ఉన్నాడో లేడో
Appearance
అసావేరి రాగం త్రిపుట తాళం
ప: ఉన్నాడో లేడో భద్రాద్రియందు || ఉన్నాడో ||
చ1: ఉన్నాడో లేడో యాపన్న రక్షకుడు
ఎన్నాళ్ళు వేడిన కన్నుల కగపడడు || ఉన్నాడో ||
చ2: నన్నుగన్న తండ్రి నా పెన్నిధానము
విన్నపము విని తా నెన్నడు రాడాయె || ఉన్నాడో ||
చ3: ఆకొని నే నిపుడు చేకొని వేడితే
రాకున్నా డయ్యయ్యో కాకుత్సతిలకుడు || ఉన్నాడో ||
చ4: వాటముగ భద్రాచల రామదాసుతో
మాటలాడుటకు నాటకధరుడు || ఉన్నాడో ||
This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.