ఎక్కడి కర్మము
Appearance
కాంభోజి రాగం త్రిపుట తాళం
ప: ఎక్కడి కర్మములడ్డుపడెనో ఏమి సేయుదునో శ్రీరామా
అక్కట నా కన్నుల నెప్పుడు హరి నినుజూతునో శ్రీరామా || ఎక్కడి ||
చ 1: ప్రకటమాయెను పాపము లెటుల బాధకోర్తును శ్రీరామా
సకలలోక రాజ్యపదవికి ఎక్కువైన యట్టి శ్రీరామా || ఎక్కడి ||
చ 2: పృధివిలోన పూర్వజన్మల పూజలింతేగా శ్రీరామ
విధులు జరుపవలయు విషయవాంఛలు తలుపక శ్రీరామ || ఎక్కడి ||
చ 3: మూడు నెలలాయె నీ మునుముందర నిల్వక శ్రీరామా
ఎన్నడిట్లుండి రాఘవ నే నెరుగ ననుగన్నయ్యా శ్రీరామా || ఎక్కడి ||
చ 4: కోరి భద్రాచలమున రాముని కొలుతునంటిని శ్రీరామా
కోర్కెలొసగి రామదాసుని గనుగొని రక్షించమంటి శ్రీరామా || ఎక్కడి ||
This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.