ఈ రేయి తీయనిది

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

లింకు పేరుమూస:సినిమా

పరిచయం[మార్చు]

ఖుషి చిత్రం తో రీ-మిక్స్ తో నూతన ఒరవడిని సృష్టించిన పవన్ జానీ లో కూడా ఆ ప్రస్థానాన్ని అలాగే కొనసాగించాడు. చిట్టి చెల్లెలులోని ఈ రేయి తీయనిది గీతాన్ని ఇందులో రీ-మిక్స్ చేశాడు.

గీతం[మార్చు]

ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది
ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది

ఏవేవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి
ఆ కొంటె మల్లికలు అల్లనగాకె వింటున్నవి

ఓ వరములా దొరికె నీ పరిచయం, నా మనసులో కురిసెనే అమృతం
నా నిలువునా అలలయే పరవశం, నీ చెలిమికే చేయనీ అంకితమ్
కోరుకునే తీరముగా ఆగెను ఈ నిమిషం
||ఏవేవో||

నీ ఊపిరే వెచ్చగా తగలనీ, నా నుదుటిపై తిలకమై వెలగనీ
నా చూపులే చల్లగా తాకనీ, నీ పెదవి పై నవ్వు గా నిలవనీ
ఆశలకే ఆయువుగా మారెను నీ స్నేహం
||ఈ రేయి||