కన కన రుచిరా కనక వసన నిన్ను

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

Pallavi కన కన రుచిరా కనక వసన నిన్ను

Anupallavi

దిన దినమున మనసున చనువున నిన్ను (కన)

Charanams

1.పాలుగారు మోమున ష్రీయపార మహిమ దనరు నిన్ను (కన)

2.కలకలమను ముఖకల గలిగిన సీత కులుకుచు నోర కన్నులను జూచే నిన్ను (కన)

3.బాలార్కాభ సుచేల మణిమయ మాలాలంక్ర్త కంధర సరసిజాక్స వరకపోల సురుచిర కిరీటధర సంతతంబు మనసారగ (కన)

4.సపత్ని మాతయౌ సురుచిచే కర్ణ షూలమైన మాట వీనుల జురుక్కన తాళక ష్రీ హరిని ధ్యానించి సుఖింపగ లేదా అదు (కన)

5.మ్ర్దమద లలామ షుభనిటల వర జటాయు మోక్శ ఫలద పవమాన సుతుడు నీదు మహిమ దెల్ప సీత దెలిసి వలచి సొక్కలేదా ఆరాతి నిన్ను (కన)

6.సుఖాస్పద విముఖాంబుధర పవన విదేహ మానస విహారాప్త సురభూజ మనిత గుణాంక చిదానంద! ఖగ తురంగ ధ్ర్త రథాంగ పరమ దయాకర కరుణారస వరుణాలయ భయాపహరా ష్రీ రఘుపతే (కన)

7.కామించి ప్రేమమీర కరముల నీదు పాద కమలముల బట్టుకొను వాడు సాక్శి రామ నామ రసికుడు కైలాస సదనుడు సాక్శి మరియు నారద పరాషర షుక షౌనక పురందర నగజా ధరజ ముఖ్యులు సాక్శి గాదా సుందరేష సుఖ కలషాంబుధి వాసా ష్రితులకై (కన)

8.సతతము ప్రేమ పూరితుడగు త్యాగరాజనుత ముఖజిత కుముదహిత వరద నిన్ను (కన)