ఎవ రేమన్నారురా రాఘవ
Appearance
పల్లవి:
ఎవ రేమన్నారురా రాఘవ - ని న్నెవ రేమన్నారురా ||ఎవ రేమన్నారురా రాఘవ||
అనుపల్లవి:
ఎవ రేమన్నారు యినకులతిలక - నా చెవిలోన దెల్పు
మావల వారి దండింతు ||ఎవ రేమన్నారురా రాఘవ||
చరణము(లు):
బాలురతో నాడి చాలయలసినావు
పాలిత్తు రమ్మన్న పరుగెత్తి డాగేవు ||ఎవ రేమన్నారురా రాఘవ||
పిలిచిన బలుకవు నిలచి మాటాడవు
అలుకలు చేసెదవు ఆర్తశరణ్యా ||ఎవ రేమన్నారురా రాఘవ||
ఇందు రమ్మని కర మంది పట్టినఁ బెనగి
చిందులు ద్రొక్కెద వెందుకురా సామి ||ఎవ రేమన్నారురా రాఘవ||
ధరణిని నరసింహదాసుని వెంట నీ
వర లేక యున్నవాడ వనుచు నోర్వలేక ||ఎవ రేమన్నారురా రాఘవ||