కోడెకారు చిన్నవాడా

వికీసోర్స్ నుండి

ముందడుగు (1958) సినిమా కోసం ఆచార్య ఆత్రేయ రచించిన లలితగీతం.

పల్లవి :

ఆమె : కోడెకారు చిన్నవాడా - వాడిపోనీ వన్నెగాడా || కోడెకారు ||

కోటలోన పాగావేశావా - చల్ పువ్వులరంగా

మాటతోనే మనసుదోచావా - చల్ పువ్వులగంగా

మాటతోనే మనసుదోచావా


అతడు : చింతపూలా రైకదానా - చిలిపిచూపుల చిన్నదానా || చింతపూలా ||

కోరికలతో కోటే కట్టావా - చల్ నవ్వులరాణి

దోరవలపుల దోచుకున్నావా - చల్ నవ్వులరాణి

దోరవలపుల దోచుకున్నావా


ఆమె : చెట్టుమీదా పిట్టవుంది - పిట్టనోటా పిలుపువుంది || చెట్టుమీదా ||

పులుపు ఎవరికో తెలుసుకున్నావా - చల్ పువ్వులరంగా

తెలుసుకుంటే కలిసి ఉంటావా - చల్ పువ్వులరంగా

తెలుసుకుంటే కలిసి ఉంటావా


అతడు : పిలువువిన్నా తెలుసుకున్నా - పిల్లదానా నమ్ముకున్నా || పిలుపువిన్నా ||

తెప్పలాగా తేలుతున్నానే - చల్ నవ్వులరాణి

నాకు జోడుగ నావ నడిపేవా - చల్ నవ్వులరాణి

నాకు జోడుగ నావ నడిపేవా


ఆమె : నేల వదిలి నీరు వదిలి - నేను నువ్వను తలపుమాని || నేల వదిలి ||

ఇద్దరొకటై ఎగిరిపోదామా - చల్ పువ్వులరంగా

గాలిదారుల తేలిపోదామా - చల్ పువ్వులరంగా

గాలిదారుల తేలిపోదామా


అతడు : ఆడదాని మాటవింటే - తేలిపోటం తేలికంటె || ఆడదాని ||

తేల్చి తేల్చి ముంచుతారంట - చల్ నవ్వులరాణి

మునుగుతుంటె నవ్వుతారంట - చల్ నవ్వులరాణి

మునుగుతుంటె నవ్వుతారంట