ఈ పయనపుం దెరువు ఇరుదెసల శిర సెత్తు

వికీసోర్స్ నుండి

ఈ పయనపుం దెరువు ఇరుదెసల శిర సెత్తు

ప్రతికుజము ప్రతిసుమము ప్రతివిహంగమరుతము

అంతలో నా హృదయ మందు సంజియకావి

వింతలై నశియించునా, నా బ్రదుకు

సుంతేని సహియించునా!


అంతమే లేని నా యాత్రాపథాన నా

పదచిహ్నములు వోలె పడియున్న వెన్నెన్నొ

అడుగుజాడలు మదీ యార్ధ్ర హృదయమ్ములో

నిశి కడుపులో తారలై, నిశ్శబ్ద

వాటిలో చిరుపాటలై!


వెను దిరిగి కను విరిసి వీక్షింతునా అంత

ప్రతిపద మ్మమృత జీవప్రతిభ పులకించి

పలుకరించిన క్రొత్త బలముతో చలముతో

పడి నడతు పవలు రేల, అజ్ఞాత

భావికాలపు యుగాల!