ఇది నితాంత తమఃక్రాంత మిది దరిద్ర
Jump to navigation
Jump to search
ఇది నితాంత తమఃక్రాంత మిది దరిద్ర
మీ నిశాంతమ్ము శూన్య, మిం దెన్నడో ర
హ శ్శిథిలసుప్తి కలవర మంది లేచి
గుబులుకొను లేత నెత్తావి గుసగుస లెవొ!
అంత నీ యంధమందిర మందు నొక్క
రెప్పపాటు వేకువ ఒక్క రెప్పపాటె
ఉన్మిషిత జీవ నాగమ నోత్సవమ్ము
ఉదిత గీతా ప్రవేశ ఘూర్త వేళ!
అప్పుడే గృహనే త్రవాతాయనముల
కొలుకులందు లే వెలుంగు తళుకు జివురు
లరుణ మసృణ తోరణ్ పంక్తు లల్లు నేమొ
ఆడు నేమొ వాడిన మోము లట్టె వాల్చు!
తెరచికొన్న ద్వారము చొచ్చి విరిసికొన్న
వాకిలిం జేరి, మంగళవాద్యపాళి
గద్గదిక వోవ సవరించి గళము, పాడు
నేమొ నిర్జీవ నిశ్శబ్ద మిట్టె మూగు!
మరల గ్రుడ్డిరాతిరి పడు, మరల నోరు
కాని శ్రుతులేని లేని చీకతులు మరల
మరల పాడిల్లు ...