ఈలాగటవే బుద్ధి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


ఈలాగటవే బుద్ధి (రాగం: ) (తాళం : )

ఈలాగటవే బుద్ధి ఇందు బింబాననా ||

నాలో నీలో భేద మేమే నాతో నానతి ఈ
వేళ మువ్వ గోపాలు నీ మేలు వాని చేయనా ||

విద్దెలు చదువక పెంచిన చిలుకకు
సుద్దులు తెలుపక సుదతి రో నీవు
అద్దమ రాతిరి యసురుసు రను కొంటి
ముద్దు మోము వాడ నిద్దుర లేకున్నావు ||

కొడె గుబ్బల పైని కొంగు బచరింపక
తోడి వారిజాక్షుల తో మాట లాడక
ఆడి కలకు లోనై అల మట నొందు చు చేడె
ఏల చెక్కిత చెయ్యి చేర్చు కొన్నావు ||

కూడి మువ్వ గోపాలు గుణములు తెలియక
కోడిగపు మాట లాడి కోమలిరో వాని బాసి
వాడలో నీ సరి వనితలు నవ్వగ
ఆడాడ భ్రమ చెందినట్లు తిరుగ విధమేమో ||


eelAgaTavE buddhi (Raagam: ) (Taalam: )

eelAgaTavE buddhi indu bimbAnanA ||

nAlO neelO bhEda mEmE nAtO nAnati ee
vELa muvva gOpAlu nee mElu vAni chEyanA ||

viddelu chaduvaka penchina chilukaku
suddulu telupaka sudati rO neevu
addama rAtiri yasurusu ranu konTi
muddu mOmu vADa niddura lEkunnAvu ||

koDe gubbala paini kongu bacharimpaka
tODi vArijAkshula tO mATa lADaka
ADi kalaku lOnai ala maTa nondu chu chEDe
Ela chekkita cheyyi chErchu konnAvu ||

kooDi muvva gOpAlu guNamulu teliyaka
kODigapu mATa lADi kOmalirO vAni bAsi
vADalO nee sari vanitalu navvaga
ADADa bhrama chendinaTlu tiruga vidhamEmO ||

This work was published before January 1, 1925, and is in the public domain worldwide because the author died at least 100 years ago.