ఓహో యనరయ్యా

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఓహో యనరయ్యా (రాగం: ) (తాళం : )

ఓహో యన రయ్యా ఒకసారి - ఇట్టె సాహసాన తిరుగ రోయి జంట భేరి //పల్లవి//

కోనేటిరాయఁడు నిద్రించి యున్నాఁడు కోనలను తిరుగ రోయి కోట భేరి వెనకటి వాకిండ్లు బిగముద్రలైయున్నవి ఘనముగ వాయించ రోయి ఘంటభేరీ //ఓహో//

గొలుసులు బంగారు గొలుసులు ఘల్లనగ కోటగస్తి తిరుగరోయి ఒకభేరీ పలుమాఱు మీరందఱు మూలమూలలను తలవలై తిరుగ రోయి తముకుభేరీ //ఓహో//

శ్రీవేంకటేశుడు చిత్తగించి యున్నాడు కోవిదులై తిరుగరోయి కోటభేరీ ఆవల బంగారుగుదియలు ఘల్లనగ తావుల హనుమంతయ్య తలారిభేరీ //ఓహో//