Jump to content

కరుణించు దైవ లలామ

వికీసోర్స్ నుండి


  సౌరాష్ట్ర రాగం     త్రిపుట తాళం

ప: కరుణించు దైవలలామ అహో

పరమ పావననామ పట్టాభిరామా || కరుణించు ||


చ 1: అన్నవస్త్రము లిత్తుమనుచు దొర

లన్నారు మనిచెదమనుచు ఆయు

రన్నం ప్రయచ్ఛతి యనుచు నూర

కున్నాను నీవే మాకున్నా వనుచు || కరుణించు ||


చ 2: మరియింత కాలమ్ముదనుక మిమ్ము

మరచితిననుచు తప్పుతలచక మమ్ము

దరిజేర్చుడని వేడితిని మీది

శరణాగత త్రాణ బిరుదు గనుక || కరుణించు ||


చ 3: పరుల గొలుచుటకన్న ఇల భద్ర

గిరి రాఘవుల వేదుకొనుట ఇహ

పరములకు దారియని వింటినే

దరహాసముఖ రామదాసపోష || కరుణించు ||

This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.