ఏమఱకుమీ మనసా - శ్రీరాముని

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


పల్లవి:
ఏమఱకుమీ మనసా - శ్రీరాముని -
ఏమఱకుమీ మనసా

చరణము(లు):
ఏమఱకుమీ రఘు - రాముని శ్రీపద
తామరసంబులు దలచుచు సతతము

రాముని సుగుణోద్దాముని భయదవి
రాముని జగదభిరాముని నిమిషము

కాలునిదూతలు గ్రమ్మువేళ నిను
గడతేర్చుటకు గతి యగు నామము

సూరిజనుల కాధారు లగుచు భువి
చారుతరంబగు తారకనామము

దేవదేవుడన తేజరిల్లి కడు
పావనుఁడగు శ్రీభద్రగిరీశుని

శ్రీకరముగ నరసింహదాసుని
జేకొని బ్రోచెడు శ్రీకరు నెద గని