ఇతర చింతలిఁకనేమిటికి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఇతర చింతలిఁకనేమిటికి
అతఁడే గతియై అరసేటివాఁడు

కర్మమూలమే కాయము నిజ
ధర్మమూలమే తనయాత్మ
అర్మిలి రెంటికి హరియెకఁడే
మర్మ మీతఁడే మనిపేటివాఁడు

బహుభోగమయము ప్రపంచము
నిహితజ్ఞానము నిజముక్తి
ఇహపరములకును యీశ్వరుఁడే
సహజపుఁగర్తై జరపేటివాఁడు

అతిదుఃఖకరము లాసలు
సతతసుఖకరము సమవిరతి
గతి యలమేల్మంగతో శ్రీవేంకట
పతి యొకఁ డన్నిట బాలించువాఁడు 3-22