కంటి మా రాములను కనుగొంటి నేను

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


   మేచ బౌళి రాగం    ఝంప తాళం

ప: కంటి మా రాములను కనుగొంటి నేను || కంటి ||


చ 1: కంటి నేడు భక్త గణముల బ్రోచు మా

యింటి వేలుపు భద్రగిరినున్న వాని || కంటి ||


చ 2: చెలు వొప్పుచున్నట్టి సీతా సమేతుడై

కొలువు తీరిన మా కోదండరాముని || కంటి ||


చ 3: తరణికుల తిలకుని ఘన నీలగాత్రుని

కరుణారసము కురియు కందోయి గలవాని || కంటి ||


చ 4: హు రు మంచి ముత్యాలసరములు మెరయగా

మురిపెంపు చిరునవ్వు మోముగలిగిన వాని || కంటి ||


చ 5: ఘలు ఘల్లుమను పైడిగజ్జెలందెలు మ్రోయగ

తళుకు బెళుకు పాదతలము గలిగిన వాని || కంటి ||


చ 6: కరకు బంగరు చేల కాంతి జగములు గప్ప

శర చాపములు కేల ధరియించు స్వామిని || కంటి ||


చ 7: ధరణిపై శ్రీరామదాసు నేలెడు వాని

పరమ పురుషుండైన భద్రగిరిస్వామిని || కంటి ||

This work was published before January 1, 1925, and is in the public domain worldwide because the author died at least 100 years ago.