ఉదాహరణము

వికీసోర్స్ నుండి

కవినామము - అంకితము

విచ్చగింపు మిట - నన్నయభట్ట కృతాంధ్రశబ్ద చిం
కల్పనో క్త కల - నాచతురోపమ లుల్లసిల్ల ని
తి నర్పణంబుగ నొ - సంగితిఁ గా మెపలీశ ! నీకునై
ఏమై తగన్. భవ దుదాహరణంబు జగత్ప్రసిద్ధిఁగన్

గణపవరపు వేంకటకవి - ఉదాహరణము

[1]ప్రబంధరాజవిజయ వేంకటేశ్వరవిలాసము, సర్వలక్షణశిరోమణి మొదలగు బహుమహాగ్రంథములు రచియించి ప్రఖ్యాతిగన్న వేంకటకవి తానొక యుదాహరణమును రచియించినట్లు, తన ప్రబంధరాజమున నిట్లు చెప్పికొనియున్నాఁడు —

సీ॥

శ్రీకరంబుగఁ బదిరెండవయేట తా
                  రావళుల్ రచియించి ప్రౌఢిఁ గన్న
ముని ముని మీసంబు మొనయునేటనె యమ
                  శతక మొనర్చి కౌశలము గన్న
ఇరువది యేటను శృంగారమంజరి యు
                  నుదాహరణఁ జేసి ఘనతఁగన్న
ఇరువదేనవ యేట కృష్ణమల్ల కథ
                  చతుర్భద్రఁ జెప్పి సంతుష్టి గన్న
మఱియు బాలరామాయణద్విపద
                  పొసంగించి బహువిధ చాటుకవిత


గీ॥

అతిశయముగన్న నాదు జిహ్వాంచలంబు
తనివినొందదు కులదేవతావతంస
వేంకటేశ్వర చరణారవిందమహిమ
నవనవోన్మేషపేశవర్ణనలఁగాక.

ఈ యుదాహరణము లభింపలేదు. ఈతని కాలనిర్ణయమును గుఱించి యొక్కొక్క రొక్కొకవిధముగ వ్రాసియున్నారు. [2]కానీ యీతని కాలనిర్ణయము సులభముగాఁ జేయువిషయము నాతఁడే తాను రచించిన విద్యావతీదండకములో నిట్లు చెప్పియున్నాఁడు—

“ దండకము ” — శ్రీ విశ్వనాథా స్వయాంబోధిచంద్రుండు ... సత్కా
శ్యపాభిఖ్య గోత్రుండు, భాస్వచ్చరిత్రుండు, శ్రీతిర్మలోర్వీతలాధీశ
పౌత్రుండు వీరావనీపాలపుత్రుండు, వీరాధివీరస్తుతోదారవచ్చొక్క
నాథక్షితీశాగ్రణీసోదరుం డాశ్రితత్రాణబద్ధాదరుం డద్రికన్యాసమా
నోల్లసల్లింగమాంబావధూగర్భశుక్తిస్ఫురన్ మౌక్తికాకారుఁడై
యొప్పు ముద్దళ్ ఘరి క్షోణిపాలుండు....... చొకాటంబుగా రాజసం
బెచ్చ నిండు పేరోలగంబుండి.......విద్యావతీ కన్యకారత్న మాత్మీ
యమౌ నాట్యశాలాస్థలీపాత్రలందెల్ల సన్మానపాత్రంబుగా శ్రీమించి
వర్ధిల్లు... గుణామేయ లక్ష్మీనివాసస్ఫురత్ పాండ్యసింహాసనా
ధ్యక్షుపేరన్ జయోదాత్తముద్దళ్ గిరి క్ష్మాతలాధీశుపేరన్, వృషాద్రీశ
సంకాశుపేరన్, మహాలక్షణ గ్రంథభాషాభిదాన ప్రథామాధురీ
సాధురీత్యర్థవచ్ఛబ్ద బంధానుబంధ ప్రబంధాది నాథాప్పయామాత్య
రాడ్వేంకటార్య. ప్రణీతంబుగాఁ బొల్చు నా పుష్పకోదండకంబైన
విద్యావతీదండకం బుర్వి నాచంద్రతారార్క మై యొప్పు నెల్లప్పుడున్.”
(A Descriptive Catalogue of Telugu Manuscripts vol viii Yak-
shaganas and Dandakas (No. 1834-2040) No 2014. Page 2262&2263.)

మధురను పరిపాలించిన సుప్రసిద్ధాంధ్రనాయక రాజవంశమునకుఁ జెందినవాఁడీ ముద్దళగిరి. ఈతఁడు ముద్దు వీరప్ప నాయకుని కొమా రుఁడు. చొక్కనాథనాయనికిఁ దమ్ముడు. చొక్కనాథనాయకుఁడు, రాజ్యభారము వహీంపలేని వయస్సున రాజ్యమునకు వచ్చుటచే, ముద్దళగిరియే రాజ్యభారము వహించెను. ఈతఁడే తంజావూరిపై దండెత్తి, విజయరాఘవనాయకుని నోడించి దానిని వశపఱచుకొనెను. ఈనృత్తాంతము క్రీ. శ. 1679 లో జరిగినది. కావున నీటినికిఁ గృతి నిచ్చిన వేంకటకవియు నా కాలమువాడనుట నిర్వివివాదాంశము. ఈతఁడు వీరేశలింగము పంతులుగారు చెప్పినట్లు, కూచిమంచి తిమ్మకవి తరువాతివాఁడు గాఁడు. పరిషత్పత్రికాసంపాదకులు చెప్పినట్లు, విజయరంగచొక్కనాథుని కాలములోవాఁడు గాఁడు. ఈతఁ డప్పకవి సమకాలికుఁడు. విద్యావతీదండకము[3] ముద్రితము. ఈతని ప్రబంధరాజము పునర్ముద్రణము చేయవలసిన యుద్గ్రంథములలో నొకటి. ఈతనిఁ 'యాంధ్రకౌముది' వేయి చరణములు గలవ్యాకరణము పరిషత్ప్రకటితము. ఈతని నిఘంటువు వేంకటేశాంధ్రము 1898 లో కాకినాడ సుజనరంజనీముద్రాక్షరశాలలో ముద్రితము. ఈతని కృతులలో ద్విరూపకోశమును, ఆంధ్రప్రయోగరత్నాకరమును ముద్రింపఁదగిన శాస్త్రీయగ్రంథములు, ఈ రెండుగ్రంథముల ప్రతులుసు తంజావూరిలో సరస్వతీభాండారముననున్నవి.

  1. ప్రబంధరాజము - అముద్రితగ్రంథచింతామణి ప్రకటన, 1892.
  2. 1. ప్రబంధరాజము పీఠిక - పూండ్ల రామకృష్ణయ్య గారు. 1892 2. వీరేశలింగము పంతులుగారు ఆంధ్రకవుల చరిత్ర తృతీయ భాగము 163-168 పుటలు 3. ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక - 3 సం 4. శతకవుల చరిత్ర, 2 వ భాగము-195-196 పుటలు. 5. ఆంధ్రకౌముది పీఠిక - ఆంధ్రసాహిత్యపరిషత్ప్రకటితము.
  3. విద్యావతీదండకము, మదరాసు ప్రాచ్యలిఖితపుస్తకశాలవారిచే, నాచే సంస్కరింపబడి ముద్రితము. (1947 సం॥)
"https://te.wikisource.org/w/index.php?title=ఉదాహరణము&oldid=397027" నుండి వెలికితీశారు