Jump to content

కాశీయాత్ర చరిత్ర/ఏనుగుల వీరాస్వామయ్యవారి జీవిత చరిత్ర

వికీసోర్స్ నుండి

ఏనుగుల వీరాస్వామయ్యవారి జీవిత చరిత్ర*

రచయిత
శ్రీ కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ళగారు

ఈ చెన్నపట్టణపు కాపురస్థుడయిన శ్రీవత్స గోత్రోద్భ వుడైన యేనుగుల సామయమంత్రి మాధన్యునకు పుత్రుండగు యేనుగుల వీరాస్వామయ్యవారితోను బహుదినములు సహవాసము చేసి స్నేహితుడనై యుండిన నేను, ఆయన చేసిన కాశీయాత్ర చరిత్రలోని సంగతులను వ్రాసేటందుకు ముందుగా ఆ పురుషుని చర్యలను తెలిసిన మట్టుకు చెప్పక పోదునేని ఆయన విషయమై న్యాయము సడిపించిన వాడను కాకపోదు నన్న భయముచేత వాటిని పూర్తిగా వర్ణింపను శక్తి యోగ్యతలు లేని వాడనైనా పూనుకోవలిసి వచ్చినందున వాటిలో కొన్నింటిని సంగ్రహముగా వర్ణించిన వాడ నౌచున్నాను.

యేనుగుల వీరాస్వామయ్యగారికి తొమ్మిదవ యేట పితృని యోగము సంభవించెను. అప్పుడు ఆయన తల్లివినాగా వేరే పోషకులు లేక యుండిరి. తండ్రి వుంచిన ఆస్తిని మితముగానే యుండెను. పండ్రెండవ యేట యింగిలీషు బహు వేగముగా చదవ శక్తిగలిగి యుండినందున అప్పుడు ఆయన ఆపఫీసులో నుండే యగ్జామినరులు యిద్దరున్ను ఆయనను రీడరుగా వుంచుకోవలెనని వివాదపడుచు వచ్చిరి. దానివల్ల ఆ వయస్సులో ఆయనకు కలిగియుండిన సామర్థ్యము తెలియవచ్చుచున్నది. పదమూడవ యేట తిర్నవల్లి కలక్టరు కచ్చేరీలో యింటేరు ప్రిటరుగా నన్ను ట్రాన్సులేటరుగానున్న రెండు సంవత్సరములు వుండి పదియేవనయేట పట్టణమునకు వచ్చిచేరెను. అటుతర్వాతను కొన్ని సంవత్సరములవరకున్ను యింగ్లీషు హవు


  • ఈజీవిత చరిత్రను శ్రీ కోమరేశ్వరపురం శ్రీనివాస పిళ్ళెగారు రచియించి కాశీయాత్ర చరిత్రతో చేర్చి 1838 లోఅచ్చువేయించారు. ఇంకా ఇతర వివరాలకు పీఠిక చూడండి. (సులు) *యేజన్సీలు గొప్ప జమీందారులు వీరితోవర్తకసరళిగా వ్యా(సంగము)*చేయిచువచ్చి !వొయర్ హవుసులొ బొక్కీపకీరుగావుండి హేడు కౌంటాంటు అయి తర్వాత సుప్రీంకోర్టు

$యింటేరు ప్రీటరు, పనిలో ప్రవేశించినారు. అప్పుడు బోర్డు ఆవుత్రేడు ఆఫీసువారు ఆయన యెడల తమకు కలిగియుండే విశ్వాసమునకు గురుతుగా ముక్కుపొడి వేశే బంగారుడబ్బి యొకటి బోర్డు శక్రిటేరి మూలముగా సుప్రీంకోర్టు జడ్జీగారి శలవుమీద ఆయనకు యిప్పించినారు.

ఆయన తనకు పరులు స్వల్పోపకారము చేసినా వారియెడల జరిగించిన మేలు చెప్ప నలవిగాదనుటకు ఆయన తిరుణామలకు వెళ్ళినప్పుడు ఆ గుడిలో తనవలెనే స్వామి దర్శనమునకు వచ్చిన ప్రజలకు సహాయముగా నుండే యొక బంట్రౌతు తనకు జాగ్రత్తగా స్వామి దర్శనము చేయించినందుకు వాని మంచి నడతలను


  • నాకు దొరికిన ప్రతిలో బ్రాకెట్లలోని అక్షరాలు చిరిగివున్నాయి.

! మనదేశములో వర్తకం చేయడానికి వచ్చి ప్రభువులైన ఇంగ్లీషు వర్తక సంఘంవారు చాలా కాలం వరకూ దేశపరిపాలనతో పాటు తమ వ్యాపారం కూడా జరుపుతూనే వుండేవారు. అందువల్ల ప్రభుత్వం కచ్చేరీలతోపాటు వ్యాపార కార్యాలయాలుకూడా వుండేవి. బోర్డుఆఫ్ త్రేడు కుంఫినీవారి వర్తక శాఖకు సంబందించిన కార్యాలయము. వొయర్ హవుసు అనగా సరకులకొట్టు.

$ ప్రస్తుతం చెన్నపట్నంలో వున్న హైకోర్టు 1862 లో స్థాపింపబడినది. అంతకుపూర్వం దీని స్థానే రెండు ఉన్నతకోర్టు లుండేవి. ఒకటి ఇంగ్లీషురాజు అధికారంక్రింద స్థాపింపబడి ఇంగ్లీషు న్యాయశాస్త్రం ప్రకారం కేవలం విచారించే పరమోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు. రెండవది ఇంగ్లీషుకంపెనీవారి అధికారంక్రింద స్థాపింపబడి మనదేశంలొ హిందూ మహమ్మదీయుల ధర్మశాస్త్రాల ప్రకారం కేసులు పరిష్కరించే జిల్లాకోర్టులపైన అధికారం గలిగిన సదరు అదాలతు కోర్టు. ఈ రెండు కోర్టులలోను ఒక్కొక్క ప్రధాన న్యాయమూర్తి ఇద్దరేసి సాధారణ న్యాయమూర్తులు వుండేవారు. రెండుకోర్టులలోను ఇంగ్లీషు అరవము తెనుగు మొదలైన భాషలలో తర్జుమా చేసే ఉద్యోగులుండేవారు. వారినే 'ఇంటర్ ప్రిటర్ ' అనేవారు. వీరాస్వామయ్యగారీ పనిలో 1819 లో ప్రవేశించారు. యిచ్చటా రివిన్యూబోర్డువారికి శ్రుతపరచి వానికి వెండిబిళ్ళయున్ను ఒక వరహాయెక్కువ జీతమున్ను కలిగేలాగు చెసినది సాక్షిభూతముగా నున్నది. ఆస్థలమునకు అష్టబంధనము చేయించి గజదానము చేసినారు. యిది వారి శక్తికి యెచ్చయిన కార్యముగా అందరికిన్ని తెలియవలశినది. అక్కడి కలకటరు ఆయననున్ను ఆయనతో కూడా వచ్చిన మరికొందరు ప్రభువులనున్ను చూచి మీరందరున్ను కూడి యిక్కడి దేవుల్నికి రధముకట్టిస్తే బాగా వుండునని చెప్పగా అప్పట్లో ఆ ప్రభువులందరుకున్ను అలాగే చేయచున్నామని ఆయనగుండా అనిపించి అక్కడినుంచి పట్టణమునకు వచ్చిన తర్వాత ఆ ప్రభువులు ఆ కార్యమును గూర్చి సదరహి అయ్యవారితో యెచ్చరించడమే కానుకొనిరి. అయ్యవారు తాను మంచిదని చెప్పినందున ఆకర్యము తన శక్తికి మించినదైనా అపరిమతమైన ధనవ్రయము చేసి రధము కట్టించి తన మాటను కాపాడు కొన్నారు. యిందువల్ల ఆడినమాట కాపాడుటకై శక్తికి మించిన కార్యములను సాధింపుచు వచ్చినారని స్పష్టముగా తెలియు చున్నది. వారి కాశీయాత్ర వెళ్ళినప్పుడు నేను ఆ రధానకు యినప గొలుసులు జాగ్రత్త పెట్టి గవర్నమెంటువారిగుండా వాటికి రంగుపూయించిన సంగతి స్వల్ప సహాయమైనా దాన్ని అనేక ప్రకరణములలో నుదాహరించి గొప్పగా కొనియాడిరి. యీలాగు స్వల్పోపకారములను గొప్పగా కొనియాడుతూ వచ్చినందున యితరులకు విశేష కార్యముల యెడల ప్రవృత్తికలుగుచూవచ్చెను.

ఒక్క సంవత్సరమునకు అధికముగానే వారు ప్రతి ద్వాదశిన్ని భక్ష్య భోజ్య ఫలాజ్య దధి ప్రాజ్యములయిన బ్రాంహ్మణారాధనలు చేసి తర్వాత తాను ద్వాదశి పారణ చేయుచు వచ్చినారు. ఆ సంతర్పణలు యీ పురమందు మహోత్సవములుగా నుండినవి. అన్న ప్రధానమందు వారి చాతుర్యమున్ను జాగ్రత్తయున్ను వర్ణింప శక్యము గావు. వొక్క స్థలమందు ఏకపాకములో ఏకాపోశనముగా వొక్క లోపమున్ను లేకుండా మూడు నాలుగు వేల బ్రాహ్మణుల భుజించునప్పుడు తా నొక పరిచారకుని కంటే సులభుడుగా నటించెను. అందరికిన్ని అనేక విషయములలో కాలయాపన మౌచున్నది. ఆ పురుషుడు ఇట్టి సద్విషయమందు, శ్రమను యెంచక స్వల్పకాలమును వ్రయపరచినది పరలోకగతుడైనా వున్నట్టే కొనియాడబడేలాగు చేయుచున్నది. ఇట్టి సత్కార్యము చేసినవారికి అది కీర్తి హేతువు కావడము మత్రమేగాక యితరులకున్ను అలాటి కీర్తి యెడల సుబుద్ధి కలగుటకు కారణ మవుచున్నది.

యీ పురమందు క్షయమాస *విషయ మయి మహాసభ కూడినప్పుడు అయ్యవారు తన పక్షమును శ్రుతి స్మృతి ప్రమాణములతో స్థాపన చేయగా ఆ సభవారు మిక్కిలీ సంతోషపడి అందుకు చిహ్నముగా అయ్యవారికి రత్నహారమును బహుమతిచేసి వారి సద్గుణములను వొక పత్రికలో వ్రాసి ఆయనకు పంపిరి.


  • దక్షిణదేసములో చాంద్రమానము సౌరమానము కూడా వ్యవహారంలో వున్నాయి. ఉత్తరదేశంలో బార్హ స్పర్యేమానముమాత్రం వ్యవహారంలో వుంది. సౌరమాన సంవత్సరానికి 365 దినములు 15 గడియల 31 విగడియలు ఉంటాయి. చాంద్రమాన సంవత్సరములో 360 దినములున్ను, బార్హస్పత్యమాన సంవత్సరానికి 361 దినముల 11 గడియలున్నూ వుంటాయి. అందువల్ల ఈమూడు మానముల ప్రకారం గుణింపబడే పంచాంగాలకు తేడా ఉండితీరాలి. అయితే దక్షిణదేశంలోని దైవజ్ఞులు చాంద్రమానాన్ని సౌరమానంతో సరిపుచ్చడానికి మనపంచాంగాలలోని అధిక క్షయ తిధులలాగనే అధిక క్షయ మాసాలు కల్పించారు. ఒక్కొక్క సంవత్సరంలో అధికమాసం అని పేరుపెట్టి ఒకమాసాన్ని చేర్చి సంవత్సరానికి 13 నెలలు చేస్తారు. ఇలాగ సరిపుచ్చుకుంటూ వస్తూంటే కొన్ని సంవత్సరా లయ్యేటప్పటికి చాంద్రమాన సంవత్సరంలో ఒక నెల తగ్గిస్తేగాని సౌరమాన సంవత్సరానికి సరిపోవని పరిస్థితి తటస్థింది. అంతట మన దైవజ్ఞులు, పండితులు, సభచేసి ఏ నెలను లెక్కలోనుంచి తీసివేయవలెనో నిర్ణయిస్తారు. అట్టిమాసానికే అనహస్పతి క్షయమాస మంటారు. అంతట ఆ క్షయమాసం లెక్కలోకిరాక తరువార వచ్చేమాసంలో కలసి పోగా ఆ సంవత్సరంలో 11 నెలలే వుంటాయి. శాలివాహనశక 1744 చిత్రభాను సం||లో పుష్యమాసము క్షయ మాసముగా నిర్ణయించబడింది. అది క్రీస్తు శకము 14-12-1822 కును

11-1-1823 కును మధ్య కాలమున వచ్చిన మార్గశీర్ష మాసమునకు సరిపోతున్నది. (స్వామి కణ్ను పిళ్ళగారి ఎపిమిరిస్ చూడండి.) ఆయన వుద్యోగములో నుండిన కాలము వరకు ఆ కోర్టు జడ్జీలకు తృప్తిగా నడుచుకొన్నారనేటందుకు దృష్టాంతముగా పెద్ద జడ్జీ యయిన సర్ రాల్ఫు ఫాల్మరు దొరగారు *ఆయనకు వ్రాసి యిచ్చిన టెస్ఠిమోనియాల్ అనే యోగ్యతాపత్రికలో విశేషముగా ఆయన కోర్టులోనున్ను, చేంబరులోనున్ను అలసట లేక బహు నెమ్మదితో పనులు గడుపుచు వచ్చె ననిన్ని, ఆయన తనగొప్ప వుద్యోగపు పనులను మిక్కిలీ నమ్మకముగా జరిపింఛె ననిన్ని మరిన్ని ప్రజల మేలుకోరి స్మృతిచంద్రిక మొదలైన కొన్ని పుస్తకములకు ట్రాన్సులేషన్ చేసెననిన్ని నే నెరిగినంతలో గవర్నమెంటువారి విశేషకృపకు యీ పురుషుడు పాత్రు డయి నట్టు హిందు పెద్ద మనుష్యులలో మరి ఎవరున్ను యెక్కువైన వారి లేరని దృఢముగా నాకు తోచి యున్నదనిన్ని వ్రాయబడి యున్నది.

లోకములో గంగాస్నానమునకు వెళ్ళిన పురుషుడు తన తల్లి దండ్రులకు గంగ తెచ్చి యివ్వడము వాడికె బడియున్నది. యీ మహాపురుషుడు గంగను పడవలు బండ్లు కావళ్ళు వగయిరాల మీద తెచ్చి యీ దేశములో నుండే నాలుగు వర్ణాల వారిలో నున్నుండే గొప్పమనుష్యులగుండా ఆ యా వర్ణములలోని ముఖ్యుల పేళ్ళు తెలుసుకొని వారి కందరికి గంగనున్ను జగన్నాధ పట ప్రసాదములనున్ను యిప్పించెను. అందువల్ల అందరినిన్ని తన బంధుసమానులుగా చూచే వారని స్ఫుటముగా తెలియుచున్నది. ఆయన యాత్ర బోవునప్పుడు #నేను సకృదావృత్తి అక్కడి వినోదములను వ్రాయించి పంపించవలె నని అడుగు కొన్నందుకు


  • సర్ రాల్ పాల్మర్ గారు మద్రాసుసుప్రీము కోర్టులో 18-7-1824 తేదీన న్యాయమూర్తులలో నొకడుగ నియమింపబడినారు. 28-1-1825 వ తేదీన ప్రధాన న్యాయమూర్తి యైనారు. ఈయన 25-10-1835 వ తేదీన పని చాలించుకొన్నారు.
  1. వీరాస్వామయ్యగారు మద్రాసునుండి 18-5-1880 వ తేదీన యాత్రకు బయలుదేరి 3-9-1881 వ తేదీన తిరిగి వచ్చినారు. యాత్రలో ప్రతిదినచర్యలనున్ను ఆయా ప్రస్తావనములలో జగదీశ్వరుడు తనకు తోపచేసిన తాత్పర్యములనున్ను మార్గమందు పరులవల్ల తాను చెందిన సహాయములనున్ను, తనవలె యాత్ర పోవువారు మార్గములో పూర్వముగానే జాగ్రత్త పెట్టుకొనవలసిన విషయములనున్ను క్రమముగా అప్పుడప్పుడు వ్రాసి పంపుచు వచ్చిరి. ఆ పుస్తకమును చూచుటవల్ల యాత్రబోయి చూచి తెలియవలసిన సంగతులన్నీ తెలియుచున్నవి. ఆ పుస్తకము పనయూరి వెంకుమొదలారిగుండా అరవముతొ తర్జుమా చేయించబడి అచ్చు వేయించబడి యున్నది. నాగపూరి వీరాస్వామి మొదలారి మహారాష్ట్రముతో భాషాంతరము చేయించినాడు. ఆ మహారాష్ట్ర పుల్స్తకమును నాగపూరి రెసైడెంటుగారు తాను యింగ్లీషుతో త్రాన్సులేషన్ చేసి ప్రసిద్ధి పరచ తలచి అయ్యవారిని సెలవు అడిగినందుకు వీరు నేనే భాషాంతరము చేయించి పంపుచున్నానని తెలియజేసి కొంత భాషాంతరము చేయించినారు. భగవంతుని కృపవల్ల కొదవయున్ను యే పుణ్యాత్ముల గుండానయినా పూర్తి కావచ్చును.

వందసంఫత్సరపు క్షామము * లో నేను కొంత ధాన్యసంగ్రహము చేసి వుంచడము మేలని చెప్పినందుకు అయ్యవారు మనము ధ్యానము సంగ్రహించి మనము మట్టుకు భుజించి అన్నాతురులై దు:ఖపడే పేదలను చూచుచు జీవించుట అప్రయోకము గనుక తన ప్రయోజనమునకు గాను విస్తరించి జాగ్రత పెట్టుకొన రాదని చెప్పి ఆ దుర్భిక్షములో శక్తి వంచనలేకుండా తాను అన్నప్రదానము చేయుచు యితరులను స్వప్రయోజనమునకు అనురింఛేలాగు అనుసరించి వారినిన్ని పేదల పోషణ విషయమై ప్రవర్తింపజేయుచు ఆ లాగు ప్రవర్తించిన వారిని తాను మిక్కిలీ కొనియాడి సంతోషపెట్టుచు వచ్చిరి.


-
  • నందననామ సంవత్సరపు కరవు 1892-3 మధ్య వచ్చింది. దీనికి గుంటూరు కరవు అనికూడా పేరు. అందువల్ల మరికొందరున్ను అన్నదానమందు ప్రవర్తింపుచు వచ్చిరి. మరిన్ని గంజిదొడ్డి యనే అన్నసత్రములో గవర్నమెంటు వారు అపార ద్రవ్యమును బదల అన్నదాంవిషయమై ఖర్చుచేసినప్పుడు అయ్యగారు ఆ ధర్మవిచారణ ప్రభువులలో తాను వొక్కడుగనుండి పేదలకు కాలములొ విమర్శగా అన్నమును అందచేసేకొరకై పడిన శ్రమ చెప్ప శక్యముకాదు. అది యేలాగంటే 1000 2000 తూముల బియ్యమును ప్రతిదినమున్ను పాకముచేయించి తన దృష్టిపధములో పేదలను శ్రమపడనీయకుండా రెండుజాములకు లోగానే అన్న మంతయు వినియోగపరచుచు వచ్చిరి. మరిన్ని తన బుద్ధి శక్తిని యావత్తున్ను రాత్రిన్ని పగలున్ను ఆ కార్య విషయమై వాడుచు వచ్చిరి.

ఇదిగాక అయ్యవారి నాతో ఒక ప్రస్తానములో చెప్పియుండే యొక సంగతి మిక్కిలి ప్రయోజనకారిగా తొచినందున యీ అడుగున వ్రాయుచున్నారు. వొక పురుషుడు విస్తరించి ద్రవ్యము నార్జించిపెట్టి తాను సద్వ్రయము చేయకుండా చనిపొవుట నిష్ఫలమని యున్ను చనిపోవువారు తమకు పిమ్మట జరగవలసిన కార్యములను వ్రాసే మరణశాసనములు అనేకముగా తన వుద్యోగమును పట్టి ట్రాం సు లేషన్ చేయవలసి వచ్చి నందున ఆ వ్రాసినవారి తాత్పర్యములనున్ను వారి జీవించి యుండగా చేయుచు వచ్చిన కృత్యములనున్ను వారికి యీలోకవిషయమై యుండిన తాత్పర్యములనున్ను వారు వ్రాసిన మరణశాసనములు వారి మరణానంతరము ఆ తాత్పర్యానకు సంబంధించకపొవుటనున్ను వారు స్వఫ్నావస్థలో గూడా చూడనివిగానున్ను యెట్టి బుద్ధిమంతులకున్ను యీలాగు సంభవించు నని ఊ హించ కూడనివిగానున్ను వుండే అనేక విషయములు సంభవించడమునున్ను తాను తెలుసుకొన్నందున తన మనసుకు లోకరీతి బాగా తెలిసి పరలోకదృష్టి ప్రబల మవుచు వచ్చినదని చెప్పినారు. మరిన్ని తన కూతురి వివాహమందు "అన్నన్య క్షుధిత: పాత్రమనే వచనప్రకారము అన్నానకు ఆకలిగొన్నవారందరున్ను పాత్రులని యోచించి అందుకు ఆక్షేపైంచిన వారినిన్ని సమ్మతిపెట్టి సమస్త జాతులకున్ను అన్నప్రదానము చేసినారు". దీనివల్ల ఆయన సర్వ సమదృష్టి గల పురుషుడని స్పష్టముగా తెలియువచ్చు చున్నది. కొందరు యీవివాహ విషయమై ద్రవ్యమును వ్యయపరచుట కంటె చిన్నదానిపోషణకొరకు ద్రవ్యమును మదుష్యాధీనముగా నుంచుటకు ప్రతిగా యీశ్వరునిచేత నేను వుంచుచున్నానని చెప్పి అపారముగా అన్నదానము చేసినారు.

ఈచెన్నపట్టణమందు హిందు లిటరైరి సొసయిటి యనే విద్వత్సభను తాను కల్పనెచేసి దాన్ని వృద్ధిపొందించను యిచ్చటి గొప్ప మనుష్యులను స్వంతపనికి అనుసరించేలాగు అనుసరించి వారి వారికి ఇష్టములయిన విద్యావిషయము లన్నీ యీ సభవల్ల సిద్ధించునని అనేక మార్గములను కనుపరచుచు వారి కందరికిన్ని యీ సఃభమీద శ్రద్ధ వృద్ధిబోందేలాగు చేయుచు వచ్చిరి.*

అయ్యవారు తన వుద్యోగమును వదలుకొని విరామదశను బొందవలెనని తన్ను యేలుచునుండిన సుప్రీం కోరటు పెద్ద జడ్జీ యైన సర్ రాబర్టు కమిన్ దొరగారికి వ్రాసుకొన్నప్పుడు ఆ కోరటు అడ్వకేట్ జనరల్ జార్జి నార్టను దొరగారు అయ్యవారియొక్క అతి చాతుర్య విశిష్టమయిన ద్విభాషిత్వ క్రమములను విస్తరించి చెప్పినంతలో జడ్జిగారు తానున్ను అయ్యవారి సుగుణములను బహు తరముగ తెలియపరచునప్పుడు యీ వుద్యోగమును యీ పురుషుడు గడిపినట్టు గడిపే శక్తిమంతులను నేను యిదివరలో చూడ


  • దీనిని గూర్చిన తప్సీలుకు పీఠిక చూడండి.

సర్ రాబర్టు బక్లే కమిషన్ గారు మద్రాసు సుప్రీముకోర్టులో 31-12-1835 వ తేదీనుండి 17-1-1842 వ తేదీవరకు ప్రధాన న్యాయమూర్తిగా నుండేవారు. కాశీయాత్ర చరిత్ర

లెదనియున్ను యీ పురుషుడు యీ వుద్యోగమును వదలుట యీ కోరుటుకు బహు నష్ట మనిన్ని వ్యసనపూర్వకముగ సెలవిచ్చినారు. జడ్జీగారు యీలాగు చెప్పే పాటియోగ్యతతో అయ్యవారు తన వుద్యోగమును జరుపుకొన్నారు.

అయ్యవారు తాను జీవించియుండిన కాలమునకున్ను కీర్తి ప్రతిష్టా హేతువులయిన సత్కార్యములను అనేకముగా జరిగించి తుదను నిర్యాణకాలము సంభవించినపుడు తీర్దయాత్రా ఋగ్యజుస్సామ వేదత్రయ పారాయణాది సత్కర్మ ప్రభావ పరిశుద్దాంత: సరణలై పరమేశ్వర కరుణాకటాక్ష లబ్ధతత్వావబోధచేత మాతృ భ్రాతృ పుత్రికా భార్యానుహృన్మిత్ర బంధువులయెడల నుండిన స్నేహపాశములను మూషికా జాలచ్చేదన న్యాయముగా చేదించి యీషణత్రయ రహితులై దేహ లోక శాస్త్రవాసన లనే వాసనాత్రయమునున్ను అగిద్యాస్మితా రాగ ద్వేషాభినివేశంబు లనియెడు పంచ క్లేశములనున్ను జయించి నిస్స్ంగులై వానప్రస్తాశ్రమ ప్రతినిధిగా కొన్ని దినములు ఆరామవాసము చేసి మహావాక్యార్ధ విచారణవల్ల సచ్చిదానందఘన మయిన బ్రహ్మకున్ను తనకున్ను బేదము లేదని తెలిసి సోహంభావన జేయుచు నుండి యిష్టులుగా నుండిన వారిని తనకు ఆపత్సన్యాసము సిద్దింప చేయవలె నని బహుతరముగా ప్రాధించి తన స్నేహ సంహందెకులయిన వారికి అనేక విధవివేక హేతువులగు వాక్యములను బోధచేసి సమ్మతి పరచి నిర్యాణదినమందు బహిరంగమయిన ఆపత్సన్యాసమును స్వీకరించిన ముహూర్తములోనే యోగాసనాసీనులయి ప్రణవాను నంధానము చేయుచు ప్రాణోత్క్రమణ క్షణ పర్యంతమున్ను పూర్ణమయిన తెలివి కలిగియుండి, ఆత్మ నిత్యుడు దేహము అస్థిర మనియున్ను తెలిసిన వారు గనుక, దేహము వదలుటవల్ల వ్యసనమును చెందక సంతోషముతో అనాయసంగా శాలివాహన శకంబు 1760 అగు దుర్ముఖ భాద్రపద బహుళ పక్షాష్టమీ సోమ ఏనుగుల వీరాస్వామయ్యగారి జీవితము

వారమునాడు* ఉదయాన స్థూలదేహము వదిలి లింగ దేహముతో పునరావృత్తిరహిత శాశ్వత బ్రహ్మలోక నివాసమును పొందినారు.

కోమలేశ్వరపురం శ్రీనివాసపిళ్ళె --



  • దుర్ముఖ సంవత్సరము శాలివాహన శకమున 1360 లో రావడం లేదు. అది 1758 లోవచ్చుచున్నది. 1760 అనునది పొరబాటు అని తోస్తూవున్నది. శాలివాహనశక 1768 దుర్మిఖిసంవత్సర భాద్రపద బహుళ 2 సోమవారము నకు సరియైన ఇంగ్లీషు తేదీ 1836 వ సంవత్సరము అక్టోబరు 3 వచ్చిన తేది అవుతున్నది.

స్వామి కణ్ణుపిళ్ళెగారి ఇండియన్ ఎపిమిరిన్ చూడండి