కలయే మమహృదయేత్వాం కమలాలయే

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


రాగం: హిందూస్తానీ కాపి - ఖండత్రిపుట తాళం


ప: కలయే మమహృదయేత్వాం కమలాలయే
    కలికలుషవిదూరవాసుదేవజాయే॥

అ: కలాపసుశోభిత సుందరకాయే కృపాలయే
    కలాధరబింబసన్నిభసుఖప్రదచ్ఛాయే
    కల్యాణ గుణనికాయే కలధౌతఖచితమణివలయే
    కలభాషణప్రియే॥

చ: వారిజోద్భవాదిధ్యేయే వారిధితనయే
      వారిజదళవిశాలనేత్రద్వయే వరేణ్యే
      వారితభక్తసంతాపనిచయే విశ్వప్రియే
      వారిజాభివ్యక్త మహోదయే సుహృదయే
      వరముని నారదాదిహృన్నిలయే
      వరవర్ణిని కుంకుమాద్యర్చనప్రియే
      వరమందహాస శోభితాస్యే
      వరుణాద్యష్ట దిక్పాలకాభివంద్యే॥