండమీద పడుకోబోతుంటే ఆవూళ్లో రాత్రులు శక్తి తిరుగుతుందనీ, బయట పరుండడం ప్రమాదమనీ, త్మ యింటిలోకి వచ్చి పండుకోమనీ ఆహ్వానించారు. అయితే ఆ సంగతేదోతను చూస్తానని ఆ రచబండ చుట్టూ మంత్రించి అక్షతలు చల్లి అర్ధరాత్రివరకూ అలాగ మెలకువగా చూస్తూనే వున్నాడు. అనుకున్నట్టు అర్ధరాత్రి పెద్దరాక్షసి అట్టహాసం చేస్తూ వచ్చింది. కాని రచ్చబండను సమీపించలేకపోతోంది. అప్పుడా బ్రాహ్మణుడు తన మంత్రశక్తితో ఆమెను నిజరూపంలోకి మార్చివేసి ప్రొద్దుట అందరికీ చూపించాడు. ఆమె గంగమ్మ, ఆమెను తిరుపతి తీసుకువచ్చాడు.యవ్వావతియై భర్తకావాలంటే ఊరిలో ఒకాయనకు పెళ్ళిచేశాడు. గర్భాదానంగదిలో ఆమె తన అసలు పిశాచరూపంలో రతికుపక్రమించగా భర్త భయపడి పారిపోయాడు. ఆమె అతన్ని వెంటాడి ఎంతవెదికినా దొరక్క ఆ బ్రాహ్మణుని దగ్గరకొచ్చిత్నకామం తీరడానికి మరో పెళ్ళి చేయమని అడిగింది. అతను అలాగే చేస్తానని రాయిచేసి వేశాడట. నాటినుండి ఆమె దేవతగా వెలిసింది తిరుపతిలో. తమపిల్లాపాపల్నిఆమె చల్లగా చూడాలని తిరుపతి పరిసరాలలోని పల్లె ప్రజలు ప్రతియేటా ఆమెకు వారంరోజులు జాతర చేస్తారు. ఈ వారం రోజులూ కొందరు యువకులు స్త్రీ వేషాలు ధరించి తిరుపతి వీధుల్లో తిరుగుతుంటారు. ఇవి గంగమ్మ వేషాలు (ఈ జాతర రోజుల్లొ ఎవరైనా తిరుపతి వెళితే వీళ్లు కొజ్జాలేమో అనుకుంటాం). కొందరు మగరాక్షసుల్లాగ వొళ్ళంతా మసి పూసుకుని వేషంవేసుకుని వేపరొట్ట చేతపట్టుకొని ఒకో గంగమ్మనూ ఒక్కొక్కరు చొప్పున వెంటనంటి తిరుగుతుంటారు. రోగాలూ, కష్టాలూ వచ్చినపుడు యిలా వేషాలు వేసి జాతరలో పాల్గొంటామని మొక్కుకుంటారట అక్కడివారు. పచ్చిబూతులు యీమెకు సమారాధన, (కామంతో తపించిపోయిందిగామరి.} తూర్పు గోదావరి జిల్లాలో ఏలేశ్వర్ం దగ్గర గొల్లాలమ్మ చరిత్ర కూడా విచిత్రంగా ఉంటుంది. పెద్దపురం తిమ్మజగపతి మహారాజు అక్కడ చెరుగు త్రఫ్వించాడు. ఇతే లింగంపర్తివైపు గట్టు ఎప్పుడూ తెగిపోతుండెదట. బండ్లకొద్దీ మట్టివేసి ఏనుగులచేత త్రొక్కించి గట్టుబిగించినా కొట్టుకుపోయేదట. అప్పుడు రాజుకు కలలో దేవత కనిపించి అక్కడికి నిత్యం పాలు తెచ్చే గొల్లాలమ్మ అనే ముసలిదాన్ని అక్కడ నిలిపి ఆమెపై గట్టు వేసేస్తే ఆగట్టు నిలుస్తుందని చెప్పిందట. గ్రామరక్షణార్ధం ఆ అవ్వ అందుకు సిద్ధపడిందట. అలాగే ఆమెను నిలబెట్టి మట్టితో కప్పేసి గట్టు వేశారు. గట్టు నిలిచి పోయిందట. నాటినుండీ ఆమెను దేవతగా కొలుస్తారు. ఆమెకు మదుం కట్టించారు. అదే గొల్లాలమ్మ మదుం. ఆ మదుందగ్గర తొల్లాలమ్మా ! అని పిలిస్తే ఓయని ప్రతి శబ్దం వస్తుందట. ఆమె జాతర రోజున మొక్కుబళ్ళు కోళ్ళు, మేకలు విశేషంగా కొస్తారు. మొక్కుకుంటే కోరిక తీరుసుందట. ఈ జాతరకే చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు తండోప తండాలుగా వస్తారు. విశేషమేమంటే ఉదయం నుంచీ మంచి జోరుగా వచ్చేజనం ప్రొద్దుగూకే టప్పడికి ఒక్కరు కూడా కనపడరు. రాత్రికి అక్కడ ఉండరాదని అమ్మ వారి ఆదేశమట. అది అసలే అడవి ప్రాంతం. పాములు, మండ్రగబ్బలు విశేషం. ఆ అమ్మవారి పేరు తలిస్తే అవి ఏమీ కరవవని అక్కడి వాళ్ళనమ్మకం.

ఇలాంటి వనిలో తూర్పుగోదావరి జిల్లాలో కాండ్రకోట నూకాలమ్మ, పెద్దపురం మరిడమ్మ, రాజమండ్రి సోమాలమ్మ, కొప్పవరం ముత్యాలమ్మ మారేడుబాక మావుళ్ళమ్మ, తుని దగ్గర తలుపులమ్మ, రాయవరం పోలమ్మ, వానపల్లి వల్లాలమ్మ, కొంకుదురు గంగాలమ్మ, చింతలూరు నూకాలమ్మ, పెద్దాపురం పరదేశమ్మ, నిడదవోలు కోటసత్తెమ్మ, ఏలేటిపాడు ముత్యాలమ్మ, మల్లప్పదిబ్బ పెద్దింటమ్మ, మండపాక ఎల్లారమ్మ, బోడసకుర్రు పైళ్ళమ్మ, అమలాపురం సుబ్బాలమ్మ, రఘుదేవపురం దుర్గమ్మ యిలా ఊరూరికీ ఉన్నాయి. నిత్య నైవేద్యాలందుకుంటున్నాయి. ఈ గ్రామ దేవతల పేర్లు స్త్రీలకే కాకుండా పురుషులకు కూడ పెడతారు పోలయ్యని, వల్లయ్యని, ముత్యాలయ్యని, మావుళ్ళయ్యని, మరిడయ్యని యిలాగ జానపదులు గ్రామదేవతలని అంత భక్తితో గొలుస్తారు. ఇవి దుర్గాదేవి అపరరూపాలని, ఆ అయ్యవార్ల పాదాల క్రింద మహిషాసురుని చిత్రిస్తారు. గ్రామస్థులకు కష్టాలు వచ్చినపుడు యీ దేవతలకు మొక్కుకుంటారు వారకల్లు గండదీపం, కావడికోళ్ళుయిస్తామని. వారకల్లు అంటే తాటికల్లు ముంతలతో తెచ్చి అమ్మవారికి యివ్వడం. గండదీపం అంటే మండిగలో నూనెపోసి వత్తి వేసి వెలిగించి నెత్తిమీద పెట్టుకొమ్ని ఊరేగింపుగా వెళ్ళి అమ్మవారి గుడిలోకి యివ్వడం.

కావడికోళ్లు అంటే ఒక కర్రకు ఇరువైపులా రెండు కోళ్లు కట్టుకుని ఆ కర్రను భుజంమీద కావిడిలా పెట్టుకొని ఊరేగింపుగా తెచ్చి అమ్మవారి గుడికివ్వడం (ఇవన్నీ ఆసాదుల పరం)

సాధారణంగా కోడినిగాని, మేకనుగాని, గొఱ్రెనుగాని బలిస్తామని మొక్కుతారు. ఆ కష్టాలు తొలిగిపోతే ఆ విశ్వాసంతో ఆ అమ్మవారి జాతర సమయంలో వానిని కోస్తారు. (వీనిని అమ్మవారి పేరు చెప్పి కోసినా తినేది వీళ్ళే అనుకోండి.)

కాండ్రకోట నూకాలమ్మకు పూర్వం ఎనుబోతును బలియిచ్చేవారట. అలాగే కొండదేవతలకు నరబలులుకూడా యిచ్చేవారట. పెద్దాపురం మరిడమ్మ తీర్ధం నెల్లాళ్ళు చేస్తారు. ఆ నెల్లాళ్ళలొ ప్రతి ఆదివారం నుంచి ప్రంబలంగా వుంటుంది. ఈ ఉత్సవానికి బండ్లమీద వేషాలు ప్రసిద్ది. రాజమండ్రి సోమాలమ్మ జాతరకు యిపుడు నాగరికంగా నాటకాలు వేయిస్తూ ఉత్సవకార్యక్రమాలు నడుపుతున్నారు. చివరి రోజు అన్నిరకాల జానపదకళారూపాలతో ఊరేగింపు చేస్తారు. తుని దగ్గర తలుపులమ్మ లోవ (లోయ)లోని తలుపులమ్మకు (తలుపులమ్మ) యిప్పటికీ జంతుబలులు జరుగుతునే ఉన్నాయి. ముఖ్యంగా క్రొత్తగా కార్లూ, లారీలూ, ట్రాక్టర్లూ, కొన్నవాళ్ళు తప్పనిసరిగా అక్కడికి తీసికెళ్ళి ఆమెకు మేకనుగాని, కోడినిగాని బలియిచ్చి ఏప్రమాదాలూ రాకుండా కాపాడమని ప్రార్ధించుకుంటారు. రాయవరం వంతెనదగ్గర పోలమ్మ ఒక చెట్టుక్రిందవుంది. ప్రతి ఏటా బ్రహ్మాండమైన జాతర చేస్తారు బాణా సంచాతో. పూర్ఫం బోగం మేళాలతో కూడా జాతర జరిపేవారు. కొప్పవరం ముత్యాలమ్మజాతర ఉగాదిముందు చేస్తారు. ఇది పిల్లల తీర్ధం. ఈ తీర్ద్జంనాడు తలిదండ్రులు తమపిల్లల్ని తీసికెళ్లి అమ్మవారికి పళ్ళీప్పిస్తారు. ఆమె పిల్లల ఆరోగ్యాన్ని కాపాడి రక్షించే తల్లి అని ప్రతీతి. ఈమె లీలలు విచిత్రంగా ఉండేవట. ఒకరోజు మిట్టమధ్యాహ్నం వేళ చక్కని పడుచులా తయారై వీధిలోపోతున్న గాజులవానిని పిలిచి గాజులేయించుకుని ఒక ఇంటిలోకి పోయిందట డబ్బులిస్థానని. ఆమె ఎప్పటికీ రాకపోయేసరికి అతను ఆయింటివారినిపిలిచి అడిగాడట. వాళ్ళు ఆమె ముత్యాలమ్మ అని గ్రహించి ఆడబ్బులిచ్చి పంపేశారట. ఇలాగే మరిణమ్మ మీదకూడా గాజుల కధవుంది.ఆమె గాజులు వేయించుకుని వెళ్ళిపోతే మల్లయ్య నాడబ్బులో నాడబ్బులో అని కేకలు పెడుతుంటే అతన్ని అక్కడ రాయిని చేసిందట. దానిని గాజులమలారం రాయి అంటారు.

ఇక కొంకుదురు గంగాలమ్మ అక్కడి చెరుఫులో దొరికితే గట్టునబెట్టి గుడి కట్టించారు. పంటలు ఎక్కువ పండాలని, గ్రామంలో మసూచి, కలరాలవంటి వ్యాధులు రాకుండా కాపాడాలని యీ అమ్మవరికి కోళ్ళూ, మేకలూ కోసి ఏటేటా జాతర చేసి తీర్ధంచేస్తారు. ఆపదల్లో ఆమెకు మొక్కుకుంటారు. ఊళ్ళో ఎవరు పెళ్ళిచేసుకున్నా తప్పనిసరిగా ముందు యీఅమ్మవారికి చలివిడి పానకాలు పోస్తారు. ఈ అమ్మవార్ల తీర్ధాలకు గారెలు, బూరెలు వగైరా పిండివంటలుచేసి అమ్మవారికి నైవేధ్యాలు పెడతారు. పొరుగూరి బందువులను కూడా పిలుచుకుని పండుగలా జరుపుకుంటారు. ఈ అమ్మవార్ల ప్రతిరూపాలు గరగలు, జాతరలో అసాదులు (పూజారులు) మావాళ్ళు పరికిణీ వేసుకొని, ఒక పంచిపైటచెంగులా వేసుకొని (అమ్మవారు స్త్రీ గదా, అందుకని స్త్రీ వేషాలు) గరగలు నెత్తిమీద పెట్టుకుఇ డప్పుల మోతకు అనుగుణంగా ఎగురుతూ (ఈ మధ్య దీనిని కూడా నాట్యం అనేస్తున్నారనుకోండి) చేతిలో వేపాకుతో ఆశీర్వదిస్తుంటారు. ఇంటింటా కాళ్ళమీద బిందెలతో నీళ్లుపోసి బియ్యం, పసుపు, కుంకుమ, ఫలహారం పళ్లెంలో పెట్టి యిచ్చి హారతియిస్తారు. తీర్దంనాడు రాత్రి గుడిదగ్గర మొక్కుకున్న వాళ్లు మేకలూ, కోళ్ళూ కోస్తారు. ఈ గంగాలమ్మకు కూడా ఒక గాధవుంది. ఈమె పడాలవారి ఆడబడుచు అనీ, మరణం సంభవించినా మమకారం చావక అక్కడ గ్రామదేవతగా వెలిసి ఆవూరిని కాపాడుతుంఅనీను, అందుకే జాతర సమయంలో యీనాటికీ కూడా ఆమెకు పడాలవారు మొదట చీర, రవికల గుడ్డ పెట్టి గరగెత్తితేగాని జాతర లేవదీయరు. మరోగ్రామదేవత నేరేళ్లమ్మ కధ మంచి ఆసక్తికరంగావుంటుంది. ఆమె ఆగ్రామంలో ఒక రైతు యింటపుట్టింది. బాలికగా ఉండగా తల్లి ఎంత తిండి పెట్టినా సాయంత్రం శ్రమపడి యింటికొచ్చిన తండ్రికి తల్లి కూడుపెట్టలేదని పిర్యారు చేసేదట. అన్నం కుండెడువార్చి పెట్టినా తినేసి పెట్టలేదని గోలపెట్టేదట. ఒకరోజు తండ్రి పరీక్షిద్దామని మిద్దెక్కి దాక్కుని తల్లి గుండెడు కూడు పెట్టడం చూసేడట. సాయంత్రం ఆపిల్ల మామూలుగాన్"ఏ తల్లి తిండిపెట్టలెదని ఫిర్యాదు చేసిందట. వెంటనే తండ్రి అది ఏదో పిశాచి అని పట్టరాని కోపంతో పలుపుతాడు తీసికొని కొట్టడానికి వస్తుంటే ఆ పిల్ల పారిపోవడం మొదలెట్టింది. వెంటబడి తరుముతుంటే కొంతదూరం వెళ్ళి మాయమయిపోయిందట. తరువాత ఆ గ్రామ దేవతగా వెలిసిందట.

ఓపిగ్గా సేకరిస్తే ప్రత్రిగ్రామదేవత వెనకా ఒక గాధ దొరుకుతుంది. కాలక్రమంలో యీ దేవతలకు ఆదరణ తగ్గుతోంది. ఈగ్రామదేవతలకు బదులు ఇప్పుడు ఊరూరా క్రొత్తగ్రామదేవతలు వెలిసారు. వారే ఊరిసొమ్మును ఊరికే మ్రింగేసే పెత్తందార్లు. రాజ్యాంగంప్రకారం వీళ్ళ జాతర అయిదేళ్ళకొకసార్.

జో స్యా లు

మనిషి జీవితం వ్రాసిన డైరీ అంటారు. ఆ డైరీలొ ఏమివుందో తెలుసుకోవాలనే కుతూహలం ప్రతివ్యక్తికి వుంటుంది. ఈ కోరికను సొమ్ము చేసుకుంటారు జ్యోతిష్కులు. జానపదులలో ఈ జోస్యాలపట్ల మక్కువ మరీ ఎక్కువ. ఈ జ్యోతిష్కులు అనేకరకాలు. ముఖ్యంగా అనాదినుంచీ మనకు కనిపించేవాళ్ళు కొండదొరలు, చిలకజోస్యులు, శివ చెప్పేవాళ్ళు, ఎరుకల సానులు, సోదె కత్తెలు, సాముద్రికులు, చక్రంవేసేవాళ్ళు, ఉపాసకులు, బాబాలు, దేవుడమ్మలు, సిద్దాంతులు వగైరా వగైరా వగైరా వీరు చెప్పేదానిలోని నిజానిజాల జోలికిపోకుండా గుడ్డిగా నమ్మి పరికిస్తే అద్భుతాలుగా కనిపిస్తాయి.

                            కొం డ దొ ర

"శ్రీరాముడు, కొండదేవర, పోలేరమ్మ, పైడితల్లి,, దారాలమ్మ, సుంకులమ్మ, కొండమారెమ్మ ఆజ్ఞ. అయ్యవారి ఆలోచన గొప్పది. మనసులో అనుకుంటున్న పని మూడు నెలల్లో అపోద్ది, తానంమంచిది. ముందుకెళ్ళాల్సిన లైనుంది, కొండదేవర ఆజ్ఞ" అని కొండ యాసతో మాటలు పట్టిపట్టి గుమ్మంలో కనిపించిన వాళ్ళను ఉద్దేశించి పలుకుతుంటారు కొండదొరలు. నుదుట కుంకంబొట్టు, ముక్కుమీద పసుపు, చెనికి రాగి రింగులు, తలపై సిగ, సిగపై పక్షిఈకలు, మణికట్టుకు రాగి మురుగు, మెడలో పులిగోరుత్రాడు, పూసలదండలూ, వీపుమీద అమ్ములపొది, పొదిలో బాణాలు, కర్రకు తగిలించిన మూట వెనక్కి వేలేసుకొని జ్యోతిష్యం చెపుతానంటూ అప్పుడప్పుడు వస్తుంటారు. వీళ్ళు నామక: చెయ్యి చూపమంటారే తప్ప చెప్పేదంతా ముఖం చూసే.

ఈ చెప్పేవాటిలో నివి చాలావరకు సామాన్యంగా అందరికీ వర్తించే పైపై నడికట్తు మాటలే. "ఆకర్షణ గొప్పది, కపటంలేని జల్మ, కడుపులొ ఆలోచన గల బుర్ర, లచ్చిమి కుదురు లేదు, అమ్మ 'ష్టారు ' గ్పొప్పది, నీనసీబు పెద్దది, కాని నరదృష్టి కొట్టేసి అంతా సున్నా అయిపోతుంది, ఈనరఘోష తొలగిపోయి పెద్దమెట్టులో కెళ్ళడనికి ఒక్క ముక్కచెబుతా" అని కాగితం ముక్క మీద కలంతో కొన్ని గీతలు గీసి అందులో పసుపూ కుంకుమా వేసి పొట్లం కట్టి మంత్రించి ఇస్తాడు. ఎదుటివాడి లొంగు బాటు చూసి ఏమీ ఇవ్వనక్కరలేదంటూనే తావీదు కట్టి, పాతచొక్కా, పాత పంచి ఐదు లోలల బియ్యం, అయిదు రూపాయలు ఇలా వారివశీకరణను బట్టి వసూలు చేస్తుంటారు. వీళ్లు చెప్పేదానిలో ఏదో ఒక మాట బలంగా హృదయానికి పట్టేసి చెప్పించుకొనేవాళ్లు ఆకర్హితులవుతుంటారు. అందులో ముఖ్యంగా పై మెట్టు కళతావనగానే పొంగిపోయి లొంగిపోతారు. తావీదు ఇచ్చేటప్పుడు కూడా ఒక తమాషాచేస్తారు. సంచిలోంచి అమ్మవారి ఫొటోతీసి తావీదు దానిమీదపెట్టి ఒక అడుగు దూరంలో దోసిలి పట్టి 'రా ' అనమంటారు. అలా "రా" అనగానే అది అగిరివచ్చి దొసిట్లో పడుతుంది. దాని వెనుక మంత్రమేఉందో, తంత్రమే ఉందో అర్ధం కాదు. వీళ్ళు అక్కినేని నాగేశ్వరరావు, ఎన్.టి.రామారావు, కృష్ణ, శోభన్ బాబు, జమున, జయసుధ, జయప్రద వంటి మేటి సినీనటులతోనూ, నెహ్రూ మొరార్జీ, ఇందిరాగాంధీ, సంజీవరెడ్ది, గిరి, జైల్ సింగ్ వంటి పెద్దపెద్ద రాజకీయ నాయకులతోనూ తీయించుకున్న ఫొటోలు చూపుతారు. దానితో మంకు వాళ్ళమీద మరింత గట్టి నమ్మకం కుదురుతుంది. వీళ్ళపేర్లు కత్తుల కృష్ణారెడ్ది, కృష్ణమరాజు, రామరాజు యిలాగ చివర రాజు, రెడ్డి పేర్లతోనే ఉంటాయి ఎక్కువగా, వచ్చి వెళ్ళేలోగా అల్లూరి శీతారామరాజు పేరు అరడజను సార్లయినా ఉచ్చరిస్తారు. వీరు చింతపల్లి, పీలేరు, భద్రాచలం మొదలైన కొండ ప్రాంతాలనుంచి వస్తుంటారు.

                    చిలక జోస్యం

ముఖాన రూపాయిబిళ్ళంత కుంకంబొట్టు, ముంజేతులకు మురుగులు నెత్తిమీద గొడుగు, కాలికి కడియం, చెవులకు పోగులు, చంకన చిలక పంజరం పెట్టుకొని వీధులవెంట జోస్యం చెబుతామంటూ తిరుగుతుంటారు కొంతమంది. ఆసక్తి కలవారు పిలిచి చెప్పమంటే పంజరం క్రిందపెట్టి, బిచాణా పరచి, దానిమీద పది పన్నెందు కవర్లు వరుసగా పేర్చి పావలా పుచ్చుకొని ప్రశ్న అడిగేవారిపేరు ఉచ్చరిస్తూ పంజరం తలుపు తీసి చిలుకను బయటకు పిలుస్తాడు. ఆ చిలుక వయ్యారంగా బయటకు వచ్చి ఓరగా యజమానిని చూస్తూ కవర్లలో ఒక్కక్కటే ముక్కుతో తీసి ప్రక్కన పెడుతూ ఎక్కడో ఒక కవరు దగ్గర ఆగి దాన్ని కరచిపెట్టి తెచ్చి అతనికి ఇస్తుంది. అ కవరులోని కార్డులపై వెంకటేశ్వరస్వామి, సత్యనారాయణమూర్తి, ఆంజనేయస్వామి, పార్వతీ పరమేశ్వరులు, సీతారామలక్ష్మణులు, దుర్గ వగైరా దేవతల బొమ్మలలో ఏదో ఒకటి ఉంటుంది. మరో కాగితం మీద "మీరు అనుకుంటున్న పని ఆరునెలల్లో నెరవేరుతుంది, వచ్చే అమావాస్య వెళ్ళినదగ్గరనుంచీ మీ జాతకం మారిపోతుంది. ఆకస్మిక ధనలాభం, ఎవరితోనూ శతృత్వం మంచిది కాదు" వంటి ఎవరికైనా వ్చర్తించేటటువంటి మూడు నాలుగు వాక్యాలు అచ్చుకాబడి వుంటాయి. అతడు అవి చదివి వృచ్చకుని కోరికకు అన్వయించి చెప్పి అందులోని బొమ్మలు అతనిపై ఎలా అనిగ్రహం చూపుతున్నాయో నప్పించి చెబుతాడు. ఈ చప్పడంలోని నేర్పే మనల్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతుంది. ఆపైన ఆ జ్యోతిష్కుని వ్యాఖ్యానపూరకమైన వాక్కు సమ్మోహితులను చేస్తుంది. ఈ చిలక జోస్యాలకు రాజమండ్రి జంతర్ మంతర్ రోడ్డు మంచి ప్రసిద్ది.(మునిచిపల్ ఆఫీసు ముందు రోడ్డు)

                           శి వం

పల్లెటూళ్ళలోనూ, పట్టణాలలోను, అక్కడక్కడ వీరభద్రుడు గడ్డెలని ఉంటాయి. చచ్చిపోయిన తమ బిడ్డ వీరభద్రుడయ్యాడని ఈ గద్దెలపై నిలుపుతుంటారుకొందరు. తల్లిదండ్రులు, ఇక్కడ వీరభద్రుడుగా ఒక పెద్ద విభూతిపండు, అతని భార్య భద్రకాళిగా ఒకలక్కబొమ్మ పెడతారు. ఇలా ఒక్కోగద్దిమీద 40, 50 దాకా వీరభద్రులుంటారు. వీనికి నిత్య పూజాదికాలు ఆ గద్దే నిలిపిన గణాచారి చేస్తుంటుంది.

ఇళ్ళల్లో అవరికైనా నలతగా ఉన్నా, దీర్ఘరోగాలు వదలకున్నా, కష్టాల్లో ఇరుక్కుపోయినా, చేతబడి అనుమానాలున్నా, అర్ధరూపాయి దిగదుడిచి ఆ మనిషి బంధువులెవరన్నా, (మేనత్త వరసవాళ్ళు) ఈ గణాచారి వద్దకు వెళ్ళి ఇచ్చి ఎదురుగా కూర్చొని సాంబ్రాణి పొగ వెయ్యగానే గణాచారి పెద్దగా నాలుగైదుసార్లు ఆవులించి, మూడు నాలుగుసార్లు త్రేన్చి తల విరబోసుకొని శివ చెప్పడం ప్రారంభిస్తుంది. గోవిందాగోవిందా అంటూ. శివంటే పూనకం, ఆ వచ్చినవాళ్ళ తాలూకు వీరభద్రుడుగానీ, వాళ్ళతాలూకు చచ్చిపోయిన పెద్దలుగానీ, వెంకటరమణమూర్తి గానీ, సత్యనారాయణస్వామిగానీ, ఆ గణాచారిని అవేశించి వీళ్ళ ప్రశ్నలకు జవాబులు చెబుతారు. ఈ శివంకి వెళ్ళీనవారిముందుప్రిచయంలోనే వారు వచ్చిన విషయం గ్రహించేసి శివంలో వాళ్లడక్కుండానే సమాధానాలు చెప్పేస్తుంది. అలా రానప్పుడు వెళ్ళినవాళ్ళే ఆ ఆవేశించిన శిక్తిని సూటిగానే ప్రశ్నించి సమాధానాలు రాబట్టుకుంటారు. ఎ శివంలొ చచ్చిపోయినవాళ్ళూ, దేవుళ్ళూవచ్చి మాట్లాడడం, వాళ్ళతో వెళ్ళినవాళ్ళు మాట్లాడడం చూస్తే బలే గమ్మత్తుగా ఉంటుంది. ఇందులో మాటమీద నమ్మకం కలుగజేసేది గణాచారి వాగ్ధాటి మాత్రమే. ఏదుకొండ్లవాడో, మరోదేవుడ్ఫ్ వంకర చేసారనేది వీళ్ళు సాధారణంగా చెప్పేది. వంకర అంటే వీళ్ళు ఎదో అపచారం చేయడంవల్ల్ అదేవుళ్ళు ఆగ్రహించి కీదు కలిగించడం, చివరన గణాచారి ఆ కీడు తొలగిపోవడానికి, రోగం నయంకావడానికి విభూతి మంత్రించి యిస్తుంది వాళ్లకి బొట్టుపెట్టమని. పల్లెల్లో యీ శివంమీద ప్రజలకు చాలా విశ్వాసం. ఈ గద్దెలకు తూర్పు గోదావరిలో కుతుకులూరు, కొంకుదురు, ప్రత్తిపాడు, రాయవరం ప్రసిద్ధి.

                         ఎ ఱు క

ఆది దేవుడు పరమేశ్వరుడు ఎరుకలసాని వేషం వేసుకొని పార్వతికి ఎ ఱుక చెప్పినట్టు, వెంకతేశ్వరస్వామి ఎఱుక వెషంతో వెళ్లి పద్మావతికి జ్యోస్యం చెప్పినట్లు పురాణగాధలున్నాయి. అంటే ఎఱుక అంతపురాతనమైనదన్న మాట.

పల్లెటూళ్లల్లో ‘ఎఱుకలు ‘ అని ఒక జాతి ఉంది. ప్రభుత్వం వీరిని షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చింది. వీరు పందులను మేపుతుంటారు. అంతేగాక మగవాళ్లు ఉండేలు బద్దలతోనూ, నాటుతుపాకీలతోనూ పిట్టలను కొట్టి అమ్ముతారు. ఆడవాళ్లు పురుళ్లు పోస్తారు మంత్రసానుల్లాగ. కొందరు ఎఱుక చెబుతారు.

తలపై కొప్పు, ముక్కున మక్కెర, నెత్తిన ఎఱుకల్బుట్ట, బుట్టలో పసుపు రాసిన చిన్న చేట ఇవీ ఆమె సామాగ్రి. ఇంటిలో ఎవరికైనా అనారోగ్యంగాఉన్నా, పిల్లలకు బాలగ్రహాలు పట్టుకున్నా ఈమను పిలిపించి ఆడవాళ్లందరూ చుట్టూచేరి మూడు దోసెళ్ల బియ్యం ఆమె చేటలో పోసి సోదె చెప్పమంటారు. ఆమె పెద్దాపురం మరిడమ్మ, కాండ్రకోట నూకాలమ్మె, బెజవాడ కనకదుర్గమ్మ వగైరా దేవతల పేర్లు తలచి సోదె చెప్పడం ప్రాతంబిస్తుంది. ఎందుకు పిలిప్ంచారో, అనారోగ్యం ఎవరికో వారి మాటల వల్ల ఆమె ముందే త్రెలుసుకుంటుంది దానికి చిలవలు పలవలుచేర్చి చిత్రమైన బాణీలో పూనకం చచ్చినట్లు ప్రతివాక్యం గడగడా చెప్పుకు పోతుంటే అందరూ నిశ్చేష్టులైవింటూ ప్రశ్నలువేస్తూ, చెప్పేతీరునుబట్టి ఆ సమాఎధానాలు నమ్మి ఆమె అదేశించినట్లు చేస్తారు. రోగనివారణకు సాధారణంగా కోడితోగాని పందితోగాని దిగదుడుపు పెట్టాలంటుంది. దిగదుడుపంటే మూడు తవ్వల బియ్యం అన్నం వడ్డించి బుట్టలో పెట్టి, ములగకూర, తెలగపిండి కలపి వండిన కూర దానిలో కలిపి, కొంచెం అన్నం పిసికి చిన్న ప్రమిదలా చేసి దానిలో నూనె పోసి ఆ దూది వత్తువేసి వెలిగించి, నల్లకోడిపట్ట పీకకోసి ఆ రక్తంతో రోగినుదుట బొట్టుపెట్టి, ఆకొడినె ఆ అన్నం బుట్టనీ రోగి తలచుట్టూ మూడుసార్లు త్రిప్పి ఆ బుట్ట ఊరవతల పారేయిస్తుంది. కొడిని ఎఱుక తీసుకుపోతుంది. రోగ తీవ్రతబు బట్టి ఆ తుడవ డప్పులతోకూడా పోయిస్తుంది. అంటే ఆ బుట్ట తీసుకువెళ్ళేటప్పుడు డప్పులు వాయిస్తూ తీసుకువెడతారన్నమాట. పందితో దిగదుడుపంటే పంది యొక్క పీక కాకుండా దాని కాలివేలి చివర రక్తం వచ్చేలాకొసి, ఆ రక్తం అన్నంలో కలుపుతుంది. ఆపంది ఆమెదే. దాన్నలా వినియోగించి నందుకు కొంతడబ్బు వసూలు చేస్తుంది. రోగం చినాదైతే రంగుదారాలతో వెరుముక్కకట్టి రెండురూపాయలు పుచ్చుకుంటుంది. ఈ వేరుముక్కలకీ,దిగదుడుపులకీ ఆ జబ్బులు తగ్గిపోతాయని చాలామంది నమ్మకం.

                             సో ది

"సోదోయమ్మ సోది, సోదడగరండమ్మా సోది" అని మిట్ట మధ్యాహ్నం వేళ చిన్న ఏక్ తార తంబుర నొకదాన్నిచేత్తో మీటుతూఆశ్రితిలోగొంతులకలిపి పాటలా మాటలు పలుకుతూ సోదికత్తలు వీధుల్లో తిరుగుతుంటారు. సోది చెప్పించుకునే ఆమె చేటలో మూడు సోలల బియ్యం పోసి ఎదురుగా కూర్చొని చెయ్యి చాపుతుంది. సోదికత్తె ఆమె చేయి స్పృశిస్తూ, ఆమెకు సంతానం, పిల్లలు, పెళ్ళిళ్ళు, ప్రయాణాలు, భార్యాభర్తల సంబందం, ఆర్ధిక పరిస్థితులు, వగైరా ఎన్నో విషయాలు ఎడతెగని వాగ్ధోరణితో చెప్పుకు పోతుంటుంది. మగవాళ్ళని పుంజనీ, ఆదవాళ్ళని పెట్టనీ, పుంజంటే గడ్డం, పెట్టంటే బొట్టు అని పలికే సంజ్ఞా పరిభాష వీళ్లదే; ఆమె ఆ చెప్పడంలోనే చెప్పించుకునేవాళ్లనుండి తనకు కావలసిన సమాచారం రాబట్టుకు చెబుతుందనేది ప్రతీతి. ఏమైనా వీళ్ళు కూడా ఆడవాళ్లని బాగా ఆకట్టుకొని బియ్యం శేర్లకొద్దీ దండుకు పోతుంటారు. ఇందులో ఎక్కువగా పనిచేసేది పరేంగిత జ్ఞానం.

                    జాతక చక్రాలు

ఈపదతి కాళిదాసు కాలం నుంచీ కనిపిస్తోంది. గుప్తరాజుల స్వర్ణకాలంలో వరాహమిహురుడు దీనిపై ఒక సిద్దాంతమే ప్రతిపాతించాడు. పుట్టినతేదీ, నక్షత్రం ఆధారంగా రాశి చక్రం వేసి లగ్నం కట్టి, గ్రహస్థానాలు నిర్ణయించి, ఆగ్రహాల ఆగ్రహానుగ్రహాల ననుసరించి ఏతేదీకి ఏది కలిసొస్తుందో, ఏసమయానికి ఏచెడు జరుగుతుందో, శుభాశుభాలు, ఉద్యోగాలూ, పెళ్ళిళ్ళూ ఒకటేమిటి సమస్తమూ చెబురారు. అవిజ్రగటం జరగపోవటం అటుంచితే యిది ఒకసిద్ధాంతం ప్రాతిపదికగా చెప్పబడే శాస్త్రం అని తెలుస్తోంది.

ఇది సంస్కృతం నుండీ తెలుగులోకి వచ్చింది. పుట్టిన సమయపు నక్షత్రాన్ని బట్టి చక్రంవేసి దశావశేషం కట్టి గ్రహచలనాన్ని రవి 6 సం. చంద్ర 10 సం. అంగారక 7 సం. బుధ 17 సం. గురు 12 సం. శుక్ర 20 సం. శని 19 సం. రాహువు 18 సం., కేతువు 7 సంవత్సరాలుగా మొత్తం పురుషాయు:ప్రమాణం 120 సంవత్సరాలు లెక్కించి ఈ దశల్లో మరల అంతర్దశలు విభజించి వాని ప్రభావాల ఫలితాలు చెబుతారు. ఇది శాస్త్రీయమని అన్నా చెప్పినవన్నీ జరుగుతున్నాయా అనేది సందేహస్పదమే. వివాహాలకు లగ్నాలూ, శుభకార్యాలకు ముహూర్తాలు దీన్ని ఆధారం చేసుకొనే పెడు;తుంటారు. చెప్పింది జరగకపోతే అది పార్వతీదేవి శాపమంటారు.

                            సా ము ద్రి కం

జీవితరేఖ, హృదయరేఖ, శిరోరేఖ, అదృష్టరేంఅ, విద్యారేఖ, కుజరేఖ, వివాహరేఖ, గురు, శని, రవి, బుధ, చంద్ర, శుక్ర, కుజ స్థానములు, బొటనవ్రేలు, అరిచేతిరంగు వగైరా అధారంగా హస్తసాంద్రికం చెబుతారు.

ఎలక్ట్రానిక్, ఆటమిక్ శక్తులతో పురోగమిస్తున్న అమెరికావంటి పాశ్చాత్య దేశాలలో కూడా దీనికి గొప్ప గిరాకీవుంది. ఇంగ్లీషులో షీరో, బెన్హం అనే పండితులు పామిస్ట్రీ గ్రంధాలు వ్రాశారు. తెలుగులో వీని కనువాదాలేగాక సూర్యసాముద్రికం వంటి స్వతంత్ర గ్రంధాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఇంగ్లీషు పద్దతికీ, తెలుగు పద్దతికీ ముఖ్యమైన తేడాలు వాళ్ళ హృదయరేఖ అనే దాన్ని మన వాళ్ళు జీవితరేఖ అంటారు. ఇంగ్లీషువాళ్ళ శాస్త్రం అరచేతికి పరిమితం. మనగాళ్ళు శాస్త్రం వ్రేళ్ళకు కూడా విస్తరించారు. (వ్రేళ్ళ కణుపులను సాసులుగా నిర్దేశించడం, వ్రేళ్ళపైభాగాలలొ శంకుచక్రాలు గుర్తించడం). ఇరువురికీ రేఖలూ, గ్రహస్థానాలూ, అధారాలు, మగవారికి కుడిచెయ్యి, ఆడవారికి ఎడమచెయ్యి చూస్తారు. చదువు, వివాహం, సంతానం, విదేశయానం, గండాలు, లాటరీలు, ఎగుడు దిగుళ్ళ వగైరా విషయాలు భవిష్యత్తులో ఏఏసందర్బాలలో ఏమేం జరుగుతాయి చెబుతుంటే చెప్పించుకొనేవాళ్ళూ మంత్రముగ్దులై వింటుంటారు. వాళ్ళు చెప్పిన ప్రకారం రాబోయే అదృష్టాన్ని తలుచుకుంటూ మురిసిపోతూ రూపాయి చెల్లించేసి రాజాలా పోతుంటారు. రాజమండ్రి జంతర్ మంతర్ రోడ్దులో ఇంగ్లీషు తెలుగుల్లో ప్రవాహంలాంటి సాంకేతిక పదోచ్చారణతొ సైకిలు ప్రక్క నిలబడి చెప్పే యీసాముద్రికుల చుట్టూ ఎప్పుడూ జనమే. ఉపాసకులు

వీరిలో దేవీ ఉపాసకులు, హనుమదుపాసకులు, క్షుద్రదేవతారాధకులు అనేక రకాలు; దేవి ఉపాసకులు కాళికాదేవినిగాని, లలితాదేవినిగాని, దుర్గనుగాని ఉపాసిస్తారు. హనుమదుపాసకులు వీరాంజజేయం పూజ చేస్తారు. క్షుద్ర దేవతారాధకులు భేతాళును, ఎర్రమాచికమ్మ, కర్ణపిశాచి వంటి క్షుద్రదెవతలను మధ్యం, మాంసం, రక్తం నివేదన చేసి ఆరాధిస్తారు. కొందరు అర్ధరాత్రి స్మశానాలలో కపాలాలమధ్యా పూడ్చిపెట్టిన శవాలమీదా కూర్చుని జపాలు చేస్తారు. ఈ క్షుద్రదేవతలు అలాకోడినో, కుక్కనో కోసి అరాధించినంతకాలం వాళ్ళ ప్రభ ఫెళ్ళున పేలించేస్తాయట. నివేద్న ఏరోజున చెయ్యకపోతే ఆరోజున వాళ్ళనే తినేస్తాయట అన్నాడు మాతాత ఒకసారి. ఇది విన్న మాఅన్న "అయితే రాజకీయ నాయకులు కూడా క్షుద్రదేవతలే" అన్నాడు. కారణం, వాళ్ళు కూడా వాళ్ళ భజనచేస్తూ తిరిగినంతకాలం పైకెత్తాస్తారట. ఎప్పుడు మానెస్తే అప్పుడు తొక్కేస్తారట.

ఇంతకీ వెరంతా ఉపాసనబలంతో జోస్యం చెబుతారు. ఇందులో వాక్సుద్ది ముఖ్యం. వీరు మనిషిని చూసి అతని గతం, భవిష్యత్తు కళ్లకుకట్టినట్టు చెబుతుంటారు. చెప్పేవాటిలో ఒకటి రెండు గట్టిగా హత్తుకుంటాయి. దానితో చెప్పించుకొనేవాడు దాసోహమనేస్తాడు. వీరిది ప్రధానంగా 'ఇన్టూషన్ ' అంటారు. ఇళ్ళలో చిన్నా పెద్దా గొంగతనాలు జరిగినప్పుడు గొంగవలెవరో తెలుసుకోవడానికి పోలీసుష్టేషను కంటే ముందు వీళ్ళ దగ్గరకె పరుగుపెడుతుంటారు చాలామంది. కొంతమంది ఎదుటవారి జేబులో డబ్బులెన్నో కూడా లెక్కచెప్పేస్తారు. (దీనికి బిక్కవోలు ఆకుల సత్యనారాయణ మంచి ప్రసిద్ధి పొందేడు) ఈమధ్య పట్టణాలలో లాడ్జింగుల్లోకూడా వీళ్ళు మకాం పెట్టి జోస్యాలు చెబుతుంన్నారు. వీళ్ళు చెప్పే రాజకీయ జోస్యాలు పత్రికల్లోకూడా ప్రముఖంగానె వస్తున్నాయి. పెద్దపెద్ద దేశనాయకులే వీళ్ల వెంటబడుతున్నారు.

ఒకసారి ఓ కాళీ ఉపాసకుడు ఒకరిని మీ ఇంట్లో ఈశాన్యణ్భాగంలో మూడునిలువుల లోతులో లంకెంబిందెలున్నాయి జపహోమాలకు వెయ్యి రూపాయలు తెస్తే తీసిస్తానన్నాడట. ఇతను వెంటనే ఆ వెయ్యీ మీరే పెట్టేసుకుని ఆబిందెలు మీరే తీసుకు పట్టుకుపోడన్నాడట. అంతే ఆయన ఉక ఆ ప్రస్థావనతెస్తే ఒట్టు.

సాధారణంగా కష్టాల్లో ఉన్నవాళ్లూ జీవితంలో నిరాశా, నిస్ప్రహలకు లోనైన వాళ్లే యీ జోస్యాలకు వెళుతుంటారు. ఈ జోస్యులు వాళ్లకి భవిషత్తులో బంగారు జీవితాన్ని చూపి వాళ్లలో నూతనోత్తాజాన్నీ, ఉత్సాహాన్నీ కలుగజేస్తున్నారు. ఇంతవరకూ వీళ్లు చేస్తున్నది మేలేకాని యీ పేరుమీద కొందరు అమాయకుల్ని దోపిడీ చేస్తుండడం మాత్రం రాదుణం.

ఇమ బాబాలు, దేవుడమ్మలు, సిద్ధాంతులు కూడా ఉపాసకులేకాని కొంచెం కాలజ్ఞానులుకూడా; భక్తి ప్రబోధం వీళ్ల పరమార్ధం. పోతులూరి వీరబ్రహ్మంగారి దగ్గర నుంచీ మనకు యీ బాపతు కనిపిస్తున్నారు. వేళ్లల్లోనేడు ముఖ్యంగా సత్యశాయిబాబా, బోనుమద్ది రమలింగ సిద్దాంతి వంటివరలు తమ బక్తులనుండి విరాళాలు రాబట్టి ధర్మకర్యాలకు వినియోగిస్తూ ప్రజాసేవకు పూనుకొవడం శుభపరిణామం.

======

సాగరతీర జానపదులు

గోదావరి సీమలో సముద్రతీరాన్ని ఆనుకొని యున్న ఉప్పాడ, చొల్లంగి, కోరంగి మొదలగు తీరంవెంబడి ఉన్న అన్ని పల్లెలలోనూ కనిపించే గంగపుత్రులే యీ సాగరతీర జానపదులు. వీరి ఆచార వ్యవహారాలు, సాంఘిక జీవనం ఇతర జానపుదులకంటే కొంచెం భిన్నంగా కనిపిస్తాయి.

అనాది కాలంలో భారతంలో శంతన మహరాజు మత్స్యగందిని చూసి మోహించి వివాహం చేసుకున్న సంగతి మొదటగా ంత్స్యకారుల ఉనికిని మనకు ప్రత్యక్షం చేస్తుంది. అంటే అంత ప్రాచీనత, ప్రాచుర్యము కలిగిన జాతి ఇది. వీరిలో జాలరులని, అగ్నికులక్షత్రియులని, బెస్తలనె, బల్జీలని, పల్లెవారని అనేక తెగలున్నాయి. అయితే ఈ తెగ అన్నిటికీ వృత్తి ఒకటే. వీటిలో చేపలవేట, వీరి ఆచారవ్యవహారాలు కూడా ఇంచుమించు ఒకటే. పురుషులు సముద్రంలో చేపలు పట్టి తెస్తే స్త్రీలు వాటిని తట్టలో పట్టుకెళ్ళి మార్కెట్ లో అమ్ముతారు. వీరి చేపలవేట ఏటిమీదైతే మోచేత్తో వలలు విసురుతారు. సముద్రంలోనైతే ఒడ్దువలలు(పెద్దవలలు) వేస్తారు. వీరు చేపల్ని పట్టి తేవడం 'పోటు ' అంటారు. ఈ పోటు సముద్రం ఆటుపోటుల్ని బట్టి ఉంటుంది. 'ఆటు ' అంటే సముద్రం గట్టుకు పొడుస్తుందన్నమాట. ఆటులోనే చేపలు పుష్కలంగా దొరికేది. అందువల్ల ఆటులోనే వలలు వేసుకుని నావలలో సముద్రంలో కెళతారు. అయిదారుగురు జట్టుగా, వలవిసిరేముందు "తాతలనాడు తల్లి, కాలంనాడు కర్త, పెద్దలనాడు పెట్టె, పన్నెండు యోజనాల పాతాళపుట్ట, ఏడుయోజనాల ఇలగోలపుట్ట, పాములాడిచేతి పారిజాతమ్మ, ఉత్తమాజలగంధీ ముద్దుకోడలా, కదలిరావమ్మా- మేము వేసిన వల మాజాతికి- జాలారి కులంలో వన్నెకెక్కిన వాడకులంలో అందరికంటే ఎక్కువైన చేపలు నా వలలో పడాలి" అని మొక్కుకుని వల విసురుతారు.

వీరి జీవితాలు సముద్రంలో నిత్యప్రమాద సంభరితాలు. తుఫాను తాకిళ్ళకి, సముద్రపు పోతళ్లకీ ఒక్కోసారి అతీగతీకూడా లేకుండా పోతుంటారు. అందుకే సముద్రం మీదకెళ్ళేటప్పుడు వారి భార్యలు, పిల్లలు సముద్రపు ఒడ్డుకువచ్చి వారికి బరువెక్కిన గుండెలతొ వీడ్కోలు చెప్పి,వెలుతున్న నావ కనిపిస్తున్నంత వరకూ ఆ గట్టున అలా నిలబడి చూస్తూనే ఉంటారు కన్నీరు కళ్లలో గ్రుక్కుకుంటూ. అవును తిరిగి రాకకు గ్యారంటీలేని పయనం అది.అందుకే మనసుల్ని దిటవు చేసుకోవడం కోసం వీరు క్షుద్రదేవతల్ని మూఢంగానూ, గాఢంగానూ కొలుస్తూ తమ భర్తలకి మేలు చేయమని కోరుకుంటారు. ఇంటింటా, పైడితల్లో, యల్లమ్మో, సత్తెమ్మో, నూకాలమ్మో, కొర్లదేవరో ఎవరో ఒక దేవతను నిలిపి పూజిస్తారు. ఇవి వారి ఇలవేలుపులు. ఇక పేటంతటికీ మరొక దేవతను ప్రతిష్టిస్తారు. ఆమె కులవేలుపు. ప్రతి సంవత్సరం సముద్రపు ఒడ్డుకి వెళ్ళి సామూహికంగా గంగపూజచేస్తారు. ఆతల్లేగదా వరికి రక్ష (వారిని భక్షించినా రక్షించినా).

వారి పాటులో ఇన్నోవంతు అని అమ్మవారికి వాటా పెడతారు. సంవత్సరమంతా ఆలాతీసి ఆ డబ్బుతో ఉగాదికి అమ్మవారి జాతర చేస్తారు. వారు ఇలవేల్పులను నిలిపే విధం బహు చోద్యంగా ఉంటుంది. మొందురోజు ఒక పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్ట శుభ్రంచేసి ఉపాసన చెప్పి వస్తారు. మరుసటి రోజు 5 డప్పులు, 12 మంది పోతురాజులు (ఆటగాళ్ళు), 5 గురు నంబులతో ఊరేగింపుగా వెళ్ళి (వీళ్ళంతా వాళ్ళ కులంవాళ్ళే) ఆ పుట్టమట్టి తీసి జంగిడిలో వేసి ఆ ఇంటామె నెత్తిమీద పెట్టి ఊరేగింపుగా తీసుకొచ్చి ఇంటిలో ప్రతిష్టారు. ఈ అమ్మవార్ల పూనకాలు బలే చిత్రంగా ఉంటాయి. వీరిలో ఒకదాసుడుంటాడు. అతను ఆ ఇంటివారిలోఒకరిమీదకు అమ్మవారిని ఆవేశింపజేస్తాడు. ఆ ఆవేశం పొందిన ఆమె వారు చేయవలసిన కర్తవ్యాన్ని తెలుపుతుంది. ఆమె చెప్పేది వారు వాస్తవంగా నమ్ముతారు. ఇలా ఎక్కువగా నమ్మకాలమీద సాగిపోతుంది వీరిజీవనయానం. ఏదైనా జబ్బు చేస్తే వీరు డాక్టరు దగ్గరకు బదులుగా దాసుడు దగ్గరికి పదుగెడుతారు అమ్మవారి అభిప్రాయం తెలుసుకోవడానికి. వీరు అమాయకత్వం నిండుగా తొణకిసలాడే మాయామర్మమెరుగని సంతృప్త జీవులు. పాటున్న రోజున పొట్టనిండా తిని, లేని రోజున కడుపులో కాళ్ళు పెట్టుకుని పడుకోడమే తప్ప దొంగతనాలు, దేవురించడాలుచూడం.

వీళ్లలో కొందరు దశావతారాలు, అమ్మవార్ల కధలు చెబుతారు గరిడీలు వాయిస్తూ కోలలు తిప్పుతూ, వీరి గరిడీలనేవి పెద్ద ఇత్తడి తాళం చిప్పలు. ఈ కధలు పాట రూపంలో ఉంటాయి. ఈ చెఫ్ఫేవాళ్లు దశా పదకోండవతారలూ విష్ణుమూర్తి ఎందుకెత్తేడంటే అని ప్రారంభిస్తుంటే పంచపాండవులు మంచంకోళ్లలా నలుగురు అనే జోక్ గుర్తుకొస్తుంది. యల్లమ్మ కధ చాలా చక్కగా చెబుతారు. పూర్వం ఏడుగురు అంతకాసురులు, ఏడుగురు తారకాసురులు ఒకరిపై ఒకరు యుద్ధం చేసుకుంటున్నారట అంతకాసురులు బహుక్రూరులు. వారి భార్యలు మహా పతివ్రతలు. వీరి పాతివ్రత్య్ మహిమవల్ల అంతకాసురులు ఓటమి లేకుండా పోరాడుతున్నాడు. తారకాసురులు అన్యాయంగా మరిణిస్తున్నారు. అందుకని విష్ణుమూర్తి మారురూపంలో వచ్చి అంతకసురులు యుద్ధంలో మరణించారని, ఆ దగ్గరున్న మర్రిచెట్టును చూపి వారి భార్యలు దానిని కౌగిలించుకున్నారట. ఆ చెట్టులో విష్ణుమూర్తి ప్రవేశించి వారిని రమించేడట/ వారి ఏడుగడియల్లో గర్భందాల్చి ఏడుగురు శిశువుల్ని ప్రసవించారట. అయితే ఆ పిల్లల్ని చూసి భర్తలు సందేహిస్తారని వారు ఆ పిల్లల్ని అక్కడే వదలి వెళ్ళిపోయేరట. ఆబాలలు కేర్ కేర్ మని ఏదుస్తుంటే పార్వతీ పరమేశ్వరులు భూమి పరిపాలించడానికి వచ్చి వాళ్ళని చూసేడట. పార్వతి వారిని లాలించి పెంచిందట. వారే నూకాలమ్మ, పరదేశమ్మ, పైడమ్మ వగైరా దేవవలు. వారిలో ఆఖరిపిల్ల యల్లమ్మ అని చెప్పి ఆమె మహిమలు, తన్ను తను నమ్మి మొక్కుకున్న వాళ్ళకు ఎలా అనుగ్రహించేదీ చెబుతుంటే ఆ కధ విని ప్రతివారూ అక్కడికక్కడే మొక్కులు మొక్కేసుకుంటుంటారు.

ఇక పెళ్లిళ్ల దగ్గరకొస్తే వీరు మంగళ సూత్రాలకు బడులు పసుపుతాడు కడతారు. ఆపేటవారికి పెళ్ళికి ముందు భోజనాలు పెడతారు. దీనిని వారు 'ధూళిఆమెత ' అంటారు. ఊరేగింపుకు వాడేది పల్లమీ కాదు అశ్వం. పెళ్లికొడుకునీ, పెళ్లికూతుర్నీ గుర్రంమీద ఎక్కించి సాయంత్రం 4 గంటలనుండి వీధుల్లో ఊరేగిస్తారు.

వీరికి కులపెద్ద ఉంటాడు - అతని ఆజ్ఞ సుగ్రీవాజ్ఞ. కులపెద్ద అనేది ఎన్నిక ద్వారాకాదు, వంశపారంపర్యంగా వస్తుంది. వ్యభిఅరంలో స్త్రీ, పురుషులలో ఎవరు పట్టుబడ్డా కులపెద్ద తప్పువేస్తాడు. ఆ డబ్బుతో సారా తాగేసి ఖుషీ చేసుకుంటారు. తమ వలలు తామే అల్లుకుంటూ, వచ్చిన కొద్ది ఆదాయం కల్లు, సారాలకు పోసేసి నిర్భాగ్యులుగా సాగరతీరాలపూరిగుడిసెల్లో జీవనం సాగించే ఈ సాహసవీరుల జీవనగతిలో కొత్తజ్యోతులు వెలిగించాల్సిన అవసరం ఎంతైనా వుంది. అప్పుడే దేశం నిజంగా పురోగమించినట్టు.


                            *****                            గిరిజన జానపదులు

గిరిజన జానపదుల తీరుతెన్నులు వేరు. గోదావరిసీమ గిరిజనులలో వాల్మీకులు, కొండరెడ్లు. లంబాడీలు, కోయలు ఎక్కవ. వాల్మీకులు హరిజన కుటుంబాలవారు. ఈ అడవి పల్లెలకు 'ముఠాలని ' పేరు. ఈ ముఠాలకు అధిపతులను ముఠాదారులంటారు. వీటికి ముఠా గుమాస్తాలు కూడా ఉండేవారు. వీరు మన మునసబు కరణాలవంటివారు. ముఠాదారుని మాట ముఠావాసులకు సుగ్రీవాజ్ఞ. ఎవరైనా అధికారులు వెళితే ఆ ముఠాదారునే కలవాలి. అతనికి కావలసిన సదుపాయాలు చేసి, మరో ముఠాకి వెళ్ళవలసి ఉంటే భద్రత కోసం మనుషులను ఇచ్చి అవతలి ముఠాదారు దగ్గరకు పంపేవారు. అడవిలో కాలిదార్లు తప్పిస్తే బండిదారులు కూడా కనబడవు. దట్టమైన అడవి, భయంకర జంతువుల అరుపులు - వీనిమధ్య ఒంటరి ప్రయాణం - బితుకుబితుకు మంటుంటుంది. అందువల్ల ముఠారార్లు మనుషులను తోడిచ్చి పంపుతుండేవారు. ఈ మనుషులు మన సామానులు కూడా భుజాన వేసుకొని మోసుకు వస్తారు ఉచితంగానే. ఇక్కడ వారి నిజాయితీకి దేశం గర్వపడాలి. ఆ ఆడవి మధ్యలో నాలుగుతన్ని మనలను దోచుకుంటే అక్కడ దిక్కూ మొక్కూ ఉండదు. కాని వారికి ఆతలంపే ఉండదు. విల్లు, బాణాలు దరించి దారిలో ఏజంతువునించైనా ప్రమాదం కనిపిస్తే వాటిని చీల్చి చెండాడి మార్గం సుకరం చేస్తారు.

                       వాల్మీకులు  - కొండరెడ్లు

తూర్పుగోదావరిలో రంపచోడవరం దగ్గరనుండి కుట్రవాడ, సాములేరు వరకు ఆదిపత్యం (కొండరెడ్లు). సాములేరుఆవల చెట్లవాడ నుండి వాల్మీకుల ఆదిపత్యం. సాములేటికి ఈవల ముఠాదార్లు రెడ్లు. వాల్మీకులు నౌకర్లు. ఇక్కడ వాల్మీకులు రెడ్డిగారు, రెడ్డిగారు అని రెడ్లను కొలుస్తారు. సాములేరు ఆవల వాల్మీకులుది అగ్రకులం. ఇక్కడ వాల్మీకులు ముఠాదార్లు. రెడ్లు వారి నౌకర్లు. ఇక్కడ వాల్మీకులు 'ఒరే రెడ్డీ ' అని పిలుస్తారు. ఏటికి ఇవతల, అవతల ఫర్లాంగుదూరం తేడాలో ఈ భేదం బలే ఆశ్ఫర్యంగా ఉంటుంది. వీళ్ళ ఆహారం పిట్టమాంసం, జీలుగుకల్లు. పిల్లా, పాపలతో అందరూ ఉదయం జీలుఇగుచెట్ల దగ్గరకు పోయి ఆ చెట్ల కల్లు తీసి త్రాగి, కొట్టుకు తెచ్చిన పిట్టమాంసం కాల్చుకు తిని ఆమత్తులో సాయత్రం వరకూ అక్కడే నిద్రపోతారు. సాయత్రం ఇళ్ళకు వస్తారు. ఇల్లు అనేది కఱ్ఱముక్కలతోను, ఆకులతోను వేసుకున్న అల్పమైన చిన్న గుడిశ. సాయంత్రం కాగానే చలి విపరీతం. 'లగిడి ' వేసుకుకొని దానిచుట్టూ పడుకుంటారు. 'లగిడి ' అంటే ఒక లావుపటి దుంగకు నిప్పు ముట్టించి అది కాలుతుంటేఆ మంటచుట్టూ పడుకుంటారు. వీళ్ళు ఆవులను, గుఱ్ఱాలను, మేకలను పెంచుతారు. వీరి ఆతిధ్యం మేకపాలు, కారుకోడి మాంసం, కారుకోళ్ళు, నెమళ్ళు ఆ ఇళ్ళచుట్టూ చెట్లమీద తిరుగుతునే ఉంటాయి. ఆశ్చర్యం! పులులు. సివంగులు వంటి క్రూరజంతువులు కూడా ఆ ప్రాంతాలలొ తిరుగుతూనే ఉంటాయి. కాని వారి ఇళ్ళలోకి రావు. దానికి వాళ్ళు ఏదో మంత్రం వేస్తారంటారు. వీరు దారాలమ్మ, పోలేరమ్మవంటి వనదేవతల జాతరులు దివిటీల వెలుగులో ఎంతో కోలాహలంగ్తా చేస్తారు. కౌజు, అడవిదున్నలవంటిపెద్ద జంతువులను బలీచ్చి తిని, తాగి వేడుక చేసుకుంటారు. వీళ్ళ మంత్రశక్తి అపూర్వం. ఎవరికైనా మండ్రగప్ప కుడితే వీరిలో మంత్రగాడు ఆ కుట్టిన ప్రదేశంలో నొక్కి మంత్రం చదువుతాడు. వెంటనే తగ్గిపోతుంది. ఆ మంత్రగాడు చేతిలో ఆకు;పసరు ఉంటుందని ఆ పసరువల్లే అది తగ్గుతుందని కొందరంటారు. పాము కరిచినా కూడా అలాగే తగ్గించుకుంటారు. అక్కడ వారికి ఆధునిక వైద్య సౌకర్యాలు ఏవి? వారి రోగాలకు అక్కడి పసర్లతోనేవైద్యం చేసుకొని రోగ నిర్మూలన చెసుకుంటార్. ఈ వనరుల వైద్యం వీరిలోచాలామందికి తెలుసు.

వీరు చాలా అమాయకులు. అరసోలెడు ఉప్పుకోసం అరవైమైళ్ళ దూరం నడిచి వచ్చి (పుల్లగినుంచి మారేడుమిల్లిసంతకు) అడవిలో తాము సేకరించిన మడపాకులు, సీకాయ,కుంకుడులు, చీపుర్లు తెచ్చి ఇచ్చి ఉప్పు, పాతబట్టలు, కరకజ్జం, జీళ్ళు కొనుక్కుని తింటూపోతారు. వీరిది డబ్బులతో బేరం కాదు - వస్తు;వులతో బేరం(బార్టరు సిస్టం). ఇందులో పాపంవీర్ పూర్తిగా దోచుకోబడతారు.

వీరు వస్త్రధారణ నామమాత్రం. స్త్రీలు ఒకటిన్నర గుడ్డను మానం కాపాడుకోవడానికి మొలకు చుట్టుకొని, స్థనాలు కనబడకుండా మరోగుడ్డపీలిక పైటలాగ వేసుకుంటారు. ఆడ్డబాస ప్రతీ స్త్రీకి ఉంటుంది. మగవాళ్ళు చిన్న గుడ్డ 'గోచీలాగ పెట్టుకుంటారు. కొందరు సంతలో కొనితెచ్చుకొన్న పాతచొక్కాలు తొడుక్కుంటారు. తలలు కొబ్బరినూనె సంస్కారము ఎరగవు. వారి మంచితనం, అమాయకత, సంతృప్తి చూస్తే వీళ్ళే నిజమైన మానవులనిపిస్తుంది.

                         లంబాడీలు

ఈ గిరిజన జానపదులలోలంబాడీ తెగ ఒకటి. పశ్చిమగోదావరి జిల్లాలోజంగారెడ్దిగూడెం బుట్టాయిగూడెంలలో వీరి తండాలున్నాయి. వీరి జనపదాలను 'తండా ' లంటారు. తాడేపల్లిగూడెం సంతలో ప్రతి ఆదివారం కనిపిస్తూంటారు. వీరి ఆబరణాలు, ఆచార వ్యవహారాలు బహు చోద్యంగా ఉంటాయి.

అద్దాలు పొదిగిన రంగు రంగుల పరికిణీలు, వీపులేని దళసరి జాకెట్లు, చేతినిండా దంతపు గాజులు, తలనుండి ముందుకు వేళ్ళడే ఇత్తడి బుకాలు, వనక్కి వేలాడే రుతకదుప్పటిముసుగుధరించే యీ స్త్రీలనుచూస్తుంటే నాగరికత వీళ్ళకి ఎన్ని ఆమడలదూరంలోఉందో అనిపిస్తుంది. బహుళ ప్రాచుర్యంపొందిన "లంబాడోళ్ళరామదాసు" పాట వింటుంటే ఆజాతి అమాయకత, ఆర్ద్రత, నిస్సహాయత హృదయాన్నిద్రవింపజేసుంది.

ఇంతకీ మీరెవరమ్మ అని తొంబది ఏండ్ల ముదుసలి అయిన లంబాడీస్త్రీ బాణావతు దుర్గమ్మను ప్రశ్నించగా ఆమె చెప్పిన సమాధానం చాలా ఆసక్తికరంగావుంది. ఆదిలో మర్వాడీలూ తామూ ఒకేతండ్రి బిడ్డలమనీ, ఆ తండ్రి మొదటి భార్య సంతతి లంబాడీలనీ, రెండవభార్య బిడ్డలు మార్వాడీలని చెప్పింది. అయితే మర్వాడీలకామహర్దశ ఏమిటి మీకు యీ దుర్గతి ఏమిటి అని ప్రశ్నిస్తే చెప్పినకధ యిది-- ఆ తండ్రి ఆస్తి పంపకాలప్పుడు బంగారమంతా పెంటకుప్పల్లోనూ, పేడకుప్పల్లోనూ దాచి వానిని ఒక వాటాగాను, గొడ్డు గోద వగైరా పశుసంతరి ఒక వాటాగాను పెట్టి కావలసిన వాటాతీసుకోమంటే మర్మమెరుగని వీళ్ళు పెంటకుప్పలు, పేడకుప్పలు తమకు వద్దని పశువుల్ని తీసుకున్నారట. నాటినుంచీ వీరు అడవి ప్రాంతాలలో పశువుల్నిమేకల్నీ మేపుకుంటూ అడవి భూముల్లో జొన్న, సజ్జవగైరాలు పండిస్తూ వానిని తీసుకొచ్చి పరిసర గ్రామాల్లో అమ్ముకుంటూ చాలీ చాలని ఆదాయంతో పిల్లా జెల్లా పోషించుకుంటూ జీవనయాత్ర సాగిస్తున్నారు. వీరు కొండప్రాంతాలలో అక్కడక్కడ గుంపులు గుంపులుగా ఉంటుంటారు. ఈ గుంఫులనే తండాలంటారు.

వీరి ఆచారాలు చాలా విచిత్రంగా ఉంటాయి. వీళ్ళలో భర్త చచ్చిపొతే మరిదిని పెళ్ళిచేసుకుంటారట. ఈ సంప్రదాయమెక్కడిదని అడిగితే తమది వాలి సుగ్రీవ వండ్శమని చెప్పింది. (అవును, వాలి చనిపోతే తార మరిది సుగ్రీవుణ్ణిపెళ్ళి చేసుకుందిగా!) ఆంజనేయుడు వీరికి మేనల్లుడట, వీళ్ళ రధ్యదైవాల్లో ఆంజనేయుడిది పెద్ద పీట. వీళ్ళల్లోకులాలు లేవు- గోత్రాలు మాత్రం కోకొల్లలు-బాణావత్తు, భూక్కా, ధరావత్తు, భరోతు, వాంకుడోతు, పాల్తియా, జర్సలా, అంగోతు, కొత్త కేడతు యిలాగ ఎన్నో గోత్రాలున్నాయట. కాని సగోత్రీకుణ్ణీ పెళ్ళీచేసుకొకూడదనేది వీళ్ళ కఠోర నియమం. ఇలాగ స్వకులస్తుల్నిపెళ్ళిచేసుకొకూడదని మనగాళ్ళుకూడా ఒక శాసనం పెట్టిస్తే దేశానికి కులాల బెడదే లేకుండా పోను.

వీళ్ళ పెళ్ళిళ్ళలో మరో విచిత్రం పెళ్ళి రోజంతా వీళ్లు ఏడుస్తారు. కారణం, తమ అమ్మాయి ఆ రోజు తమనువీడి అత్తవరింటికి వెళ్ళిపోతుందన్మట. దానికి అంతగా ఏదవాలా అంటే వీరిలో అత్తవారింటికి వెళ్ళిన అమ్మాయి తిరిగి పుట్టింటికి రావడం అరుదట. అప్పుడప్పుడు బజార్లలో మనం చూస్తుంటాం లంబాడీస్త్రీలు ఒకరినొకరు కావలించుకు ఏడుస్తుండడం. అలా ఏడుస్తూ కనిపించారంటే అక్కడ అనుకోకుండా ఎంతో కాలం తరువాత ఆ తల్లీ కూగుళ్లుగాని ఆత్మబంధువులుగాని కలిసేరన్నమాట. ఇది సంచారజాతిగదా! వీళ్ళ పెళ్ళితంతులో ముఖ్యమైనది పెళ్ళికూతుర్ని ఎద్దుపై నిలబెట్టి "బోరాయేతోతో, హనహనకరతో" "దియా.....రే, రే....మా....రీ.....అన్ వో----- కే----జీ, ఇందా-----నే----డి"

అని విషాదంగా పాటపాడుతూ అందరూ ఏదుస్తుంటారు. -అప్పుడు ఆ ఎద్దుకూడా ఏదుస్తుందట. అంత కరుణ రసాత్మకంగాపాడతారన్న మాట. అది మన అప్పగింతలపాటలాటిది. ఈ భాష బాగా పరిశీలిస్తే అక్కడక్కడ హిందీకి, కొన్నిచోట్ల మూలద్రావిడ భాషకూ కొంత చేరువుగా కంజ్పిస్తొంది. అన్నను, ‘బియా ‘ అంటారు. (హిందీలో భాషా జన్యమైన తెలుగులో జానపదులు తండ్రిని బాబా అని పిలవడం కద్దు).

పెళ్ళివారు మరదలువరుసపిల్ల పెళ్ళికొడుకు చెవులు చిల్లపెంకులతో గట్టిగా నొక్కుతుంది. అప్పుడు ఎంత భాధకలిగినా అతడు అబ్బా! అనడానికి వీల్లేదు. అంతేకాకుండా పెళ్ళీకి కట్టుకునే కొత్త పంచి నీటిలో తడిపి మరదలుపిల్ల పెళ్ళీకొడుకు మెడమీదవేసి దానిపై రోకలిబండతో కుడివైపు మూడుదెబ్బలు, ఎడమవైపు 4 దెబ్బలూ కొడుతుంది. ఎంత గట్టిగా కొట్టినా అభ్భా! అనకూడదు. ఈబావా మరదళ్ళ మోటు సరసం పెళ్ళికొడుకు సహనానికి పరీక్షలాంటిది. మరో విచిత్రంపెళ్ళి పందిరికి మనం మామిడాకుల తోరణాలు కడతాంకదా! వీరు పందిరికి జిల్లేడుమడములు కడతారట. దీని ప్రాశస్త్య మేమిటోమరి!

ఇక వీరివి వరకట్నాలు కావు- కన్యా శుల్కాలు, పెండ్లికొడుకు ఆడపిల్లతం డ్రికి 3 గిత్తలు యివ్వాలి (ఎద్దులు)- వోలిగా 50 రూపాయలు యివ్వాలి. ఆడపెళ్ళివారు తమ పిల్లకు తమస్థాయినిబట్టి ఇత్తడి జూకాలు, వెండి కుచ్చులు, ముక్కుపోగు వగైరా లంబాడీ ఆభరణాలు పెడతారు. పెళ్ళి పెళ్ళికూతురింటి దగ్గరే చెయ్యాలి. గర్బాదానం మాత్రం పెళ్ళికొడుకు ఇంట చేస్తారు. పెళ్ళిలో మొదటితంతు పెళ్ళికూతురుదండకు ఆడపడుచులు దంతపుగాజులు తొడగటమట. ఇది మన మంగళసూత్రధారణ లాంటిది. కాళ్ళకు వాంకిణి (కడియాలు) తొడుగుతారు. తలవెంట్రుకలకు జూకాలు తగిలిస్తారు. ఇవి ఉంటే ఆస్త్రీకి పెళ్ళయినభర్త ఉన్నట్టు లెక్క. భర్త చనిపోయినప్పుడు ఇవి తీసేస్తారు.

వీళ్ళలో స్త్రీ వ్యభిచారం నేరం. ఇతర జాతుల వారితో వ్యభిచరిస్తే ఆమెను వేలేస్తారు. స్వజాతి వారితో అయితే తండా పెద్ద తప్పువేస్తాడు. వీరిలో బహుభార్యాత్వం తప్పుకాదు. బహుభతృమే తప్పు. ఈజాతిలో ఒకరికొకరు సాధారణంగా పిల్లల్ని పెంపకం యివ్వరు. అందువల్ల పిల్లలు లేనివాళ్లు యానాదివగైరా యితర కులాల పిల్లల్ని పెంచు కుంటారు. కాని 3 తరాల వరకూ వారిని తమ జాతిలో కలుపుకోరట. మరి అప్పటి వరకూ వాళ్ల ఫేళ్లిళ్లు అవరితో జరుపుతారు అంటే అలాగే పెంచబడిన పిల్లల్ని వెతికి చేస్తారట. ఆ మూడోతరం పిల్లల్ని కంచుకంచంలో నెయ్యి, పరమాన్నం కలిపి తండానాయకులు తిని ఆ ఎంగిలిని ఆపిల్లల చేత తినిపించి జాతిలో కలుపుకుంటారట. వివాహ భోజనాలలో వీరికి వేట మాంసం (మేకమాంసం) ముఖ్యం. దానిలోనికి మంచి నీరు మద్యం.

రంగ స్థలం మీద ఈ నాటి జానపద నృత్యాలలో లంబాడీ డాన్సుకు మంచి ప్రసిద్ది వుంది. (కాకపోతే కొందరు లంబాడీ డాన్సు అని కోయడాన్సు వేస్తున్నారనుకోండి అవగాహన లేక) తండాలో మగవాళ్ళు డప్పులు వాయిస్తుంటే ఆడవాళ్లు కాళ్లకు గజ్జలు కట్టుకొని జట్టులు జట్టులుగా లయాను గుణంగా రమ్యంగా నృత్యమ్న్ చేస్తారు. ఇది చూడడానికి చాలా ముచ్చటగా వుంటుంది. ఈ నృత్యానికి కూడా ఒక పద్దతి వుంది. ఇది వాళ్ళ సంప్రదాయ పద్దతి. పెద్దవాళ్ళు చిన్నవాళ్లకి నేర్పుతారు. ప్రత్యేకంగా పండుగనాడు "చారెబెజారతే హోలీ ఆయా" అని పాడుతూ ఆనందోత్సాహంతొ వీరు చేసే యీ నృత్యం చూసి తీరవలసిందే. మందు హుషారులో మగవాళ్ళూ, స్వేచ్చగా పురి విప్పిన నెమళ్ళలా ఆడవాళ్ళూ తారస్థాయితో యీప్రదర్శన చేస్తున్నప్పుడు చూసే వాళ్ళ మెను పులకరించి పోతుంది. అలాగే దీపావళి రోజున వీరి దివిటీల ప్రదర్శన కూడా మనోహరదృశ్యం.

పగటి వెషగాళ్ళు వీరి వేషాలువేసి జనాన్ని బలే ఆకట్టుకుంటారు. అంటే వీళ్ళ వేషంలో, భాషలో అంత విలక్షణత ఉందన్నమాట.

వీరి ఇలవేల్పు "తులజాయాడి", పిల్లలకు పుట్టువెంట్రుకలు తీసేటప్పుడు యీమెకు జోడు మేకపొతులు బలియిచ్చి సారాతో జాతర చేసుకు తింటారు. ఇతర గిరిజనుల లాగే మారెమ్మ, గంగమ్మ, దుర్గమ్మ, దారాలమ్మ వగైరా కొండదేవతలను జంతు బలులతో ఆరాధిస్తారు. అలాగని సాత్వికారాధన లేదనుకోరాదు- బాలాజీ (వెంకటేశ్వరస్వామి) మీద వీరికి మక్కువ ఎక్కువ. అలాగే ఎన్నో వ్యయప్రయాసలకోర్చి కోటప్పకొంద తిరునాళ్ళకు వెళ్ళి భక్తి శ్రద్ధలతో స్వామికి మొక్కులు చెల్లించుకుంటారు. వీరు పశ్చిమగొదావరి గొల్లమందల, చింతలపూడి వగైరా ప్రదేశాలలొ ఎక్కువగా కనిపిస్తుంటారు. వీరినే సుగాలీలంటారు.స్వాతంత్రం వచ్చాక వీరిలో కూడా చైతన్యం వస్తొంది.కొద్ది కొద్దిగా నాగరిక ప్రపంచంలో ప్రవేసశించి నాగరికుల పద్దతుల లోనికి మారుతున్నారు.ఇప్పుడిప్పుడే కొంతమంది విద్యాధికులై ప్రభుత్వంలొ ఉద్యోగాలు,పదవులూ చేబడుతూ ముందుకొస్తున్నారు. ఇది దేశానికి శుభ పరిణామం.

                                కో య లు
                  
         గిరిజన జానపదులో కోయలు కూడా ముఖ్యులు. వీరిలో అనేక తెగలున్నాయి. 'డోలీలు ' ఒక తెగ. వీరు నృత్యాలకు డోలువాయిస్తారు. కొమ్ములవారు మరొకతెగ. వారు కొమ్ము ఊదుతారు- ఇలా చేసే పనినిబట్టి వీరి శాఖలేర్పడాయి. ఆదిలో కులాలు కూడాయిలా ఏర్పడ్డవేగా !
                              భూమి పండుగ
        
                వీరికి  భుమిపండుగ ప్రధానమైనది. ఈ పందుగ కాలంలో కోయమహిళలు పాటలుపాడుతూ ప్రయాణీకుల్ని ఆపుచేసి మరీ కానుకలు తీసుకుంటారు. సరిగా చెప్పాలంటే మీదబడి జేబులో చెయ్యిబెట్టి తీసేసుకుంటారు. వీళ్ళు అలామీద పడడం వీళ్ళకి సరదా - వీరుపాడే ప్రతి పాటలోనూ 'రేలా, రేలా ' అనేపదం ఉంటుంది. ఈరేలా పదానికి అర్ధమేమిటని ఒక కోయపడుచునడిగితే ముసిముసిగా నవ్వి ఓకధ చెప్పింది.  భారతకాలంలో భీముడు గిరిజనకన్య హిడింబితో అడవుల్లో ప్రేమాయణం సాగించినప్పుడు వాళ్ళిద్దరూ వెదురు పొదలమాటున, రెల్లుదుబ్బులు చాటునచేస్తున్న రతిక్రియచూసి కైపెక్కిన సాటి గిరిజన కన్యలుతాపంతో 'రేలా, రేలా ' అని పాడేరట.  అనాటినుంచీ వారు యితరులతొ శృంగారపరిహాస మాడదలుచుకున్నప్పుడు ఇలా 'రేలా, రేలా ' అంటూ పాటలు పాడతారట - ఇంతకీ 'రేలా,రేలా 'అంటే వాళ్ళభాషలో రతికార్యక్రమం తాలూకు కవ్వింపు బూతుమాట.  ఇది యీజాతికి ఆనందం - అయినాసెక్సు విషయం ఏజాతికానందంకాదు!                           పె ళ్ళి ళ్ళు

వీళ్ళ పెళ్ళిళ్ళ వ్యవహారం చాలా చిత్రంగా ఉంటుంది. ఆడా, మగా, పెద్దా, చిన్నా అంతా సంతలకీ, తీర్దాలకీ వెళుతుంటారు. ఆదారిలో యువతీ యువకులు ప్రేంచుకోడాలు, యువతిని యువకుడు ఎత్తుకు పోవడం ఆ తరువాత ఆవైపు పెద్దలూ, యీ వైపు పెద్దలూ చేరి సఖ్యపరచి పెళ్ళి చెయ్యడం- ఇదీ పద్ధతి. వీళ్ళు ఓలిగా గాడిదల్నీ, పందుల్నీయిస్తారు. ఇదేగా వారి సంపద మరి: వీరిలోవ్యచారం తప్పుకాడు. అందుకే వీరిలో హత్యలుండవు. విడిపోవాలనుకుంటే గూడెం నాయకుది దగ్గరతగువేత్తుకుంటేచాలు. అతను తప్పేసి విడాకులిప్పిస్తాడు. మరల వాళ్ళు తమకిష్టమైనవాళ్ళను పెళ్ళిచేసుకోవచ్చు. తప్పంటే జరిమానా. ఆ జరిమానా సొమ్ముతో ఆ రోజు గూడెం పెద్దలు మందేసుకుని మజా ఛేసుకుంటారు.

ఇది సంచారజాతి. అందుకని వాళ్ళ సామాన్లు మొయ్యడానికి గాడిదల్నీ, తినడానికి పందుల్నీ పెంచుతారు. త్రాగడానికి మంచినీళ్ళు సొరకాయగుల్లలో పట్టుకుని కూడా తీసుకుపొతుంటారు. (అవి మోసుకెళ్ళడానికి తేలిగ్గాఉంటాయి గనుక.) వీరిది దివామైధునం - వీరిదృష్టిలో రాత్రి మైధునం శవసంభోగం వీరి దేవత కొండమ్మ. నాలుగుపుల్లలు నిలబెట్టి క్రింద కొండదేవతను నిలిపి జాతర చేస్తరు. ఆ జతరలో ఆడామగా నృత్యంచేస్తూ పాడే పాటలలొ 'రేలా,రేలా ' అనే మాట ప్రముఖంగా చోటు చేసుకుంటుంది.

                      నృ త్యా లు


వీరు చేసే నృత్యాలకు సహకారుల డప్పు, డోలు, ఫ్లూటు వాయిద్యాలు. తలపై కొందరు కొమ్ములు కట్టుకుంటారు - అది జంతువు వేషమన్నమాట. జంతువు ఎలా వేటాడుతుందో వీరి నాట్యంలో కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. అలాగే వీళ్లు జంతువుల్ని వేటాడే విధంకూడాకనిపిస్తుంది. మగగాళ్లు డోళ్ళువాయిస్తుంటే ఆడవాళ్ళు చెయ్యీచెయ్యీ పట్టుకుని వలయంగా త్రిరుగుతూ లయానుగుణంగా నాట్యం చేస్తుంటారు. వీరి సహజ దుస్తులతో చేసే యీనాట్యం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ మధ్య వీరి 'ధింసా' నృత్యం దేశ వ్రఖ్యాతి పొందింది. ఇందు ఆడా మగా ఒకరినడుములొకరు పట్టుకుని వలయంగా నిలుచుని లయతో అడుగులు వేస్తూ ముందుకి వెనక్కి నదుస్తూ జట్టులు జట్టులుగా విడుతూ రకరకాల విన్యాసాలతొ నృత్యాభినయం చేస్తుంటీ మొన్న ఢిల్లీయే దిమ్మెరి పొయిందట రిపబ్లిక్ దినోత్సవాలలో.ఇంతకి వీరిది ఒక కళగా గుర్తించి గౌరవించడం ఆనందింపదగిన విషయం.మారుతున్న ప్రపంచంలో వీరుకూడా మారుతూ నేడు విధ్యాధికులై ఉన్నతోద్యోగాలలోకి వస్తున్నారు. ఉన్నత పదవుల నధిష్టీస్తున్నారు.ఇది దేశప్రగతికి చిహ్నం.

కోయలు పశ్చిమగోదావరిజిల్లాలో పోలవరం, బుట్టాయగూడం, కొయ్యలగూడెం, జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం మండలాలలో విశేషంగా ఉన్నారు.




*****