గానసుధారస పానముజేసే

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


రాగం: ఖరహరప్రియ - ఆది తాళం


గానసుధారస పానముజేసే
మానవులే ధన్యులు ఈ భువిలో॥

ఈ నరదేహము స్థిరమని తెలియక
గానలోలుని వాసుదేవుని మరవక॥

యోగివరేణ్యుడైన నారదముని కృపతో
భాగవతాగ్రేసరుడని వెలసిన
త్యాగరాజుని మరి మహాత్ములను దలచుకొని
రాగ లయాదులను బాగుగ దెలుసుకొని॥