గురుజాడలు/కవితలు/నీలగిరి పాటలు - సుందరతర మీ నీల నగము

వికీసోర్స్ నుండి



నీలగిరి పాటలు

సుందరతర మీ నీల నగము

రాగము, సురట, - తాళము, ఆది.

             పల్లవి
సుందరతరమీ నీల నగము దీని|
యందము హృదయానందకరము దీని|
చందము హృదయానందకరము ||
            అనుపల్లవి
నందన వన నిదె - నాతిరొ వింటివె|
బృందారక ముని - బృంద సేవితము||

    చరణములు
1. ఎచ్చట జూచిన - బచ్చిక పట్టులు|
   పొద పొద రొదలిడు - పొలుపగు పిట్టలు|
   వింత వాసనలు - వీచెడు చెట్టులు|
   కుదురు రథ్యగల - కొలకుల గట్టులు||

2.నిచ్చలు నగముల - నీటగు తోఁటల|
   విచ్చలవిడి చను - నచ్చపు మొగుళుల|
   నచ్చరఁగేరెడు - మచ్చెకంటు లిటl
   మించు తీవలన - మించి చరింతురు ||

3. పాద ఘట్టనకుఁ - బర్వు చక్రములు|
   మంత్ర మహిమనగు - జంత్రపు రథములు!



పందెము వారెడు - పటుజవనాశ్వము|
లందముగా నిట - గ్రందయి తోచును||

4. గట్టుల లోయలఁ - గాజు చప్పరల|
   మట్టి గోలెముల - మడువుల నడవుల|
   నెల్లెడ విరియగ - వెల్లువలై విరు|
   లిక్షధన్వు దొన - లక్షయమయ్యెను!!

5. తప్పక భృత్యుల - నెప్పుడు బ్రోచెడి|
   యప్పలకొండయ - మాంబా దేవిని|
   నొప్పుగఁబ్రోచుత - నప్పుర దమనుఁడు|
   మెప్పగు వరముల - విప్పుగఁగురియుచు||