ఏమి సేతురా లింగ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఏమి సేతురా లింగా ఏమి సేతురా
గంగ ఉదకం తెచ్చి నీకు లింగ పూజలు చేద్దామంటే
గంగనునాచేప కప్ప ఎంగిలంటున్నాది లింగ
మహనుభావ మాలింగమూర్తి మహదేవశంభో


ఏమి సేతురా లింగ ఏమి సేతురా లింగ
అక్షయావులపాడి తెచ్చి అర్పితము చేద్దమంటే
అక్షయావులలేగ దూడ ఎంగిలంటున్నాది లింగ

మహానుభావ మాహదేవ శంభో మాలింగ మూర్తి

ఏమి సేతురా లింగ ఏమి సేతురా లింగ
తుమ్మి పువ్వులు తెచ్చి నీకు తుష్టుగా పూజిద్దమంటే
కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెద ఎంగిలంటున్నది లింగ


మహనుభావ మహదేవశంభో మాలింగమూర్తి