కాదు సుమా కలకాదు సుమా

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఇది కీలుగుర్రం (1949) సినిమా కోసం తాపీ ధర్మారావు రచించిన లలితగీతం.

గానం: ఘంటసాల, వక్కలంక సరళ

కాదు సుమా కలకాదు సుమా (2)

అమృత పానమును అమర గానమును (2)

గగనయానమును కల్గినట్లుగ

గాలిని తేలుచు సోలిపోవుటిది

కాదు సుమా కలకాదు సుమా!


ప్రేమలు పూచే సీమల లోపలా.. (2)

వలపులు పారే సెలయేరులలో

తేటపాటలను తేలియాడుటిది

కాదు సుమా కలకాదు సుమా!


కన్నె తారకల కలగానముతో

వెన్నెల చేరుల ఉయ్యాలలో..ఓ..ఓ..ఓ..

ఉత్సాహముతో ఊగుచుండుటిది

కాదు సుమా కలకాదు సుమా!


పూల వాసనల గాలి తెరలలో

వలపు చీకటుల వన్నె కాంతిలో | పూల వాసనల |

ఆహా ఆహాహా దోబూచులాడుటిది

కాదు సుమా కలకాదు సుమా!