కాళ్ళ గజ్జె కంకాణమ్మ పాట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

కాళ్ళగజ్జె కంకాణమ్మ
వేగుచుక్క వెలగా మొగ్గ
మొగ్గ కాదు మోదుగనీరు
నీరు కాదు నిమ్మల బావి
బావి కాదు బచ్చలి కూర
కూర కాదు గుమ్మడి పండు
పండు కాదు పావడ మీసం
మీసం కాదు మిరియాల పోతు
పోతు కాదు బొమ్మల శెట్టి
శెట్టి కాదు శామల మన్ను
మన్ను కాదు మంచిగంధపు చెక్క
లింగులిటుకు పందెమాల పటుకు
కాలు పడింది కడగా తీసి పెట్టు