Jump to content

ఎదలోపలి యెదలో

వికీసోర్స్ నుండి

ఎదలోపలి యెదలో, నె

మ్మదిలో, జీవిత రహస్యమార్గమ్ములలో

వదలని కోరిక వై, నా

బ్రదుకుబరువు లెల్ల పాట పాడింతు సఖీ!


చలువపిసాళిగాలి నునుచక్కిలిగింతల కౌగిలింతలన్

నిలువున పాటగా కరగనేర్చునొ నీరవ వేణువీథి! నీ

వలపుతలంపు సోకిననె, ప్రాణసఖీ! బ్రతు కెల్ల కోటి గొం

తుల విడి సోనలై పొరలు నూతన గీత సుధాపథాలలో!


నీ యాజ్ఞ కూడెనా, గొంతుముడి వీడెనా

హాయిగా యుగయుగంబుల కలల్ పాడనా!

చిర గాఢనిద్ర మేల్కొలిపి సందేశాల

పరపనా దిక్కు దిక్కులకు చుక్కలకు!