కుంతీవిలాపం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

అదియొక రమణీయ పుష్పవనము

ఆ….వనమందొక మేడ

అదియొక రమణీయ పుష్పవనము

ఆ….వనమందొక మేడ


మేడపై అదియొక మారుమూల గది

ఆ గది తలుపులు తీసి మెల్లగా

పదునైదేండ్ల యీడు గల బాలిక… పోలిక రాచపిల్ల

జం కొదవెడు కాళ్లతోడ..

దిగుచున్నది క్రిందకి

మెట్టుమీదుగాన్ …ఆ……


ఆ అమ్మాయి ఇటువైపే వచ్చుచున్నది

యీ నదివద్ద ఆమెకు ఏం పనో


కన్నియలాగె వాలకము కన్పట్టుచున్నది

కన్నియలాగె వాలకము కన్పట్టుచున్నది

కాదు కాదు ఆ చిన్ని గులాబి

లేత అరచేతులలో - పసిబిడ్డ యట్టున్నది

ఏమి కావలయునో గద ఆమెకు

అచ్చు గుద్దినట్టున్నవి రూపురేఖలు

యెవ్వరో యవరాదాతడామె బిడ్డ


ఆమె సంతోషపడుతున్నదా

ఆమె దుఃఖిస్తున్నదా


దొరలు ఆనంద భాష్పాలో

పొరలు దుఃఖభాష్పములోగాని

అవి గుర్తుపట్టలేము

రాలుచున్నవి ఆమె నేత్రాలు నుండి

బాలకుని ముద్దు చెక్కుటద్దాలమీద


ఒహొ తెలిసింది


గాలితాకున జలతారు

మేనిముసుగు జారెనొకింత

అదిగో …చిన్నారి మోము

పోల్చుకున్నాములే ….

కుంతిభోజపుత్రి స్నిగ్ధసుకుమారి

ఆమె కుంతి కుమారి


మునిమంత్రమ్ము నొసంగనేల

యిడుగో మున్ముందు మార్తాండూ నే కోరగనేల

కోరితినో భో ఆతండు రానేలా వచ్చెను భో

కన్నియనందు నెంచక -నను చేపట్టరావేలా

పట్టెను భో … పట్టి నొసంగనేలా

అడుగంటెన్ కుంతి సౌభాగ్యముల్..ఆ....


అయ్యో భగవానుడా


ఈ విషాదాశ్రువులతోడ

ఇంక ఎంతకాలము యీ మేను మోతూ గంగాభవాని

కలుషహారిని ఈ తల్లి కడుపులోన

కలిసి పోయెద నా కన్న కడుపుతోడ..ఆ.....ఈ విధంగా నిశ్చయించుకొని

బిడ్డను రొమ్ములలో అదుముకుంటూ

కుంతీకుమారి నదిలోనికి దిగిపోతున్నది

అంతలోనది తరంగాలలో నుండి

తేలుతూ ఒక పెట్టె

కొట్టుకుంటూ వచ్చింది

కుంతీకుమారి కళ్ళలో

ఆశాకిరణాలు మెరిసాయి

ఈశ్వరేచ్చఇలా ఉందని గుర్తించింది

ఆమె ఆత్మహత్యనుండి విరమించుకొంది

పెట్టెనిండాఒత్తుగా పూల గుత్తులు చిగురుటాకులు పేర్చింది

మెత్తగాపక్క దిద్ది తీర్చింది - వత్తుకోకుండా

చేత్తో వత్తి చూసింది….

యెలాగో గుండెలు బిగబెట్టుకొని


జాష్పములతో తాముతడిసిన ప్రక్క మీద

చిట్టితండ్రిని బజ్జుండబెట్టె తల్లి


భోగభాగ్యాలతో తులతూగుచున్న

కుంతిభోజునీ గారాబుకూతురినై

కన్న నలుసుకు ఒక్క పట్టెడన్నమైన

పెత్తుకోనోచనైతి పాపిష్టిదానా...ఆ..


నా చిట్టిబాబు


పెట్టియలోయలోన నొత్తిగిల్లబెట్త్టి నినున్

నడిగంగలోకి నెట్టుచుండి తండ్రి

ఇక నీకును నాకు ఋణము తీరె

మీదెట్టులయున్నదో మన యదృష్టము

ఘోరము చేసినాను నా పుట్టుగమాసిపోను

నినుబోలిన రత్నము నాకు దక్కునే

అయ్యో తండ్రి

పున్నమ చందమామ సరిపోయేడి

నీ వరహాల మోము

నేనెన్నటికైనా జూతునే

మరే దురదృష్టము గప్పికున్న

నాకన్నుల కంత భాగ్యమును కల్గునే

ఏయమ్మయిన ఇంత నీకన్నము బెట్టి

ఆయువిడినపాటిమాట గదోయి నాయనా


తల్లి గంగాభవాని


బాలభానుని బోలు నా బాలు

నీదుగర్భమున నుంచుచుంటి

గంగాభవానీ

బాలభానుని బోలు నా బాలు

నీదుగర్భమున నుంచుచుంటి

గంగాభవానీ

వీనినే తల్లి చేతిలోనయిన పెట్టి

మాట మన్నించుమమ్మా…ఆ….ఆ…

నమస్సులమ్మా

నమస్సులమ్మా

నమస్సులమ్మా


మరులు రేకెత్త బిడ్డను

మరల మరల నెత్తుకొనుచు

పాలిండ్ల పై నొత్తుకొనుచు

మరులు రేకెత్త బిడ్డను

మరల మరల నెత్తుకొనుచు

పాలిండ్ల పై నొత్తుకొనుచు

బుజ్జగింపుల మమకార ముజ్జగించి

పెట్టెలోపల నుంచి జోకొట్టె తల్లీ


ఆమె మాతృహృదయం

తటపట కొట్టుకుంటున్నది పాపం


ఆతపత్రమ్ము భంగి

కంజాత పత్రముండు

బంగారు తండ్రిపై ఎండ తగులకుండ సందించి

ఆతపత్రమ్ము భంగి

కంజాత పత్రముండు

బంగారు తండ్రిపై ఎండ తగులకుండ సందించి

ఆకులోనుండి ముద్దు మూతిపై

కట్టకడపటి ముద్దునునిచి

నన్ను విడిపోవుచుండే

మా నాన్నయనుచు

కరుణ గద్గద కంఠియై


కంఫమాన హస్తములతోడ

కాంక్షలల్లాడ కనులు మూసుకొని

నీటిలోనికి త్రోసె పెట్టె


నది తరంగాలలో పెట్టె కొట్టుకుపోతున్నది

……………………………………

ఏటి కెరటాలలో - పెట్టె ఏగుచుండ

గట్టుపై నిల్చి, అట్టే నిర్ఘాంతపోయి

నిశ్చల, నిరీహ, నీరస, నిర్నిమిష

నేత్రములతో కుంతి చూచుచుండె…