ఇతరుల నడుగము యితఁడే మాదాత

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఇతరుల నడుగము యితఁడే మాదాత
యితని యీవి వొరు లియ్యఁగఁ గలరా

దేవదేవుఁడాదిమపురుషుఁడు హరి
శ్రీవత్సాంకుఁడు చిన్మయుఁడు
యీవల నావల యిలమేలు పతఁడు
బావజగురుఁడు మాపాలిటివాఁడు

జగదేకగురుఁడు శాశ్వతుఁడచ్యుతుఁ
డగజకు వరదుఁడు అనంతుఁడు
తగి మమునేలినదైవము యేలిక
నిగమమూర్తి మానిజబంధువుఁడు

కలిదోషహరుఁడు కైవల్యవిభుఁడు
అలరిన శ్రీవేంకటాధిపుఁడు
చలమి బలిమి మాజననియు జనకుఁడు
అలమి యితఁడు మాయంతర్యామి 3-526