Jump to content

కాదంబరి

వికీసోర్స్ నుండి

కాదంబరి

భాస్కరుని కేతన ప్రెగ్గడ

బాణుని కాదంబరికి ఇది అనువాదం. భాస్కరుని కేతన అని పేర్కొనబడిన ఈతడు తిక్కన పెదతండ్రియైన కేతన కావచ్చునని విమర్శకుల అభిప్రాయం.

శా.

గంధర్వాత్మజ రాజుఁ జూచెఁ బతియుం గాదంబరిం జూచె ద
ర్పాంధీభూతమనస్కుఁడై మరుఁడు విల్లందెన్ బ్రసూనోల్లస
ద్గంధం బొప్పఁగ [నెక్కు]వెట్టి గుణనాదం [1]బూని పుష్పాస్త్రముల్
సంధించెన్ దెగఁబాపి యేయఁదొడఁగెన్ సవ్యాపసవ్యంబుగన్.

ప్రబంధరత్నాకరము 2.73

సీ.

దీనిలోపలఁ గొన్ని దినము [2]లుండిన నుష్ణ
                   కరుఁడైన నట శీతకరుఁడు గాఁడె
దీని లోఁతెరిగినఁ దానంబురాశిలోఁ
                   గాదని జలశాయి గాఁపు రాఁడె
దీని తియ్యని నీరు దివిజులు [3]త్రావిన
                   తమ యమృతంబు చేఁదనుచు ననరె
దీని తోయంబులఁ దీర్థమాడిన [4]యంతఁ
                   బాపాత్ములును మోక్షపదవిఁ గనరె


తే.

యనుచుఁ గొలనినీటి యతిశీతలత్వంబుఁ
బఱపు పెంపుఁ దీపుఁ బావనతయు
మనుజనాయకుండు గొనియాడి పడివాగె
త్రాట హయముఁ దిగిచి తఱియఁ జొచ్చె.

ప్రబంధరత్నాకరము 1.262

జనవరేణ్యు గాంచి సాష్టాంగ మెఱగిన
నా విభుండు వాని లేవనెత్తి
కౌగలించి వాని గనుగొని కేయూర
కాభిదాన మొసగె గౌతుకమున.

ఆనందరంగరాట్ఛందం 3.213

శా.

డాచే యంకతలంబు జేర్చి వలచేతన్ మాలికన్ దాల్చి
లోచెయ్వుల్ కొనసాగి పూవుపయి........తపోరాశినా
జూచెన్ దప్పక తత్క్షణంబున గడున్ శోభిల్లెనేమో మదిన్
సూచింపన్ కడగిట్టి పల్కుమెయి దా నాలించె.............

ఆనందరంగరాట్ఛందం 3.282 ఆంధ్ర ప్రయోగరత్నాకరం 14, సకలలక్షణసారసంగ్రహం 23

సీ.

ఆనక యమృతంబు దాఁ నిట్టి చవి యని
                   జనుల కేర్పఱుపఁగాఁ జాలువారు
చూడక మన్మధు సుందరాకారంబు
                   గరిమ చూపఁగఁ జాలు కడఁకవారు
వినయక పరతత్త్వవిపులనినాదంబు
                   వినుతింపఁ జాలెడు వెరవువారు
యంటక మెఱపుల యందంబు వ్రేగును
                   గణుతింపఁ జాలు ప్రఖ్యాతివారు


గీ.

కంపు గొనయక కల్పవృక్షముల పుష్ప
సౌరభం బిట్టిదని చెప్పఁ జాలువారు
నెందుఁ జూచిన ధాత్రిలో హృదయదృష్టి
గవులు గానని మర్మంబు గలదె జగతి.

కుమారసంభవ ప్రథమభాగానుబంధం

సీ.

కడువేఁడి పెల్లెండ పుడమి వ్రేల్చినప్రొద్దు
                   లాకాశగతియ మేలని తలంప
వాత్యాభిహతి లగ్గవాడి వియచ్చరు
                   లవనిపైఁ జనుట మేలని తలంప
వడవడఁగా నీళు లుడికిన జలచరుల్
                   వనచరవృత్తి మేలని తలంప
వనములఁ గార్చిచ్చుఁ దనరిన వనచరు
                   లంబుసంచరణ మేలని తలంప


ఆ.

వాఁడి యెండ గాసె వడిగొనె సురగాడ్పు
లెసఁగె వడయగాలి నెగసెఁ జాల
దావదహన మడరె జీవుల కధికసం
తాపకాల మగు నిదాఘవేళ.

కుమారసంభవ ప్రథమభాగానుబంధం

  1. బాని
  2. లూనిన
  3. త్రావి చూచినఁ దమయమృతంబు చేఁదునారె?
  4. నెంత
"https://te.wikisource.org/w/index.php?title=కాదంబరి&oldid=451294" నుండి వెలికితీశారు