ఇతరమెరఁగగతి ఇదియె శరణ్యము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఇతరమెరఁగగతి ఇదియె శరణ్యము
సతత పూర్ణునికి శరణ్యము

సర్వలోకముల సాక్షై కాచిన
సర్వేశ్వరునకు శరణ్యము
వుర్వికి మింటికి నొక్కట బెరిగిన
సార్వభౌమునకు శరణ్యము

శ్రీకాంతనురము చెంగట నిలిపిన
సాకారునకు శరణ్యము
పైకొని వెలిఁగేటి పరంజ్యోతియై(యౌ)
సౌకుమారునకు శరణ్యము

తగనిహ పరములు దాసుల కొసఁగేటి
జగదీశ్వరునకు శరణ్యము
నగుశ్రీ వేంకట నాధుఁడనీకును
సుగుణ మూర్తికయిదె శరణ్యము 4-376