ఏమిర రామ నావల్ల నేర మేమిరా రామ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


   నాదనామక్రియ రాగం    ఆది తాళం

ప: ఏమిర రామ నావల్ల నేర మేమిరా రామ

చ 1: ఏమిర రామ ఈ కష్టము

నీ మహిమో నా ప్రారబ్ధమో || ఏమిర ||


చ 2: కుండలిశయన వేదండ రక్షకా

అఖండతేజ నాయండ నుండవే || ఏమిర ||


చ 3: పంకజలోచన శంకరనుత నా

సంకటమును మాన్పవె పొంకముతోను || ఏమిర ||


చ 4: మందరధర నీ సుందర పదములు

ఇందిరేశ కనుగొందు జూపవే || ఏమిర ||


చ 5: దినమొక ఏడుగ ఘనముగ గడిపితి

తనయుని మీదను దయలేదయయో || ఏమిర ||


చ 6: సదయహృదయ నీ మృదు పదములు నా

హృదయ కమలమున వదలక నిలిపితి || ఏమిర ||


చ 7: రామ రామ భద్రాచల సీతా

రామదాసుని ప్రేమతో నేలవె || ఏమిర ||

This work was published before January 1, 1925, and is in the public domain worldwide because the author died at least 100 years ago.