కూసుమంచి గణపేశ్వరాలయం/కృతజ్ఞతలు
కృతజ్ఞతలు
పురాణమిత్యేవ న సాధు సర్వం. పాతదైనంత మాత్రాన ప్రతిదీ గొప్పదేం కాదు. అలాగని మెరిసేదంతా బంగారమూ కాదు. తాతల కాలం నాటి కిటికీ అనుకుంటూ మూసిపెట్టి భజన చేస్తే ఏమొస్తుంది?శుభ్రం చేసి బార్లా తెరస్తేనే కదా స్వచ్చమైన గాలి లోపలికోస్తుంది? స్థానిక చరిత్రలను నాస్టాల్జిక్ అనుభూతి కోసమే వాడుకుంటే సరిపొదు.చరిత్ర నేర్పే పాఠాలను అర్థం చేసుకుంటూ, వర్తమానం లోని వాస్తవానికి అన్వయించుకుంటే ప్రగతికి మేలు జరుగుతుంది.
1998లో ఉపాధ్యాయుడుగా ఉద్యోగ బాధ్యతలలోకి వచ్చిన తర్వాతనుంచి ఈ ప్రాంత మిత్రులు అర్వపల్లి వీరాస్వామిగారు, ధనమూర్తిగారు, బండి శేషయ్యగార్లతో కలిసి ఈ దేవాలయాన్ని సందర్శించినప్పుడల్లా ఈ బృహత్తరమైన నిర్మాణాలను వాటివెనకున్న నిపుణతను చూసి అబ్బురపడటంతో పాటు, ఖమ్మం జిల్లాకు చరిత్రలేదని బాధపడేకంటే ఇటువంటి విలువైన సంపద కాలగర్భంలో కలిసిపోతుంటే చూస్తూ వుండాల్సిందేనా అనుకునే వాడిని. ఎవరూ ఎందుకు పట్టించుకోవట్లేదనే దగ్గరనుంచి, నేనే ఎందుకు పట్టించుకోకూడదు? ఒక్క అడుగు నా ఓపిక మేరకు నేనే వేస్తే, మరికొన్ని అడుగులు కలవాలని కోరుకోవడంలో అర్ధం వుంటుందికదా అనిపించింది. అందుకే సైన్సు, లిటరేటరు బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ శ్రద్ధగా చరిత్రను చదవటం అర్ధం చేసుకోవడం చేస్తూ ఔత్సాహికుడిగా పనిని ప్రారంభించాను. ఇప్పటికే అచ్చంగా ఈ ఆలయం గురించి పేర్కొన్న రచనలు కానీ శాసనాలుకానీ ఏవీ దొరకలేదు. సరే మొదటిప్రయత్నం చేయడం కూడా మంచి విషయమేగా అనే ఉద్దేశ్యంతోనే ఇలా మీ ముందుకు వచ్చాను.
ఈ క్రమంలో గుడి వివరాలను పారంపర్యంగా తెలుసుకున్న సంగతులను ఓపికగా వివరించిన దేవాలయ పూజాదికాలను నిర్వహిస్తున్న శ్రీ దేవులపల్లి శేషగిరిశర్మ గారు, వారి తండ్రిగారు శివరామయ్య శర్మగారికి ప్రత్యేక ధన్యవాదాలు.
అనేక సందేహాలను సందేహాలను నివృత్తిచేసిన శ్రీరామోజు హరగోపాల్ గారూ, ఎన్ వేణుగోపాల్ గారూ, వేముగంటి రఘునందన్ గారూ, వేముగంటి మురళీ కృష్ణగారూ, మా గురువుగారు శ్రీ గంగుల బాబుగారు అలాగే శాసన పాఠాలను ఎలా అర్ధంచేసుకోవాలి? పరిష్కృతమైన శాసనాలను ఎక్కడ సంపాదించాలి లాంటి వివరాలు అందజేసిన శ్రీయుతులు ఎం.నారాయణ శర్మ, శ్రీ సంగిశెట్టి శ్రీనివాస్, శ్రీ గుర్రం సీతారాములు గార్లకు...
దేవాలయ పునర్నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించిన అప్పటి సి.ఐ ప్రతాపరెడ్డిగారు ఫోన్ ద్వారా సంప్రదించినప్పుడు ఆప్యాయంగా ఆ సంగతులన్నీ తెలియజేసినందుకు,
దేవాలయన్ని క్షుణ్ణంగా పరిశీలించడంకోసం నాతో పాటు కలిసి తిరిగిన మిత్రులు అర్వపల్లి వీరస్వామి, ధనమూర్తి, బండి శేషయ్య, రామకృష్ణ,భాస్కర్ కొండ్రెడ్డి గార్లకు...
గుడిపరిశీలన, రామప్ప, కోటగుళ్లతో సరిపోల్చటం ప్రూఫ్‌రీడ్ ఇలా ప్రతివిషయంలోనూ తన సమాయాన్ని నాకోసం కేటాయించిన కవి నందకిశోర్‌కు కృతజ్ఞతలు చాలా చిన్నమాట.
ఇలా చేయబోతున్నానని చెప్పగానే వెన్నుతట్టి ప్రోత్సహించిన శ్రీయుతులు సుంకిరెడ్డి నారాయణ రెడ్డిగారు, జితేంద్రబాబు గారు, గణపేశ్వరాలయ చరిత్రపై ఇదే దేవాలయ ఆవరణలో ప్రాసంగిక వివరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాచేత మాట్లాడించిన 'అమ్మఒడి' సంస్థకు నిర్వాకులు శ్రీ సాధనాల వెంకటస్వామినాయుడు, సోదరుడు లెనిన్ శ్రీనివాస్, రాజశేఖర్ గారు, బావ పోతగాని సత్యనారాయణ,తదితర మిత్రులకు...
రిఫరెన్స్ కోసం అనేక పుస్తకాలను సమాచారాన్ని వెతుక్కోవడంలో సహకరించిన సత్తుపల్లి గ్రంధాలయ లైబ్రేరియన్, మరియు సృజన సాహితీ సమాఖ్య నిర్వాహకులు శ్రీ జి.రామకృష్ణ, బోడేపూడి విజ్ఞానకేంద్రం నిర్వాహకులు మా బాబాయ్ శ్రీ కపిల రాంకుమార్ గారూ,హైదరాబాద్ యస్వీకే గ్రంథాలయానికి...
పుస్తకం పని త్వరగా పూర్తయ్యేందుకు తన ల్యాప్‌టాప్‌ను ఇచ్చిన అన్నయ్య కవియాకూబ్ గారికి, టూరిజం మీద నాకు ప్రత్యేకశ్రద్ధ ఏర్పడేందుకు కారణం అయిన బావమరిది యం.కృష్ణసుమంత్ అసిస్టెంట్ ప్రొఫెసర్, టూరిజం మేనేజ్‌మెంట్ కాకతీయ విశ్వవిద్యాలయం గారికి,
నాకు వెన్నంటి సహకరించిన నా సతీమణి లక్ష్మికి, పిల్లలు రక్షితసుమ, సుప్రజిత్ రామహర్షలకు, తమ్ముడు కట్టా జ్ఞానేశ్వర్, నాగలక్ష్మిలకు, అమ్మ కట్టాలీలావతికి,
వివిధ సందర్భాలలో చాలా విషయాలను చెప్పిన గ్రామస్థులు, పుస్తకాన్ని సకాలంలో ఇంత అర్థవంతంగా తయారుచేసి ఇచ్చిన మిత్రులు అబ్దుల్ వాహెద్ గారికీ, మరియు ఇతర మిత్రులకూ పేరుపేరునా ధన్యవాదాలు.
కట్టా శ్రీనివాస్
9885 133969
nivas.katta74@gmail.com
www.antharlochana.blogspot.in