ఇతనికంటే మరిదైవము గానము యెక్కడ వెదకిన నితఁడే

వికీసోర్స్ నుండి

ఇతనికంటే మరిదైవము గానము యెక్కడ వెదకిన నితఁడే
అతిశయమగు మహిమలతో వెలసెను అన్నిటికాధారముదానె

మదిజలధులనొకదైవము వెదకిన మత్స్యావతారంబితఁడు
అదివోపాతాళమందు వెదకితే ఆదికూర్మమీ విష్ణుఁడు
పొదిగొని యడవుల వెదకి చూచితే భూవరాహమనికంటిమి
చెదరక కొండల గుహలవెదకిటేశ్రీనరసింహంబున్నాఁడు

తెలిసి భూనభోంతరమున వెదకిన త్రివిక్రమాకృతి నిలిచినది
పలువీరులలో వెదకిచూచితే పరశురాముడొకడొకఁడైనాఁడు
తలపుఁన శివుడుఁనుఁ బార్వతి వెదకిన తారకబ్రహ్మమురాఘవుఁడు
కెలఁకుల నావులమందల వెదకిన కృష్ణుఁడు రాముడు నైనారు

పొంచి అసురకాంతలలో వెదకిన బుద్ధావతారంబైనాఁడు
మించిన కాలము కడపట వెదకిన మీఁదటి కల్క్యావతారము
అంచెల జీవులలోపల వెదకిన నంతర్యామై మెరసెను 3-370
యెంచుక ఇహమునఁ బరమున వెదకిన యీతఁడే శ్రీవేంకటవిభుఁడు