ఈ గాలి ఈ నేల

వికీసోర్స్ నుండి

పల్లవి:

ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు

నను గన్న నావాళ్ళు, నా కళ్ళ లోగిళ్ళు || ఈ గాలి ||


చరణం:

చిన్నారి గొరవంక, కూసేను ఆవంక,

నారాక తెలిసాక, వచ్చేను నావంక | చిన్నారి |

ఎన్నాళ్ళో గడిచాకా, ఇన్నాళ్ళకు కలిసాక | ఎనాళ్ళో |

ఉప్పొంగిన గుండెల కేక, ఎగసేను నింగిదాక | ఎగసేను| || ఈ గాలి ||


చరణం:

ఏనాడు ఏశిల్పీ, కన్నాడో ఈ కలలు,

ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కళలు | ఏనాడు |

ఏ తలపుల వలపులతో తెలిపాడో ఈ కళలు

ఈ రాళ్ళే జవరాళ్ళై ఇట నాట్యాలాడేను | ఈ రాళ్ళే |


కన్నెమూగ మనసు కన్న స్వర్ణ స్వప్నమై

తళుకుమన్న తారచిలుకు కాంతి చినుకులై | కన్నె |

గగన గళము నుండి అమర గానవాహిని...ఆ....ఆ... | గగన |

జాలువారుతోంది ఇలా అమృతవర్షిణీ...అమృతవర్షీణీ...అమృతవర్షీణీ

ఈ స్వాతివానలో నా ఆత్మ స్నానమాడే

నీ మురళిలో నాహృదయమే స్వరములు గా మారె

ఆహాహా....హాహహా....... || ఈ గాలి ||