ఇపుడు ప్రళయమ్ము క్రమ్మిన దేమొ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఇపుడు ప్రళయమ్ము క్రమ్మిన దేమొ, కాక

దొరకదో నిల్వ నీడ నా చిరుతపాటకు,

ఇంత యిరు కౌనె యిమధానంత విశ్వ

మలమికొను చీకటుల కలకలమువలన!


ఎటు గనిన గాని ఆకాశ హృదయవాటి

సంకుల విషాద జలధర చ్ఛాయ లందు

పొంచు బాష్పాంబునిధులు ఘోషించు; నెగుర

పక్షములు దాల్చ వెరచు నా పాట నేడు!


దశదిశల చీల్చికొని రేగు దారుణ్ ప్ర

భంజ నోచ్చలి తోన్మత్త భంగ వీథి

నెగయు, నయ్యయో, లోకేశు నెడద వెడలి

యేడ్పు సందడు లెగయూర్పు లేర్చు పొగలు;

పొంచి పొంచి నాలో మూల మూలలందు,

క్రుంగి క్రుంగి యడంగి దాగుండు గీతి!


స్థాణు వయ్యెనొ, పాషాణ జడభరమ్ము

గనెనొ, కదలదు మెదలదు కంఠరవము;

నే డిదేమో క్షమాజననీ పురాణ

గర్భకుహరమ్ము విదలించి కారుచిచ్చు

టెరుపుమంట మూలుం గేదొ యేదొ ప్రాకె...

ఇపుడు ప్రళయమే!...