Jump to content

కర్పూర హారతు లివ్వరే

వికీసోర్స్ నుండి


పల్లవి:
కర్పూర హారతు లివ్వరే, శ్రీరాములకు
కర్పూర హారతు లివ్వరె నేర్పుమీరఁగ మీర
లోర్పుతోడుత గందర్పునిఁ గన్నతండ్రికి

చరణము(లు):
పున్నమ చంద్రుని గేరుచున్న నగుమోమువాని
గన్నుల గాంచి మిగుల సన్నుతు లెసగజేసి

పూని భుజంగరాజుకైనఁ బొగడంగ రాని
వాని నేమరక యిపుడు ధ్యానించి శ్రీపాదములకు

పంకజముఖులు కరపంకజములు సాచి
పంకజనాభునిమ్రోల సంకీర్తనములుచేసి

కోరి సేవించువారికిఁ గోరిక లిచ్చి ప్రోచు
ధీరుఁడైనట్టి రఘువీరున కిపుడు మీరు

మీరి భద్రాచల విహారుడై నేడు తూము
నారసింహుని దరిజేరి ప్రోచెడిస్వామికి