Jump to content

క్షాత్రకాలపు హింద్వార్యులు/క్షాత్రయుగమునాటి హింద్వార్యులు - వారి యాహారము

వికీసోర్స్ నుండి

క్షాత్రయుగమునాటి హింద్వార్యులు - వారి యాహారము.

మనపూర్వులగు హింద్వార్యులు క్షాత్రయుగమున నెట్టి వస్త్రముల ధరించుచుండిరో మా మొదటివ్య్లాసౌన జూసి యున్నాము. ఆకాలమున వారెట్టి యాహారమును భుజింపుచుండిరో, క్ష్తాత్రయుగారంభమునుండి దద్యుగారంతమువఱకు వారి యాహారమున నేట్టిమార్పులు కలిగెనో ఈవ్యాసమున దెలుపుట మాయుద్దేశము. ఇట్టిమార్పులను మనకు జూపు ముఖ్యగ్రంధములు ఉపనిషత్తులు, వీరకావ్యములు, మనుస్మృతియునై యున్నవి. మనవారిలో వాటిల్లిన యీమార్పులు ఒకదృష్టికి అభివృద్ధిసూచకము లేయైనను వేఱొకదృష్టితో జూచినపక్షమున నవి మనవారి హీనదశకుగూద కారణములైనవని యనేక విద్వాంసు లభిప్రాయబడుచున్నారు. నైతికాధార్మికబుద్ధితో నాలోచించిన యెడల, మతసంబంధమగు నుద్దేశములప్రేరణచేత మాంసాహరమును త్యజించి శాకాహరము నవలంభించిన వారు మ్న కెంతయు వందనీయులనుటకు సందేహముండునా? ఉండదు. కాని ఆరమార్ధికదృష్టితో నాహారమునందు వారుచేసికొనిన యామార్పు వారిని రాజ్యాంగస్వాతంత్ర్యమునుండి దూరగుల జేసిన మాటదలంచినపుడు యామార్పు వారికనర్ధదాయక

వారియాహారము

ముగా బరిణమించినదికాని లాభప్రదము కాలేదను సంగతిని మోక్షమూలరువంటివాడొప్పికొని యున్నాడు. పైన జెప్పబడిన మార్పెట్లు కలిగినదో వీరకావ్యములనుబట్టి యోచించుటకు ముందు, బృహదారణ్యకోపనిషత్తునందలి యీక్రిందివాక్యము మాచదువరుల శ్రద్ధనాకర్షింపదగియున్నది. "విద్వస్తభలందజేయుడుగను, సర్వజనప్రీతికరముగ నుపన్యసించు వక్తగాను, వేదార్ధమును బోధింపగలవాడుగను, దీర్ఘాయువుగను నుండు పుత్రుని బడయగోరువాడు నేతితోను (గొడ్డుదైనను సరే గొఱ్ఱెదైననుసరే) మాంసముతోను వండబడిన యన్నమును దినవలయును." ఇట్టి యన్నమును దినుటవలన పైవచనముననున్న ఫలము లభించునా లభింపదాయను విషయమున మేము వాదముసల్ప బూనుకొనలేదు. కాని ఈవాక్యమునుబట్టి చూచినచో గొడ్దుమాంసమును దినువారు శారీరక బలమునందు మాత్రమేకాక మానసికబలమునందు గొప్పవారగుదురని ఆకాలపువారు నమ్మియుండిరనుట్ స్పష్టముగా మాత్రము తెలియుచున్నది. కనుక ఆకాలపువారికి మాంస మహారమైయుండెననియు, పైన జెప్పినమాంసము మేదస్సునకుగూడ బలము నిచ్చునదియని వారెంచుచుండిరనియు తేలుచున్నది.

    మహాభరతముకూడ పైయంశమునే బలఫరచుచున్నది. యుద్దానంతరము ధర్మజుడొనర్చిన యశ్వమేధసందర్భమున, యజ్ఞకార్యముకొఱకు మంచిదని వచించియున్నాడు. @అంతే

@తంతందేవం సముద్దిశ్య, పక్షిణ:ప్;అశపశ్చయే, ఋషభాశాస్త్రసరితా,

క్షాత్రయుగమునాటి హింద్వార్యులు.

కాదు. ఆయజ్ఙసమయమున, జంతువులమాంసముతో వండబడిన వివిధ మధురాహారములకు మితమేలేకుండేననికూడ చప్పబడి యున్నది. +వేలకొలది బ్రాహ్మణులును లక్షలకొలది క్షత్రియులును భుజించుటకై యేర్పరుపబడిన విందులం దనేక పశువుల మాంసము వండబడియుండవలయుననియు, చంపబడిన జంతువులసంఖ్యనుబట్టియేమి, వాడబడిన ++మద్యభాండముల సంఖ్యనుబట్టియేమి అప్పటి మన హింద్వార్యులవిందులకును వరి సోదరులగు జర్మనీదేశీయుల విందులకును విశేషభేదముండలేదని యు చెప్పినచో నందు ఆసంగతిమేమియునుండరు.

  మహాభారతమున ఇప్పటియాకారము నొసగిన సౌతి, వైష్ణవ జైన బౌద్ధమతములు వృద్ధిజెందిన తరువాతివాడు; కనుక పైనజెప్పిన విందుల వివరములు అతనికి వింతగాదోచి యుండవచ్చును. కావుననే యాతడు, తరువాత వచ్చిన యధ్యాయమునందు అట్టి విందులను నిరసించినాడు. ఈయధ్యాయమున బంగారుతలగల యొక నకులము (ముంగిస) కధ వచ్చినది. మాంసాహారమును, జంతువలబలులును దూష్యములుగా జూపి, యవిగల యజ్ఞములకంటె ఆకలిగొన్న యతిధికి పిడికడటుకులు పెట్టిన నెక్కువపుణ్యము వచ్చునని నిరూపించుటకై

స్తభాజలచరాశ్చయే, సర్వాస్తానభ్యయంజన్తే, తత్రాగ్నిచయ కర్మణీకి అశ్వ:

+ భక్ష్యభాండవరాగాణాం శ్రియతాంభుజ్యతాంతధా, పశూనాంవధ్య తాంచైన నాంతందదృశరేజనాశ॥ అశ్వ॥

++సురామైరేయ్హసాగరం॥అశ్వ॥

వారి యాహారము.

ఈకధ యచ్చట తెచ్చిపట్టబడినది. క్షాత్రయుగారంబము నుండి యాయుగమును ముగియునాటికి జనులయభిప్రాయముము లేనివిధముగా మారినవో పైకధవలన దెల్లమగుచున్నది.

  జనాభిప్రాయము మెట్టిమార్పు జెందినను క్షత్రియులు మాత్రము నేడేట్లొ యట్లే ఆకాలమునందును పూర్వాచారమును వదలక మాంసాశనమును జంతువుల బలులను జరపుచునే యుండిరి. పైనాద్ని తరువాతయధ్యాయమున అప్పటి జనాభిప్రాయమును కొంతసమాధానపఱచుటకై యియ్యబడిన ప్తత్యుత్తరమొకటి మనకు కానవచ్చుచున్నది.  వ్యాసాదిమహర్షుల నియోగముననుసరించి ధర్మరాజుచేసిన యాయజ్ఞ కార్యమును నకులమెట్లు నిందింప సాహసించెనని జనమేజయుడు ప్రశ్నవేయగా వైశంపాయను డిట్లు చెపుచున్నాడు. పూర్వమొకప్పుడు ఇంద్రుడు యజ్ఞము చేయుచుండ యజ్ఞపశువుల జాలింగొలుపు చూపుల జూచి దయ దలచి 'పశుహింస అధర్మకార్యము కనుక ఈ యాగము సధర్మమైనది కాదు ' అని ఇంద్రునితో ననిరి. *ఇంద్రుడు వారితో నేకీభవిపనందున యజ్ఞములందు జంతువులను వధింపవచ్చునా కూడదా యని విషయమున ఇంద్రునకు ఋషులకును వాదము కలిగెను. అంత వారి వివాదాంశమున చేదిదేశపు రాజగు వసువుయొక్క తీర్మానమును గొరిరి. ఏది దొరకిన దానితోనే యజ్ఞము చేయవచ్చునని వసు

  • నాయంధర్మకృతోజ్ఞా నహింసాధర్మఉచ్యతే, యజబీజై సహ పాక్ష త్రివర్ష పరమోక్షితై: ॥అశ్వ॥

క్షాత్రయుగమునాటి హింద్వార్యులు.

వు నిర్దారనచేసెను. ఈ యంశము నింతనిర్లక్ష్యముగా తీర్మానించి నందున చేదిరాజు అధోగతిపాలై పాతాళమునకు బోయెను" కాని యీవివాద మింతటితో ముగియలేదు. జనసామాన్యము జంతువులకు మాఱుగా నిశరపదార్ధములను యజ్ఞసమయములం దర్పించి తృప్తినొందుచుండిరి. కాని క్షత్రియులు మాత్రము తమ పూర్వపద్ధతిని మానలేదు. కనుకనే క్షత్రియుడైనవాడు తన సర్ఫభౌమత్వమును జాటగలిగినపుడేల్ల ధర్మజ జనమేజయులవలె నశ్వమేధము జెయుచునే యుండెను. అశోకునివంసమంతరించిన తరువాత హిందూచక్రవర్తియగు పుష్యమిత్రుడు అశ్వమేధయాగము చేసెను. ఈవిధముగా యజ్ఞములుందు జరగుహింస న్యాయమైన దేనని బ్రాహ్మణ లొప్పుకొనవలసినదవరైరి. దీని తరువాత యధ్యాయమున అగస్త్యుని యజ్ఞపుకధకలదు. ఈజన్మము పెండ్రెండు వత్సరములు జగుచుండెను. దీనియందు నిర్జీవపదార్ధములే యాహుతి యియ్యబడెను. అంతనింద్రు డాగ్రహించి వర్షింపమానుకొనెను. యజ్ఞాదులకు ధాన్యమైనను దొరకదేమో కదా యని ఋష్యాదులు భయపడి, అగస్త్యుని యెద్దకు బోయి మొఱపెట్టుకొనిరి. అగస్త్యుడు చేయునదేమియులేక, ధాన్యమే లభింపనియెడల తాను మానసిక యజ్ఞముచేసెదననియు, కాకపోయినచో ఉత్తర కురుభూములకు బోయి ద్రవ్యము దెత్తుననియ్, అదియును కాదా తానె యింద్రత్వమువహించి భూమిని సస్యవంతముగ జేసెదననిచెప్పి యట్లె తన మహాత్మ్యమువలన ద్రవ్యము నుద్భవింప జేసెను. ఇంద్రుడచ్చెరువొంది తన్ను క్షమింపుమని యగ

వారి యాహారము

స్త్యుని వేడికొని ఎప్పటివలె వర్షము గుఱిపించెను. దేవతలతొడి వైరమున తమ తపోధనమును వృధ చేసికొనుత మంచిపనికారు కనుక యాగములలో జరగు పశుహింస హింసయేకాదని విధింపుమని అగస్త్యుని ఋషులు వేడికొనిరి. అతడు వారివిన్నపము అంగీకరించెను. ఋషులు స్వస్థానములకు బోయిరి. ఈసమయమున జంతువుల బలుల కనుకూలముగ్ నభిప్రాయము మాఱినది కనుకనే అశ్వమెధపర్వమునందలి తుదియధ్యాయమున వెనుకటి స్థితిగతులుపోయి, ధర్మజుని యాగమును నిందించిన యానకులము నిజముగా నకులము కాదనియు, యముడు జమదగ్ని శాపవశమున నకులాకారమును ధరించెననియు, యుథిష్టిరుని యాగమును చూఱినప్పుడు శాపనివృత్తి కలుగవలసిన విధానముండెను కనుక యాగమును నిందించుట సంభవించినదనియు చెప్పబడియున్నది.

మాంసాహారమును గుఱించియు, యాగములందు పశు హింస జరగుటను గురించియు జనుల యభిప్రాయము లెట్లుమారినవో చూపుటకై మెము నకులము యొక్క కధను కొంత దీర్ఘముగ వ్రాయ వలసినవారమైతిమి. ఈ నకులముయొక్క కధ మనవారి యాహార విధానముయొక్క మూడు దశాభేదములను దెలుపుచున్నది. మొదట మాంసాహారులుగను జంతువుల్ను బలియిచ్చువారుగను నున్న హింద్వార్యులుగాను ఆపద్దతివదలి అహింసా సిద్దాంతము నవలంబించి రెండవదశకువచ్చిరి. ఆ రెండవదశనుండి మరల యాగాదులందు హింసజరుగవచ్చును. అన్ సిద్దాంతము నొప్పుకొని మూడవదశకు వచ్చిరి. ఈవిధముగా

క్షాత్రయుగమునాటి హింద్వార్యులు.

క్షాత్రయుగాంతమునాటికి స్ధిరపడిన నీమూడవ యభిప్రాయమే ఇప్పటికాలమున పశుహింసతోగూడిన యాగములు విశేషముగా గానరాకపోయినను, క్షాత్రయుగాంతముననుండి యభిప్రాయమే యిప్పటికి స్థిరమైయున్నదనుట స్పష్టము. ఆహారవిషయమునను క్షాత్రయుగాంతమునాటి యభిప్రాయములే నేడును నిలచియున్నవి. అనగా నేటికిని క్షత్రియులును, హింద్వార్యులలోను మిశ్రార్యులలోను జేరిన కొన్ని బ్రాహ్మణజాతులవారును మాంసాహారమునే భుజించుచున్నారు.

   అయినను, ఒకవిషయమున మాత్రము కడపటివాక్యమున బేర్కొనబదినవారు తక్కుంగల హిందుచ్వుల మార్గమనుసరింపక తప్పలేదు. అదేదన గోవధము. హిందువులలోని వివిధశాఖలవా రెట్లు గోవృషభవధమును మహాపతకములుగ గణించుచుండిరో పై వారును నట్లే తలచుచుండిరి. *ఈనిషేధమెప్పుడు విధింపబడినదో తెలియదు. క్షాత్రయుగారంభమున మన హింద్వార్య్హులు గోవృషభము లను బలియిచ్చుచు, వాని వాని మాంసమును దినుచుండిరనుట నిర్విదాంశము. ఈసిద్దాంతమును బలపరచు వాక్యములు మహాభారతమం దెన్నియో కలవు. అనేక యాగములచే బ్రసిద్దిగాంచిన రంతిదేవుడు బలి

*

  • అర్జునిను శపధసందర్భమున జూడుడు:-

బ్రహ్మభ్నూనాంచయేలొకా, యేచగోధూతినామపి, సాయసంహియనానంహి శాకంకృసరమేవహి, సంయావాపూసమాంసాని యేచలొకావృధాన్నతాం॥ ద్రోణ॥

వారి యాహారము.

యిచ్చుచుండిన వృషభముల *చర్మముల కుప్పలలోనుండి యొక నది యుత్పత్తియయ్యెననియు, దానికి చర్మావతీ (చేంబలు) యను సార్ధకనామము వచ్చననియు, మహాభారతముననున్నది. ఇక గోడ్డు మాంసమును దినుచుండిరను విషయమున, కావలసినచో భచ్వభూతి కృతమగు 'ఉత్తరరామచరిత్ర 'లోని వశిష్టవిశ్వామిత్రుల శిష్యుల సంభాషణము చూడదగును. ఈ సంభాషణమున వశిష్టుని యాతిధ్యమునకై మధుపర్కముకొరకు చిన్నయావ్చు నొకదానిని వధించిన విధమును తెల్లగడ్డముగల యాజడదారియెదుట నాయావు, పుళ్ ముందుబడిన మేకపిల్లవలె, గుటక్కున మాయమైన విధమును వర్ణింపబది యున్నది. స్థితిగతులట్లుండగా క్షాత్రయుగాంతమునాటికి గోవృషభములు ఆహారరూపపున మనవారి కుక్షులలోబడకుండ నెట్లుతప్పించుకొనగల్గెనో తెలియవచ్చుటలేదు. ఎట్లయిననేమి! క్షాత్రయుగాంతమునాటికి వానికాయవస్థ తప్పినది. ఎందుచేతనోకాని గ్రీకులు ఈ నిషేధము వ్రాయలేదు. అప్పటికాలపువారు శాకాహారులుగా నుండిరనియు, జంతువుల బలియిచ్చుట వారేవగించుకొనుచుండిరనియు, గ్రీకుకులు కనిపెట్టిరి. "హిందూదేశీయులు సాధారణముగా ధాన్యము తిని జీవించెదరు; నేలదున్నెదరు. కాని పర్వతప్రాంతములవారు మాత్రము వేటాడిన జంతువుల మాంసము దిను


  • రంతిదేవునియింట దినమునకు 1000 పశువులు చంపబడుచుండెనని చెప్పబడియున్నది:--

ఆలభంతతదాగాన॥, సహస్రాణ్యేకవింశతి: । తత్రస్మమాదాక్రోశన్తి, సుమృష్ట మణికుండలా॥ । సూపంభూయిష్టమశ్నీధ్వం, నాద్యమాం సంయధాపురా॥ ద్రోణ॥

క్షాత్రాయుగమునాటి హింద్వార్యులు.

చుందురు" అని 'పరియాను ' వ్రాసియున్నాడు. దీనినిబట్టి చూడ, ఇప్పటివలెనే ఆకాలములగూడ హిమాలయప్రాంతవాసులు మాంసమును దినుచుండిరనియు మైదానములలో నుండువారు శాకాహారులుగా నుండిరనియు తెలియుచున్నది. 'వేటాడిన జంతువులు ' అనుతవలన గోవధ నిషిద్ధమైనట్టు కొంగగొచర మగుచున్నది. కాని పరదేశీయులదృష్టి నాకర్షింపవలసిన యీ యంశము గ్రీకులకేల స్పష్టముగా స్ఫురింపలేదో తెలియరాకున్నది. వారు వ్రాసిననేమి వ్రాయకపోయిననేమి? నేడెట్లో క్షాత్రల్యుగాంతము న గూడ నట్లే గోవధ మహాపాతకముగా నెంచబడుచుండెననుట నిస్సంశయము.

   మహాభారతము నచ్చటచ్చట కానవచ్చుట కానవచ్చు నస్పష్ట చిహ్నములను బట్టి గొవధానిషేధచరిత్రమును కొంచెము కనుగొందము; నహుష సప్తర్షులకధలో, సప్తర్షులు యాగములందు గోవధ క్రమమైనదేయని వాదించుచుండ, నహుషుడది యక్రమమని వాదించును. అనగా సప్తర్షులు క్షాత్రయుగమునాటి పూర్వాచారపరాయణుల భావముల వ్యక్తీకరించినారు; నహుషుడు సంస్కార వాదుల యభిప్రాయములను ప్రకటించియున్నాడు. "గోవులను బలియియ్యవచ్చునని చెప్పు వేదమంత్రములను నీవు నమ్ముదువా?" యని నహుషుని అగస్త్యుడడిగెను. *"నేను నమ్మ" నని నహుషుడు ఉత్తరమిచ్చెను. ఋషునిట్ల

  • యఇమేబ్రహణాస్రోక్తా, మంత్రానైప్రోక్షణేగవాం ఏతేప్రమాణంభవేఈ, ఉతాహో నేతివాసనకి నహుషోనెతితానాహ తమసోమా ఢచేతన: ఋ.ఉ.ఆధర్మేసంప్రబృత్తస్త్వం ధర్మం ప్రతిబుధ్యనే ప్రమాణేతదసాకం, పూర్వపోక మహర్షిభి॥ ఉద్యో॥

వారి యాహారము.

నిరి. "నీవధర్మమార్గమున నున్నావు. అనుశ్రుతముగా వచ్చుచు న్న మతము నీవొప్పుకొనకున్నావు" తరువాతజరిగిన వాదవివా దమున నహుషుడు అగస్త్యుని తలమీదగొట్టి, శాసనశమున మతక్యాలోకమున సర్పమై జన్మించెను. నకులము కధలో జంతు హింసకు ప్రతికూలముగా నున్న అగస్త్యుడు ఈ సందర్భమున జంతు హింసకు అనుకూలుడుగా నుండుట విచిత్రముగానున్నది. పైన వివరింపబదిన శ్లోక వ్యాఖ్యానమున గొవుయొక్క సానిత్య్రము ఏర్పడినకారణము చూపబడియున్నది. యాగసంబంధములగు మంత్రములకు బ్రాహ్మణుడెట్లు ఉనికివట్లోయట్లే యజ్ఞ ద్రవ్యములగు క్షీరము, నేయి మొదలగు వానికి ఆవులునికిపట్టులు కనుక ఆవులను వధింపగూడదని నహుషుడుతలచెనట. గోవధానిషేధము నకు మరియొక కారణము గూడనుండవచ్చును. కృష్ణునకు గోవుల గౌరవముకూడ హెచ్చియుండవచ్చును. ఇంకొక సంగతికూడ గమనింపదగియున్నది. ఇరానియనులు గోవులపావిత్ర్యమును అమ్ముచుండిరి. కనుజ్క సింధునది యావలినుండి అప్పుడప్పుడు వచ్చుచుండిన యార్యులతోగూడ నీయభిప్రాయము దేశమునందంతట బ్రవేశించియుండవచ్చును. ఎట్లువచ్చిన నేమి? గోవజ్ధానిషేధముక్షాత్రయుగములోనే వచ్చినదనియు అది కొంతకాలమువఱకు వాదవివాదములకు గుఱియై ఆయుగాంతము వఱకు స్థిరపడినదనియు మనము నమ్మవలెను.

వీపులమీద బరువులనుమోసికొనిపోల్వు జంతులమాంసము తినకూడదని మనదేశమందొక నియముండేను. మహా

క్షాత్రయుగమునాటి హింద్వార్యులు.

భారతమున నిట్టి మాంసమునకు 'వృష్ఠమాంస ' మని పేరు. బరువులు మోయు జంతువులయెడల్ జనులకుగలకృతజ్ఞతవలన నీనియమము పుట్టియుండవచ్చును. ఈ కారణము వృషభము వధకు వర్తించునుగని గోవధకు వర్తింపదు. అంతేకాక గుఱ్ఱపుమాంస ము ఆకాలమున నిషిద్దముగా నుండలెదు. గుఱ్ఱముకూడ బరువులను మోసుకొనిపోవు జంతువేకదా. కనుక వృష్ణమాంస సిద్దాంతము తర్కమునకు నిలువజాలదు.

   గోమాంసముమాత్రమేకాక బ్రాహ్మణ క్షత్రియులుతినగూడని మాంక్షముల విధములు ఇంకనుగలవు. "ఐదునఖములు గల యైదుతరగతుల జంతువుల మాంసమునుమాత్రమే బ్రాహ్మణ *క్షత్రియులు తినదగినది". యని రామాయణమున నొక ప్రసిద్ధ శ్లోకము కలదు. దీనినిబట్టి చూచితిమేని బ్ర్రహ్మణులు మాంసాహారమును దిను విషయమున మఱే నిర్భంధముండినట్లు కానరాదు. ఇటుండియు, మహాభారతమున నొకచోట త్యాజ్యములగు జంతువులు పేర్కొనబడినవి. శాంతిపర్వములోని 36 వ అధ్యాయము "బ్రాహ్మణుడు తినగూడని మాంసమేది?" యని ధర్మరాజు భీష్మునదుగును. దీనికి భీష్ముడిచ్చిన ప్రత్యుత్తరమిది. +"ఎద్దులను, మంటిని (?) చిన్న పిపీలకలను,

  • పంచపంచనఖాభక్ష్యా బ్రహక్షత్రేణరాఘన, శల్యక శ్చానిధోగభా. ళళ కూర్మశ్పసంచమకి

+అనణ్వార్మృత్తికారైన, తధాక్షుద్రపిపీలికా॥,శ్లెష్మాతజస్తధానిప్రై, రభక్ష్యంవిషమేనచ।అభక్ష్యాబ్రహ్మణైర్మత్స్యాణ్ణ, శల్కైన్యేవిఅవిచర్జితా॥, శల్కైద్యేవైవిసర్జితా॥ । చతుష్పాత్కచ్చపాద న్యే మడూకాజలజాశ్చయే భాసా హింసా॥సువర్ణాశ్చ, చ్క్రనాకౌ॥ కాకోమద్గుశ్చ గృధర్చ,

వారు యాహారము.

మలినపదార్దములలో జన్మించు పురుగులను, విషమును బ్రాహ్మణులు తినగూదదు. పొలసులేని చేపలను, తాబేళ్ళను తిస్పకప్పలవంటి చతుష్పాత్తులగు జలచరములనుగూడ వారు భుజింపగూడదు. భాసములను, హంసలను, సువర్ణములను, చక్రవాకములను, ప్లవములను, కొంగలను, కాకులను, మద్గులను, గ్రద్దలను, శ్యేనములను, గుడ్లగూబలను, మాంసమును భక్షించు నట్టి పదునైన పొడుగుపాటి కోరలుగల చతుష్పాత్తులను, రెండు దంతములుగట్టియు నాల్గుద్ంతములుగట్టియు పక్షులను వారు తినగూడరు." దీని తరువాత, తక్కిన విధములగు మాంసములను బ్రాఃహ్మణులు తినవచ్చునని చెప్పబడియున్నది. ఇట్టి యనుకూల ప్రమాణము లుండినప్పటికిని క్షాత్రాయుగాంతము నాటికి హింద్వార్య్హులును, మిశ్రార్యులును పూర్వాచారపరాయణులగు క్షత్రియ్హులుతప్ప తక్కిన వారందరును, క్రమమముగా మాంసాహారమును మానివేయుచుండిరి. అధ్యాత్మికజీవనము కల వారు మాంసమును త్యజించి తీరవలయునని విధానముండింట్టు కాన వచ్చుచున్నది. "మాంసాహరమును మధ్యపానమును మానవునకు సహజములగు కోరికలు కనుక వానిని వాడుకొనవచ్చును. అయినను వానిని వదలిపెట్టుట మహాలాభ ప్రదజ్ము" *అని మ


శ్యేనోలూకాంతధైవచ॥ క్రవ్యాచాంష్త్రిన సర్వే చతుష్పార్పక్షిణశ్చయే యేషాంరోభయతోదంతా, చతుర్ధంష్ట్రాశ్చసర్వశ్:॥ మృత్తికా ' విషమ అనువానికి, 'నేల 'విషము అని అర్ధమువ్రాసినాము వీనినిజమైన భావమేమో తెలియదు.

నమాంసభక్షణేరోషా, నమద్యంంచమైధునే, ప్రవృత్తి నేషాభూతాజాం వృత్తిస్తుమాఫలా॥

క్షాత్రయుగమునాటి హింద్వార్యులు.

నువు వచించియున్నాడు. మాంసము తినవచ్చునా తినగూడదా యను ప్రశ్న క్షాత్రయుగాంతప్రాంతమున జనులమనస్సున్ చాల కలవరపఱపరచినట్లున్నది. ఇట్టి తర్కవితర్కములకు ముఖ్యకారణ ము అప్పుడు ప్రచారమునందుండిన అహింసాసిద్దాంతమే. అనుశాసన పర్వములోని 115 వ అధ్యాయమునందు యుధిష్టిరుడు ఇట్లు భీష్మునడిగెను. "అహింస పరమధర్మమని మీరు చెప్పుచున్నారు. శ్రాద్దసమయమున పితృదేవతలకు మాంస మర్పింపవలయునని మీరే చెప్పుచున్నారు. హింసలేకుండ మాంస మెట్లు వచ్చును? మాంసాహారమువలన కలుగు పాపమేది? దానిని వర్జించిన వారి కబ్బు పుణ్యమెట్టిది? జంతువును వధించి దాని మాంసమును దినిన వారి కెంతదోషము? ఇతరులు చంపితెస్సిన మాంసమును తినిన వారి దోషమెట్టిది?" ఈప్రశ్నములకు భీష్ముని యుత్తరముల జూడుడు. "తేజమును, ఆయువును, బుద్ధిని, బలమును, మేధాశక్తిని కాంక్షించువాడు హింసమానవలెను. మద్య మాంసములను వదిలినవాడు ప్రతిమాసమున నశ్వమేధము చేసిన వానికి లభించు పుణ్యము పొందును. ఇతరప్రాణుల మాంసము చేత శరీరమును పెంచుకొనువాడు తప్పకదు:ఖమును బొందునని నారదుడు వచించియున్నాడు. తనను ఎవరైన హింసించినపుడు ఎట్టి బాధ కలుగుచున్నదో అట్టి బాధయే జంతువులను హింసించు నపుడు వానికిని కలుగుచున్నదని తలంచవలెను. మాంసము కొరకే జంతువులు హింసింపబదుచున్నవి. హింసార్ధము ధనమిచ్చు వాడును, ఒకడు చంఫి తెచ్చినమాంసమును తినువాడును, జంతువులను స్వయముగా చంపువాడును హింసా దొషమున

వారి యాహారము.

సమానులు అయినను, ప్రాపంచికులకొఱకు మహర్షు లీవిధమున విధించియున్నారు. కాని మోక్షాసక్తుడగువాడు ఈ నియమము లను పాటింపవలసిన పనిలేదు. దేవతల కర్పింపబడినదియ్యూ పితరులకియ్యబడినదియు తప్ప తక్కిన మాంసం లన్నియు వర్జీయములే. మాంసము తినవచ్చునని వచించిన వసురాజు స్వర్గమునుండి యధోలోకమునంబడి యటనుండి పాతాళము పాలయ్యెను. అగస్త్యుడు జనులపైన దయదలచి వేటజంతువు ప్రోక్షితములని వచించెను. కనుక శ్రాద్ధములలో మాంసము నర్పింప వచ్చును. ముఖ్యముగా అశ్విజమాస శుక్లపక్షమున మద్యమాంస ములను ముట్టగూడదు. చాతుర్మాసములయందు వీనిని వర్జించిన వాడు, యశము, దీర్ఘాయువు, బలము, విజయము, అను వానిని పొందును. ఆశ్వీజమాసమున మాంసమును త్యజించుట వలనెనే నాభాగుడును, అంబరీషుడును స్వర్గము నకు బొయిరి. మద్యమాంసములను త్యజించినవారు మునులవలనబడు చున్నారు."

పైవాక్యములవలన, మనకు అక్కాలపు జనులకు మాంసాహారముపై గలిగిన అసహనభావమును పూర్వాచారమును త్రోసిపుచ్చజాలక కొన్ని సమయములందు అట్టి యాహారమును వారు వాడుట కొప్పుకొనుటయును తెలియవచ్చుచున్నది. వారు జంతువులబలిని, వేటను తప్పుగా దలపలేదు. వారు తినుచుండిన మాంసము దేవతల కర్పింపబడినట్టిదో వేటాడిన జంతువులదో యైయుండెను. రోమను కాధలిక్కులలోని "లెంటు" వలెనే అప్పటి క్షత్రియులుకూడ జానాబిప్రాయానుసారము ఒక మాసమువఱకుఇ మాంసమును వదలు చుండిరి.

క్షాత్రయుగమునాటి హింద్వార్య్లులు.

రాను రాను బ్రాహ్మణులు పైతృకవిధులకొరకు బలులకొఱకును హింసచేయుచుండినను, మాంసాహారమును మాత్రము విసర్జించిరి. యజ్ఞశేషమగు మాంసమును అగ్నిలో బడవేయసాగిరి. పితృదేవతా రాధనమున మాంసమును దినుట పాతకముగా పరిగణింపబడ మొదలిడెను. *కొందరు క్షత్రియులు వేటాడుట వదలక పోయినను మాంసాహారమును సంపూర్ణముగ వదలిరి.

      ఈ విధముగా హిందూజాతియంతయు మాంసాశనమునేకాక మధ్యపానమునుగూడ త్యజించుట అత్యంత ఘనకార్యమనుటకు సంశయించు వారుందురా! మధ్యపానాభ్యాసము యొక్క చరిత్రను పరిశీలించితిమేని, ఆరంభమున హింద్వార్యులకును వారి సోదరులగు జర్మనులకుండినంత మధ్యపానాసక్తి

  • పితృదేవల కర్పింపబడు వివిధమాంసము లీక్రిందిశ్లోకములందు వర్ణింపబడియున్నవి. (అనుశాసనపర్వము)

న్యౌమాసౌతుభపితృక్తిర్మత్సైపితృగణస్యసా, త్రీస్మాసానానిసేనా
విశ్పతుర్మాసం॥శేసష॥
అజేనమాసాన్ ప్రీయంతే సంచేన పితరోనృప, తారాహేమష
ణ్మాసాన్ సప్తవైశాకులేనతు । మాసామష్టై సాషన్ తేన రౌరినేణ
సంప్రభో॥
గవయస్యతుమాంసేన తృప్తి:స్యాద్శమాపిన్ |మాంసేనైకాగరప్రీతి
పితృణాం మహిషేణతు॥
గన్యేవదత్తేశ్రాద్దేతు సంవత్సరమిహోద్యతే । వ్యాఘ్రీణసస్య్హమాంసేన
తృప్తిద్వాదశవార్షికీ । అలంక్యాయభవేవర్గత్తంఖడ్గమాంసం పితృక్షయే

వారి యాహారము.

యుండెడిది. అలసియుండినపుడును, సంతోషమున నుండినపుడు ను కృష్ణార్జునులు మద్యపానము చేయుచుండిరని మహాభరతము మనకు జెప్పుచున్నది. యదువృష్టులు మధ్యపానరతులని మన మెరుగుదుము. బలరాముని త్రాగుబోతుతనము మనకు క్రొత్తవిషయముకాదు. త్రాగుబోతుతనము యొక్క్ ప్రభావము వలన యాదవులంతకలహములపాలైతుదకు మడిసిన సంగతిమనకు తెలిసినదె. సురాపానము చేయువారు సురలనియు, చేయనివారు అసురులనియు రామాయణమునందు గంగాఖ్యానములోనున్నది. దండకారణ్యముంకుబోవుచు గంగానదిని దాటుంపుడు, తాన్ 14 సంవత్సరముల్ల వనవాసమును నిరపాయముగా గడపి మరల వచ్చువేళ అనెకకుంభముల్ మధ్యమును గంగాదేవి కర్పింతునని సీత మ్రొక్కుకొనినది. యుదిష్టిరిని యశ్వమేధ పర్ణమునందు యజ్ఞ ప్రవేశము మద్యసముద్రంగా నుండెనని యున్నది. పై యంశములును, లెక్కకు మిక్కిలిగానున్న ఇతరములగు నుదా హర్ణములును కల్సి, క్షాత్రయుగారంభమున్ మన హింద్వార్యులు సాధరణముగాను క్షత్రియులు ముఖ్యముగాను మద్యమును సేవించుచుండిరని మనకు రుజువుచేయుచున్నవి. కాని ఆ యుగము ముగియువఱకు హిందువులలో విశేషజనులు, ముఖ్యముగా బ్రాహ్మణులందఱును మద్యము వదలి యుండిరి. కాని క్షత్రియులుమాత్రం ఇంకను పూర్వాచార శృఖ్మలములను తపించు కొనజాలరైరి. మద్యపానము పంచమహాపాతకములలో నొకటియయ్యెను. ఈపాతకములు ఉపనిషత్తులలోగూడ వచ్చి

క్షాత్రయుగమునాటి హింద్వార్యులు.

నవి. *కనక క్షాత్రయుగాదియందు బ్రాహ్మణులు ఈ నిషేధమును పాటించియుండిరేమో! అదెట్లుండినను, క్షాత్రయుగములోపల మాత్రము వారు మధ్యమును పూర్తిగా వదలుటయే కాక, దానిని ఆర్యేతరకార్యముగా భావించియుండిరనుట నిస్సంశము. ఈ విషయమునుగూర్చిన యొక వచనము శాంతిపర్వములోని 141 అధ్యాయమున విశ్వామిత్ర చండాలుర కధ యందున్నది. కఱవు కాలమున నొకనాడు విశ్వామిత్రుడు క్షుద్భాధాపీడితుడై యొక చండాలుని గృహము ప్రవేశించి చచ్చిన కుక్కకాలును తినుటకై తస్కరించెను. అప్పుడు విశ్వామిత్రునకును చండాలునకును, విశ్వామిత్రుని వర్తనమును గుఱించియు, బ్రామణుడగువాడు మాంసము తినవచ్చునాయనుటనుగుఱించియు నొక సంభాషణము జరుగుని. సంభాషణాంతమున, ఆహారవిషయమున ఈ నియమమును పాటింపకపోయినచో దోషముకాదనియు, "పతిత" శబ్దము త్రాగుబోతు విషయమున మాత్రమే వర్తించుచున్నదనియు విశ్వామిత్రుడు చెప్పియున్నాడు. +శాంతిపర్వములోని 120 వ అధ్యాయములో మోక్షధర్మప్రశంసయందు మఱియొక శ్లోకమున్నది. ఇంద్రుడు జంబుకరూపమున వచ్చి బాధితుడగునొక బ్రాహ్మణు నూఱడించుచుబ్రాహ్మణులగొప్పతనమునుగ్గడించుచునిట్లనును. "మధ్యము లత్వాకపక్షిమాంసము, ప్రపంచములోని సమస్త ప్రదార్ధములయందును ఎక్కువ రుచిగలవి అట్టివారినినీవు కలలోనైన" తలంపవు.


  • చాందోగ్యోపనిషత్తు 10 కాండము

+వైవాతిపాపంభక్షమాణస్య దృష్టంసురాంతు పిత్త్వానతతీతగోబ్ద:॥

వారి యాహారము.

ఇట్టిసదభ్యాసము బ్రాహ్మణునకుహింద్వార్యులలో నున్నత స్థానము నొసంగిన కారణములలోనొకటి. అప్పుడును ఇప్పటివలెనే బ్ర్రహ్మణులలో కొందఱు వంచకులుగూడనుండిరి. మొత్తము మీద బ్రాహ్మణులయందున్న ఈసదాచారము తక్కినవారిని సన్మార్గము నకు ద్రిపుటకు కారణమయ్యెను. కనుకనే "యాగాదులంచు తప్ప వారెప్పుడును మద్యపరముచేయరు" అనుమెగాస్తనీసు వచనప్పను స్ట్రాబో ఉదాహరించియున్నాడు.++

   ఈ ప్రకారము క్షాత్రయుగమున హించువులు గోహత్యను గోమాంసమును పూర్ణముగ విడిచిపట్టెరి. క్షత్రియులుతప్ప తక్కినవారందరు మద్యపానమును దాదాపుగా మానుకొనిది అయినను ఈ సిద్ధాంతమునకు కొన్ని నిషేధములు లేక పోలేదు. గంగానదీప్రాంతవాసులగు నార్యులు సంఘ, మతసం స్కారములందు పురోగాములై యుండ పంజాపుదేశపు టార్యులు పూర్వాచారపరాయణులైయుండిరి. కావుననే పంజాబువరిలో వివాహసంబంధములగు పూర్వాచార ములనేకములుండెను. వారు జాతిభేదమునకు పూర్తిగాలోబడినవారుకారు. ఆహారపానీయమ్లలో సైతము వారు తమతొంటిమార్గమును వదలలేదు, కావుననే గంగానదీప్రాంతవాసులు పంజాబువారిని నీతిహీనులుగా దలచుచుండిరి. మహాభారతములోని కర్ణపర్వమునందు ఒకశ్లోకము కలదు. !"గోవర్ధనమనునది మఱ్ఱిచెట్టు; సుభద్రయను

++ ఇది సోమపానముకాబోలును, అని మాక్ క్రిండల్ వ్రాసినాడు

!గోవర్ధనోపానమటు, సుభద్రంనామదత్వరం, ఏకద్రాజకులద్వారమా

సమాంత్స్మరామ్యహ॥ కర్ణకి

క్షాత్రయుగమునాటి హిద్వార్యులు.

నది చత్త్వరము. ఇది చిన్నతనమునుండి నేనెఱిగియున్న రాజకులద్వారము." అని యాశ్లోకమునకర్ధము. అనగా గోవధశాలయు, సురాభాండాశ్రయమును రాజమందిరద్వారమున తప్పక యుండునని దీని భావము. గోవధమును మధ్యపారమును గంగానదీ ప్రాంతవాసులగు నార్యులు అసహనముతొ జూచుచుడిరి. ఇంకొకశ్లోకమున నిట్లున్నది. "బియ్యముతో జేయబడిన మద్యమును ద్రావునట్టియు గొడ్దుమాంసమును ఉల్లిగడ్డలను, ఆపూసమాంసమును, వేయించిన ధాన్యమును తినునట్టి పంజాబు దేశవాసులు దుర్వర్తనము కలవారు" అప్పటివఱకును పంజాబు దేశపు స్త్రీపురుషులు గొడ్దుమాంసమునుదిని మైకమెత్తునట్లు మద్యమునుద్రావి రాత్రిందినములు స్వేచ్చావిహారము సల్పుచుండిన కారణమువలనె, గంగానదీ ప్రాంతవాసులగు నార్యులు వారిని హేయభావముతో జూచుచుండిరి. పంజాబుదేశపు టార్యులు ఈ విధముగా వెనుకబదియుండినను కాలక్రమున వారును గోవధను మహాపాతకముగా లెక్కించి తక్కుంగలవారి యభిప్రాయములతో నేకీభవించిరి.

ఆహారవిషయమున సర్వార్యజ్నసమ్మతమైయుండిన పైనియమ మును పాటింపనిజాతిమఱియొకటి యుండెను. అది సారస్వత బ్రాహ్మణజాతి. పొలసులేని చేపలను క్షాత్రయుగమునాటి బ్రాహ్మణుడు తినగూడరు. అట్టి యాచారమునకు విరుద్ధముగా నాటినుండి నేటివరకు మత్సములను దినుచుచుండు సారస్వత బ్రాహ్మణులయొక్క యాచారమును దెలుపుగాధ యొకటి శల్య పరములోని సరస్వత్యుపాఖ్యానముననున్నది. ఒకప్పుడు హిందూ

వారి యాహారము.

దేశమున ద్వాదశవర్షక్షామము మహాభయంకరముగా నుండెను. బ్రాహ్మణులు దేశదేశములకు వెడలిపోయిరి. అప్పుడు కొందరు బ్రాహ్మణులు మాత్రం సరస్వతీ నదీతీరమున మత్స్యాహారవ్రతులై అటేయుండి వేదములను గాపాడిరి. క్షామము పోయిన తరువాత బ్రాహ్మణులు మరలవచ్చి సారస్వతుల వద్ద వేదముల జదివి, వంగదేశ బ్రాహ్మణులును శన్వీబ్రాహ్మణులును సారస్వతుల యాచారమునే ఇప్పటికిని అవలంభించియున్నరు.

   ఆకాలమున హిందువులు సామాన్య్హులుగా భూజించు నాహారము ధాన్యసంబంధమైనది. అందును వారు ముఖ్యముగా వరియన్నమును దినుచుండిరి. సాధారనముగా ధనవంతులును ముఖ్యముగా క్షత్రియులును మాంసముతోగూడ వండబడిన యన్నమును-- ఈకాలమున పొలావు అనబడునట్టి దానిని-- తినుచుండిరి. రాజసూయానంతరము దుర్యోధనుడు హస్తినాపుర మునకు వచ్చి పిమ్మట, ధృతరాష్ట్రుడు కుమారునిజూచి "నిశితౌ దనమును దినుచున్న నీవు ఇట్లు శుష్కించుచున్నావేమి?" యని సభాపర్వమున నడుగును. *ఇదిగాక, క్షాత్రయుగాంతరమున వివిధ జీవితవస్థలలోనుండిన హిందువులెట్టియెట్టియహారమును భుజించు చుండిరో తెలుపు మఱియొక శ్లోకమున్నది. దానియర్ధమిది. "ధనవంతులు మాంసము విశేషముగాగల యాహారమును, మాధ్యమికస్థితిగలవరు పాలును పాలతోచేయబడిన వస్తువులు విశేషముగాగల యాహరమును, పేదవారు

  • అచ్చాదయసి ప్రోనారానశ్నతి పిళితౌదనం, ఆనానేయానహంత్య శ్వా: కేనాసిహరణ:కృళకి సభా॥

క్షాత్రయుగమునాటి హింద్వార్యులు.

ఎక్కువగా తైలపక్వములను తినెదరు. $

   వనపర్వమునందలి 190 వ అద్యాయమునందున్న ఒకశ్లోకము ను బట్టి చూచినచో, ఆర్యులు ఆరంభమున హిమాలయా పాదప్రాంతములందు నివాసముచేసి యుండిరనియు, అచ్చట వరి పంట యుండేననియు తెలియుచున్నది. అప్పుడుమాత్రమేగాదు, హిందూదేశపు ఉత్తరభాగములలోని పర్వతప్రాంతములు నేటికిని సువాసనగల వరిపంటలకు పేరుగాంచి యున్నవి. ఆర్యుల ప్రదేశములనుండి వెడలి వానికంటె నెక్కువయుష్ణముగానుండు మైదానములలోనికి క్రమక్రమము బ్రవేశించిరి. ఈక్రొతస్థలములు నాటికిని నేటికిని గోధుమలపంటలకును యవల పంటలకును యోగ్యములై యున్నవి. "యుగాంతమున జనులు యవలు గోధుమలు తిను స్థలములకుబోయెదరు." *ఈ శ్లోకార్ధమును సమన్వయముచేయదలచినయెడల మ్నము పైయూహనే యాధారము చేసికొనవలెను. దుర్యోధనుని యాహారము విషయమున వచ్చినశ్లోకమునందలి "పిశితౌదన" శబ్దమునుబట్టి చూచితిమేని ధనవంతులగువారు గోధుములకంటే బియ్యము యెక్కువగా వాడుచుండిరని తెలియుచున్నది.
    హిందువులు మితాహారులు, హిందువులకు నిర్ణీతములగు భోజనసమయములే,లేవని గ్రీకులు వ్రాసియున్నారు.  ఈ యంశమును బలపఱచు వాక్యములు కొన్ని మహాభారతమునం

$ అధ్యానాంమాంససపరమం మధ్యాఆం గౌరిసోత్తరం, తైలోత్తరం దరిద్రాణాం, భోజనంభరతర్షభ॥ ఉద్యో॥

  • యేయవాన్నాయనయదా, గోనూమ్నాస్తధైవచ, తాన్ దేకాన్ సంశ్రయిష్యంత యుగాంతే పర్యుసస్థితే॥నిన॥

వారి యాహారము.

గలవు. మాట్లాడకుండ భోజనము చేయుట మంచిదని మన హింద్వార్యులు తలచుచుండిరి, &కుటుంబమువారందఱు నొకమారే భుజించుచుండిరని తోచుచున్నది. విందువేళలందున్ యాగారులందును భూరిసంతర్పణములు జరుగుచుండెనని చెప్పవలెను. అశ్వమేధసమయమున వేలకొలది బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు భోజనమువలన సంతృప్తులైరని మహాభారమునం దున్నది. నిర్ణీత కాలమునందు భోజనముచేయని దురభ్యాసము మనయందు నేటికీని గలదు. విందుసమయములందు మధురాహారములు వడ్దింపబడుచుండెను. "శాకమ్లనువండు వంట వాండ్రును మధురపదర్ధములను వండువాండ్రును ఎప్పటివలెనే ధృతరాష్ట్రుని సేనయందుందిరి." z ఈ శ్లోకమునుబట్టి ధనవంతులు మధుర పదార్ధములను ఎల్లప్పుడును తినుచుండిరని తెలియుచున్నది. దుర్యోధనుని పాలనమునాటివలెనే యుధిష్టిరుని పాలనయందుసైతము అమర్పబడుచుండిన మధురపదార్ధము లేవియో చెప్పుటకు వీలులేదు. *శర్కర, అల్లము మొదలగు వస్తువులతో జేయబడు తియ్యని పదార్ధములను, కూర్గాయలను వండుటయందు తెలివిగల వంటవాండ్రను నర్ధమిచ్చు వివిధశబ్దములను వ్యాఖ్యాత


$ ప్రాజ్మిభోత్యమర్నియా ద్వాగ్యగోన్నమ కుత్సయన్॥ అను॥

z అరాలికాసూపకారా, రావికాండవికాస్తధా ఉపతిష్ఠన్తరాజా నం,ధృతరాష్ట్రం పురాయనా॥ఆశ్ర॥

  • ఆపూసములు, ఖండవిరాగములు (లేక రాగఖండములు) అను రెండు విధములగు పదార్ధములును మోదకములును అచ్చటచ్చట వచ్చుచుండును.

క్షాత్రాయుగమునాటి హింద్వార్యులు.

వివరించియున్నారు. కూరగాయల ప్రసక్తిపలుతావుల గాలదు. కాని యవియెట్టివో వ్రాయలేదు. ఉల్లిగడ్దలు, వెల్లిగడ్దలు సాధారణముగా పంజాబునందుమాత్రము వాడుకయందుండెనని యిదివఱకే చెప్పి యున్నాము. ఇవి మధ్యదేశమువారికి నిషిద్ధములుగా నుండెను. పాలు అందఱును ఉపయోగించుచుండిరి. పాలవలన తయారగు వస్తువులన్నిటిలోఉత్తమపదార్ధముమునేయి యేయని 'ఘృతంశ్రేయో ఉరశ్చిత: ' అను వాక్యమువలన దెలియుచున్నది.

                         ----