కలినరులకు నీమహిమ దెలుసున

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


రాగం: మాయామాళవగౌళ. తాళం: ఆది.

కలినరులకు నీ మహిమ దెలుసునా కమల నయన వాసుదేవ మహానుభావా||

జలజ సంభవ భవేంద్రాది వందిత చరణా ||

సులలితమగు నీ చరణము సోకగ శిలయే అహల్యయై వెలయలేదా మును
బలిని ప్రహ్లాదుని ధ్రువుని పాంచాలిని సలుప లేదేమయ్య హలధర సోదర||