ఓ మానవోత్తమా!

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఓ మానవోత్తమా!

ఓ వీరమూర్ధన్య!

ఓ యమృతభాసమా

నోన్నతప్రేమసామ్రాజ్యైకచక్రవర్తీ!

స్నేహశీలి!


నీ హృదంతరములో నిరుపమా నాఖాత

రత్నాక రామూల్య రాగసంపద మొరయు!

నీ యాశయమ్ములో నిర్మ లోత్తుంగ ది

వ్యాకాశ సంకాశ భాగ్యరాసులు మెరయు!


ఈ యశ్రుఝరులతో, ఇరులతో, రొదలతో

సొదలతో, ఈ హాస మృదుల వాసనలతో

విసముతో, సిగ్గుతో, కొసరు తేనియలతో

ఈ పాట బ్రతుకు నీ కేపాటి దోయి, నా

నెచ్చెలీ!

నెచ్చెలీ!