Jump to content

నీతి దీపిక

వికీసోర్స్ నుండి


నీతి దీపిక.









By

K. VEERESALINGAM







కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు

నీతిదీపిక.


నీతిదీపిక

పెంచి, పెద్దవానిగఁజేసి మంచినట్టి
తల్లిఋణమించుకయుఁ దీర్పఁదరమె మనకు?

తే. విద్యయును బుద్ధి చెప్పించి, వెలయఁజేసి
       కాయమెక్కింతనొచ్చినఁ గలఁతపడుచుఁ
       దగుచికిత్సలఁ జేయించి, తెగులుమాన్పి
       మనల నింతవారిగఁ జేసె జనకుఁ డరసి.

తే. ఒక్కగర్భవాసంబున నుద్భవించి,
       యొక్కతల్లి పాలఁ బెరిగి, యొక్కశయ్యఁ
       బండుకొని యుండి, పయిఁ బ్రక్కఁ బడుచునుండు
       సోదరులు పరస్పరమైత్రి నుండవలయు.

తే. చేయవలెఁ దల్లిదండ్రులుచెప్పుపనిని
      మాఱువల్కక పుత్రుండు, మనినదనుకఁ
      జుట్టములనెల్ల బ్రేమతో ఁ జూడవలయుఁ
       జేతనై నంతసాయంబుఁజేయుచెపుడు.

మంచిబాలుఁడు.

ఆ. ప్రొద్దుపొడువకుండ నిద్దుర మేల్కని
       సమయకృత్యములను జక్కఁబెట్టి
       పుస్తకములఁ గొనుచుఁ బొరుగుపిల్లలఁగూడి,
        బడికిబోవు మంచిబాలకుండు.

తే. భోజనము చేయునప్పుడు బుద్ధిగలిగి
       లేనివస్తువు ల్తెమ్మని లేనిపోని
       యాగడముచేసి యలఁచక, వేగమునను
        గలకొలందినిభుజియించికదలిపోవు.

తే. తానుబడియందుజదివినదానినెపుడు
       మఱచిపోవక, వల్లించుమరలమరలఁ

నీతిదీపిక

బుస్తకంబులఁ జింపక, పొదుపుగాను
వాడుకొనుచుండుఁదనతోడివారుమెచ్చ.

తే. తనకుదీఱికయైనట్టితఱిని దినము,
       సెలవులిచ్చినదినములఁ జింతనంబు
        సేయుచును, నాటపాటల చెంతఁ బోక
       కరముప్రాఁతపాఠంబులగట్టిచేయు.
తే. చెడ్డబిడ్డలతోఁ జెల్మి. జేయఁబోఁడు;
       తల్లిదండ్రులమాటల దాఁటకుండు
        గురుని దైవంబుగానెంచి కొలువుసేయుఁ;
        జూడమనసైన, నల్లరిజాడ; జనఁడు

విద్య.

ఆ. విద్యవలన మిగుల వినయంబు గలుగును;
        విద్యచేతఁ దెలివి వి స్తరిల్లు;
        విద్యచేతఁ గరము వెలయును యోగ్యత;
        విద్యలేనివాఁడు వింతపశువు.

ఆ. ధనముతఱిఁగిపోవు దనంబుచేసిన,
        విద్య దానమునను వృద్ధినొందు;
        విత్తమరసిచూడ విద్యాధనముతోడ
         నీడ నంగఁ దగునె యించుకైన?

ఆ. చదువువేళ నీకు సందేహమేదేని
        తోఁచెనేని, మదినిదాఁచుకోక,
         గురునియొద్దకరిగి, గొబ్బుననడుగుము;
         సిగ్గుపడియె దేని, చెడుదువీవ.

ఆ. మురుగులుంగరములు ముత్యంపుపరులును
         బురుషుని గయి సేయు భూషణములె?

నీతిదీపిక


యరనిమేషమునకు నన్ని యునశియించ;
విద్యయొకటె యెపుడువిడనితోడవు.

తే. రాజుతనదేశముననెగౌరవముగాంచుఁ;
బండితుఁడొ, యెల్లయెడగారవమ్మువడయుఁ;
జదువునకు రాజ్యమైనను జాలదనఁగ,
విద్యతోసాటి మఱియేదివిశ్వమునను ?

ఆడఁ కువ.

ఆ. ఎంతకలిమిగలుగు, సంతయడంకువఁ
గలిగియుండవలయు, గర్వపడక ;
యన్నిగుణములుండి, యడఁకువ లేకున్న
నిష్ఫలంబులవియు నిశ్చయముగ.

తే. చదువునకుఁదోడువునయంబుగుదిరియుంట
పశిఁడిదావియబ్బినభాతియగును
విద్యగలిగియు నడఁకువ వెలయకుంట
యమరతరువునుగచ్చచెట్టలమికొనుట.

ఆ. అడఁగిమడఁగియుండు నాతనిగుణములు,
కొలఁదివైన, మిగుల గొప్పవగును;
విఱ్ఱవీఁగుచుండువీఱిఁడిగుణములు,
గొప్పవైన, మిగులఁగొలఁదివగును.

తే.క్రిందుమీఁదును గానక కేరలిపడెడు
నరునుసుగుణములెయవగుణంబులగును;
జెప్పనేటికి? వానికిఁ జెడుగుణములె
కలిగియున్న, నిఁకెట్టుగాఁదలఁపఁబడునొ.

గర్వము

తే. కలిమి భువిలోన నీకెంతకలిగియున్న,
గర్వపడకుము నేనెకా ఘనుఁడననుచు

నీతి దీపిక

నెంతసిరియుండు,నంతకునేనుమడుగు గు లడఁగియుండు;నీకయ శ్రెయస్కరంబు.

తే. తన్ను ఁదాగొప్పవానిఁగ,దలనచుట్టి కాని,చెప్పుకొనెడునట్టికాని,నరునిఁ బరిహసింతురు,చాటునఁబ్రజలు మిగులఁ; గనుక,నాత్మప్రసంశయెయనుచితంబు.

తే. మనకు లేని విద్యయు గొప్పదనము,మనకు గలదటంచునటించినఁగల్ల తెలిసి ప్రజలుమనలనవ్వుదురుచప్పుటలుగొట్టి యవిలవములేనినరుకంటెనలుసుచేసి.

తే. తనకుఁగలమేలుతోడనె తనివిపొంద, మోద మొదవును;మఱిచాలలేదటంచు మనసులోపలచింతతో వనరుచున్న, సౌఖ్యమెడఁబాయు,నిచ్చలుశ్రమముగదురు,

తే. సౌఖ్యమబ్బెడునంచు,దెసమ్ములెల్ల ఁ దిగురుఁబనిలేదు;మదిలోనఁద్రుప్తియొకటి కలిగెనేనియు,నీంటనే కలుగు సుఖఃము; తుష్టిలేదేని,సౌఖ్యంబు దొరకదెందు.

తే. ఇంతచదివితిఁజాలదె? ఇంకనేల? యనుచుఁ దనుకున్నవిద్యతోమనుజుఁడేపుడుఁ దృప్తినొందుచునుందుట,తెలివిలేమి; బ్రతికినన్నళ్ళు,విద్యను బడయవలయు.ధైర్యము.

తే.ఆపదలువచ్చినపుడు డధైర్యంబు వడిన, నంతకంతకు మఱిచింత యతిశయిల్లుఁ; నీతిదీపిక

గొంచెమైననుదానిచేఁగూడిరాదు; కాన,నట్టిచో ధైర్యబె పూనవలయు.

తే. ఎంతజాగ్రత్తతోనున్న,నెన్నఁడేని నొక్కసమయంబున విపత్తులొదపకుండ వట్టిపట్టులఁ, గీడుపోగొట్టుకునెడు వెరవురోయంగఁజనుఁ గాని, వెఱవఁదగదు.సత్యము

తే. తండ్రిడండించు, గౄహమునఁదల్లిదిట్టు గురుఁడుపాటశాలకుఁబోవఁగోపపడును, తోడిబాలురుదూషింత్రు తులువయనుచుఁ, గానఁగూడదు బాలుండుకల్లలాడ. <poem>నితిదీసిక

  తమ్ముమించువారు   తమకట్లుచెసిన,
  నెట్టులండునొక్క   యెఱుఁగలెరు
ఆ. అల్పజంతువులకు  హనిఁజెయుచున్నున;
      నంతంతెకదియెస్వాతంత్రమునకు
     బట్టునడుచుఁబిదపఁ జెటులనరులకుఁ
    జెయుబుద్దిపుట్టఁ జెట్టుమూడు
ఆ. దొమ మొదలు   పెద్దసామజంబువఱకుఁ
      గలుగుజంతువులలక  కారనంబు
      బాదసెయుకండవలయును   సతతంబు
      హింసకుండద  నెడియెకగలిగి
ఆ. ప్రాణికొటియెడల ఁ మాయనిదయగల్గు
      వారియందు,  దై  వమారయంగఁ
     గరమనుగ్రహంబు    గలిగియుండున్య్  ఁగాన
      హింసజెయుఁ   గూడ దించుకైన,

ఆ. గొప్పవారలైనఁ గొంచెపువారైన

    నన్న  దములగుడు రరసిచూడ
     దై  వ  మొకనివలనఁ దారందనుగల్గి
    మెక్కపుడమియం   చెయుండుకతన.
ఆ. కాన,   చెదబుద్ది  గల్పించుకొన్నిత్రుళ్ళి
       పడక  యెవుడులెనివారిఁ  గన్న
       నాదరిప  వలయు    సొదరబావంబు
      తొడఁ, జెతనైనతొడు సూపి.
 తే. అవని  లొపల,  సదికార  మబ్బెనెని
       క్రింది  వారల   నెప్పుడుఁ గిలియఁదగదు; <poem>నీతిదీపిక
  దానిచెఁ, దనదాష్ట్యంబె   కాననగును;
   గాని  వచ్చులాబము   లెశమైనలెదు
దే, కొలువుకుదిరిన వానిని    గూర్మితొడ.
      గనుచునుండి నఁజేసెడిపనిని   వాఁడు
     తనమనపూర్తితొ  ఁజెయు;  దాన  జనియు
    మేలుగానుండు  గసరెడు వెనిలన్ను
 ఆ. ప్రేమఁజూడబఁడినభృత్యుండు,  సత్యంబు
      స్వామొభక్తిగలిగి,     పలువుఁబనులు
       ప్రభువుమిఁదిప్రేమఁ, ప్రాణంబులనునిచ్చు
      సరకుగొనక,    కొన్నిసమయములను.


పాటుపడుత.

  ఆ. దరణి  సకంలబు  దై  వవంబునృజియించి
        పాటుపదెడువాని    పాలుచెసెఁ;
       బాటు  పడిన  చొట .  ఫలించువన్నియుఁ
       బాటుపడకయున్న,   ఫలముగలదె

ఆ. తగినపాటు దేహదార్దంబు వెలంచు

     దగినపాటు మేనితెగులు   మాంర్చఁ;
   దగినపాటు  కలిమిఁ ద్ప్పక  కలిగించుఁ;
   బాటుపడుతతొ  డసాటిగలదె?
ఆ. పాటులెక  దేహపాటవం   బడఁగును
     పాటులెక సాఖ్యపదవి  తగ్గు;
     బాటులెక  యెడల బహురొగముచెయుఁ
     బాటులెనిసాఖ్య   పాటు  లెదు
ఆ. ఇట్టుజరిగియుండు, నింతటిసిరు   లుండ
      బృత్యులింతమంది   బెరసియుంద <poem>నీతిదిపిక
   నేనుబనులజేయ  నేల?  యనకొకింత
   కాయకస్గ్టమెపుడుఁ  జేయవలయు.

ఆ. కష్టపడుత మంచికార్యంబటంచును

     గానిపనులయందు  గష్టపడకు;
     హనికరము    కరముతీకాయకష్టంబుఁ
    బుడమిలనముఁ  గ్రష్టపడుమిఁలొలె.
                                   శరీరారోగ్యము.
తే, అన్నిటికి ముఖ్య  మాత్మ   దేహంబునందు
      గొఱత్రిరాకుండఁ గాపాడుకొనుచునుంట
      తాన్ను  దినఁగాఁదిరి  గెడుతఱీనిగాచె
      సర్వదర్మములను  జేయశక్తుఁడగుట.
తే. మానవుండు  దేహరిగ్యమునుకొకు. నీతిదీపిక
దిరుగవలయును, దేహంబుదృఢతగాంచి
యెపుడుదరుగంగపత్వంబునిచ్చుకొరకు.

ఆ.కల్మషోదకంబు గలిగించువ్యాధిని;

నిర్మలోదకంబు నిలుపుదాని,
దెలిసివడియగట్టుజల మె గ్రొలగదగు,
సౌఖ్యమండదలచు జనుడువినుడు.

తే.మితముతప్పింభుజించుట మేరగాదు;

మిగులగుడిచిన. నొడలికిదెగులుగలుగు
దనకడుపు నిండినను బంచదారనైన,
విషముభంగినిదలపోసి, విడువవలయు.

ఆ.రేయిపగలు మంచివాయువు వచ్చెడు

మాగములనుగలిగి, మందిరంబు,
పజ్జదెమ్మలేక, పరిశుభ్రమైయుండ
వలయునిత్యమును నివాసమునకు.

స్వతంత్ర జీవనము

తే.అన్నవస్త్రాదులకు నైన, వధికమైన

భోగభాగ్యంబులకునై నభూమిమీద
నొరులనేనమ్ముకొనియెప్డునుండరాదు;
తనదుచేతుల నమ్మంగజనునుగాని;

తే.పెద్దలాజించి, లోపలబెట్టిచన్న

ధనము ధాన్యంబుజోరులు తఱియెఱింగి,
తస్కరించిన, బోవునుదాచుకొన్న;
నవలవ్యధునిగతియేమియగునొకనుడు.

తే.పూర్వులుగడించిచునుమాన్యములునుమడులు,

పండకుండును; రాజులుపున్నుచాల నీతిదీపిక

గట్టుదురువానిమీద; దాకట్టుపడున;
నపుడురి క్తునిబ్రతు కేమియగునొచెపుడు.

తే.తాతముత్తాత లెంతెంత ధనముకూడ
బెట్టి, పెట్టెలునిండంగ బెట్టియున్న
గష్టపడి తామున్యాయమార్గమునబడయు
స్వార్జితంబొకగవ్వతోసమముగాదు.

తే.కాన, మానవు డెప్పుడు గష్టపడుచు,
వలయువిద్యల గళలను, బాల్యముననె
చక్కగా నేర్చియితరులసాయమాన
పడక, తనయెంతజీవింపగడగవలయు.

తే.న్యాయమార్గంబుతప్పకయర్ధమెపుడు
మనుజుడార్జించుచుండగజనును; దాన
బాత్రులకుదాన మొసరింపవలయుగొంత,
యనుభవింపంగవలయు దాననవరతము.

తే.తానుజేసినధర్మంబెతన్నుగాచు
ననుటలెస్సగాహృదయంబునందెఱింగి,
త్యాగమొనరింపవలయు; సానేగుతఱిని
తనదిచిల్లి గవ్వయు వెంటజనదుగాన.

ఆ.దానమియ్య లేక, తానునుదిన లేక,
ధనముభూమిలోన దాచిపెట్టి,
చెడుగులుబ్దు, దాని గడకుదొంగలపాలొ
నేలపాలొ, చేయునిహముగాను.

తే.ఆయమునకన్న నెన్నడునధిక మైన
వ్యయముచేయంగగూడదు; యాచకునకు

నీతిదీపిక

దనకుగలదానిలోనెయీదగనుగాని,
దాతనని, యవ్వగొనియియ్యదగవుగాదు.

తే.కుంటివారలువృద్ధులు గ్రుడ్డివారు
లోనగాబాటుపడళ క్తి లేనివారి
కియ్యవలెగాని, యితరులకిచ్చి దాన
మహిని వెలయింపరాదుసోమరితనంబు.

తే.మనముగడియించుదానిలో, మఱచిపోక
నిలువచేయంగడగుగొంతనేర్పుమెరసి
వార్ధకంబున, రోగముల్ వచ్చునపుడు,
గడనజేసెడుపామర్ధ్హ్యముడుగుగాని.

                                    ముఖస్తుతి

తే.ఇంద్రు,డవునీవుచంద్రుడువీనటంచు,
దావునను జేరియొనదించు స్తవమువకును
కాయముప్పొంగివిశ్వంబుగానలేక,
చేతిసొమ్మల్లబోవిడిచెదవుమమ్ము?

ఆ.సరస జేరి, నిన్ను సం స్తవ మొవరించు
వారలెల్ల సఖులుగారునీకు;
గష్టకాలమందు గాచువాడొక్కడె,
నిక్కమైనపఖుడు నీకుదలప.

కే.ధనముగలిగినయన్నాళ్ళు, దానిలాగ
మెంటదిరుగుచునుందురు, విహితులట్ల;
ధనముపోయినమఱునాడు దలపవారు
తొంగిచూడరునీయిల్లుదూరమునను.

నీతిదీపిక

పవిబనుచుట

ఆ.ఆజ్ఞ చేసినట్టులన్యులబనిచిన,
జెప్పుపనిని వారుచేయకుంద్రు;
చేసిరేని, దాని జెడగొట్టుదురుచాల,
హృదయమందసూయపొదలుగనుక.
ఆ.పరులవేడుపట్టు పనిచేయ బనిచిన
జెప్పుదడవదాని జేయుచుందు;
చేయుపనియుజాల శ్రేష్ఠంబుగానుండు,
మనసు కుదిరిచేయుమహిమకతిన.
తే.చెలిమిమైజేదు మేసింపజెల్లుగాని,
బలిమిమైబాలుద్రావింపబాటుగాదు
కాన, మంచితనముననే కార్యమెపుడు
దీర్పవలె; గానిపనిగాదతీవ్రపడిన.
ఆ.ంరుచ్చిలగ, రాజుమూన్మున్నదండించి,
దండుగగొనుదొంటిధనముగూడ
నిరుగుపొరుగువార లెప్పుడునింద్రింత్రు;
పరమునందుజాలబాధతొడరు.
తే.ఎవ్వరునుజూడరనిమనమెన్నకొన్న
బావమదియెప్పుడై ననుబయలబడును;
గాని, దొంగతనంబు దాగదునిజంబు;
దీని నింతయులెస్సగాదెలియవలయు.
ఆ.ఎవరుజూడకున్న, నీశ్వరుడైనను
మనము సేయుకానిపనులగనడె?

నీతిదీపిక

శాన, దొంగతనము గావింపనెందైన
శిక్షతప్పకుంట సిద్ధమరయ.

ఆ.ఒరులమాయచేసి సిరిగాంతు ననుకొంట
వెఱ్ఱితనముగాని వేఱుగాదు;
దాన, ముప్పతనకె తప్పకఘటియిల్లు;
బరుల జెఱుచువాడుబాగుపడునె?


పరోపకారము.

తే.కడుపై కై లాసమనియెంచి గాసిపడక
శ్రమమునకునై ననోరిచి, శక్తికొలది
బరులకుపకార మొనరింపబాటుపడుదు
రాకలియుడప్పిపాటింపక లఘుమతులు


వివిధధర్మములు.

తే.భూమిమీదను మనమిట్లు పట్టుటెల్ల
భోజనంబుకేయని, మూఢమతులు
తిండియేలోకమనియుందు రొండుచింతు
దక్కి, ధర్మమునందై న దలపులేక.

ఆ.మంచివాడువుడమి మాటాడుమల్లగా
బలువయెపుడుగొంతుపగులనఱచు;
ముఱికికాల్వలెపుడు ంరోగినలాగున
నదులుసేయుచున్మె రొదలనెందు?

తే.భాగ్యహీనులనైన, సేవకులనై న
బరుషవాక్యంబులాడుటపాడిగాదు;
దాన, బెట్టినపెట్టెల్ల గానజేరు;
వదన జేసినమేలును బదట గలుయు.

నీతిదీపిక

తే. ఎదుటివారిని మర్యాద నెలమిఁజేసి,

          తానుమర్యాదబడయంగఁదగునునరుడును;
        వారి నటుతాను గౌరవ పఱుపకున్నఁ
        దనకు గారవమబ్బదు; తథ్యమిదియె

ఆ. మంచికార్యమునకు, మానక యెప్పుడు

          యత్నమాచరించు  టర్హమగును  ;
           మొదలఁగాకయున్న, బదరకమరచేయ
          వలయు;గానినడుమవదలఁదగదు.

ఆ. చెడ్డకార్యమునకుఁజేరరాదెప్పుడు;

          చేరేనేనిమేచేటు వచ్చు;
           హీనకృత్యమందు నెఱుఁగకచొచ్చినఁ
          దెలిసినపుడెవిడిచి  తొలఁగవలయు.

ఆ. అల్పబుద్ధులెప్పుడన్యులతప్పుల

           వెదకుచుందు ; రల్పవిషయములనె
           గొప్పగాఁగనెంచి, కోపంబువహియింతు;
           రలుకవిడువకుందు రనవరతము.

ఆ. అలఘుబుద్ధులెపుడు నన్యులగుణముల

             నభినుతింతు రెఱిఁగి  ; యవగుణములఁ
          దడవకుందు ; రలుకఁదడవుగఁబూనరు;
              సైరణను వహింత్రుసంతతమును.

ఆ. తనకుఁజేయుమేలు మనమునఁగుక్కయు

              నెఱిఁగిసతముస్వామియిల్లుగాచు ;
             మేలుమఱచునేని, మేదినిమనుజుండు
కుక్కకన్నఁగొంతతక్కువరయ.

నీతిదీపిక

తే. తప్పుచేసితి వేనియు, నొప్పుకొనుము  ;

         గురునిముంగలఁగల్పించుకొనుచువచ్చి
         మాయమాటలఁజెప్పుట  మానుకొమ్ము;
         దాననొజ్జలునీయెడదయఁదలంచు.

ఆ. పిలిచియొకరు మనయభిప్రాయ మడిగినఁ

           బక్షపాతబుద్ధిఁబాఱదోలి
            మనసునందుఁగలచె, మాటుపెట్టక  తెల్పె
           వలయు, నొకనికెగ్గు గలుగుచున్న.

ఆ. సూక్ష్మమంచునించి చులుకసేయఁగ రాదు;

            సూక్ష్మములె,వినుండు, స్థూలమగును
            జలకణములు గలిపి, జలరాసికాలేదె?
              చిన్నవానినేల చేయువిడువ?

ఆ. మహిమనివాఱునెలలు సహవాసమొనరింప

              వారువీరలగుదు రారయంగఁ;
               గాన, జనుఁడుమంచిమానిసితోడనె
              చెలిమినెల్లతఱినిజేయవలయు.

తే. మున్నె, వాగ్దానమొనరింపకున్నయపుడె

                పదిగఁదలపోసిమఱిచేయవలయుఁజుమ్ము
                 చేసి చెల్లింప లేకుంటసిగ్గుపాటు
                 చేయుఁ గలిగియుఁజేయమి హేయమరయ

తే. తిన్నగా మాటలాడంగఁదెలియనట్టి

                  వాఁడెవండైన,  నినుదప్పఁబలికెనేనిఁ
                  దప్పుగాఁబట్టుకొనుచును, దాని నీవు
                  పట్టిపల్లార్చి, కోపంబుపడకుమెపుడు.

ఆ. ఒక్కకాలమందు నొక్కపనినెచేసి

యయ్యది కడముట్టనై నవెనుక నీతిదీపిక

              మాఱుపనికిఁదాను మరలంగఁదగుఁగాని
              పెక్కుపనులకొకట నిక్కరాదు.
             

ఆ. పెద్దవారలైనఁ బిన్నవారైనను

               జెప్పునట్టిపలుకుఁజెవిని జొనిపి,
              యుక్తియుక్తమైన, నొయ్యనగ్రహియింపు ;
               కానిదైనఁగొనకమానుమీపు

తే. పలికిబొంకనిజిహ్వయుఁబాడిగలుగు

                వర్తనముఁబాపమెఱుఁగనిబాహువులును
                 బురుషునకు నెందుజారనిభూషణములు
                 కాని, విలువబట్టలుగావు, కావునగలు.

ఆ. తెల్లవార లేచి, దినమెల్లంఆణాఛెయూ

                 కర్మచయములోనఁగర్మపాక్షి
                   ప్రతిదినంబు మంచిపనులఁగొన్నిటిఁ
                  జూచిఁయేగునట్టుగఁజరియింపవలయు.

ఆ. పరులునీకు నెట్లు వాంఛింతువోచేయి

                  బరుల కట్లచేయవలయు నీవు;
                 సర్వశాస్త్రములను జర్చింపఁదేలెడు
                    సారమైనధర్మసరణి యిదియె.

తే. మేనుక్షణభంగురంబౌట, మానసమున

                    నుంచి, రేపుచేసెదనని యుంటమాన
                   వలయుఁసద్దర్మములనేఁడెసలుపవలయు
                    నెల్లి మనముందుమోలేమొయెఱుఁగరాదు.

తే.గీ. ఇందుఁగలపాఠశాలలయందుఁజదువు

                   దిగువతరగతిబాలుర తెలిపి కొఱకు
                  నీతిదీపికయను నూఱు గీతములను
                కందుకూరి వీరేశలింగము రచించె.