ఎక్కడవున్నా ఏమైనా
స్వరూపం
మురళీకృష్ణ (1964) సినిమా కోసం ఆచార్య ఆత్రేయ రచించిన లలితగీతం.
ఎక్కడవున్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనా
నీ సుఖమే నే కోరుతున్నా నీ సుఖమే నే కోరుతున్నా
నిను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నే కోరుతున్నా
అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్నీ
జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని ||| నీ సుఖమే |||
పసిపాపవలే ఒడి చేర్చినాను కనుపాపవలె కాపాడినాను
గుండెను గుడిగా చేసాను గుండెను గుడిగా చేసాను
నువ్వు ఉండలేనని వెళ్ళావు
వలచుట తెలిసిన నా మనసునకు మరచుట మాత్రం తెలియనిదా
మనసిచ్చినదే నిజమైతే మన్నించుటయే ఋజువు కదా ||| నీ సుఖమే |||
నీ కలలే కమ్మగ పండనీ
నా తలపే నీలో వాడనీ
కలకాలం చల్లగ ఉండాలనీ
దీవిస్తున్నా నా దేవినీ దీవిస్తున్నా నా దేవినీ ||| ఎక్కడవున్నా ||| నీ సుఖమే |||