ఎందరో వికీమీడియన్లు/అస్తమించిన భాస్కరుడు
స్వరూపం
అస్తమించిన భాస్కరుడు
2011 నుండి పదేళ్ళ పాటు తెవికీలో వెలుతురు పంచిన వ్యక్తి భాస్కరనాయుడు గారు. మొత్తం అన్ని వికీప్రాజెక్టుల్లోనూ కలిపి 3 లక్షల 74 వేల దిద్దుబాట్లు చేసారు.
ఎక్కువగా తెలుగు వారు, తెలుగు సంస్కృతి, తెలుగు గ్రామీణ వాతావరణం, పల్లె వాసుల జీవన విధానము, తెలుగు జాతీయాలు, సామెతలు లాంటి అంశాలపై కృషి చేసేవారు. తెలుగుదనాన్ని ప్రదర్శించే బొమ్మలను ఎక్కించేవారు. ఆయన కామన్సులోకి ఎక్కించిన వీడియో ఒకటి, 2017 జనవరి 3 న మీడియా ఆఫ్ ది డే గా ఎంపికైంది. ఇదొక అరుదైన ఘనత. తెవికీలో 2 లక్షల పైచిలుకు దిద్దుబాట్లు చేసి ఒక రికార్డు సృష్టించారాయన.
రికార్డులు శాశ్వతం కాదు, కానీ తెవికీలో ఆయన చేసిన కృషి మాత్రం శాశ్వతం. ఆయన మరణించారు కానీ ఆయన చేసిన కృషికి మరణం లేదు. తెవికీ ఆయన కృషిని మరువదు.
ఆయనకు మా గౌరవ పురస్సరమైన శ్రద్ధాంజలి.