ఏది హిందూ ఏది ముస్లిం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఏది హిందూ ఏది ముస్లిం ఏది క్రైస్తవము?
ఎల్లమతముల సారమొకటే
హృదయమే మతము
కృష్ణుడో క్రీస్తో ముహమ్మదో
గీతయో బైబిలు ఖురానో
ప్రేమనే బోధించలేదా?
ద్వేషమును నిరసించె కాదా?
తూర్పు పడమర బేధమేలా?
తోటకెల్ల వసంతుడొకడే
కరములెవరెటు మోడ్చి పిలిచిన
ఖంగుమని గుడిగంట ఒకటే

---బోయి భీమన్న

మూలాలు[మార్చు]

http://dietanjaneyulu.yolasite.com/resources/14-Edi%20Hindu%20Edi%20Muslim.mp3