ఎవ రోహో, ఈ నిశీథి నెగసి, నీడవోలె నిలిచి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఎవ రోహో, ఈ నిశీథి నెగసి, నీడవోలె నిలిచి

పిలుతు రెవరొ, మూగకనులు మోయలేని చూపులతో

ఎవ రోహో! ఎవరోహో!


ఇపుడా నను పలకరింతురు!

మ్రోయలేని నీరవగళమున చలించు కోరికతో

ఇపుడా నను పలకరింతురు!


ఎవరని ఈ రేయి నిదుర హృదయ మదర, వేయి చేయి

చాయలాడ పెనుచీకటి సైగలతో నా కన్నుల

రక్త మురల లాగికొందురు!


ఎవరో, నా హృదయనాళ మేలా తునియలుగా నా

నిర్జీవపు జీవితమ్ము నిట వదలుదురా!

ఎవ రోహో! ఎవ రోహో!

ఇపుడా నను పలకరింతురు?