ఇతని ప్రసాదమే యిన్నియును

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

గతి యితనిదేకన కాదనరాదు
కాయములో నొకఘనసంసారము
ప్రాయంబులతోఁ బ్రబలీని
ఆయ మందుకును హరి దానేయై
దాయక పాయక తగిలున్నాఁడు
వొనరినకలలో నొకసంసారము
మనసుతోడనే మలసీని
ననిచి యందుకును నారాయణుఁడై
కొనమొదలై తా గురియైనాడు
వుడిబడి కోర్కుల నొకసంసారము
బడిబడియాసలఁ బరగీని
విడువక యిది శ్రీవేంకటేశ్వరుఁడే
తొడిఁబడఁ గల్పించి ధ్రువమయినాఁడు 2-504