ఎన్నగాను రామభజన

వికీసోర్స్ నుండి



పల్లలవి :

ఎన్నగాను రామభజనకన్న మిక్కిలున్నదా ఎ..

అను పల్లవి :

సన్నుతించి శ్రీరామచంద్రు తలచవే మనస?

కన్నవిన్నవారి వేడుకొన్న నేమిఫలము మనస? ఎ..

చరణం 1:

రామచిలుక నొకటి పెంచి ప్రేమ మాటలాడ నేర్పి

రామరామరామ యనుచు రమణియొకతె పల్కగా

ప్రేమమీర భద్రాద్రిధాముడైన రామవిభుడు

కామితార్థము ఫలములిచ్చి కైవల్యమొసగలేదా? ఎ..

చరణం 2:

శాపకారణము నహల్య చాపరాతి చందమాయె

పాపమెల్ల బాసె రామపదము సోకినంతనే

రూపవతులలో నధిక రూపురేఖలను కలిగియు

తాపమెల్ల తీరి రామతత్త్వమెల్ల తెలుపలేదా? ఎ..