కంచికి పోతావా క్రిష్ణమ్మా
Appearance
కంచికి పోతావా క్రిష్ణమ్మా
ఆ కంచి వార్తలేమి క్రిష్ణమ్మా
కంచిలో ఉన్నది బొమ్మా
అది బొమ్మ కాదు ముద్దుగుమ్మా ॥౨॥
త్యాగరాజ కీర్తనల్లే ఉన్నాదీ బొమ్మ
రాగమేదొ తీసినట్టు ఉందమ్మా ॥౨॥
ముసిముసి నవ్వుల పువ్వులు పూసిందీ కొమ్మ
మువ్వగోపాలా మువ్వగోపాలా మువ్వగోపాలా అన్నట్టుందమ్మా
అడుగుల్ల సవ్వళ్ళు కావమ్మా అవి ఎడదల్లొ సందళ్ళు లేవమ్మా ॥౨॥॥కంచికి॥
రాసలీల సాగినాక రాధ నీవేనమ్మా
రాతిరేళ కంట నిదర రాదమ్మా ॥౨॥
ముసిరిన చీకటి ముంగిట వేచిందీ కొమ్మ
ముద్దు మురిపాలా మువ్వగోపాలా నీవు రావేలా అన్నట్టుందమ్మా
మనసు దోచుకున్న ఓయమ్మా నీ మనసు దాచుకోకు బుల్లెమ్మా ॥౨॥ ॥కంచికి॥
ముద్దు మురిపాలా మువ్వగోపాలా నీవు రావేలా క్రిష్ణమ్మా
చిత్రం: శుభోదయం
రచన: వేటూరి
సంగీతం: కె.వి.మహదేవన్
గానం: ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం