ఇదిగదా సుదినమునకు మూలము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


పల్లవి:
ఇదిగదా సుదినమునకు మూలము ఇదిగదా ||ఇదిగదా||

చరణం1:
ఇదిగదా బ్రహ్మాదుల కందని పదవి
యనుచు యోగులు ధ్యానింతురు ||ఇదిగదా||

చరణం2:
యాగ యజ్ఞ తపయోగములెల్లను
బాగుగఁజేయక భక్తి గొల్చుటకు ||ఇదిగదా||

చరణం3:
అరసి భక్తజనములు దినమును హృ
త్సరసిజమున భవహరమని కొల్తురు ||ఇదిగదా||

చరణం4:
ప్రేమ భద్రగిరి ధాముడైన శ్రీ
రాము డితడని రమియింతురు సదా ||ఇదిగదా||

చరణం5:
వాసిగ నరసింహ దాసునేలు కృపఁ
డాసి కంటి మిక ధన్యుల మైతిమి ||ఇదిగదా||