కట కట
Appearance
కాంభోజి రాగం త్రిపుట తాళం
ప: కట కట నీదు సంకల్ప మెట్టిదో గాని
నే నెంతవాడనురా రామ || కట కట ||
అ.ప: నిటలాక్షుడు తొల్లి నీ మాయగనలేక
తటుకున నీ వల తగిలెను గనుక || కట కట ||
చ 1: శరణన్న మునులను బిరబిర బ్రోచెడు
బిరుదు గలిగిన దొరవే ఓ రామ
పరి పరి విధముల మొరలిడ వినక న
న్నర మర చేసిన హరి నిన్నేమందు || కట కట ||
చ 2: భావజ జనక నా భావమెరుగ వే
వే వేగమున జూడవే ఓ రామ
దేవాది దేవ దేవ దీనశరణ్య
నేవే దిక్కని నిక్కము నమ్మితి || కట కట ||
చ 3: గీర్వాణనుత భద్రగిరివాస సర్వ యో
గీశ్వరేశ్వర రామ ఓ రామ
సర్వాత్మ రామదాస హృదయాబ్జ నిలయ
సర్వాధార పరాకేల రామా || కట కట ||
This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.