Jump to content

ఎందరో వికీమీడియన్లు/రాబోయే కాలానికి కాబోయే నాయకుడు

వికీసోర్స్ నుండి

రాబోయే కాలానికి కాబోయే నాయకుడు

ఇపుడో పెద్దమనిషి గురించి. రాతల్ని బట్టి, చేసే చర్చలను బట్టీ వ్యక్తి మూర్తిమత్వాన్ని అంచనా వెయ్యగలిగితే, మురళీకృష్ణ ఎమ్ గారిని పెద్దమనిషి అనాలి. దోష రహితమైన భాషలో చక్కటి వ్యాసాలు రాయడంలో పోటీ పెడితే గట్టిపోటీ ఇవ్వగల వికీపీడియన్ మురళీకృష్ణ. భాష మాత్రమే కాదు, వికీపీడియాలో నిర్వచించుకున్న విధానాలను, మార్గదర్శకాలనూ ఖచ్చితంగా పాటిస్తారు.

ఆయన వికీకి వచ్చిన కొత్తలో, వికీ శైలి ప్రకారం తేదీ ఆకృతి ఇలా ఉండాలండీ అని సీనియర్లు చెప్పారు. ఇక ఆ తరువాత ఆ మార్గదర్శకాన్ని ఆయన ఏనాడూ మీరలేదు. ఈ విషయంలో అతను వికీపీడియన్లందరికీ అనుసరణీయుడు. మురళీకృష్ణ చర్చల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. అందుకు గాను నిర్వాహకుల నుండి మెప్పు కూడా పొందారు. 2021, 2022 సంవత్సరాల్లో ఫొటోలు చేర్చే ప్రాజెక్టులలో చురుగ్గా కృషి చేసారు. చర్చ కొంత కటువుగా మారుతున్న సందర్భంలో మౌనంగా పక్కకు తప్పుకుంటారు. వాడుకరులు అంతగా ఆసక్తి చూపని "మీకు తెలుసా?" వాక్యాలపై పని చేస్తూంటారు. రాబోయే సంవత్సరాల్లో తెవికీని ముందుకు తీసుకువెళ్ళే ముఖ్యుల్లో ఈయనొకరుగా ఉండే అవకాశం చాలానే ఉంది. తాను నిర్వాహకుడు కావాల్సిన అవసరం ఉందన్న సంగతి ఆయన గ్రహించారో లేదో గానీ ఇతరులు గ్రహించినట్టే ఉంది.