ఏనాడు మొదలిడితివో

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

చిత్రం: చంద్రహారం (1954)

రచన: పింగళి

సంగీతం: ఘంటసాల

గానం: ఘంటసాల


ప. ఏనాడు మొదలిడితివో ఓ! విధీ

ఏనాటికయ్యెనీ నాటక సమాప్తి


చ. జనన మరణాలతో సుఖదుఃఖములతో |జనన|

ప్రాణులను ఆడించి పీడింతువేమయ్య |ప్రాణులను|

ఎన్నెన్నొ వేడుకల యీ సృష్టి కల్పించి |ఎన్నెన్నొ|

కనుమూయునమ్తలో మాయజేసేవయ్య

ఏనాడు మొదలిడితివో ఓ! విధీ

ఏనాటికయ్యెనీ నాటక సమాప్తి


చ. నేను నాదను ఆశ గగనానికెక్కించి |నేను నాదను|

అంతలో పాతాళమున దింతువేమయ్య |అంతలో|

తనువు శాశ్వతమంచు మైమరువ జేసి |తనువు|

తనువునూ, జీవినీ విడదీయువేమయ్య

ఏనాడు మొదలిడితివో ఓ! విధీ

ఏనాటికయ్యెనీ నాటక సమాప్తి

ఏనాటికయ్యెనీ నాటక సమాప్తి